Gunde Ninda Gudi Gantalu April 7th: రోహిణి గుండె గుబేల్.. అంతు చూసుకుంటున్న బాలు

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 4వ తేదీ 394వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణి పుట్టింటి నుంచి మేనమామగా జూనియర్ ఆర్టిస్ట్ ఎంట్రీ ఇవ్వాల్సి ఉంది. రోహిణి మేనమామ మలేషియా నుంచి వస్తున్నాడని ప్రభావతి ఎంతో హడావుడి చేస్తుంది. అన్ని రకాల వంటలు వండిస్తుంది. గ్రాండ్ గా వెల్కమ్ చెప్పేందుకు ఇంటిముందు ముగ్గు కూడా వేయిస్తుంది. ఇక రోహిణి మేనమామగా ఒక జూనియర్ ఆర్టిస్ట్ ను ఏర్పాటు చేసిన విషయం ఎవరికీ తెలియకుండా రోహిణి జాగ్రత్తపడుతుంది. ఇక జూనియర్ ఆర్టిస్ట్ రోహిణి మేనమామగా పసర్లపూడి గ్రామానికి చేరుకుంటాడు. మలేషియా నుంచి వస్తున్నాడు కాబట్టి అతను కారులో వస్తారని అంతా భావిస్తారు. కానీ ఆ జూనియర్ ఆర్టిస్ట్ మాణిక్యం భయంతో పరిగెత్తుకుంటూ ఇంటి ముందుకు వస్తాడు. గ్రామంలో కుక్కలు తరమడంతో భయంతో పరిగెత్తుకుంటూ వచ్చి కాపాడండి కాపాడండి అంటూ ఇంటి ముందు ఉన్న కుడిది తొట్టిలో పడిపోతాడు. అప్పటికి ఆయన కోసం ఎదురు చూస్తున్నా ప్రభావతి, రోహిణి, మనోజ్ అతని చూసి షాక్ అవుతారు.

కాపాడండి కాపాడండి అంటూ రోహిణి మేనమామగా వచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ మాణిక్యం అరుపులకు ఇంట్లో నుంచి బాలు, శృతి, రవి, సత్యం కూడా ఇంట్లో నుంచి బయటికి వస్తారు. ఇక అతను కుడిది తొట్టిలో పడిపోవడం చూసి ఆశ్చర్యపోతారు. ఆ తొట్టిలో నుంచి మనోజ్ రోహిణి ఇద్దరు అతన్ని పైకి తీస్తారు. రోహిణి ఎంతో ఖరీదు పెట్టి కొనుగోలు చేసిన బట్టలు మొత్తం కుడిది నీళ్లతో తడిచిపోతాయి. ఇక ఆయనకు రాగానే ఇలా జరగడంతో ప్రభావతి అప్సెట్ అవుతుంది. చేసేదేమీ లేక ఆయన్ని ఇంట్లోకి తీసుకెళ్లి స్నానానికి ఏర్పాట్లు చేస్తారు. ఆ జూనియర్ ఆర్టిస్ట్ రెడీ అయ్యి కొత్త దుస్తులు వేసుకొని వస్తాడు. అయితే అతని మాటలు మలేషియాలో నివసించే వారిలా ఉండకపోవడంతో బాలుకు అప్పటికే అతనిపై ఉన్న సందేహం మరింత బలపడుతుంది. అటు శృతి, రవి కూడా అతన్ని సందేహిస్తారు. ఇంట్లోకి వచ్చిన తర్వాత రోహిణి మేనమామగా ఆ జూనియర్ ఆర్టిస్ట్ ఏం చేశారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో తరువాయి ఎపిసోడ్ పై మరింత ఇంట్రెస్ట్ క్రియేట్ అయింది. ఇక ఏప్రిల్ 7వ తేదీ 395 ఎపిసోడ్ లో ఏం జరిగిందనేదంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 395 April 7th

రోహిణి మేనమామకు ఎంతో ఘనంగా స్వాగతం పలుకు దామని అనుకున్న ప్రభావతికి షాక్ తగులుతుంది. రోహిణి మేనమామగా ఆ ఇంటికి వచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ వచ్చి రాగానే వెళ్లి ఇంటి ముందు ఉన్న కుడిది తొట్టిలో పడిపోతాడు. అతనిని రోహిణి మనోజ్ బయటకు తీస్తారు. కుడిదిలో నుంచి బయటికి వచ్చిన అతను కుడిదిలో ఇంకెన్ని కూరగాయ ముక్కలు కలపాల్సిందే, మేకలు మంచిగా తినేవని అంటాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. మలేషియా నుంచి వచ్చి మేకల గురించి మాట్లాడుతున్నారని ఆశ్చర్యపోతారు. ఇక ఓవైపు శృతి అతన్ని చూసి మలేషియా వారిలా లేడని రవితో అంటుంది. రవి కూడా నాకు అదే సందేహం కలుగుతుందని అంటాడు.

ఆ మాటలు విన్న బాలు అవునవును సూడు గేదకు సూట్ వేసినట్టు ఉన్నాడని చమత్కారంగా మాట్లాడతాడు. ఇక ప్రభావతి బాలు మాటలను అడ్డుకొని రోహిణిని ఇంట్లోకి వెళ్లి హారతి పళ్ళను తీసుకుని రమ్మని అంటుంది. దాంతో పక్కనే ఉన్న సుశీలమ్మ ఎలక చచ్చిన వాసన అతను శరీరం నిండా ఉండగా హారతి ఎలా ఇస్తామని అంటుంది. ముందు అతన్ని స్నానం చేసి రమ్మను అని చెప్తుంది. ఇక దాంతో రోహిణి పెరట్లో బావి ఉందని అక్కడ స్నానం చేసి రమ్మని తన మేనమామగా వచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ కు చెబుతుంది. అంతటితో అతను వెళ్ళిపోతాడు.

ఇక ఇంట్లోకి వెళ్లిన తర్వాత ప్రభావతి రోహిణికి పలు సూచనలు చేస్తుంది. తన మలేషియా మామయ్య ఏది తింటే అది వండించు అని చెబుతుంది. అన్ని సౌకర్యాలు ఉండేలా జాగ్రత్తగా చూసుకోవాలని అంటుంది. ఇక ఈలోగా స్నానం చేసేసి రోహిణి ఫేక్ మేనమామ వస్తాడు. అతను వచ్చే రాగానే పూల చొక్కాను చూసి సుశీలమ్మ మండిపడుతుంది. పగటి వేషగాడిలా ఆ బట్టలు ఏంటని కసురుకుంటుంది. దాంతో అతను ఇచ్చిన సమాధానం రోహిణికి గుండె పగిలిపోయేలా చేస్తుంది. ఆ బట్టలు తన గోవాలో కొనుక్కొని వచ్చానని చెబుతాడు. మలేషియా మేనమామ పాత్రను మర్చిపోయి లోకల్ వ్యక్తిలానే మాట్లాడుతాడు. ఆయన ఇచ్చిన సమాధానానికి ఇంట్లో వాళ్లంతా షాక్ అవుతారు.

మీరు ఉండేది మలేషియాలో కదా గోవాకు ఎప్పుడు వచ్చారు అని అడుగుతారు. బిజినెస్ పని మీద అప్పట్లో ఇండియాకు వచ్చానని చెబుతాడు. ఇక ఇండియాకు వచ్చినా కూడా తమ ఇంటికి ఎందుకు రాలేదని ప్రభావతి ప్రశ్నిస్తుంది. దానితో రోహిణి కలగజేసుకొని గోవాలో చిన్న బిజినెస్ పని ఉండి వచ్చారని చెబుతుంది. బార్ అండ్ రెస్టారెంట్ ఓపెన్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అబద్ధం చెప్పి కవర్ చేస్తుంది. ఇక నమ్మేసిన ప్రభావతి వెంటనే అతని బయటికి వెళ్ళమని, తిరిగి ఇంట్లోకి వచ్చేటప్పుడు హారతి ఇవ్వండని చెబుతుంది. ఇక హారతి ఇచ్చాక అతని ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు. రోహిణి వాళ్ళ నాన్న చీర డ్రెస్సు బ్రాస్లెట్ పంపించారని తాంబూలంలో పెట్టి ఇస్తాడు. మలేషియా నుంచి తెచ్చింది ఇంతేనా అని బాలు ఎగతాళి చేస్తాడు.

రోహిణి వాళ్ళ నాన్న వచ్చేటప్పుడు 100 ప్లేట్లలో బట్టలు బంగారం తీసుకొస్తారని గొప్పగా చెప్తాడు. అయితే రోహిణి వాళ్ళ నాన్న గురించి సత్యం అడగ్గానే కంగారు పడతాడు. మలేషియా పాత్ర మరిచిపోయి నాన్న ఇంకెక్కడ నాన్న ఎప్పుడో చుట్ట కాల్చి కాల్చి చనిపోయాడు కదా అని చెప్తాడు. దాంతో అందరు షాక్ అవుతారు. ఏంటి రోహిణి వాళ్ళ నాన్న చనిపోయాడా అని మళ్ళీ ప్రశ్నిస్తారు. దాంతో రోహిణి మళ్లీ కలగజేసుకొని చనిపోయింది వాళ్ళ నాన్న అని, మా నాన్న కాదు అని సరిచేస్తుంది. ప్రభావతి ఇక్కడ ఇల్లు చాలా ఇరుకుగా ఉండింది, మలేషియాలో పెద్ద పెద్ద భవంతులో ఉండి ఉంటాయి కదా అని అంటుంది. దాంతో అతను మాది పెద్ద ఇల్లు ఏం కాదు రెండు మటన్ కొట్టులు పడతాయి అంతే అని బదులుస్తాడు. దాంతోను అందరూ షాక్ అవుతారు.

