Gunde Ninda Gudi Gantalu April 9th: రోహిణి పచ్చి మోసం.. ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్న బాలు

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 8వ తేదీ 396వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణి వాళ్ళ మేనమామ గా నటించేందుకు వచ్చిన జూనియర్ ఆర్టిస్ట్, మటన్ కొట్టే మాణిక్యం కుటుంబ సభ్యుల ముందర ఆమె పరువు పోయేలా చేస్తున్నాడు. మలేషియా నుంచి వచ్చినట్టుగా నటించాలని చెప్పిన అతను మాత్రం స్థానికుడిగానే వ్యవహరిస్తున్నాడు. నటించాల్సిన పాత్రను మరిచి, పదే పదే తన మటన్ కొట్టు ను ఎగ్జాంపుల్ గా గుర్తు చేసుకుని డైలాగులు కొడుతున్నాడు. అసలే తన మీద మామ మలేషియాలో ఉంటాడని రోహిణి అత్త ప్రభావతితో చాలా బిల్డప్ ఇస్తుంది. దాంతో అతను వచ్చిన సందర్భంగా అతి మర్యాదలు చేస్తూ అతను గురించి గొప్పలు చెబుతూ ఉంటుంది. అయితే మలేషియా మేనమామగా నటిస్తున్న ఆయన ప్రతి సందర్భంలో దొరికిపోయేలా ఏదో ఒక హింట్ ఇస్తూ ఉంటాడు. దానిపై కుటుంబ సభ్యులందరూ ప్రశ్నలు సాధిస్తూ ఉంటారు. ఎక్కడ దొరికిపోతానని రోహిణి చాలా టెన్షన్ పడుతుంది.

మలేషియాలో ఎక్కడ ఉంటారని, రోహిణి వాళ్ళ నాన్న ఎలా ఉన్నారని, మలేషియాలో మీ జీవితం ఎలా ఉంటుందని ఇలా పలు ప్రశ్నలు వేస్తూ ఉంటారు. అతను చెప్పడంలో తడబడుతుంటే రోహిణి జోక్యం చేసుకొని సర్ది చెప్పుకుంటూ వస్తోంది. అయితే మలేషియా మేనమామగా వచ్చిన అతను బాలు ఈగోను హార్ట్ చేసేలా మాట్లాడుతాడు. తాగుబోతు బాలు అంటే ఇతనేనా అని మాట్లాడుతాడు. దాంతో బాలుకు మండిపోతుంది. మొదటినుంచి అతనిపై సందేహం ఉన్న బాలు ఇక ఎలాగైనా అతని సంగతి చూడాలని, అసలు రోహిణికి అతను మేనమామేనా అని తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. తన ఫ్రెండ్ రాజేష్ తో కలిసి ఒక ప్లాన్ వేస్తాడు. రోహిణి మలేషియా మేనమామతో కూడా నువ్వు మటన్ కొట్టేవాడిలా ఉన్నావ్ అని, మలేషియాలో మటన్ షాప్ లే నడిపిస్తున్నావా అని సందేహాలు రేకెత్తించేలా మాట్లాడతాడు. ఇదిలా ఉండగా సుశీలమ్మ ముగ్గురు కోడళ్ళతో బోనం వండించి, దేవతలకు నైవేద్యం పెట్టించే ప్రయత్నం చేస్తుంది. ఇక ఆ తర్వాత కథ ఎలా జరిగిందనేది తరువాత ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక ఏప్రిల్ 9వ తేదీ 397 ఎపిసోడ్ లో ఏం జరిగిందనేదంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 397 April 9th

సుశీలమ్మ గారు తన ముగ్గురు మనవరాళ్లతో బోనం వడ్డిస్తుంది. బోనం నెత్తిన మోయించి దేవతలకు నైవేద్యం పెట్టిస్తుంది. ఆ తర్వాత తెలుగు పండగల సంప్రదాయాలను అందరికీ అర్థమయ్యేలా చేస్తుంది. ఇక ఆ తర్వా అందరూ ఇంటిముందు వాకిట్లో కూర్చొని ఉగాది ప్రసాదం తింటూ ఉంటారు. ఈ సంద్భంగా రోహిణి మలేషియా మేనమామ ప్రసాదం తింటూ కూడా మేక మాంసాన్నిగుర్తు చేస్తాడు. రోజూ మిగిలి పోయిన మటనే తినేవాడినని ఇవ్వాళ నోటీ నిండా తిపి వస్తువు తినడంతో ఆనందంగా ఉందన్నారు. దీంతో బాలు వెంటనే వచ్చి ప్రతి దానికి మేక మేక అని అంటావు ఏంటీ, నువ్వేదో మంట కొట్టు నడుపుతున్నట్టు అని సందేహం వ్యక్తం చేస్తాడు. అటు రోహిణికి టెన్షన్ పడుతూ ఉంటుంది.

