Gunde Ninda Gudi Gantalu April 12th : దొరికిపోయిన రోహిణి.. మలేషియా మామ గుట్టురట్టు.. బాలు రచ్చ
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 11వ తేదీ 399వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణి మేనమామగా జూనియర్ ఆర్టిస్ట్ గా మటన్ కొట్టును మాణిక్యం వచ్చిన సంగతి తెలిసిందే. అతని గురించి ఎవ్వరికి తెలియకుండా రోహిణి చాలా జాగ్రత్త పడుతోంది. ఈ క్రమంలో మొదటి నుంచి మాణిక్యంపై బాలుకు సందేహం కూడా ఏర్పడింది. దాంతో ఎలాగైనా మాణిక్యం మలేషియా నుంచి వచ్చాడా? లేదా? అని తెలుసుకోవాలని అనుకుంటాడు. దీంతో అతనితో తాగించి పచ్చి నిజాలు బయటికి కక్కించాలని ప్రయత్నిస్తాడు బాలు. కానీ అది కాస్తా సీన్ రివర్స్ అవుతుంది. మాణిక్యంను బాలు తన స్నేహితుడు రాజేష్ తో కలిసి బయటికి తీసుకెళ్తాడు. అసలు గుట్టు రాబట్టేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తాడు. మలేషియా గురించి పలు ప్రశ్నలు అడిగి అసలు విషయం తెలుసుకోవాలని అనుకుంటాడు. కానీ మాణిక్యం చెప్పినట్టే చెప్పి మళ్లి తెలివిగా తప్పికుంటాడు. ఎక్కడా దొరకకుండా జాగ్రత్త పడుతాడు.
మరోవైపు మాణిక్యం తాగుతనని చెప్పడంతో బాలు అతనికి తాటి కల్లు అరెంజ్ చేస్తాడు. మాణిక్యం అందరి కంటే ముందుగానే ముంతల మీద ముంతలు తాగుతూ ఆశర్చపరుస్తాడు. ఏకంగా నాలుగైదు ముంతలు తాగుతాడు. దాంతో బాలు, రాజేష్ మిగితా వాళ్లందరూ షాక్ అవుతారు. అలాగే మాణిక్యం పీకల్లోతు దాకా తాగడమే కాకుండా మనోజ్ తోనూ తాగిస్తాడు. పైగా ఇంటికి వెళ్లాకా బాలునే మనోజ్ తో తాగించాడని అబద్ధం కూడా చెబుతాడు. దాంతో బాలుపై ఇంట్లో వాళ్లందరూ తెగ మండిపడుతారు. రోహిణి దొరికిందే సందుగా నానా మాటలు అంటుంది. నీలాగే తాగుబోతును చేస్తావా? మనోజ్ ను అంటూ మండిపడుతుంది. మరోవైపు ప్రభావతి కూడా కొడుకుపై కోపం చేస్తుంది. ఇక సుశీలమ్మ ఏకంగా బాలు చెంపచెల్లుమనిస్తుంది. ఇక ఈ బాధలోనే బాలు మరింతగా తాడుతాడు. రోహిణి మేనమామగా వచ్చిన అతని గురించి అసలు విషయం తెలుసుకోవాల్సిందేనని పట్టుదల పట్టుకొని కూర్చుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 15న 400 ఎపిసోడ్ లో ఏం జరిగి ఉంటుందంటే?

పీకల్లోతుదాకా తాగిందే గాకా మనోజ్ తోనూ తానే తాగించాననే బాధలో బాలు ఇంకా తాగుతుంటాడు. దాంతో మీనా వచ్చి అడ్డుకుంటూ ఉంటుంది. ఇలా తాగితే అస్సలు ఊరుకునేది లేదని మండిపడుతుంది. దాంతో బాలు మీనాను క్యూట్ గా బతిమిలాడుతూ ఈ ఒక్కసారే తాగుతున్నానని, ఆ మేకమామ చేసిన పనికి తాగిందంతా దిగిపోయిందని చెబుతాడు. ఇవ్వాళ ఒక్కరోజే తాగుతానని చెప్పి పర్మిషన్ తీసుకుంటాడు బాలు. మరోవైపు మీనా కూడా ఊర్లో ఇవ్వాళ ఒక్కరోజే తాగాలని మళ్లీ తాగితే ఊరుకోనని హెచ్చరిస్తుంది. అందుకు బాలు ఓకే అని దాచుకున్న కల్లు సీసా తీసి పూర్తిగా లాగించేస్తాడు. ఇక ఆ తర్వాత రోజు అందరూ భోజనాలకు రెడీ అవుతారు. రోజూ కూరగాయల భోజనమే అవుతుందని, ఇవ్వాళ మాత్రం మేకను కొట్టించామని బాలు నానమ్మ సుశీలమ్మ చెబుతుంది.
