Gunde Ninda Gudi Gantalu April 16th: తల్లి ప్రేమ కోసం బాలు తపన.. ప్రభావతి గుండె తరుక్కుపోయేలా
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 15వ తేదీ 401వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. సుశీలమ్మ కుటుంబ సభ్యులతో ఆటల పోటీలు ఏర్పాటు చేయిస్తుంది. ఇక ఆటలు ముగియడంతో అందరూ తిరిగి వెళ్ళిపోతామని సుశీలమ్మతో అంటారు. దాంతో ఆమె ఒప్పుకోదు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరికి మళ్ళీ మాటల యుద్ధం జరుగుతుంది. ఇంత ప్రయత్నం చేసినా వృధా అయ్యిందా అని సుశీలమ్మ అందరి వైపు ఒక లుక్ ఇస్తుంది. ఈ లోపు శృతి స్పందిస్తూ మరొక గేమ్ ఆడదామని చెబుతుంది. కూర్చొని ఆడే కి ఏమీ పెడదామని చెప్పి ట్రూత్ ఆర్ డేర్ ఆటను ప్రారంభిస్తుంది. మొదటగా రవిని ప్రశ్నిస్తుంది. దాంతో రవి ట్రూత్ ఎంచుకొని తన లవ్ స్టోరీని చెబుతాడు. ఆ తర్వాత బాలు శృతిని అడిగి కాస్త ఫన్నీగా ఏడిపిస్తాడు. చివర్లో సుశీలమ్మ ప్రభావతిని బాలు గురించి మూడు నిజాలు చెప్పమని అడుగుతుంది, అలాగే బాలును కూడా తన తల్లి గురించి మూడు మంచి విషయాలు చెప్పమని అడుగుతుంది.
దాంతో మొదటగా తల్లి ప్రభావతి స్పందిస్తూ బాలుకు తన తండ్రి అంటే చాలా ఇష్టమని చెబుతుంది. అలాగే తన తండ్రి కోసం ఎంతటి కష్టమైనా ఇష్టంగా చేస్తాడు అని చెబుతుంది. అంతే కాకుండా ముక్కు సూటిగా మాట్లాడుతాడని, నిజాలు చెప్పడం మాత్రమే తెలుసని చెబుతుంది. ఆ తర్వాత బాలు స్పందిస్తూ తన తల్లి గురించి మాట్లాడుతాడు. తన తల్లి ప్రేమ కావాలని, తనను చిన్నప్పుడు ఎంతో బాగా చూసుకున్న ఆ అమ్మ ఇప్పుడు మళ్లీ కావాలని, ఆ ప్రేమ కోసమే ఎదురుచూస్తున్నానని చెబుతాడు. మరోవైపు తనపై నింద పడిందని చెప్పి సస్పెన్స్ క్రియేట్ చేశారు. ఇంతకీ ఆ సస్పెన్స్ ఏంటనేది ఆసక్తికరంగా మారింది. ఆ ప్రశ్నలకు వారు ఎలాంటి సమాధానాలు ఇచ్చారనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 16వ తేదీ 402 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

శృతి ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ను ప్రారంభించడంతో అందరూ పార్టిసీపేట్ చేస్తారు. ఈ సందర్బంగా బాలు మనోజ్ కు ఫన్నీ టాస్క్ ఇస్తారు. డేర్ ఎంచుకోవడంతో ఊరు మధ్యలో ఉన్న మామిడి చెట్టు ఎక్కి మామిడికాయ కోసుకొని రా అని చెప్తాడు. దాంతో నాకేం భయం అని చెప్పి ధైర్యంగా వెళ్తాడు. ఇక ఆయన వెనకాల తెలియకుండా బాలు వెళ్లి దెయ్యంలాగా భయపెడుతాడు. దాంతో మనోజ్ జడుసుకుంటాడు. ఇంటికి పరిగెత్తుకుంటూ వస్తాడు. ఆ వెనకాలె బాలు కూడా వచ్చి ఆటపట్టిస్తాడు. ఆ తర్వాత రోహిణిని అడగ్గా ఆమె ట్రూత్ ఎంచుకుంటుంది. చివరిగా చెప్పిన అబద్ధం ఏంటని ప్రశ్నిస్తారు.
దీంతో రోహిణి మాట్లాడుతూ.. ఒకరిపై పడ్డ నింద గురించి చెప్పాలి. మా మేనమామ విషయంలో అబద్ధం చెప్పాను. మనోజ్ కు తాగించింది బాలు కాదు, మా మేనమామ అని తెలుసు. కానీ చెప్పకుండా దాచి ఉంచాను. అది అబద్ధం కిందనే లెక్క కదా అని చెబుతుంది. నిజం తెలిసిపోవడంతో సుశీలమ్మ బాలును క్షమాపణలు అడుగుతుంది. బాలును అనవసరంగా కొట్టాను అని బాధపడుతుంది. తర్వాత మీనాను అడ్డగా ట్రూత్ ఎంచుకుంటుంది. నీ కోసం జీవితంలో ఏదైనా సాధించాలని ఉందా? అని అడగ్గా ఉందని బదులిస్తుంది. తన తల్లి, చెల్లి, తమ్ముడు ఎంతో కష్టపడుతున్నారని చెబుతుంది. వారి సంతోషంగా ఉండేందుకు చాలా కష్టపడాలని ఉంది. చెల్లి, తమ్ముడిని చదివించాలని ఉందని తన మనసులోని మాట చెబుతుంది.
