Gunde Ninda Gudi Gantalu April 14th: రోహిణి అబద్ధాల చిట్టా.. బయటికి లాగుతున్న బాలు
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 11వ తేదీ 399వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణి మేనమామగా వచ్చిన మాణిక్యం ఊహించని షాక్ ఇచ్చారు. బాలుపై నింద వేస్తాడు. మనోజ్ కు తాగించింది నేను కాదని, బాలునే బలవంతంగా తాగించాడని చెప్పి ఇంట్లో వాళ్లందరితో తిట్టిస్తాడు. ఏకంగా సుశీలమ్మ చెంపచెల్లుమనేలా బాలును కొడుతుంది. ఆ తర్వాత ఎలాగైనా మలేషియా మేనమామ గుట్టు రట్టు చేయాలని బాలు నిర్ణయించుకుంటాడు. ఈ విషయాన్ని రోహిణి తెలుసుకుంటుంది. దీంతో మాణిక్యంను అలర్ట్ చేస్తుంది.
మాణిక్యం వల్లనే సమస్య వస్తోందని అతనికి క్లాస్ పీకుతుంది. సరిగా పెర్ఫామ్ చేయమని, లేదంటే బాలుతో సమస్య వస్తుందని హెచ్చరిస్తుంది. దీంతో సరేనని మాణిక్యం చెబుతాడు. ఇక బాలు ఒంటరిగా మళ్లీ తాగడం ప్రారంభిస్తాడు. రోహిణి అసలు గుట్టు రట్టు చేయాలని ఆలోచిస్తూ తాగుతూ ఉంటాడు. ఈలోగా మీనా వచ్చి తాగుడు ఆపేయమని భర్త బాలుకు చెబుతుంది. ఇక బాలు ఇవ్వాళ ఒక్కరోజే తాగుతానని, మళ్లీ తాగబోనని చెబుతాడు. దాంతో మీనా సరేనని పర్మిషన్ ఇస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది తరువాత ఎపిసోడ్ లో చూడాలి. ఇక ఏప్రిల్ 12వ తేదీ 400 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

ఉదయం లేవగానే ప్రభావతి కిచెన్ లో నుంచి కాఫీ తీసుకొని వస్తుంది. అది చూసిన కోడలు మీనా అదేంటి అత్తయ్య నన్ను అడిగితే ఇచ్చే దాన్ని కదా అని అంటుంది. ఇక ప్రభావతి అదేం అవసరం లేదు. నీతో పని చేయించానని మా అత్తయ్య సుశీలమ్మతో తిట్టించాలని ప్రయత్నం చేస్తున్నావు కదా అని చిరాకు పడుతుంది. ఇక్కడున్నంతవరకే నీ ఆటలు సాగుతాయని మళ్లీ మన ఇంటికి వెళ్లాక నువ్వు నువ్వే నేను నేనే అని ప్రభావతి మీనతో అంటుంది. ఇక ప్రభావతి మాటలకు మీనా కూడా ఆ విషయం నాకు తెలుసులే అని దీటుగా బదులిస్తుంది. ఇక ప్రభావతి చేతిలో ఉన్న కాఫీ ని చూసి ఇది నాకేనా అని సత్యం తీసుకోబోతుంటాడు. దాంతో ప్రభావతి ఇది మీ కోసం కాదు అనే అడ్డుకుంటుంది. మా మలేషియా మరిది గారి కోసం నేనే ప్రత్యేకంగా చేశానని గొప్పగా చెబుతుంది. దాంతో సత్యం కు మండిపోతుంది.
