Gunde Ninda Gudi Gantalu April 18th: బయటపడ్డ రోహిణి బంఢారం.. పోయిపోయి బాలుకే చిక్కిన పార్లరమ్మ
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 17వ తేదీ 403వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మొత్తానికి సత్యం వాళ్ల సొంత ఊరు, సుశీలమ్మ గారి ఇంటి నుంచి తిరిగి కుటుంబం మొత్తం హైదరాబాద్ కు తిరిగి వస్తుంది. బాలు, ప్రభావతి మధ్య ఘర్షణ చూసిన సత్యం వారిపై మండిపడుతాడు. ఊర్లో ఎంతో మంచి కుటుంబం అని మనల్ని అందరూ మెచ్చుకున్నారు. కానీ మీరు ఇంటికి తిరిగి రాగానే రోడ్డుపైనే ఇలా దెబ్బలాడుతూ పరువు తీస్తూన్నారంటూ కోపం చేస్తాడు. ఇక అందరూ ఇంట్లోకి వెళ్తారు. వెళ్లగానే రెస్ట్ తీసుకోవాలని రోహిణి మనోజ్, శృతి అంటారు. మరోవైపు ప్రభావతి కూడా కాస్తా విశ్రాంతి తీసుకోవాలని అనుకుంటుంది. ఎవరి గదుల్లోకి వారు వెళ్లాలని అనుకుంటారు. మీనాను ప్రభావతి కాఫీ అడుగుతుంది. దాంతో పూలకొట్టు తీశాక ఇస్తానని బదులిస్తుంది.
ఆ పూల కొట్టు ఏమైనా పెద్ద షాప్ నా కాఫీ ఇచ్చి వెళ్లు. ఊర్లో సుశీలమ్మ దగ్గర సాగిన నాటకాలు ఇక్కడ సాగవని అంటుంది. ఇది నా పుట్టింటి వారు ఇచ్చిన ఇల్లు.. అని చెబుతుంది. ఇక్కడ అందరికీ రూమ్ లు ఉన్నాయి. మాకే లేదని చిరాకు పడుతుంది. మీనా, బాలు వల్ల మాకు రూమ్ లేకుండా పోయిందని అంటారు. దీంతో బాలు జోక్యం చేసుకుని తన తండ్రి సత్యం కాదా? అని అడుగుతాడు. ఇక సత్యం స్పందిస్తూ త్వరలోనే పైన ఇంకో గది కట్టిస్తానని అంటాడు. పైన గది కడితే మీనాను ఇంట్లో నుంచి వెళ్ల గొట్టే అవకాశం ఉండదని ఆలోచిస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 18వ తేదీ 404 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

పసర్లపూడి గ్రామానికి వచ్చిన తర్వాత సత్యం వారి ఇంట్లో కొత్త సమస్య మొదలైంది. మీనా ఎంత అనుకువగా పద్ధతిగా ఉన్నప్పటికీ ప్రభావతి మాత్రం ఎంతకూ మెచ్చుకోదు. పైగా ఎప్పటికప్పుడు ఏదోలా నిప్పులు కురిపిస్తుంది. ఇక పసర్లపూడి గ్రామం నుంచి ఇంటికి రాగానే ప్రభావతి కాస్తా రిలాక్స్ అవుతుంది. ఇలోగా ప్రభావతి వదిన కామాక్షి వస్తుంది. ప్రభావతి ఆమెతో మాట్లాడుతూ ఉంటుంది. ఆమె ఎప్పటిలాగే ప్రభావతి ఏం మాట్లాడిన దెప్పిపోడుతూ ఉంటుంది. ఇక ప్రభావతి కామక్షితో ఒంటిరిగా మాట్లాడాలని అంటుంది. దీంతో హాల్ లో కాకుండా వేరే గదిలో కూర్చొని మాట్లాడుకుందామని అంటుంది.
మొదటగా చిన్నకొడుకు రవి శృతి వాళ్ల రూమ్ లోకి వెళ్లి మాట్లాడుకుందామని ఆ గది దగ్గరికి వెళ్తారు. ప్రభావతి శృతిని పిలిచే లోపే శృతి తన భర్త రవిని గదిలోంచి బయటికి నెట్టివేస్తుంది. దీంతో ప్రభావతి, కామక్షి రవిని అలా గెంటేయడం చూసి షాక్ అవుతారు. దీంతో కామక్షి ఎటకారంగా ఏవమ్మా శృతి మీ అత్తగారి మొహం మీదనే తలుపు వేశావు. కొంచెం ఉంటే మీ అత్తయ్య ముక్కు పగిలిపోయేది అని దెప్పిపొడుస్తుంది. దీంతో ప్రభావతి అవమానంగా ఫీలవుతుంది. ఇక రవిని అలా నెట్టేశావేంటనీ అడగ్గా అదేం లేదు పిన్ని డ్రెస్ ఛేంజ్ చేసుకోవాలని బయటికి పంపించాను అంతే అని చెప్పి, అత్త ప్రభావతికి కూడా సారీ చెబుతుంది. ఇక శృతి గదిలోనే బిజీగా ఉండటంతో రోహిణి వాళ్ల గదివైపు వెళ్తారు.
