Gunde Ninda Gudi Gantalu April 11th: బాలు చెంప చెల్లుమనిపించిన సుశీలమ్మ.. రోహిణి ఊహించని దెబ్బ

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 10వ తేదీ 398వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణి మేనమామగా వచ్చిన మాణిక్యం ఊహించని షాక్ ఇచ్చారు. జూనియర్ ఆర్టిస్ట్ గా చిన్న చిన్న పాత్రలు పోషించే అతడు ఓవైపు మటన్ కొట్టును కూడా నడిపిస్తాడు. రోహిణి పుట్టింటి నుంచి తండ్రిని తీసుకురావాలని ప్రభావతి ఒత్తిడి చేయడంతో ఇతన్ని తన మలేషియా మేనమామగా నటించేందుకు తీసుకువస్తుంది. దాంతో ఆయన నేరుగా పసర్లపూడి గ్రామానికి వెళ్లిన సంగతి తెలిసిందే. ఇక అక్కడ మలేషియా నుంచి వచ్చిన వాడిలా కాకుండా లోకల్ వ్యక్తిలానే బిహేవ్ చేస్తున్నాడు. ఆయన ప్రవర్తనతో మలేషియా నుంచి మాత్రం కచ్చితంగా వచ్చి ఉండడని బాలు సందేహిస్తాడు. మలేషియా మేనమామ మరిన్ని మాటలతో బాలుకు పక్కా అనుమానం కలుగుతుంది.

దీంతో ఎలాగైనా రోహిణి మేనమామగా నటించేందుకు వచ్చిన మాణిక్యం సంగతేంటో చూడాలని నిర్ణయించుకుంటాడు. ఈలోగానే మాణ్యికమే వచ్చి బాలును ఊర్లోకి వెళ్లి చూసొద్దామని అంటాడు. దాంతో బాలు మంచి సమయంగా భావించి తన స్నేహితుడు రాజేష్ ను కూడా వెంట రమ్మని అడుగుతాడు. ఇక వీరు వెళ్లే సమయానికి రోహిణి ఎదురవుతుంది. బాలు ఎక్కడా మాణిక్యం మలేషియా నుంచి రాలేదని తెలుసుకుంటాడోననే భయంతో మనోజ్ ను కూడా వెంట పంపిస్తుంది. దాంతో ఊర్లోని పొలాల మధ్య తిరుగుతూ ఉంటారు. బాలు మాణిక్యం వివరాలను అడుగుతూ ఉంటాడు. ఆయనిచ్చే సమాధానాలతో అప్పటికీ మరింతగా అనుమానం వ్యక్తం అవుతుంది. ఇక కల్లు తాగిస్తే నిజం కక్కుతాడని బాలు భావిస్తాడు. కానీ ఒక్క ముక్క కూడా చెప్పడు. పైగా మనోజ్ కు మాణిక్యం బలవంతంగా కల్లు తాగిస్తాడు. ఇక అందరూ ఇంటికి వెళ్లాకా మనోజ్ తాగడం పట్ల రోహిణి, ప్రభావతి, సత్యం, సుశీలమ్మ అందరూ బాలుని నిందిస్తాడు. ఇక మనోజ్ కు తాగించింది మాణిక్యమే అని, ఆ విషయం ఆయనే నోటే వినండి అని అంటాడు. కానీ మాణిక్యం బాలుపై నింద వేస్తాడు. దీంతో సీన్ మొత్తం రివర్స్ అవుతుంది. బాలును సుశీలమ్మ చెంపచెల్లుమనేలా కొడుతుంది. ఇక ఏప్రిల్ 11వ తేదీ 399 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 399 April 11th

మలేషియా మేనమామ మాణిక్యం, మనోజ్ ఇద్దరూ పీకల్లోతు తాగి మత్తులోకి జారుకుంటారు. మనోజ్ పూర్తిగా మైకంలో ముగిని తేలుతాడు. ఇక మాణిక్యం మాత్రం కాస్తా సృహలో ఉంటాడు. ఇక ఇంటికి వెళ్లాక అందరూ తననే తిడతారని వాస్తవానికి మనోజ్ కు తాగించింది ననువ్వే కాబట్టి నువ్వే అని ఒప్పుకోవాలని మాణిక్యంతో చెబుతాడు. అలాగే అని చెబుతాడు. నీపై ఈగ కూడా వాలకుండా చూసుకుంటానని చెబుతాడు. దాంతో అందరితో కలిసి ఇంట్లోకి వెళ్తాడు. అయితే మనోజ్ కు ఓపికా లేకపోవడంతో వెళ్లి సోఫాలో కూర్చుంటాడు. దాంతో అందరూ వచ్చి ఏమైందని అడుగుతారు.

