Gunde Ninda Gudi Gantalu April 15th: కన్నీళ్లు పెట్టుకున్న బాలు.. తట్టుకోలేకపోయిన భార్య మీనా
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 14వ తేదీ 400వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణి వాళ్లమేనమామ బంఢారం బయట పెడుదామని ఎంతో ప్రయత్నించిన బాలుకే ఎదురుదెబ్బ పడింది. అతని లోగుట్టు తెలియకపోగా.. మనోజ్ కు బాలునే కల్లు తాగించాడని అబద్ధం చెప్పి ఇరికిస్తాడు. వాస్తావానికి మలేషియా మాణిక్యమే బలవంతంగా తాగిస్తాడు. తానే తాగించాననే నిజనాన్ని కూడా ఒప్పుకుంటానని బాలుతో ముందే చెబుతాడు. కానీ తీరా ఇంటికి వెళ్లిన తర్వాత బాలునే ఇరికిస్తాడు. దాంతో బాలు చాలా షాక్ అవుతాడు. ఇంక ఎట్టిపరిస్థితుల్లోనూ మలేషియా మామ సంగతి తేల్చాలని నిర్ణయించుకుంటాడు. అప్పటికే రోహిణి మలేషియా మేనమామగా నటించేందుకు వచ్చిన మాణిక్యంను ఎంతగానో హెచ్చరిస్తుంది. నోటికి వచ్చింది మాట్లాడొద్దని మలేషియా మేనమామగానే నటించాలని చెబుతుంది.
అయినప్పటికీ ఆయన నోరుజారుతూనే ఉంటాడు. ఇవ్వాళ భోజనాల విషయంలో కూరగాయాలు కాకుండా మేకను కొట్టించాలని సుశీలమ్మ చెప్పడంతో అతిగా స్పందిస్తాడు. మేక కోయడం దగ్గర నుంచి మటన్ కొట్టడం వరకు అన్ని విషయాలను వివరంగా చెబుతాడు. మాటల్లో పడి తనకు మటన్ కొట్టు ఉందని, మెయిన్ రోడ్డు పక్కనే ఉందని బాలుతో అంటాడు. దాంతో బాలు దొరికిపోయాడని అంటాడు. ఇంట్లో వాళ్లందరూ కూడా ఎంతో షాక్ అవుతున్నారు. కానీ ఆలోపే రోహిణి కలుగజేసుకొని మరిపిస్తుంది. మలేషియా నుంచి తన అత్తయ్య ఫోన్ చేసి తనకు సీరియస్ గా ఉందని మరో అబద్ధం చెప్పి మాణిక్యం ను ఇంట్లో నుంచి పంపించేస్తుంది. అలా రోహిణి బతికిపోతోంది. ఆ తర్వాత బాలుకు మరో సమస్య వస్తుంది. సుశీలమ్మ ఆటలపోటీలు ఏర్పాటు చేయగా బాలుపై తల్లి ప్రభావతి మాట్లాడిన మాటలు అతనిని బాధపెడుతాయి. ఇక ఏప్రిల్ 15వ తేదీ 401 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

మొత్తానికి రోహిణి మేనమామగా నటించేందుకు వచ్చిన మటన్ కొట్టే మాణిక్యం అతి నటనను తట్టుకోలేక రోహిణి పంపించేస్తుంది. ఒకటి చెప్తే మరొకటి చేస్తూ రోహిణినే ఇరకాటంలో పెట్టే పరిస్థితి సృష్టిస్తున్నందుకు అతన్ని వెలగొట్టింది. మలేషియాలో తన అత్తయ్యకు ఆరోగ్యం బాగాలేదని కండిషన్ సీరియస్ గా ఉందని అబద్ధం చెప్పి మాణిక్యం కు ఎగ్జిట్ పలుకుతుంది. ఇక తర్వాత అందరూ తిరిగి హైదరాబాదుకు వెళ్ళిపోతామని సుశీలమ్మతో చెప్పడంతో అడ్డుకుంటుంది. మరో రెండు రోజులు ఉండి వెళ్లాల్సిందే అని పట్టుబడుతుంది. అందుకు అందరూ సరేనని ఒప్పుకుంటారు.
కొడుకు కోడలు మనవళ్లు మనవరాలు అందరూ తన మాట విని ఇంట్లోనే ఉండేందుకు ఒప్పుకోవడంతో సుశీలమ్మ ఆటల పోటీలకు ఏర్పాటు చేయిస్తుంది. వాళ్లు పసర్లపూడి గ్రామానికి వచ్చిన మొదటి రోజు నుంచి సుశీలమ్మ కుటుంబ పాఠాలను నేర్పుతూనే ఉంది. అయినా ఒకరి మధ్య ఒకరికి మాటలు యుద్ధం జరుగుతూనే వస్తోంది. ఇక మాణిక్యం వల్ల ఏకంగా బాలు పైనే సుశీలమ్మ చేయి చేసుకునే పరిస్థితి రావడంతో కాస్త బాధపడుతుంది. వాళ్లందరిని మళ్లీ కలపాలని, రాగద్వేషాలు లేకుండా అందరూ కలిసి పోవాలని ఆటల పోటీలను ఏర్పాటు చేయిస్తుంది.
