Gunde Ninda Gudi Gantalu April 8th: పెంటపెంట చేస్తున్న రోహిణి మేనమామ.. గురిచూసి కొడుస్తున్న బాలు

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 7వ తేదీ 395వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణి మేనమామగా జూనియర్ ఆర్టిస్ట్ మటన్ కొట్టే మాణిక్యం ఎంట్రీ ఇస్తాడు. ఇక అతని ఎంతో ఘనంగా స్వాగతం పలుకుదామని ప్రభావతి భావిస్తుంది. కానీ అతను రావడమే కుడిది తొట్టేలో పడిపోయి అందరికీ షాక్ ఇస్తాడు. పైగా అతని మాటలతో అందరికీ డౌట్ వచ్చేలా చేస్తాడు. మలేషియా నుంచి వచ్చి మేకల గురించి మాట్లాడుతుండటం కచ్చితంగా మటన్ కొట్టే వాడని రవి, శృతి, బాలు, సుశీలమ్మ అనుమానం వ్యక్తం చేస్తారు. అతనిపై ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. ఒకరి తర్వాత మరొకరు డౌట్ పడుతూ అతని గురించి ఆరా తీస్తూ ఉంటారు.

ఇక అతను చెప్పనే సమాధానాలతో రోహిణి గుండె గుబేలు అంటుంది. ఎక్కడా అతను జూనియర్ ఆర్టిస్ట్ అని తెలుస్తుందోనని టెన్షన్ పడుతుంది. అందరి ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాక.. తన మేనమామగా వచ్చిన ఆ జూనియర్ ఆర్టిస్టును రోహిణి తన రూమ్ లోకి తీసుకువెళ్లి క్లాస్ పీకుతుంది. తను చెప్పింది మాత్రమే చేయమని, సొంత టాలెంట్ పెట్టొద్దని హెచ్చరిస్తుంది. దాంతో ఆయన ఓకే అంటాడు. అయితే ఇంట్లో వాళ్లతో మాట్లాడే సమయంలో బాలుపై ఆ జూనియర్ ఆర్టిస్ట్ మాట జారుతాడు. తాగుబోతు బాలు ఇతనేనా అని అంటాడు. దీంతో బాలుకు చిర్రెత్తిపోతుంది. ఎలాగైనా అతని అంతు చూడాలని భావిస్తాడు. అందుకు ప్లాన్ చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 7వ తేదీ 396 ఎపిసోడ్ లో ఏం జరిగిందనేదంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 396 April 8th

రోహిణి వాళ్ళ మేనమామ మొత్తానికి ఆ గ్రామానికి రావడంతో ప్రభావతి సంతోషిస్తుంది. ఆయనకు సకల మర్యాదలు చేసేందుకు ప్రయత్నాలు చేస్తుంటుంది. ఇక ఇప్పటికే ఆ జూనియర్ ఆర్టిస్ట్ మలేషియా మేన మామగా నటించాల్సింది పోయి తన నిజ జీవితం మటన్ కొట్టే మల్లేష్ లాగానే ప్రవర్తిస్తాడు. ఇంట్లో వాళ్ళు తనపై ప్రశ్నల వర్షం కురిపించడంతో ఏం చెప్పాలో తెలియక తన తోచింది చెబుతూ రోహిణిని టెన్షన్ పడుతూ ఉంటాడు. ఇక ఉగాది పండుగ రావడంతో సుశీలమ్మ వంటలన్నీ చేయాలని ప్రభావతిని మాత్రమే ఆదేశిస్తుంది. మీ నాతో వంటలు చేయించొద్దని గట్టిగా చెబుతుంది. వంటలన్నీ నా కోడలు ప్రభావతి మాత్రమే చేయాలని ఆర్డర్ వేస్తుంది.

దీంతో ప్రభావతి వంటలన్నింటినీ తానే చేసేందుకు ఒప్పుకుంటుంది. ఇక ఇద్దరు కోడళ్ళు రోహిణి, శృతి కూడా కూరగాయలు తరిమేందుకు సహకరిస్తారు. ఇక రవి కూడా వచ్చి శ్రుతికి కూరగాయలు తరమడం రాకపోవడంతో తాను సహకరిస్తానని అంటాడు. ఆ మాటలు విన్న మనోజ్ చేయరా చేయి నీ పని అదే కదా అని కాస్త ఎగతాళి చేస్తాడు. దాంతో రవికి మండిపోతుంది. నాకు కనీసం కూరగాయలు తరిమే జాబ్ అయినా ఉంది. మరి నువ్వేం జాబ్ చేస్తున్నావని నిలదీస్తాడు. దీంతో మనోజ్ మొహం నేలకు వేస్తాడు. ఇక వెంటనే సుశీలమ్మ అందుకుంటుంది. ఏరా మనోజ్ నీకు జాబ్ లేదంట పార్కులో తిరుగుతున్నావు అంట ఆ సంగతి ఏంటి అని ప్రశ్నిస్తుంది.

