Gunde Ninda Gudi Gantalu April 17th: పార్లర్ కు వెళ్లిన బాలు.. రోహిణి గుట్టు తెలుసుకుని షాక్

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 16వ తేదీ 402వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు చిన్నతనంలో జరిగిన ఓ విషాద ఘటనతో ప్రభావతి బాలు మధ్య దూరం పెరుగుతుంది. ఇక బాలు అసలు నిందితుడు ఎవరో చెప్పబోతుంటే తండ్రి సత్యం భుజంపై చేయి వేసి ఆపుతాడు. దాంతో అసలు నిజం ఏంటని రవి, శృతి, మీనా, రోహిణి అందరూ షాక్ అవుతారు. బాలు మనస్సుల్లో ఇంత బాధ ఉందా అని శృతి కూడా బాధపడుతుంది. బాలు రాత్రి పడుకునేందుకు ముందు ఆరుబయట మంచంపై దిగాలుగా కూర్చుకుంటాడు. తన గతాన్ని గుర్తుచేసుకుంటూ బాధపడుతాడు. దాంతో మీనా వచ్చి ఏం జరిగిందని అడుగుతుంది. నాకు కూడా చెప్పలేనిదా అని అంటుంది. దాని బాలు అమ్మతో మాత్రమే చెప్పేది, అమ్మకు మాత్రం అది అర్థం అవుతందని అంటాడు.

దాంతో మీనా కూడా చాలా బాధపడుతుంది. ఏం జరిగిందని తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. కానీ బాలు చెప్పేందుకు ఇష్టపడడు. ఇక ఆ తర్వాత ఎపిసోడ్ లో బాలు రోహిణి గుట్టు తెలుసుకుంటాడు. రైడ్ కోసం వెళ్లి రోహిణి పార్లర్ వద్దకు వెళ్తాడు. కస్టమర్ డబ్బులు ఇవ్వకపోవడంతో అడిగేందుకు పార్లర్ లోపలికి వెళ్తాడు. ఈ పార్లర్ ఓనర్ రోహిణి లేదా అని అడుగుతాడు. అందుకు అక్కడ పనిచేసే బ్యూటీషియన్ ఈ పార్లర్ రోహిణిది కాదని, ఆమె ఇందులో బ్యూటీషియన్ గా మాత్రమే పనిచేస్తుందని బదులిస్తుంది. దాంతో బాలు షాక్ అవుతాడు. ఇదంతా ప్రోమోలో చూపించారు. అంతకంటే ముందు ఏం జరిగిందనేది ఏప్రిల్ 17వ తేదీ 403 ఎపిసోడ్ లో..

Gunde Ninda Gudi Gantalu serial episode 403 April 17th

ఆరుబయట వెన్నెల రాత్రిలో కూర్చొని బాలు బాధపడుతూ ఉంటాడు. మీనా బాలు దగ్గరికి వచ్చి ఓదార్చుతూ ఉంటుంది. బాలు మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి అమ్మ ప్రేమ దక్కలేదని, అమ్మ ప్రేమ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నానని భార్య మీనాతో చెబుతాడు. తల్లికి ఎందుకు దూరమయ్యానో ఎవరికి చెప్పిన అర్థం కాదు. నేను పడే వేదన తల్లికి, తండ్రికి కూడా తెలిసి ఉండదు. నా జీవితంలో ఏమి దక్కని ఒంటరి వాడిలా ఇన్ని రోజులు గడిపాను. అమ్మ ప్రేమ దక్కని నాలాంటి దురదృష్టవంతులు కూడా ఉంటారు కదా అని మీనా తో చెప్పుకుంటూ తన బాధను కాస్త దిగమింగుకుంటాడు.

ఇక మీనా స్పందిస్తూ ఏమాత్రం అధైర్య పడద్దని చెబుతుంది. మంచి చేసిన వాళ్ళకి మంచే జరుగుతుందనీ చెప్పి భర్తను తన ఒడిలో పడుకోబెట్టుకుంటుంది. భర్త పడే బాధను చూసి తట్టుకోలేక పోతుంది. మరోవైపు గాఢ నిద్రలో ఉన్న సుశీలమ్మకు పీడకల వస్తుంది. బాలు మీనా విడిపోయినట్టుగా కల వస్తుంది. బాలు ప్రవర్తనకు విసిగెత్తిపోయిన మీనా ఇక తనతో కాపురం చేయలేనంటూ ఇంటి నుంచి బ్యాగ్ పట్టుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. బాలు మీనా ను బ్రతిమిలాడతాడు. తన మారుతానని ఇకపై ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకుంటానని మీనాతో చెప్పి ఒప్పించే ప్రయత్నం చేస్తాడు. కానీ మీనా ఎంతకు ఒప్పుకోదు. ఆవేశపరుడుతో కాపురం చేయడం నావల్ల కాదని వెళ్లిపోవడానికి నిర్ణయించుకున్నట్టుగా సుశీలమ్మకు కల వస్తుంది.

