Gunde Ninda Gudi Gantalu April 22nd: ప్రభావతికి నిజం చెప్పే ప్రయత్నం.. బాలుకు హెచ్చరించిన తండ్రి సత్యం

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 21వ తేదీ 405వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు రోహిణి బ్యూటీ పార్లర్ దగ్గరికి వెళ్లి విస్తుపోయే నిజాలను తెలుసుకుంటాడు. పార్లర్ పేరు ప్రభావతిపై లేదని, క్వీన్ పార్లర్ గా మారిపోయిందని, ఆ ఫ్రాంచైజీకి ఎప్పుడే అమ్మేశారని, ఇప్పుడు రోహిణి కేవలం సాధారణ బ్యూటీషియన్ అనే షాకింగ్ విషయాలను తెలుసుకుంటాడు. అయితే అప్పటికే రోహిణిని చూసి తన వెంటనే పార్లర్ లోపలికి వచ్చిన మటన్ కొట్టే మాణిక్యంను మాత్రం చూడలేకపోతాడు. రోహిణి గుట్టు తెలుసుకునే క్రమంలో తన ముందు నుంచే వెళ్లిన మాణిక్యంను చూడలేకపోతాడు. అసలు మాణిక్యంను చూసి కథ మరోలా ఉండేది. కానీ అది మిస్సైపోయింది. ఇక ఎట్టకేళలకు రోహిణి పార్లర్ కు ఓనర్ కాదనే విషయాన్ని మాత్రం తెలుసుకుంటాడు.

పార్లర్ పేరు మార్చిన బోర్డు వద్ద కూడా సెల్ఫీలు దిగుతాడు. వెంటనే వెళ్లి తన తండ్రి సత్యంకు చెబుతాడు. కానీ ఆయన నమ్మడు. దీంతో ఫొటోలు చూపిస్తాడు. దాంతో సత్యం కూడా షాక్ అవుతాడు. ఇక ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని అంటాడు. చెబితే అప్పుడు రోహిణి వెళ్లిపోయినట్టే మనోజ్ కూడా వెళ్లిపోతాడని బాలుతో చెప్పి నోరు మూయిస్తాడు. దానికి బాలు ఓకే అని చెబుతాడు. కానీ ప్రభావతికి ఎలాగైనా రోహిణి పార్లకు ఓనర్ కాదనే విషయాన్ని చెప్పాలని అనుకుంటాడు. చెప్పే ప్రయత్నం చేస్తాడు. సత్యం అడ్డుకోవడంతో చెప్పబోయి ఆగిపోతుంటాడు. ఇక కనీసం మీనాకైనా చెప్పాలనుకుంటాడు.తండ్రి అప్పుడు కూడా వచ్చి అడ్డుకుంటాడు. ఎవరికీ చెప్పొద్దని హెచ్చరిస్తూ ఉంటాడు... ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 22వ తేదీ 406 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 406 April 22nd

మీనాతోనైనా రోహిణి పార్లర్ గురించి చెబుదామని ప్రయత్నం చేస్తుంటాడు. ఈ క్రమంలో ఓనర్ కాదు.. అని అంటాడు. ఎవరు ఓనర్ కాదు, దేనికి ఓనర్ కాదు అని మీనా అడుగుతుంది. బాలు చెప్పబోతుంటే సత్యం అడ్డుకుంటాడు. దాంతో బాబు రోహిణి పార్లర్ విషయం చెప్పకుండా తనకు ఇంకా కారుకు ఓనర్ కాలేదు కదా అని అంటాడు. ఈఎంఐలు పూర్తయ్యే వరకు తను కారుకు పూర్తి ఓనర్ కాదు అని మాట మార్చేస్తాడు. సరేనని మీనా అంటుంది. ఇక మరోసారి బాలును సత్యం హెచ్చరిస్తాడు. నువ్వు ఆ నిజం ఎవ్వరికీ చెప్పుకూడదని అంటాడు.

ఇక మరోవైపు మనోజ్ ఇంటర్వ్యూ కోసమని ఉదయాన్నే రెడీ అయ్యి బయటికి వెళ్తూ తల్లి ప్రభావతితో మాట్లాడుతాడు. అమ్మ నేను ఇంటర్వ్యూకు వెళ్తున్నాను. టిఫిన్ రెడీ అయ్యిందా? అని అడుగుతాడు. దాంతో ప్రభావతి ఉండురా అడుగుతాను అని మీనాను పిలుస్తుంది. మీనా బదులిచ్చే సమయంలోనే బాలు బదులిస్తాడు. ఏ టిఫిన్ కోసం మీనానే ఎందుకు పిలుస్తున్నావు అని తల్లి ప్రభావతిని ప్రశ్నిస్తాడు. దాంతో వంట పని మీనాదే కదా అని అంటుంది. దాంతో బాలు మండిపోతాడు. వంట పని మీనానే చేయాలని రాజ్యాంగంలో రాసి ఉందా? అని అంటాడు. మిగితా వాళ్లు కూడా చేయొచ్చు కదా అని అంటాడు.

