Gunde Ninda Gudi Gantalu April 21th: అత్త ప్రభావతికి తెలిసిన రోహిణి బంఢారం.. సాక్ష్యాలతో బయటపెట్టిన బాలు
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 18వ తేదీ 404వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇంట్లో ఏ గదిలో ఖాళీ లేకపోవడంతో ప్రభావతి ఇబ్బందిగా ఫీలవుతుంది. ఇలా ఉంది నా పరిస్థితి అని తన వదిన కామాక్షితో చెబుతుంది. దాంతో ఆమె బదులిస్తుంది. నీకేంటి ముగ్గురు కొడుకులు, ముగ్గురు కోడళ్లతో కలిసి సుఖంగా ఉంటున్నావు అని కామక్షి అంటుంది. అందుకు ప్రభావతి స్పందిస్తూ నాకంటూ ప్రత్యేకమైన గదిలో లేకుండా పోయిందని అంటుంది. పైన ఒక గది కట్టించుకోని హాయిగా ఉండండి అని బదులిస్తుంది. దానికి ప్రభావతి కూడా స్పందిస్తూ అదే అనుకున్నాం. కానీ అందరికి సరిపడా రూమ్ లు ఉంటే బాలు, మీనాను బయటికి గెంటేయడం వీలవ్వదు కదా అని అంటుంది. వారిని బయటికి పంపించాక మూడంతస్తుల మేడ కట్టుకుంటామని ఇక్కడ హాల్, ఇక్కడ టీవీ యూనిట్, ఇక్కడ స్విమ్మింగ్ ఫూల్ అని చెబుతుంది.
ఇంటి ముందు ఉన్న పూల కొట్టు కూడా పీకించేయిస్తానని అంటుంది. ఆ మాటలు మీనా వింటుంది. దాంతో వారిద్దరూ సెలైంట్ గా ఉండిపోతారు. మరోవైపు బాలు రైడ్ కు అని వెళ్తాడు. అది కాస్తా నేరుగా రోహిణి బ్యూటీ పార్లర్ కే వెళ్లాల్సి వస్తుంది. రోహిణి అమ్మేసిన బ్యూటీ పార్లర్ ఓనర్ బాలు క్యాబ్ ను బుక్ చేస్తుంది. పార్లర్ వద్దకు వెళ్లగానే బాలుకు డబ్బులివ్వకుండా పైకి వెళ్తుంది. అప్పటికే మటన్ కొట్టు మాణిక్యం దారిలో రోహిణిని చూసి పార్లర్ వరకు వస్తాడు. మేడమ్ మటన్ తీసుకోండి అని చెబుతాడు. మాణిక్యంను చూసిన రోహిణి కంగారు పడుతుంది. నువ్విలా బయట తిరగొద్దని హెచ్చరిస్తుంది. ఇలాగైతే నీకు రాజమౌళి సినిమాలో అవకాశం రాదని చెబుతుంది. మరోవైపు బాలు పార్లర్ లోపలికి వచ్చి ఆమె ను డబ్బులు అడుగుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 21వ తేదీ 405 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

బాలు రోహిణి పార్లర్ దగ్గరకు వెళ్తాడు. అదే సమయానికి రోహిణి కూడా పార్లర్ లోనే ఉంటుంది. అయితే బాలు రోహిణిని, మాణిక్యంను కలిసి చూస్తాడని అంతా ఊహించారు. కానీ అలా జరగదు. బాలు క్యాబ్ డబ్బుల కోసమని పార్లర్ లోపలికి వస్తాడు. అయితే ఆ పార్లర్ రోహిణిది అనే విషయం బాలుకు తెలుసు. అయితే తన క్యాబ్ లో వచ్చిన ఆమె కౌంటర్ నుంచి డబ్బులు తీసి ఇవ్వమని అంటుంది. దాంతో బాలు షాక్ అవుతాడు. ఏంటీ మీ పార్లర్ లో కస్టమర్లకు కూడా డబ్బులు ఇచ్చి పంపిస్తారా? అని అడుగుతాడు. అసలు ఈ పార్లర్ ఓనర్ ఆమెనే అని బదులిస్తుంది. దాంతో బాలు ఇంకా షాక్ అవుతాడు. ఏంటీ ఈ పార్లర్ కు ఓనర్ రోహణి కాదా అని అడుగుతాడు. రెసెప్షనిస్ట్ మళ్లీ కాదని బదులిస్తుంది.
బోర్డు చూడలేదా? క్వీన్ బ్యూటీ పార్లర్ గా మారిపోయింది. రోహిణి పార్లర్ ను క్వీన్ బ్యూటీ పార్లర్ లో కలిపేశారు. ఇప్పుడు ఈ పార్లర్ కు ఓనర్ ఆమెనే అని చెబుతుంది. దాంతో బాలు షాక్ అవుతాడు. ఇన్నాళ్లు తన పార్లర్ కు ప్రభావతి పార్లర్ అని పేరు పెట్టుకున్నానని, సొంతంగా వ్యాపారం నడిపిస్తున్నానని గొప్పలు చెబుకుంటూ ఇంట్లో అందరిని చులకనగా చూస్తున్నది రోహిణి అంటూ మండిపడుతాడు. ఇక ఈ విషయం వెంటనే ఇంట్లో చెప్పాలనుకుంటాడు. అంత కంటే ముందు పార్లర్ బోర్డు దగ్గర సెల్ఫీలు దిగి సాక్ష్యాలుగా చూపించాలని అనుకుంటాడు. సెల్ఫీలు తీసుకుంటాడు.
