Gunde Ninda Gudi Gantalu April 19th : రోహిణి పార్లర్ లో రచ్చ.. బాలు ముందు పరువు పోగొట్టున్న పార్లరమ్మ
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 18వ తేదీ 399వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మొత్తానికి పసర్లపూడి గ్రామం నుంచి తిరిగిన వచ్చిన తర్వాత సత్యం కుటుంబంలో మరో ఆసక్తికరమైన సంఘటన జరిగింది. గ్రామంలో ఎంతో కలిసి ఉన్నా ఇంటికి వచ్చే సరికి మళ్లీ ఎక్కడి వేసిన గొంగడి అక్కడే అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు. బాలుతో ప్రభావతి నిత్య గొడవ.. మీనాపై ప్రభావతి నిప్పులు కక్కడం యథావిధంగా కొనసాగుతున్నాయి. ఇక తాజాగా ప్రభావతి మదిలో మీనాను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలనే ఆలోచనలు మొదలయ్యాయి. అందుకు తగ్గటుటుగా వ్యూహాలు రచిస్తోంది. తన వదినను పిలిపించి మరీ మీనాను వెళ్లగొట్టే పని గురించి చెప్పడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు బాలు తన కారు నడుపుకుంటూ మళ్లీ బిజీ అయ్యి పోయాడు. ఈ క్రమంలో రైడ్స్ కోసం తిరుగుతూ తిరుగుతూ ఒక కస్టమర్ ను ఎక్కించుకొని రోహిణికి సంబంధించిన బ్యూటీ పార్లర్ దగ్గరకు వెళ్తాడు. అయితే ఆమె బ్యూటీ పార్లర్ లోపలికి వెళ్లి పోతుంది. బాలుకు డబ్బులు ఇవ్వడం మర్చి పోతుంది. ఇక వెంటనే బాలు తన రైడ్ డబ్బులు వసూల్ చేసుకోవడం కోసమని పార్లర్ లోపలికి వెళ్తాడు. అక్కడి వెళ్లిన బాలుకు ఊహించని షాక్ తగులుతుంది. అయితే అప్పటికే ఆ పార్లర్ లో మలేషియా మేనమామ ఉండటంతో సీన్ ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 19న 405 ఎపిసోడ్ లో ఏం జరిగి ఉంటుందంటే?

పసర్లపూడి గ్రామం నుంచి తిరిగి హైదరాబాద్ లోని తమ సొంత ఇంటికి వచ్చిన తర్వాత ప్రభావతి మరో వివాదానికి దారి తీస్తుంది. ఇంట్లో ఉన్నవే మూడు గదులని రోహిణి - మనోజ్ లకు ఒక గది, రవి - శృతిలకు ఒక గది పోనూ మిగిలిన గదిలో తాము ఉండేవాళ్లమని, ఇక మీనాతో బాలుకు పెళ్లాయ్యాయక అది కూడా లేకుండా పోయిందని గులుగుతూ ఉంటుంది. దీంతో మీనాను ఎలాగైనా ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అప్పటికే తన ఇంటికి వదిన కాంచనను పిలిపించుకొని మరీ తన కుట్ర పూరిత ఆలోచనను బయట పెడుతుంది.
ఈ క్రమంలోనే మీనాను ఇంకా టార్చర్ పెట్టేందుకు ప్రయత్నిస్తుంది. మీనా కనిపించిన ప్రతిసారి ఏదోలా సూటిపోటు మాటలతో మనసుకు గాయం చేసేలా మాట్లాడుతూ ఉంటుంది. ఇక మీనా కూడా ప్రస్తుతం పూలకొట్టుతో సంపాదిస్తుండటం మూలంగా ప్రభావతి ఎన్ని మాటలు అన్నా కూడా పట్టించుకోదు. పైగా ధీటుగా బదులిస్తూ ఉంటుంది. తనకు మామ సత్యం మద్దతు, భర్త బాలు సపోర్ట్ ఉంటున్న సంగతి తెలిసిందే. మీనాను టార్చర్ పెట్టడమే కాకుండా రోహిణి, శృతిలను మీనా ముందే మెచ్చుకుంటూ తనను కావాలనే అవమానిస్తుంది. అయినా మీనా భరిస్తుంది.
మరోవైపు బాలు పసర్లపూడి గ్రామం నుంచి తిరిగి ఇంటికి వచ్చాక హాయిగా రెస్ట్ తీసుకుంటాడు. ఇక మళ్లీ తన రోజువారీ పనుల్లో బిజీ అయిపోతాడు. కారు తీసుకొని రైడ్ కు వెళ్తాడు. తన కారులో ఒక మహిళ ఎక్కుతుంది. ఆమె డ్రాప్ లోకేషన్ రోహిణి పార్లర్ వద్దకు ఉంటుంది. అక్కడికి చేరుకున్నాక త్వరగా దిగి ఆమె పార్లర్ లోపలికి వెళ్తుంది. డబ్బులివ్వకుండా వెళ్లడంతో బాలు ఆమె వెనకాలే పార్లర్ లోనికి వెళ్లి ఆమెను పిలిచి డబ్బులివ్వమని అడుగుతాడు. అయితే ముందే పార్లర్ లో ఆసక్తికర ఘటన జరుగుతుంది.