ఈ లోపు బాలు కూడా వచ్చి తన తండ్రికి కాఫీ ఇవ్వకపోవడంతో ప్రభావతిపై మండిపడతాడు. తల్లి ప్రభావతి చేతిలో ఉన్న కాఫీ ని తీసుకొని డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటే ఎలాంటి మర్యాదలైనా చేస్తావు కదా అని తల్లి ప్రభావతిని అంటారు. ఇక కాఫీని తానే మలేషియా నుంచి వచ్చాడని చెప్పిన మాణిక్యం కు ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. ఈ క్రమంలో అతనిని పలు రకాల పేర్లతో పిలుస్తూ ఆడుకుంటాడు. ఇదిగో రావయ్యా మేఘ రమేష్ నీకోసం కుడితి తయారు చేశాం, సారీ సారీ కాఫీ రెడీ చేసాం తాగి పెట్టు.. అని అంటాడు బాలు. అయితే ముందుగానే మలేషియా మాణిక్యంపై రగిలిపోతున్న బాలు మర్యాదలు పక్కనపెట్టి మేకలాగా అరుస్తూ అతని గుట్టు రట్టు చేసే ప్రయత్నం చేస్తాడు. నిజంగానే ఇంట్లోకి మేఘా వచ్చిందేమో అనుకొని మాణిక్యం పరువు పరుగున వస్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. మేక విషయం చెప్పగానే ప్రతిసారి ఓవర్గా స్పందిస్తుండడంతో బాలుకు మరింతగా డౌట్ క్రియేట్ అవుతూ ఉంటుంది.
ఇక బాలు అతనికి కాఫీ ఇచ్చి తాగుమని చెబుతాడు. ప్రభావతి, రోహిణిలా జోక్యంతో బాలు సైలెంట్ అవుతాడు. ఆ తర్వాత మలేషియా మాణిక్యం ఈరోజు వంటలు చేశారు అని అడుగుతాడు. అందుకు సుశీలమ్మ బదిలిస్తుంది. ఇక సుశీలమ్మ మాట్లాడుతూ ప్రతిరోజు కూరగాయల భోజనం అవుతుందని, ఈరోజు మేకను కొట్టించాను.. అందరూ పుష్టిగా తినాలని కోరుకుంటున్నాను... అని మాణిక్యంకు బదిలిస్తుంది. ఇక మేక కూర అనగానే మాణిక్యం అతిగా స్పందిస్తుంటాడు. అప్పుడే మీకేం తీసుకొచ్చి కోసేసారా అని విచిత్రంగా అడుగుతాడు. దాంతో బాలు కలుగజేసుకొని.. లేదంటే మీరు కోస్తారా అని ప్రశ్నిస్తాడు. అందుకు నేనెందుకు మేకలను కోస్తాను, అది నా పని కాదు కానీ నాకు మటన్ అంటే చాలా ఇష్టం. మటన్, బోటి, లివర్, కాళ్లు తలకాయ ఇలా వేరువేరుగా వండి తింటే చాలా బాగుంటుంది. వాటిని వేరువేరుగా కట్ చేయించడం ముఖ్యమని చెబుతున్నాను అంటాడు. మాణిక్యం మంచి ఫ్లోలో చెబుతుండగా మధ్యలోనే బాలు ఇంతకీ మన మటన్ షాప్ ఎక్కడ అని అడుగుతాడు.
దీంతో తొందరపడ్డ మాణిక్యం మెయిన్ రోడ్డు పక్కనే అని బాలుతో అంటాడు. ఇక దాంతో బాలు మేక మామ దొరికేశాడు అని అంటాడు. తన మటన్ షాప్ మెయిన్ రోడ్డు పక్కనే అని చెప్పడంతో అటు ప్రభావతి, సత్యం, మనోజ్, సుశీలమ్మ షాక్ అవుతారు. ఇక రోహిణి గుండె మాత్రం జల్లుమంటుంది. ఈ మటన్ కొట్టు మాణిక్యం మలేషియా మేనమామగా నటించమంటే ఇంత ఈజీగా దొరికిపోయేలా చేస్తున్నాడని కంగారుపడుతుంది. ఇప్పుడు ఏం చేయాలనే ఆందోళన చెందుతుంది. తన గురించి మొత్తం ఇంట్లో తెలిసిపోతుందని భయపడుతుంది. ఇంక మాణిక్యం తన మటన్ షాప్ మెయిన్ రోడ్ పక్కనే అని చెప్పడంతో ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయి సైలెంట్ గా ఉండిపోతారు. వెంటనే రోహిణి కలగజేసుకొని తనకు ఫోన్ వచ్చినట్టుగా నాటకం ఆడుతుంది. మలేషియాలో తన అత్తయ్య ఆరోగ్యం బాలేదని, సీరియస్ గా ఉండిందని అందరూ ముందు ఫోన్ మాట్లాడినట్టు చేస్తుంది.