అయితే సెల్ఫీలు తీసుకున్న వెంటనే నేరుగా ఇంటికి వెళ్లకుండా తన తండ్రి సత్యం దగ్గరకు వెళ్లి అసలు నిజం చెబుతాడు. తన కారు తీసుకొని రైడ్స్ కు వెళ్లిన సందర్భంగా రోహిణి బ్యూటీ పార్లర్ కు వెళ్లానని వివరిస్తాడు. అయితే రోహిణి పార్లర్ తన సొంతం కాదని, ఎప్పుడో అమ్మేసిందని తండ్రితో చెబుతాడు. తండ్రి సత్యం నమ్మబోడు. దాంతో వెంటనే ఫొటోలను చూపిస్తాడు. సత్యం కూడా షాక్ అవుతాడు. ఇక బాలు వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో చెబుదాం పదా నాన్న అని అంటాడు. కానీ మళ్లీ ఎలాంటి గొడవలు అవుతాయోనని సత్యం ఎవరికీ ఈ విషయం చెప్పొద్దని ప్రామీస్ చేయించుకుంటాడు.
అయితే తనంతటా తానుగా ఎవరికీ ఈ విషయం చెప్పబోనని, కానీ ఎవరైనా రెచ్చగొడితే మాత్రం నేనేం చేయలేనని ముందే తండ్రి సత్యంకు చెబుతాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి ఇంటికి వెళ్తారు. అదే సమయానికి రోహిణి కూడా పార్లర్ నుంచి తిరిగి ఇంటికి వస్తుంది. ఇక ఇంట్లోనే ఉన్న ప్రభావతి రోహిణిని ఈరోజు కాస్తా ఆలస్యమైంది రోహిణి. పార్లర్ లో బాగా పని ఉందా? అని అడుగుతుంది. దాంతో రోహిణి అవును అత్తమ్మ అని బదులిస్తుంది. అక్కడే ఉన్న బాలు అవునవును వీళ్ల పార్లర్ లో పనివాళ్ల కంటే ఓనర్లే ఎక్కువగా పనిచేస్తారని చెబుతాడు.
బాలు మాటలకు రోహిణి షాక్ అవుతుంది. మరోవైపు నిజం చెప్పబోతుంటే తండ్రి సత్యం కూడా అడ్డుకుంటాడు. ఇక ప్రభావతి మాట్లాడుతూ.. నీకు ఇబ్బందైతే చెప్పామ్మ ఎలాగూ పార్లర్ నా పేరు మీదే ఉంది కాబట్టి, నేనే ఓపెన్ చేశాను కాబట్టి, నేను వచ్చి కౌంటర్ మీద కూర్చుంటాను. నీకు కాస్తా పనిభారం తగ్గుతుందని అంటుంది. దానికి బాలు స్పందిస్తూ అసలు పేర్లు ఉంటే మన సొంతమైపోతదని, సెలబ్రెటీలు షాపింగ్ మాల్స్ ఓపెన్ చేసినంత మాత్రానా వారిది అయిపోదు కదా.. ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే వారిదే అవుతుందని అంటాడు.
మరోవైపు ప్రభావతి మీనాను పిలిచి రోహిణి బాగా అలిసిపోయి వచ్చిందని, జ్యూస్ తీసి ఇవ్వు అని ఆదేశిస్తుంది. ఇక అక్కడే ఉన్న బాలు మై క్వీన్ మీనా నాకు కూడా జ్యూస్ ఇవ్వవా అని అంటాడు. నీకెందుకు రా జ్యూస్ అని ప్రభావతి అంటుంది. మీనా మై క్వీన్, ఇది మై క్వీన్ పాలెస్, మై జ్యూస్ కాబట్టి నాకు తాగాలనిపించి అడుగుతున్నాను అని అంటాడు. పదే పదే క్వీన్, క్వీన్ అనడంతో రోహిణి గుండె జల్లుమంటుంది. తెలిసి పోయిందా అని కంగారు పడుతుంది. ఇక త్వరగా మాటలు ముగించి తన రూమ్ లోకి వెళ్లిపోతుంది. మరోవైపు బాలు ఈ విషయాన్ని మీనాకు చెప్పాలని అనుకుంటాడు. అయితే అక్కడ కూడా సత్యం బాలును అడ్డుకుంటాడు. అయినా మీనాకు నిజం చెప్పాలని బాలు ప్రయత్నిస్తూనే ఉంటాడు.. సత్యం అడ్డుపడుతూనే ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది వేచి చూడాలి.


Click it and Unblock the Notifications