సుశీలమ్మ వెంటనే నిద్రలో నుంచి లేచి ఆందోళన పడుతుంది. తన మనవడు బాలును మీనా విడిచిపెట్టి పోతుందా అని కంగారుపడుతుంది. కలే అయినప్పటికీ చాలా ఆందోళన పడుతుంది. వెంటనే బాలు మీనా అని పిలుస్తూ వాళ్ల దగ్గరికి వెళ్తుంది. వెంటనే వాళ్ళని ఇంట్లోకి తీసుకెళ్లి దేవుని దగ్గర నిల్చోబెట్టి దిష్టి తీస్తుంది. ఇవ్వాళ పీడకల వచ్చిందని చెప్పుకుంటూ బాధపడుతుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ బాలుని విడిచి వెళ్ళొద్దని మీనాకు సుశీలమ్మ చెబుతుంది. అందుకు మీనా స్పందిస్తూ ఎన్ని కష్టాలు వచ్చినా ఇద్దరం కలిసి ఉంటామని, ఒకరిని విడిచి మరొకరు ఉండబోమని సుశీలమ్మకు మీనా వాగ్దానం చేస్తుంది.

ఇక తర్వాత ఉదయం అందరూ తిరిగి హైదరాబాదుకు చేరుకుంటారు. ఇంటికి వచ్చి రాగానే బాలు ప్రభావతి మధ్య ఘర్షణ ఏర్పడుతుంది. ప్రభావతి పూల కొట్టు అనే బోర్డు చూసి మండిపడుతోంది. వచ్చి రాగానే ఇదే కనిపిస్తుంది అంటూ చిరాకు పడుతుంది. ఆ బోర్డు పీకి పారేయ్ అని కొడుకు బాలుతో అంటుంది. బాలు ఆ బోర్డుపైనే నీ పేరే ఉంది. రోడ్డుపై పడేస్తే అందరూ తొక్కుకుంటూ వెళ్తారని బదులిస్తాడు. దాంతో ప్రభావతి ఆ బోర్డును తీసేసేందుకు వెళ్తుంటుంది. వెంటనే బాలు పెద్ద బోర్డు పెట్టిస్తానని హెచ్చరిస్తాడు. దీంతో బాలుతో ఎందుకు వచ్చిన గోల అని సైలెంట్ గా ఉంటుంది ప్రభావతి.

బాలు, ప్రభావతి మధ్య ఘర్షణ చూసిన సత్యం వారిపై మండిపడుతాడు. ఊర్లో ఎంతో మంచి కుటుంబం అని మనల్ని అందరూ మెచ్చుకున్నారు. కానీ మీరు ఇంటికి తిరిగి రాగానే రోడ్డుపైనే ఇలా దెబ్బలాడుతూ పరువు తీస్తూన్నారంటూ కోపం చేస్తాడు. ఇక అందరూ ఇంట్లోకి వెళ్తారు. వెళ్లగానే రెస్ట్ తీసుకోవాలని రోహిణి మనోజ్, శృతి అంటారు. మరోవైపు ప్రభావతి కూడా కాస్తా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటుంది. ఎవరి గదుల్లోకి వారు వెళ్లాలని అనుకుంటారు. మీనాను ప్రభావతి కాఫీ అడుగుతుంది. దాంతో పూలకొట్టు తీశాక ఇస్తానని బదులిస్తుంది.

ఆ పూల కొట్టు ఏమైనా పెద్ద షాప్ నా కాఫీ ఇచ్చి వెళ్లు. ఊర్లో సుశీలమ్మ దగ్గర సాగిన నాటకాలు ఇక్కడ సాగవని అంటుంది. ఇది నా పుట్టింటి వారు ఇచ్చిన ఇల్లు.. అని చెబుతుంది. ఇక్కడ అందరికీ రూమ్ లు ఉన్నాయి. మాకే లేదని చిరాకు పడుతుంది. మీనా, బాలు వల్ల మాకు రూమ్ లేకుండా పోయిందని అంటారు. దీంతో బాలు జోక్యం చేసుకుని తన తండ్రి సత్యం కాదా? అని అడుగుతాడు. ఇక సత్యం స్పందిస్తూ త్వరలోనే పైన ఇంకో గది కట్టిస్తానని అంటాడు. పైన గది కడితే మీనాను ఇంట్లో నుంచి వెళ్ల గొట్టే అవకాశం ఉండదని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. అయితే ప్రోమోలో రోహిణి పార్లర్ దగ్గరకు బాలు వెళ్లినట్టు, పార్లర్ తనది కాదని తెలుసుకున్నట్టు చూపించారు. దానిపైనా ఆసక్తి నెలకొంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X