ఇక వెంటనే ప్రభావతమ్మ కలగజేసుకొని తొందరలోనే జాబ్ వస్తుందిలే అత్తయ్య అని సుశీలమ్మకు బదులిస్తుంది. అయితే మనోజ్ కు జాబ్ లేదని రోహిణి వాళ్ళ మేనమామ ముందు అనవద్దని కోరుతుంది. వాళ్లు కూరగాయలు కట్ చేస్తుంటే మధ్యలో వచ్చి సత్యం కూడా కూరగాయలు తరుముతానని అంటాడు. అప్పటికే ఊర్లోకి వెళ్లి వచ్చిన సత్యం తనకు చాలా సంతోషంగా ఉందని ఈ రోజు ఈ కూరగాయలు కట్ చేసే పనిని సంతోషంగా చేస్తానని చెబుతాడు. ప్రభావతి మీ తల్లిగారు సుశీల ముందు మీరు కూరగాయలు కట్ చేయడం దేనికి కానీ ఆ కొబ్బరి ముక్కల దొరమండి అంటూ చెబుతుంది. ఇక సత్యం కొబ్బరి ముక్కలను తోముతుంటారు. ఈ క్రమంలో నే ఈ క్రమంలోనే రోహిణి వాళ్ళ మేనమామ ఎంట్రీ ఇస్తాడు.

సత్యం కొబ్బరి ముక్కలు తరుముతూ ఉంటే అతని వద్దకు వెళ్లి మీరు కొబ్బరి ముక్కలు తురుముతున్నారేంటి అని ప్రశ్నిస్తాడు. మన ఇంట్లో పని మనం చేస్తే తప్పేంటి అని సత్యం బదులిస్తాడు. అంతేలెండి, ఇంతకు మీరు ఏం పని చేస్తారు అని రోహిణి మేనమామ గా నటిస్తున్న మాణిక్యం అడుగుతాడు. డ్రైవర్ అని సమాధానం ఇస్తాడు. ఓహో డ్రైవర్ అని కాస్త తక్కువ చేసి మాట్లాడుతాడు. దీంతో సత్యం కు మండిపోతుంది. అదే సమయానికి బాలు కూడా వచ్చి, ఏంటి డ్రైవర్ అని అదోరకం గా అడుగుతున్నామని మండిపడతాడు. బాలు గొంతులో ఘనం చూసిన ఆయన దెబ్బకు భయపడిపోతాడు. నేను మంచి ఉద్దేశంతోనే అడిగానని అంటాడు.

బాలును కూడా ఏం చేస్తున్నావ్ అని ప్రశ్నిస్తాడు. నేను కూడా డ్రైవర్ రే అని చాలా హుందాగా చెబుతాడు. ఇంతకీ అందరి గురించి అడుగుతున్నారు కానీ రోహిణి వాళ్ళ మొగుడు ఏం జాబ్ చేస్తా డో అడిగారా అని ప్రశ్నిస్తాడు. దీంతో ప్రభావతి కలగజేసుకుని మనోజ్ ను సేవ్ చేస్తుంది. ఇక ఆ మలేషియా మేనమామ అందరూ కూరగాయలు నిదానంగా తరమడం చూసి, మీరు ఇలా కట్ చేస్తే రేపటికి భోజనాలు తయారవుతాయని అంటాడు. వాళ్ళందరిని లెమ్మని చెప్పి తాను కూర్చుని కూరగాయలు కట్ చేస్తారు. తనకు మటన్ కొట్టే అనుభవం ఉండడంతో మటన్ ను కీమా కొట్టినట్టుగా కూరగాయలను తరుముతాడు. దీంతో వాళ్ళందరికీ డౌట్ వస్తుంది. మటన్ కొట్టిన అనుభవం ఉందని బాలు బయటికి అనేస్తాడు. అందరూ అదే అభిప్రాయపడతారు.

ఇక రోహిణి మధ్యలో కలుగజేసుకొని అతన్ని లోపలికి తీసుకువెళుతుంది. నువ్వు మళ్ళీ నేను పిలిచే వరకు బయటకు రావద్దని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. చెప్పిన విషయాన్ని గుర్తు పెట్టుకొని చెప్పినట్టుగా చేస్తే చాలని, సొంత డైలాగులు వాడొద్దని మరోసారి హెచ్చరిస్తుంది. దీంతో అతను ఏ నేను బాగా నటించడం లేదా అని తనను తాను ప్రశ్నించుకుంటాడు. ఇక తను నువ్వు రూమ్ లోనే పడుకోమని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత సుశీలమ్మ కొత్త కోడళ్ళతో నైవేద్యం వండిస్తుంది. వారి కుటుంబాలు పది కాలాలపాటు చల్లగా ఉండాలని స్వయంగా వారి చేతనే నైవేద్యాలు అందించి నెత్తిన బోనం ఎత్తిస్తుంది. ఇక తర్వాత ఏం జరుగుతుందనేది చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X