ఎవరూ ఊహించని విధంగా మటన్ కొట్టు మాణిక్యం పార్లర్ కు వస్తాడు. రోహిణి, తన స్నేహితురాలు దివ్య రోడ్డుపై కనిపించడంతో వారికి మటన్ ఇద్దామని వెనకాలే పార్లర్ వరకు వెళ్తాడు. అయితే అతన్ని పార్లర్ లోపల చూసిన రోహిణి చాలా కంగారు పడుతుంది. వెంటనే మటన్ కొట్టే మాణిక్యంను లోపలికి తీసుకెళ్లి నువ్విలా బయట తిరగొద్దు అని చెప్పి హెచ్చరిస్తుంది. వాళ్లు నిన్ను గుర్తు పడితే సమస్యల్లో ఇరుక్కు పోతావని సూచిస్తుంది. అర్థం కానీ అతను రాజమౌళి సినిమాలో అవకాశం పోతుందేమోనని భయపడి సరే అని అంటాడు.
అదే సమయానికి పార్లర్ కు రోహిణి వాళ్ల ఓనర్ వస్తుంది. ఆమె పోయిపోయి బాలు కార్ లోని వస్తుంది. డబ్బులివ్వకుండా తన కారులోనే వచ్చాను అనుకొని హడావుడిగా లోపలికి వస్తుంది. దాంతో రోహిణి కంగారు పడుతూ వచ్చి ఆమెతో మాట్లాడుతుంది. బిజినెస్ వివరాలు అడిగి ఐబ్రోస్ చేయాలని అంటుంది. దీంతో రోహిణి ఆమెను మాణిక్యం ఉన్న రూమ్ లో కాకుండా మరో రూమ్ లోకి పంపించి వేచి ఉండండి అని చెబుతుంది. ఆ వెంటనే వచ్చి మాణిక్యంను ఇక నువ్వు వెళ్లు అని చెబుతుంది.
అయితే అప్పటికే బయట బాలు రోహిణి వాళ్ల ఓనర్ దగ్గర నుంచి రైడ్ కు సంబంధించిన డబ్బులు తీసుకుంటాడు. అయితే ఆమె కౌంటర్ లో నుంచి ఇవ్వమని రెసెప్షనిస్ట్ కు చెబుతుంది. ఈ క్రమంలోనే ఆ పార్లర్ రోహిణిది కాదని తెలుసుకుంటాడు. మీ పార్లర్ లో కస్టమర్లకు కూడా డబ్బులు ఇస్తారా? అని అడుగుతాడు. లేదు ఆమెనే ఈ పార్లర్ కు ఓనర్ అని ఆమె చెబుతుంది. బోర్డు కూడా మార్చేశాం కదా అని చెప్పడంతో బాలు షాక్ అవుతాడు. ఈ క్రమంలో మలేషియా మేనమామ పార్లర్ లోపలి నుంచి బయటికి వచ్చే ప్రయత్నం చేస్తాడు.
కానీ బాలు బయటి వచ్చి ఉన్న సంగతిని రోహిణి తెలుసుకుంటుంది తన స్నేహితురాలు ముందుగా బయటికి రావడంతో బాలును చూస్తుంది. దీంతో లోపల ఉన్న మాణిక్యం ను బయటికి రాకుండా జాగ్రత్త పడుతుంది. తన స్నేహితురాలు దివ్య వల్ల మాణిక్యంను బయటికి రానివ్వకుండా చేస్తుంది. కానీ రోహిణి వాళ్ల ఓనర్ రోహిణిని పిలుస్తూ ఉంటుంది. మరోవైపు పార్లర్లోని అన్ని పనులను చేయిస్తూ ఉంటుంది. అన్ని పనులు సరిగా చూసుకోవాలని కూడా చెబుతూ ఉంటుంది. ఇవన్నీ బాలు గమనిస్తూ ఉంటాడు.
ఇక పార్లర్ తనది కాదనే నిజం తెలిసిపోవడంతో రోహిణి గుట్టు ఇంట్లో బయట పెట్టాలని ప్రయత్నిస్తాడు. ఇక ఇంటి వెళ్తాడు. వెళ్లగానే రోహిణి కూడా పార్లర్ నుంచి తిరిగి వస్తుంది. దీంతో ప్రభావతి ఇవ్వాళ బాగా పనిచేశావు అనుకుంటా అమ్మ అని అంటుంది. దాంతో బాలు అవును ఆవిడ పార్లర్ లో బ్యూటీషన్లే కంటే ఓనర్లే ఎక్కువ పనిచేస్తున్నారని అంటాడు. దీంతో రోహిణి నిజం తెలిసి పోయిందా? అని కంగారు పడుతుంది. ఈ సందర్భంగా ఏం జరిగిందనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