అత్తకు ఆరోగ్యం బాగాలేదనే కారణంతో మలేషియా మాణిక్యమును తిరిగి వెళ్ళిపోవాలని చెబుతుంది. దీంతో అతను మాత్రం నటించడానికి వచ్చాడు కాబట్టి అక్కడ పరిస్థితి తీవ్రత అర్థం కాక మటన్ తినేసి తీరిగ్గా వెళ్తానని రోహిణి తో అంటాడు. దీంతో రోహిణి ఒక్కసారిగా ఫైర్ అవుతుంది. మధ్యలో కలగజేసుకున్న ప్రభావతి పైన కూడా మండిపడుతుంది. హే ఆగు నీతో గోల.. అని అత్తపై మాట జారుతుంది. దీనికి అందరూ షాక్ అవుతారు. బాలు మాట్లాడుతూ రోహిణి అసలు నువ్వు ఏం మాట్లాడవో నీకు అర్థం అవుతుందా అని అంటాడు. తను ఉన్న కంగారులో నుంచి బయటకు వచ్చిన రోహిణి వెంటనే అత్త ప్రభావతిని క్షమించమని అడుగుతుంది. తన అత్తకు బాగా లేదని టెన్షన్లో అలా మాట్లాడాను అని, మేనమామతో మాట్లాడుతున్న సమయంలో కంగారులో అనేసానని ఏమనుకోవద్దు అని చెప్పి క్షమాపణ కోరుతుంది. ఇక వెంటనే నేరుగా గదిలోకి వెళ్లి మాణిక్యం బ్యాగ్ తీసుకుని వచ్చే అతనికి ఇచ్చి వెళ్లిపోమని చెబుతోంది.
ఇక మాణిక్యం వెళ్లిపోవడంతో బాలుకు మరింతగా డౌట్ వస్తుంది. తెలుగు ఇంట్లోకి వచ్చిన రోహిణి మీ మామయ్య వెళ్లిపోయాడా నువ్వే పంపించావని ప్రశ్నిస్తాడు. దానికి రోహిణి స్పందిస్తూ రాకరాక మా పుట్టింటి నుంచి ఒకరు వస్తే ఇలానే మాట్లాడతావా అని బాలు పై మండిపడుతుంది. ఇక ఎలాగో ఇన్ని రోజులు ఉన్నాం కదా అని అందరూ వెళ్ళిపోదామని అనుకుంటూ ఉంటారు. ఈలోగా సుశీలమ్మ ఎవరు వెళ్లడానికి వీలులేదని మరో రెండు రోజులు ఉండాలని చెబుతుంది. అందరికీ బోర్ కొడుతుందని అనడంతో సుశీలమ్మ ఆ విషయం ముందుగానే అర్థం చేసుకొని ఆటల పోటీలకు ఏర్పాటు చేయిస్తుంది. దీంతో కుటుంబ సభ్యులందరినీ రెండు జట్టులుగా ఏర్పాటు చేస్తుంది. అయితే ఈ ఆటల పోటీల్లో ఎలాగైనా బాలుని ఓడించి అవమానించాలని అందరూ అనుకుంటారు. ఇక తర్వాత ఏం జరిగిందనేది తర్వాత ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