అయినా మనోజ్ గాడు దున్నపోతులా తిని వెళ్లి పార్కులో పడుకోవడం తప్ప ఇంకెముందని అంటూ తిడుతాడు. ఈలోగా లోపలి నుంచి రోహిణి వచ్చి బాలు మాటలకు అప్సెట్ అవుతుంది. దాంతో బాలుకు ఎదురు మాట్లాడుతూ ఉంటుంది. ఊరికే ఏదో అనకుండా ఉండలేవా అని అంటుంది. దాంతో బాలు నేను మోసం చేస్తూ ఉండలేనని అంటాడు. దానికి రోహిణి షాక్ అవుతుంది. ఇక రోహిణి మనోజ్ దగ్గరకు వెళ్లి ఈరోజు నువ్వు ఎలాగైనా జాబ్ చూసుకొనే ఇంటికి తిరిగి రావాలని అంటుంది. అయితే ఈలోగా లాండ్రీ షాప్ ల నుంచి బట్టలు ఐరెన్ తీసుకొని ఓ వ్యక్తి తీసుకొస్తాడు. బిల్ 1250 అయ్యిందని చెబుతాడు.

ఐరెన్ బట్టలు వేసుకునే అంతా ఎవరు ఎదిగారని బాలు షాక్ అవుతాడు. తండ్రి సత్యం, మీనాను మీరేమైనా ఐరెన్ కు బట్టలు ఇచ్చారా? అని అడుగుతాడు. సత్యం నేనే బయటికి వెళ్లేదే ఒకటీ రెండు సార్లు దానికి ఐరెన్ బట్టలతో పని ఏముందిరా అని బదులిస్తాడు. ఇక మీనా నేను ఎప్పుడైనా ఫంక్షన్ కు వెళితేనే నా చీరలు దిండు కింద పెట్టుకొని పడుకుంటున్నాను అని బదులిస్తుంది. దాంతో ప్రభావతి.. అవును లే ఎప్పుడైనా ఐరన్ మొహం చూసిన మొహమేనా మీది అని అంటుంది. ఆ మాటకొస్తే దీపావళి, శ్రీరామనవమి, విజయదశమి రోజుల్లో ఇంట్లో పోయ్యికూడా వెలింగించరేమో, అన్నీ ఫ్రీగా చేయడం మీ అమ్మ నేర్పించింది కదా అని మీనాను ప్రభావతి అవమానిస్తుంది.

అత్త ప్రభావతి మాటలకు మీనా ఎంతగానో బాధపడుతుంది. ఇక వెంటనే ఆ కోపాన్ని మనోజ్ పై తీస్తాడు. ఐరన్ కే 1250 అంటే నెలకు 10 వేలపైనే ఆదాయం వస్తుంది కదా. ఇంటి ముందు ఐరన్ షాప్ పెట్టుకో, అప్పుడు మనకు పార్లర్, పూలకొట్టు, ఐరెన్ షాపు ఇలా మూడు షాపులు అవుతాయి... అయ్యయ్యో పార్లర్ లేదు కదా.. అని నోరు జారుతాడు. దీంతో రోహిణి గుండె గుబేల్ మంటుంది. బాలుకు నిజం తెలిసిపోయిందా అని ఆందోళన పడుతుంది. ఇక ప్రభావతి ఏంట్రా పార్లర్ లేకపోవడం ఏంటీ, నా కోడలు రోహిణి పార్లర్ ను బాగా చూసుకుంటుంది.. అని అంటుంది. ఇక తండ్రి సత్యం ఆపడంతో బాలు అదే ఇంటి ముందు లేదు కదా అని అంటున్నానని బదులిస్తాడు.

మరోవైపు మనోజ్ ఇంటి నుంచి ఇంటర్వ్యూ కోసమని బయటికి వెళ్తాడు. ఎలాగైనా ఈరోజు ఉద్యోగం చూసుకొని ఇంటికి వెళ్లాలని, తన వల్ల రోహిణి ఎంతగానో బాధపడుతోందని ఆలోచిస్తూ ఉంటాడు. తిరుగుతూ తిరుగుతూ ఒక రెస్టారెంట్ లో ఆర్డర్స్ తీసుకునే బేరర్ గా పనిచేసేందుకు సిద్దమవుతాడు. వెకెన్సీ ఉండటంతో అక్కడికి వెళ్లి ఉద్యోగం కావాలని అడుతాడు.12 గంటలు పని ఉంటుందని, సరిగా పనిచేయకపోతే ఊరుకోబోమని చెబుతాడు. మనోజ్ శాలరీ విషయం నాలుగు రోజులు పనిచేశాక చెబుతామంటారు. ఇక ఇంటి దగ్గర బాలు మీనాపై అరుస్తాడు. బయట పూలకొట్టు చూసుకోకుండా ఇంట్లో ఈ రాజా మాతకు కాఫీలు ఇస్తున్నావా? అని అడుగుతాడు. రాజామాత అంటే అర్థం కాలేదా? రాజామాతను ఇంగ్లీష్ లో ఏమంటారో తెలుసా? అని ప్రశ్నిస్తాడు. దాని రోహిణినే బదులు అడుగుతాడు. రోహిణి క్వీన్ అని చెబుతుంది. ఇప్పుడు చెప్పు అని మీనాతో క్వీన్ అని పలికిస్తాడు. తర్వాత ప్రభావతితో కూడా క్వీన్ అని పలికిస్తాడు. అదే సమయంలో వచ్చిన తండ్రి సత్యంతోనూ క్వీన్ అని పలికిస్తాడు. ఇన్ని సార్లు క్వీన్ అనడంతో రోహిణి గుట్టు బాలుకు తెలిసిపోయిందేమోనని సందేహిస్తుంది. ఈలోగా మనోజ్ ఇంటికి వచ్చి హడావుడి చేస్తాడు... ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X