దాంతో మేక మాంసమా అంటూ మాణిక్యం నోరు వెళ్లబెడుతాడు. మేకను కట్ చేశారా? లేకా ఇంకా కట్ చేశారా? ముక్కులు కొట్టాలా? అని అడుగుతాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. మొదటి నుంచి మాణిక్యం మేకల గురించి, మటన్ గురించి, మటన్ షాపుల గురించి మాట్లాడుతుంటంతో అందరికీ అతనిపై డౌట్ క్రియేట్ అవుతుంది. ఈ క్రమంలోనే మాణిక్యం మాట్లాడే మాటలకు రోహిణి గుండే జారిపోతుంది. ఎక్కడ దొరికితే తన గుట్టు రట్టు అవుతుందోనని భయపడుతుంది. వెంటనే అతన్ని వదిలించుకోవాలని ఎలాగైనా మాణిక్యం నుంచి వచ్చే సమస్యలకు పరిష్కారం ఆలోచించాలని అనుకుంటుంది. అప్పటికే చాలా జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పినా మళ్లీ మాట జారుతాడు మాణిక్యం. ఎంత చెప్పినా మటన్, మేకల గురించి టాపిక్ వస్తే మాత్రం ఇట్టే డైవర్ట్ అవుతున్నాడని రోహిణి కంగారు పడుతుంది. బాలు ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పినా మాణిక్యం బాలు ముందే తనకు ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతూ రోహిణిని టెన్షన్ పెడుతుంటాడు.
మరోవైపు అప్పటికే మాణిక్యం గుట్టును బాలు బయటపెడుతాడు. మొదటి నుంచి అతను మటన్ కొట్టే పనిని గుర్తుచేసుకుంటూ మటన్, మేకలు, మేత గురించే మాట్లాడుతూ సందేహం కలిగే చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎప్పుడూ కూరగాయాల భోజనమే అవుతుందని, ఈ రోజు మేకను కొట్టించామని సుశీలమ్మ చెప్పడంతో మాణిక్యం ఓవర్ ఎగ్జైట్ అవుతాడు. దాంతో మేకను మొత్తం కోసేశారా? అని అడుగుతాడు. దాంతో బాలు మీకు మటన్ షాప్ ఉంది కదా? అది ఎక్కడ అని అడగ్గా మెయిన్ రోడ్డు పక్కనే అని చెబుతాడు. దాంతో మాణిక్యం దొరికిపోయాడని బాలు అంటాడు. మొదటి నుంచి అతనిపై తనకు అనుమానం ఉందని, పదే పదే మటన్ షాప్ గురించి మాట్లాడుతున్నప్పుడే నాకు డౌట్ వచ్చిందని చెబుతాడు. ఇవ్వాళ అతనే చెప్పాడని అంటాడు.
నానమ్మ సుశీలమ్మ మటన్ అనగానే అతి ఉత్సాహం చూపించడానికి కారణం అతను మలేషియా నుంచి వచ్చిన వాడు కాదని తన అభిప్రాయాన్ని బాలు బయటపెడుతాడు. ఇక మాణిక్యం అలా అడ్డదిడ్డం నమాట్లాడతంతో రోహిణి టెన్షన్ పడుతుంది. ఎవరితోనైనా జాగ్రత్తగా ఉండాలని చెప్పానో అతనితోనే మాణిక్యం మాట జారాడని కంగారు పడుతుంది. మరోవైపు తన మటన్ కొట్టు అడ్రస్ దగ్గరి నుంచి అన్ని విషయాలను మాణిక్యం నోటి నుంచి చెప్పిస్తాడు. దాంతో కుటుంబ సభ్యులందరూ షాక్ అవుతారు. మాణిక్యం మెయిన్ రోడ్డు పక్కనే తన మటన్ కొట్టు అని చెప్పడంతో అందరికీ అనుమానం స్టార్ట్ అవుతుంది.
మరోవైపు రోహిణి మాణిక్యం తనను దొరించేశాడని టెన్షన్ పడుతుంది. మాణిక్యం చెప్పిన మాటలను కవర్ చేసేందుకు ప్రయత్నిస్తుంది. ఇంట్లో వాళ్లకు పలు రకాలుగా బదులిచ్చే ప్రయత్నం చేస్తుంది. అయినా బాలు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తాడు. మాణిక్యం తీరా చిక్కుల్లో పడుతాడు. అంతే కాకుండా రోహిణిని కూడా చిక్కుల్లో పడేస్తాడు. ఇక రోహిణినే అతన్ని తీసుకొచ్చిందని చెబుతాడా? లేకా రోహిణి జ్యోక్యం చేసుకొని మళ్లీ అందరినీ మరిపిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది. ఇక రాబోయే ఎపిసోడ్ లో ఏం జరుగుతుందనేది చూడాలి.


Click it and Unblock the Notifications