రోహిణి వాళ్ల గదివైపు వెళ్లివెళ్లగానే వెదవలు అంటూ మనోజ్ పై రోహిణి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఊరు నుంచి తిరిగి వచ్చాక ఉద్యోగం చూసుకుంటానని చెప్పి మంచిగా పడుకుంటున్నావా? అని మండిపడుతుంది. దీంతో మనోజ్ లేస్తూ ఉద్యోగం రావడం లేదని లేజీగా బదులిస్తాడు. ఇక ఉద్యోగం రాకపోతే లక్షలు మింగడం వచ్చా అని మనోజ్ ను తిడుతుంది. ఇవన్నీ మాటలు వింటూ ప్రభావతి అవమానంగా భావిస్తుంది. వదినతో ఏకాంతంగా తన గోడు చెప్పుకుందామంటే అటు శృతి, ఇటు రోహిణి తమ గదుల్లోకి రానిచ్చేలా కనిపించకపోవడంతో అప్సెట్ అవుతుంది. ఇక చేసేదీ లేక బాలు వాళ్ల గదిలో మాట్లాడుకునేందుకని వెళ్తారు. మీనా ఎలాగూ కాఫీ చేయడానికి అని కిచెన్ లో ఉంది కదా.. ఇక అక్కడ ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చిన అనుకుంటారు.
కానీ ప్రభావతి, తన వదిన కామాక్షితో కలిసి మీనా గది వరకు వెళ్లి చూడగా.. బాలు మంచి పడుకొని ఉంటాడు. దీంతో మీనా తన స్వరంతో లేపుతుంది. లేచిన బాలు వారిద్దరిని చూసి ఏంటనీ అడుగుతాడు. మేం ఇద్దరం ఏకాంతంగా మాట్లాడుకోవాలని ప్రభావతి బాలుతో చెబుతుంది. అయితే మాట్లాడుకోండి దానికి నా అనుమతి ఎందుకని అంటాడు. ఏకాంతంగా అంటే ఎవరూ లేని ప్రదేశంలో అని అంటుంది ప్రభావతి.. దాంతో బాలు హాల్ లో ఎవరూ లేరు వెళ్లి మాట్లాడుకోండి అని బదులిస్తాడు. ఇక చేసేదేమీ లేక బిల్డింగ్ పైకి వెళ్లి మాట్లాడుకుంటారు.
ఇక ప్రభావతి మాట్లాడుతూ ఇలా ఉంది నా పరిస్థితి అని అంటుంది. నీకేంటి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్లతో కలిసి సుఖంగా ఉంటున్నావు అని కామక్షి అంటుంది. అందుకు ప్రభావతి స్పందిస్తూ నాకంటూ ప్రత్యేకమైన గదిలో లేకుండా పోయిందని అంటుంది. పైన ఒక గది కట్టించుకోని హాయిగా ఉండండి అని బదులిస్తుంది. దానికి ప్రభావతి కూడా స్పందిస్తూ అదే అనుకున్నాం. కానీ అందరికి సరిపడా రూమ్ లు ఉంటే బాలు, మీనాను బయటికి గెంటేయడం వీలవ్వదు కదా అని అంటుంది. వారిని బయటికి పంపించాక మూడంతస్తుల మేడ కట్టుకుంటామని ఇక్కడ హాల్, ఇక్కడ టీవీ యూనిట్, ఇక్కడ స్విమ్మింగ్ ఫూల్ అని చెబుతుంది.
ఇంటి ముందు ఉన్న పూల కొట్టు కూడా పీకించేయిస్తానని అంటుంది. ఆ మాటలు మీనా వింటుంది. దాంతో వారిద్దరూ సెలైంట్ గా ఉండిపోతారు. మరువైపు బాలు రైడ్ కు అని వెళ్తాడు. అది కాస్తా నేరుగా రోహిణి బ్యూటీ పార్లర్ కే వెళ్లాల్సి వస్తుంది. రోహిణి అమ్మేసిన బ్యూటీ పార్లర్ ఓనర్ బాలు క్యాబ్ ను బుక్ చేస్తుంది. పార్లర్ వద్దకు వెళ్లగానే బాలుకు డబ్బులివ్వకుండా పైకి వెళ్తుంది. అప్పటికే మటన్ కొట్టు మాణిక్యం దారిలో రోహిణిని చూసి పార్లర్ వరకు వస్తాడు. మేడమ్ మటన్ తీసుకోండి అని చెబుతాడు. మాణిక్యంను చూసిన రోహిణి కంగారు పడుతుంది. నువ్విలా బయట తిరగొద్దని హెచ్చరిస్తుంది. ఇలాగైతే నీకు రాజమౌళి సినిమాలో అవకాశం రాదని చెబుతుంది. మరోవైపు బాలు పార్లర్ లోపలికి వచ్చి ఆమె ను డబ్బులు అడుగుతాడు. ఆమె క్యాష్ కౌంటర్ లోంచి డబ్బులు ఇప్పిస్తుంది.. ఇక తర్వాత బాలు మాణిక్యంను చూసి షాక్ అవుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