ఇక రోహిణి వాళ్ళ మేనమామపై సందేహం కలిగిన శృతి ఆయనను పలు ప్రశ్నలు అడుగుతుంది. మేము మలేషియాలో ఉండి ఉంటే చాలా చల్లగా ఉండేదని ఇక్కడ చాలా వేడిగా ఉందని రోహిణి వాళ్ళ మేనమామగా నటించేందుకు వచ్చిన జూనియర్ ఆర్టిస్ట్ అంటాడు. ఆ మాట విన్న శృతి మలేషియాలో ఇప్పుడు చల్లగా ఉంటుంది కదా అని ప్రశ్నిస్తుంది. మా అమ్మ నాన్న వాళ్లు మలేషియాకి వెళ్లొచ్చారు సమ్మర్లో అక్కడ చాలా చల్లగా ఉంటుంది అని గట్టిగా చెబుతుంది. దాంతో అతను ఏం సమాధానం చెప్పాలో తెలియక తత్తరపడతాడు. ఏం చెప్పాలో తెలియక మా ఏరియాలో చల్లగా ఉంటుందని చెప్పాను పాప అంటాడు. మలేషియాలో మీ ఏరియా అయినా కూడా ఉడికిపోతుంది కదా అని సందేహం వ్యక్తం చేస్తుంది.

ఇంతకీ మీరు మలేషియాలో ఎక్కడ ఉంటారని అసలు ప్రశ్న సంధిస్తుంది. దాంతో ఒక్కసారిగా ఆ జూనియర్ ఆర్టిస్ట్ కు గుండెజారి పోయినంత పని అవుతుంది. తనేదో రాజమౌళి సినిమా అంటే నటించేందుకు వచ్చానని, ఇక్కడ కెమెరాలు లేకపోవడం సైతం, స్క్రిప్టు లో లేని మాటలన్నీ మాట్లాడుతున్నారు ఏంటని సందేహ పడతాడు. కానీ పక్కనే ఉన్నారు రోహిణి చిరాకు పడడంతో తను సరిగా నటించడం చేయడం లేదేమో అని భావించి ఆ విషయం అడగడం మానేస్తాడు. ఇక శృతికి ఆ మలేషియా ఫేక్ మేనమామ సమాధానం ఇవ్వలేక పోతాడు. దీంతో అందరూ డౌటు వ్యక్తం చేసే సమయంలో రోహిణి స్పందిస్తుంది. మలేషియాలను ఒక టౌన్ పేరు చెప్పి అక్కడే ఉంటారని నమ్మిస్తుంది. ఇక బాలు మరిన్ని ప్రశ్నలు అడగబోతుంటే అతని వెళ్ళిపో అని ప్రభావతి చెబుతుంది. బాలు వెళ్తున్న క్రమంలో మీ తాగుబోతు బాలు ఇతనేనా అని రోహిణితో అంటాడు. దాంతో బాలు సీరియస్ అవుతాడు. మీనా కూడా మండిపడుతుంది. ఇంట్లో విషయాలన్నీ చెప్పేశావా అని సత్యం కూడా కోప్పడతాడు. దాంతో రోహిణికి తల తీసేసినట్టు అవుతుంది.

ఇక తన మేనమామగా వచ్చిన ఆ జూనియర్ ఆర్టిస్టును రోహిణి తన రూమ్ లోకి తీసుకువెళ్లి చెప్పింది మాత్రమే చేయని, సొంత డైలాగులు వాడి కొత్త సమస్యల్లో ఇరికించొద్దు అని మండిపడుతుంది. అతనికి ఏమీ అర్థం కాక సరేనని అంటాడు. నెక్స్ట్ సీన్లో బాగా నటించాలని అనుకుంటూ ఉంటాడు. మరోవైపు ప్రభావతి రోహిణి వాళ్ళ మేనమామ రావడంతో అన్ని రకాల వంటలు చేయడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటుంది. వంటలు వండడానికి రోహిణినీ పిలవద్దని సుశీలమ్మ చెప్పడంతో ఇక మిగిలిన ఇద్దరు కోడళ్ళతో కూరగాయలు తరుముతూ ఉంటుంది. ఇక శృతి కూరగాయలు కట్ చేసే సమయంలో నానా రచ్చ చేస్తుంది. రోహిణి మాత్రం చక చక కట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఎపిసోడ్లో అందరూ కూర్చుని భోజనాలు తింటూ ఉంటారు. ఈ క్రమంలో మళ్లీ రోహిణి వాళ్ళ మలేషియా మావయ్య పై ప్రశ్నలు వర్షం కురిపిస్తారు. ఈసారి బాలు టార్గెట్ చేసుకొని మాట్లాడతాడు. అక్కడ జరిగిన సంభాషణ ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X