ఇక ఆ తర్వాత సుశీలమ్మ ముగ్గురు మనవరాళ్లు, మనవాళ్లను దగ్గరికి పిలిచి వారందరికీ ఉగాది ప్రసాదం తినిపిస్తూ ఉంటుంది. దీంతో సత్యం తన తల్లిని చూసి నేర్చుకో పిల్లలని ఎలా చూసుకోవాలో అని అంటాడు. దాంతో ప్రభావతి గులుగుతుంది. అందుకు ప్రభావతమ్మ బదులిస్తూ.. కడుపులో మోసిన పిల్లలతో పాటు, కోడళ్లను కూడా సమానంగా చూసుకోవాలని చెబుతుంది. ఆ విషయం ఎక్కడా తేడా రానివ్వొద్దని సూచిస్తుంది. మీనాను ఒకళా, శృతి రోహిణిలను మరోలా చూడటం మరిచిపోవాలని చెబుతుంది.

ఇక ఇదిలా ఉండగా.. రోహిణి వాళ్ల మేనమమా, మటన్ కొట్టే మాణిక్యం ఉన్నట్టుండి మనోజ్ జాబ్ గురించి అడుగుతాడు. దాంతో బాలు స్పందించి ఆయన ఇంకా జాబ్ సెర్చింగ్ లోనే ఉన్నారని చెప్పారు. ఇంకా జాబ్ లేకపోవడం ఏంటని అతను అంటాడు. దానికి మనోజ్ స్పందిస్తూ నాకు కూడా మీలాగే బిజినెస్ పెట్టి గొప్ప స్థాయికి వెళ్లాలని ఉందంటూ చెబుతాడు. అక్కడ కూడా అతను మేక తోలు ఎగుమతిని బిజినెస్ గా చేసి తన స్నేహితుడు ఒకరు కోట్లు ఆర్జించాడని ఉదహరిస్తాడు. దీంతో మళ్లీ బాలుకు బలమైన సందేహం ఏర్పడుతుంది. ఇక ఈ క్రమంలోనే రోహిణి వాళ్ల నాన్న గురించి టాపిక్ వస్తుంది. రోహిణి వాళ్ల అమ్మగారు కిడ్నీ, లివర్, లంగ్స్ ఫెయిల్ అయిన చనిపోయిందని, తర్వాత వాళ్ల నాన్న మరోక పెళ్లి చేసుకున్నారని చెబుతాడు.

ఇక బతికుండగానే తన తల్లిని ఎన్నోసార్లు చంపాల్సిన పరిస్థితి వస్తుందని రోహిణి మనసులో బాధపడుతుంది. దాంతో వాళ్లందరూ మాట్లాడుతుండగానే బయటికి వెళ్లి తన తల్లి సుగణమ్మకు ఫోన్ చేస్తుంది. ఆమె వెంటే కళ్యాణి అని పిలిచి, అలా పిలవొద్దు అన్నావు కదా అని అంటుంది. ఇప్పుడు తన పక్కన ఎవ్వరూ లేని ప్రస్తుతానికి ఏం కాదని చెబుతుంది. అమ్మ నువ్వు గుర్తుకొచ్చావు అందుకే ఫోన్ చేశానని చెబుతుంది. కాసేపు మాట్లాడుతుంది. ఆ తర్వాత మనోజ్ ను పెళ్లి చేసుకునే సయమంలో తనకు తల్లిలేదని, తన పేరు రోహిణి అని, తన తండ్రి మలేషియాలో ఉంటాడని అబద్ధాలు చెప్పిన సంగతిని గుర్తు చేసుకుంటుంది.

తల్లిని అవమానిస్తున్నాననే బాధతో ఇంటి బయట ఒక్కతే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. అది గమనించిన శృతి వచ్చి ఏమైంది రోహిణి అని అడుగుతుంది. రోహిణి ఏం చెప్పకపోవడంతో పక్కనే కూర్చొని ఓదార్చుతుంది. దాంతో లోపలి నుంచి మీనా, సుశీలమ్మ, ప్రభావతి కూడా వచ్చి ఓదార్చుతారు. మళ్లీ సుశీలమ్మ కోడళ్లను తల్లిలాగా చూసుకోవాలని చెబుతుంది. రోహిణికి తల్లి లేదు కాబట్టి ఏ లోటు రాకుండా చూసుకోవాలని సూచిస్తుంది. అందరికి అమ్మలానే ఉండిపోతానని చెబుతుంది. ఇక శృతి మాత్రం తనకు తల్లి ఉందని, అత్తలానే ఉండు అని బదులిస్తోంది. దాంతో ప్రభావతి షాక్ లో ఉండిపోతుంది. ఇక బాలు రోహిణి వాళ్ల మేన మామను ఊర్లోకి తీసుకెళ్లి కళ్లు తాగిస్తాడు. అతను ఎవరు? ఎందుకు రోహిణి వాళ్ల మేనమాగా వచ్చాడని, అసలు నిజం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X