మనోజ్ ను లేపే ప్రయత్నం చేస్తారు. దీంతో అతని దగ్గర కల్లు వాసన రావడంతో తాగొచ్చవా? అని రోహిణి అడుగుతుంది. దాంతో బాలు అసలు విషయం మాణిక్యం చెబుతాడని అంటాడు. కానీ మాణిక్యం ఇంట్లోకి వెళ్లాక అందరి ముందు నిజం చెబుతానని చెప్పి తీరా బాలుపై నింద వేస్తాడు. వద్దు వద్దు అన్నా కూడా మనోజ్ కు బలవంతంగా బాలునే తాగించాడని అబద్ధం చెబుతాడు. దీంతో ప్రభావతి, రోహిణి మండిపడుతారు. ఏకంగా నానమ్మ సుశీలమ్మ బాలును చెంపచెల్లుమనేలా కొడుతుంది. నా చేతులారా పెంచితే ఇలా పచ్చిగా తాగుతున్నావా? అంటూ కోపం చేస్తుంది.

బాలు సుశీలమ్మకు అసలు విషయం చెప్పబోతుంటే ప్రభావతి జోక్యం చేసుకొని చెప్పకుండా చేస్తుంది. దీంతో బాలు చెప్పినా ఎవ్వరూ నమ్మరని సైలెంట్ గా ఉంటాడు. ఇక మనోజ్ కూ సృహ వచ్చాక అసలు విషయం చెప్పబోతుంటే అప్పుడు మాణిక్యం నేను చెప్పేశానులే నువ్వు వెళ్లి రెస్ట్ తీసుకో అని చెబుతాడు. ఇక మనోజ్ తప్పతాగడంతో బాలులా మారిపోతాడు. అచ్చం బాలులానే మాట్లాడుతూ అందరికు షాక్ ఇచ్చాడు. ఇక రోహిణి మనోజ్ ను తీసుకెళ్లి బెడ్ రూమ్ లో పడుకోబెడుతుంది.

అయితే మాణిక్యం వల్లనే ఈ సమస్య అంతా వచ్చిందని అతనికి క్లాస్ పీకడానికి వెళ్తుంటుంది. ఈ క్రమంలో ప్రభావతి ఎదురై తన కొడుకు ఎవరి వద్ద పనిచేయలేడని మీ నాన్నతో చెప్పి ఏదైనా బిజినెస్ పెట్టించు అని చెబుతుంది. దాంతో సరేనని శృతి బదులిచ్చి వెళ్లిపోతుంది. ఈ క్రమంలోనే బాలు తన స్నేహితుడు రాజేష్ తో అసలు మనోజ్ కు తాగించింది మాణిక్యమే కదరా? వాడు నిజమైన మలేషియా మామ అయితే నన్ను ఎందుకు ఇరికిస్తాడు? అంతలా కల్లు ఎలా తాగుతాడని అనుమానం వ్యక్తం చేస్తారు. ఇక రేపే ఆ సంగతి తెల్చుతానని నిర్ణయించుకుంటాడు. వీరు మాట్లాడుకునేది అంతా రోహిణి వింటుంది.

దాంతో రోహిణి భయపడుతుంది. మనోజ్ పార్క్ విషయాన్ని ఎలా బయటపెట్టాడో అలాగే తన గుట్టు కూడా బయటపెడతాడని భయపడుతుంది. వెంటనే మాణిక్యం నోరును అదుపులో పెట్టుకోమని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. సరిగా పెర్ఫామ్ చేయమని, లేదంటే బాలుతో సమస్య వస్తుందని హెచ్చరిస్తుంది. దీంతో సరేనని మాణిక్యం చెబుతాడు. ఇక బాలు ఒంటరిగా మళ్లీ తాగడం ప్రారంభిస్తాడు. రోహిణి అసలు గుట్టు రట్టు చేయాలని ఆలోచిస్తూ తాగుతూ ఉంటాడు. ఈలోగా మీనా వచ్చి తాగుడు ఆపేయమని భర్త బాలుకు చెబుతుంది. ఇక బాలు ఇవ్వాళ ఒక్కరోజే తాగుతానని, మళ్లీ తాగబోనని చెబుతాడు. దాంతో మీనా సరేనని పర్మిషన్ ఇస్తుంది.

మరోవైపు మాణిక్యం గుట్టును బాలు బయటపెడుతాడు. మొదటి నుంచి అతను మటన్ కొట్టే పనిని గుర్తుచేసుకుంటూ మటన్, మేకలు, మేత గురించే మాట్లాడుతూ సందేహం కలిగే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పుడూ కూరగాయాల భోజనమే అవుతుందని, ఈ రోజు మేకను కొట్టించామని సుశీలమ్మ చెప్పడంతో మాణిక్యం ఓవర్ ఎగ్జైట్ అవుతాడు. దాంతో మేకను మొత్తం కోసేశారా? అని అడుగుతాడు. దాంతో బాలు మీకు మటన్ షాప్ ఉంది కదా? అది ఎక్కడ అని అడగ్గా మెయిన్ రోడ్డు పక్కనే అని చెబుతాడు. దాంతో మాణిక్యం దొరికిపోయాడని బాలు అంటాడు. రోహిణి టెన్షన్ పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది తరువాత ఎపిసోడ్ లో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X