ఇక సత్యం, ప్రభావతిలను కెప్టెన్లుగా పెట్టి మనవాళ్లు మనవరాలను జట్టు సభ్యులుగా కేటాయిస్తుంది. ప్రభావతి జట్టులో కొడుకులు బాలు మనోజ్ రవి ఉంటారు. ఇక సత్యం జట్టులో కోడళ్ళు మీనా రోహిణి శృతి ఉంటారు. ఈ సందర్భంగా మొదటగా థగ్ ఫైట్ పోటీని నిర్వహిస్తారు. పురుషుల బలం ఎక్కువగా ఉండడంతో ప్రభావతి టీం గెలుస్తుంది. బాలు గెలిపించడంతో తల్లి ప్రభావతి ఉప్పొంగిపోతుంది. ఇక తర్వాత టైర్ తో ఆటలాడిస్తుంది సుశీలమ్మ. అందులోనూ బాలు గెలిచి ప్రభావతిని నెగ్గిస్తాడు. దీంతో మళ్లీ ప్రభావతి సంతోషం వ్యక్తం చేస్తుంది.
తన కొడుకు గెలిపించాడ ని ప్రభావతి చెప్పడంతో బాలు ఎమోషనల్ అవుతాడు. ఇక సుశీలమ్మ స్పందిస్తూ.. కుటుంబం అంటే ఇంతేనని ఒక జట్టులో ఉన్నప్పుడు తల్లికి కొడుకు, కొడుకుకు తల్లి ఎలా సహకరించుకున్నారు ఇక జీవితంలోనూ అలాగే సహకరించుకుంటూ ఉండాలని సూచించింది. అలా ఉంటేనే జీవితం మొత్తం సంతోషంగా ఉండగలరని చెబుతుంది. దానికి శృతి, రోహిణి కూడా ఎంతో సంతోషిస్తారు. ఇకపై అందరం అలాగే కలిసి ఉందాం అని, ఉంటాము కూడా అని సుశీలమ్మకు హామీని ఇస్తారు.
కానీ ఆ కొద్దిసేపటికి ఇంట్లోకి వెళ్ళాక సీన్ రివర్స్ అవుతుంది. ఆటలు ముగిసాయి కాబట్టి ఇక వెళ్ళిపోతామని మళ్లీ సుశీలమ్మతో అంటారు. దాంతో ఆమె ఒప్పుకోదు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరికి మళ్ళీ మాటల యుద్ధం జరుగుతుంది. ఇంత ప్రయత్నం చేసినప్పటికీ వృధా అయ్యిందా అని సుశీలమ్మ అందరి వైపు ఒక లుక్ ఇస్తుంది. ఈ లోపు శృతి స్పందిస్తూ మరొక గేమ్ ఆడదామని చెబుతుంది. కూర్చొని ఆడే కి ఏమీ పెడదామని చెప్పి ట్రూత్ ఆర్ డేర్ ఆటను ప్రారంభిస్తుంది. మొదటగా రవిని ప్రశ్నిస్తుంది. దాంతో రవి ట్రూత్ ఎంచుకొని తన లవ్ స్టోరీని చెబుతాడు. ఆ తర్వాత బాలు శృతిని అడిగి కాస్త ఫన్నీగా ఏడిపిస్తాడు. చివర్లో సుశీలమ్మ ప్రభావతిని బాలు గురించి మూడు నిజాలు చెప్పమని అడుగుతుంది, అలాగే బాలును కూడా తన తల్లి గురించి మూడు మంచి విషయాలు చెప్పమని అడుగుతుంది.
దాంతో మొదటగా తల్లి ప్రభావతి స్పందిస్తూ బాలుకు తన తండ్రి అంటే చాలా ఇష్టమని చెబుతుంది. అలాగే తన తండ్రి కోసం ఎంతటి కష్టమైనా ఇష్టంగా చేస్తాడు అని చెబుతుంది. అంతే కాకుండా ముక్కు సూటిగా మాట్లాడుతాడని, నిజాలు చెప్పడం మాత్రమే తెలుసని చెబుతుంది. ఆ తర్వాత బాలు స్పందిస్తూ తన తల్లి గురించి మాట్లాడుతాడు. తన తల్లి ప్రేమ కావాలని, తనను చిన్నప్పుడు ఎంతో బాగా చూసుకున్న ఆ అమ్మ ఇప్పుడు మళ్లీ కావాలని, ఆ ప్రేమ కోసమే ఎదురుచూస్తున్నానని చెబుతాడు. మరోవైపు తనపై నింద పడిందని చెప్పి సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఇంతకీ ఆ సస్పెన్స్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఆ ప్రశ్నలకు వారు ఎలాంటి సమాధానాలు ఇచ్చారనేది తర్వాత ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచుతుంది.


Click it and Unblock the Notifications