ఆ తర్వాత సుశీలమ్మ తన కొడలు ప్రభావతిని ట్రూత్ ఆర్ డేర్ అని అడుగుతుంది. అందుకు ఆమె స్పందిస్తూ ట్రూత్ అని చెబుతుంది. దీంతో బాలు గురించి మూడు మంచి విషయాలు చెప్పమని అడుగుతుంది. ప్రభావతి స్పందిస్తూ బాలుకు తన తండ్రి అంటే చాలా ఇష్టమని తండ్రి కోసం ఎంత కష్టమైనా చేస్తాడని చెబుతుంది. అలాగే ఎదుటి వారు కష్టాల్లో ఉంటే కాపాడుతాడని, తనకు నష్టం జరుగుతుందని తెలిసినా, ఎదుటివారికి ఇబ్బంది కలుగుతుందని తెలిసినా నిజాలే మాట్లాడుతాడని చెప్పి బాలు మనస్సు గెలుచుకుంటుంది. అంతే కాదు ప్రభావతి అలా చెప్పడంతో అందరూ సంతోషిస్తారు. బాలుపై ప్రభావతికి ఉన్న ప్రేమను చూసి సుశీలమ్మ కూడా ఆనందిస్తుంది.
ఇక బాలు చెప్పడం స్టార్ చేస్తాడు. చిన్నప్పుడు మా అమ్మ నన్ను ఎంతో బాగా చూసుకునేంది. నన్ను ఆడించేంది పాడించేది. చేతులు పట్టుకొని నడిపించేంది. జాబిలమ్మను చూపిస్తూ గోరుముద్దలు తినిపించేది. చందమామ కథలు చెప్పి నాన్న నిద్రబుచ్చేది. ప్రతి విషయంలో నాకు ధైర్యంగా ఉండేది. జాతరకు వెళ్లినా తప్పిపోతానని చేయి అస్సలు విడిచేది కాదు. కానీ ఒక రోజు ఆ అమ్మే నన్ను తీసుకొచ్చి నానమ్మ దగ్గర వదిలేసి వెళ్లింది. అప్పటి నుంచి తిరిగి రాలేదు. నాకు ఆ అమ్మ కావాలని అని బాలు ఎమోషనల్ అవుతాడు. తను అమ్మకు దూరంగా అవ్వడానికి కారణం ఉందని, ఒకరిపై పడాల్సిన నింద నాపై పడిందని, అప్పటి నుంచి తల్లినాకు దూరమైందని భాగోద్వేగం అవుతాడు.
తనపై పడ్డ నింద అనగానే మనోజ్ భయపడిపోతాడు. చిన్నప్పుడు ఈతకు వెళ్లిన సమయంలో వాళ్ల అన్నయ్య వరదలో కొట్టుకుపోతాడు. దాంతో ప్రాణాలు కోల్పోతాడు. దాంతో జైలుకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అయితే బాలుడు వరదలో కొట్టుకుపోవడానికి కారణం ఒకరైతే బాలుపై నిందపడుతుంది. అప్పటి నుంచి ప్రభావతి బాలు మధ్య దూరం పెరుగుతుంది. ఇక బాలు అసలు నిందితుడు ఎవరో చెప్పబోతుంటే తండ్రి సత్యం భుజంపై చేయి వేసి ఆపుతాడు. దాంతో అసలు నిజం ఏంటని రవి, శృతి, మీనా, రోహిణి అందరూ షాక్ అవుతారు. బాలు మనస్సుల్లో ఇంత బాధ ఉందా అని శృతి కూడా బాధపడుతుంది.
ఇక ఆ తర్వాత బాలు రాత్రి పడుకునేందుకు ముందు ఆరుబయట మంచంపై దిగాలుగా కూర్చుకుంటాడు. తన గతాన్ని గుర్తుచేసుకుంటూ బాధపడుతాడు. దాంతో మీనా వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. నాకు కూడా చెప్పలేనిదా అని అంటుంది. దాని బాలు అమ్మతో మాత్రమే చెప్పేది, అమ్మకు మాత్రం అది అర్థం అవుతందని అంటాడు. దాంతో మీనా కూడా చాలా బాధపడుతుంది. ఏం జరిగిందని తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ బాలు చెప్పేందుకు ఇష్టపడడు. ఇక ఆ తర్వాత ఎపిసోడ్ లో బాలు రోహిణి గుట్టు తెలుసుకుంటాడు. రైడ్ కోసం వెళ్లి రోహిణి పార్లర్ వద్దకు వెళ్తాడు. కస్టమర్ డబ్బులు ఇవ్వకపోవడంతో అడిగేందుకు పార్లర్ లోపలికి వెళ్తాడు. ఈ పార్లర్ ఓనర్ రోహిణి లేదా అని అడుగుతాడు. అందుకు అక్కడ పనిచేసే బ్యూటీషియన్ ఈ పార్లర్ రోహిణిది కాదని, ఆమె ఇందులో బ్యూటీషియన్ గా మాత్రమే పనిచేస్తుందని బదులిస్తుంది. దాంతో బాలు షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications










