Gunde Ninda Gudi Gantalu April 10th: తప్పతాగిన రోహిణి మేనమామ.. అసలు గుట్టు తెలుసుకున్న బాలు

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 9వ తేదీ 397వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణి మేనమామగా నటించేందుకు వచ్చిన మాణిక్యం పదే పదే మేకలు, మటన్ గురించి మాట్లాడుతూ తనపై అనుమానం వచ్చేలా మాట్లాడుతాడు. అసలు మలేషియా నుంచి వచ్చిన వ్యక్తి ఏ బిజినెస్ గురించో మాట్లాడుతాడో అనుకుంటే అందుకు భిన్నంగా మాట్లాడుతూ ఆశ్చర్యానికి గురి చేస్తాడు. ఇక రోహిణి వాళ్ల నాన్న రెండో పెళ్లి చేసుకున్నాడని, వాళ్ల అమ్మ కిడ్నీ, లివర్, లంగ్స్ ఫెయిల్ అయ్యి చనిపోయిందని చెబుతాడు. దాంతో రోహిణి బాధపడుతుంది.

బతికి ఉన్న తల్లిని చంపుకోవాల్సి వస్తుందని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఒక్కసారి వాళ్ల అమ్మ సుగణకు కాల్ చేసి మాట్లాడుతుంది. గుర్తుకు వచ్చావని చెప్పుకుంటూ ఏడుస్తుంది. ఆ తర్వాత ఇంటి గుమ్మం ముందు దిగాలుగా కూర్చుంటుంది. శృతి, రోహిణి, ప్రభావతి, సుశీలమ్మ అందరూ వచ్చి ఓదార్చుతారు. మరోవైపు రోహిణి వాళ్ల మేనమామను తాటి కల్లు తాగించేందుకు తీసుకెళ్తాడు. అక్కడ ఆయన తప్పతాగి పడిపోతాడు. దాం తర్వాత అతని కూపీ లాగేందుకు బాలు ప్రయత్నిస్తాడు. అతను చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ మత్తులు నెలమీద పడిపోతాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 398 April 10th

మత్తులోకి జారుకొని స్పృహ కోల్పోతాడు. అక్కడి వరకు బాలుకు అతను మలేషియా నుంచి వచ్చిన వాడు కాదని మాత్రం తెలిసిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది తరువాత ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక ఏప్రిల్ 10వ తేదీ 398 ఎపిసోడ్ లో ఏం జరిగిందనేదంటే..?

రోహిణికి తల్లి లేదని లివర్ కిడ్నీ లంగ్స్ ఫెయిల్ అవ్వడం వల్ల చనిపోయిందని రోహిణి మేనమామగా నటించేందుకు వచ్చిన మాణిక్యం చెబుతాడు. ఒక్కసారిగా మాణిక్యం అలా అనడంతో రోహిణి ఎంతో బాధపడుతుంది. బతికున్న తన తల్లిని ఎన్నోసార్లు చంపాల్సి వస్తుందని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ వెంటనే బయటికి వెళ్లి తన తల్లి సుగుణకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. ఆ తర్వాత వచ్చే ఇంటి ముందు దిగాలుగా కూర్చుంటుంది. దాంతో శృతి మీనా సుశీలమ్మ ప్రభావతి అందరూ ఆమెను ఓదార్చుతారు. ఇక సుశీలమ్మ ప్రభావతికి క్లాస్ పీకుతుంది. కోడళ్ళు అందరినీ సమానంగా చూసుకోవాలి అని, లేదంటే ఇంట్లో నుంచి వెళ్లి ఎవరి కాపురం వారు పెడతారని హెచ్చరించింది. అప్పుడు ఇల్లు మొత్తం బోసి పోతుందని తెలుస్తుంది. దాంతో ప్రభావతి అందరిని చక్కగా చూసుకుంటానని చెబుతుంది.

ఇక మరోవైపు బాలు తన స్నేహితుడు రాజేష్ తో కలిసి చెరుకు గడలు తింటూ ఉంటాడు. మనోజ్ రవి కూడా తింటూ ఉంటారు. ఈలోగా వాళ్లు కూర్చున్న దగ్గరికి రోహిణి మేనమామగా నటిస్తున్న మాణిక్యం వస్తాడు. సరదాగా మాట్లాడుతారు. ఇక ఊరు చూసేద్దాం అని అతనే అంటాడు. దాంతో బాలు తన స్నేహితుడు రాజేష్ తో పాటును మాణిక్యమును బయటకు తీసుకెళ్తాడు. ఇక అప్పటికే రోహిణి ఎదురై మనోజ్ ను కూడా వెళ్లి రా అని చెబుతుంది. బాలు ఎక్కడ మాణిక్యంతో నిజం కక్కిస్తాడా అని భయపడుతుంది. అందుకే మనోజ్ ను కూడా వెంట పంపిస్తుంది.

బాలు తన స్నేహితుడు రాజేష్ తో పాటు మాణిక్యమును బయటికి తీసుకెళ్తాడు. మనోజ్ కూడా వెంట వెళ్తాడు. ఇక దారిలో వెళుతూ మాణిక్యంతో బాలు మాట్లాడుతూ ఉంటాడు. నీ మలేషియాలో ఎలా ఉంటుందని, మీరు అక్కడ ఏం బిజినెస్ చేస్తారు బాబాయ్ అని ఊపి లాగుతుంటాడు. దానికి మాణిక్య స్పందిస్తూ ఒక ఫేక్ పిన్కోడ్ చెప్పి ఆ ఏరియాలో ఉంటానని అంటాడు. ఇక మలేషియాలో వాళ్ళ ఇంట్లోకి కూడా వర్షం కొడితే నీళ్లు వస్తాయని, అక్కడ వెదర్ కారణంగా పనిచేసేటప్పుడు చొక్కా విప్పేసి పనిచేస్తానని చెబుతాడు. ఈ మాటలన్నీ విన్న బాలు రాజేష్ ఇతను పక్క స్థానికుడై ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తాడు. ఇతను మలేషియా నుంచి రానే రాలేదని బలంగా నమ్ముతారు.

ఇక బాలు తన ఫ్రెండ్ రాజేష్ కోసం మాణిక్యం వచ్చేప్పుడు ఏమైనా ఫారన్ మందు తెచ్చారా అని అడుగుతాడు. పక్కనే ఉన్న మనోజ్ అంత పెద్ద ఆయనతో అలానేనా మాట్లాడేది అని బాలు పై మండిపడతాడు. ఇక మాణిక్యం కూడా పర్లేదు మనోజ్ అని చెబుతాడు. వచ్చేటప్పుడు ఐదు ఫుల్ బాటిల్స్ తీసుకువచ్చానని బాలుకు బదులిస్తాడు మాణిక్యం. మరి అవి ఎక్కడ ఉన్నాయని అడగడంతో ఎయిర్పోర్టులో దిగి వచ్చేప్పుడు దారిలో పోలీసులు పట్టుకున్నారని చెబుతాడు. దాంతో బాలు ఫ్రెండ్ రాజేష్ అప్సెట్ అవుతాడు. ఇక వెంటనే మాణిక్యం వారం సర్కు తాగి తాగి బోర్ కొట్టేసిందని కల్లు తాగుదామని అంటాడు. దాంతో బాలు కూడా ఇదే సమయం కోసం ఎదురుచూస్తున్నారని మనసులో అనుకుంటాడు.

ఇక వెంటనే బాలు తన మరో ఫ్రెండ్ కు ఫోన్ చేసి ఫ్రెష్ కల్లు తెప్పించరా అని చెబుతాడు. ఇక అందరూ వెళ్లి మంచి చల్లటి ప్రదేశంలో కూర్చుని తాగేందుకు సిద్ధమవుతారు. బాలు అందరికీ కల్లు ముంతలను అందిస్తాడు. ఇక మలేషియా మాణిక్యం అందరూ తాగే లోపే తాగేసి ముంత పక్కన పెట్టేస్తాడు. ఆ తర్వాత మరొకటి అందించగా అది కూడా తాగేసి ముంత పక్కకి పడేసి ఆవకాయ పచ్చడి నంజుకుంటాడు. మలేషియా నుంచి వచ్చాడు సాఫ్ట్ గా ఉన్నాడనుకుంటే ఊర మాస్ అవతారంలో కనిపించి అందరికీ షాక్ ఇస్తాడు. ఇక మద్యం మధ్యలోకి జారుకుగా బాలు మాణిక్యంతో నిజాలు చెప్పించేందుకు ప్రయత్నం చేస్తాడు. ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఊరు పేరు? అతని అస్సలు వృత్తి? ఇలా అన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నిస్తాడు.

కానీ మలేషియా మేనమామ మత్తు లోకి జారుకున్నాక బాలు మాటలను పట్టించుకోడు. తన గురించి చెప్పడం మానేసి కింద పడిపోయి నిద్రపోతాడు. ఇక అప్పటికే మనోజ్ కు మాణిక్యం రెండు ముంతల కల్లు తాగించడంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్దామని బయలుదేరి మధ్యలోనే పడిపోతాడు. ఇక మాణిక్యం కూడా తాగి పడుకోవడం అతన్నీ ఇంటికి తీసుకువస్తుంటారు. ఇక దారిలో పడిపోయిన మనోజ్ను కూడా లేపి ఇంటికి తీసుకొస్తారు. కానీ మనోజ్ కు తాగించింది బాలు అని తెలిస్తే ఇంట్లో వాళ్ళందరూ తనను తిడతారని, మాణిక్యం అందరి ముందు నిజం ఒప్పుకోవాలని బాలు అంటాడు. అందుకు సరే అంటాడు మాణిక్యం. కానీ ఇంటికి వెళ్లాక బాలునే తాగించాడని అబద్ధం చెబుతాడు. దాంతో రోహిణి మండిపడుతుంది. ప్రభావతి, సుశీలమ్మ బాలు పై చేయి చేసుకుంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X