Gunde Ninda Gudi Gantalu April 23rd: మీనా కఠిన నిర్ణయం.. బాలు గుండె ముక్కలు
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 22వ తేదీ 406వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రోహిణి బ్యూటీ పార్లర్ గుట్టు తెలిసిన తర్వాత బాలు వెంటనే ఆ విషయాన్ని తన తండ్రి సత్యంకు చెబుతాడు. రోహిణి ఇప్పుడు పార్లర్ కు ఓనర్ కాదని, కేవలం బ్యూటీషియన్ అని చెబుతాడు. నమ్మకపోయే సరికి బ్యూటీ పార్లర్ పేరు మార్చిన ఫొటోలను కూడా చూపిస్తాడు. అయితే సత్యం ఈ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని బాలుకు సూచిస్తాడు. బాలు కూడా సరేనని చెప్పి ఒప్పుకుంటాడు. కానీ తన కడుపులో ఆత్రం ఆపులోక సందర్భం వచ్చినప్పుడల్లా చెప్పే ప్రయత్నం చేస్తుంటాడు. కానీ తండ్రి సత్యం అడ్డుకోవడంతో ఆగిపోతాడు.
మరోవైపు బాలు తన మాటలతో ఎప్పటికప్పుడు రోహిణికి భయం పుట్టిస్తుంటాడు. మాటి మాటికీ తన పార్లర్ గురించి, బ్యూటీ పార్లర్ పేరు గురించి, పార్లర్ లో పని చేసే వారి గురించి మాట్లాడుతూ వణికు పుట్టిస్తుంటాడు. బాలుకు నిజం తెలిసి పోయిందా అని రోహిణి చాలా టెన్షన్ పడుతుంది. కానీ ఇంకా బాలు ఓపెన్ గా మాట్లాడక పోవడంతో రోహిణి తన పార్లర్ గురించి గొప్పగానే చెబుతూ ఉంటుంది. ముఖ్యంగా ప్రభావతి రోహిణి పార్లర్ గురించి గొప్పలు చెబుతూ ఉంటుంది. దాంతో బాలు రోహిణి పార్లర్ గురించి అసలు విషయం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరోవైపు మనోజ్ జాబ్ కోసమని ఇంటర్వ్యూ కు వెళ్తాడు. తన చదువుకు తగిన ఉద్యోగం రాకపోవడంతో ఇక ఓ రెస్టారెంట్ లో బేరర్ గా జాయిన్ అవుతాడు. వెంటనే ఇంటికి తిరిగి వస్తాడు. అదే విషయాన్ని ఇంట్లో వాళ్లందరినీ పిలిచి చెప్పే ప్రయత్నం చేస్తాడు. ఇక మనోజ్ ఏమని చెప్పాడనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 23వ తేదీ 407 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

మనోజ్ ఓ రెస్టారెంట్ లో జాబ్ చూసుకున్న సంతోషంలో ఇంటికి తిరిగి వస్తాడు. వస్తూ వస్తూ స్వీట్ బాక్స్ తీసుకొని వస్తాడు. వచ్చీ రాగానే బాలు ఎదురవుతాడు. ఇక మనోజ్ ఇంట్లో వాళ్లందరినీ పిలుస్తూ హడావుడి చేస్తాడు. తల్లి ప్రభావతిని, తండ్రి సత్యంను, తమ్ముడు రవి, శృతిలను కూడా త్వరగా రమ్మని పిలుస్తాడు. మనోజ్ హడావుడి చూసి బాలు షాక్ అవుతాడు. ఏ రా త్వరగానే ఇంటికి తిరిగి వచ్చావు అని అడుగుతాడు. దాంతో మనోజ్ నీకే షాకింగ్ న్యూస్ చెబుతాను రా ఉండూ.. అంటాడు. అయితే నేను వెళ్లిపోతానని బాలు అంటాడు. కానీ మనోజ్ ముఖ్యంగా ఉండాల్సింది నువ్వే అని చెబుతాడు.
అంటే.. ఉదయం ఐరన్ షాప్ ఐడియా ఇచ్చినందుకు నా ధన్యవాదాలు చెబుతున్నావా? అని బాలు ఎటకారం చేస్తాడు. దాంతో మనోజ్ తన చదువుకు తగ్గట్టుగా ఉద్యోగం చూసుకున్నానని బదులిస్తాడు. దాంతో సత్యం, ప్రభావతి, రోహిణి చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. రోహిణి ఉప్పొంగి పోతుంది. మరోవైపు ప్రభావతి బాలు నోరు మూయించావని సంబర పడుతుంది. ఇక బాలు జాబ్ వచ్చిందనడంతో షాక్ అవుతాడు. ఈ భయంకరమైన నిజాన్ని చూసి తట్టుకోలేక పోతున్నానని అంటాడు. ఇక మనోజ్ తన భార్య రోహిణికి క్రాబ్స్ తీసుకొచ్చానని, నీలా హల్వా తేలేదని బాలును ఎగతాళి చేస్తాడు. దాంతర్వాత మనోజ్ అందరికీ స్వీట్స్ పంచిస్తాడు. అందరూ సంతోషంగా స్వీట్స్ తీసుకుని తింటారు. ఇక బాలు కూడా స్వీట్ తీసుకొని తింటాడు.
ఆ స్వీట్ తిన్న తర్వాత బాలు షాకింగ్ గా మాట్లాడుతాడు. నాకు అసలు నిజం తెలిసి పోయిందని అంటాడు. దాంతో ఓవైపు మనోజ్, మరోవైపు రోహిణి జల్లుమంటారు. ఇక సత్యం ఏంటనీ అడగడంతో ఈ స్వీట్ నేను రోజు తినే రెస్టారెంట్ నుంచి తీసుకొచ్చిందే. నేను ఎప్పుడూ మీనా కోసం స్వీట్స్ అక్కడే తీసుకుంటాను. ప్రత్యేకంగా హల్వా. నేను రైడ్స్ కు వెళ్లి అలిసిపోతే అక్కడే భోజనం కూడా చేస్తాను. నాకు ఆ రెస్టారెంట్ లో పని చేసే సర్వర్స్ అందరితో బాగా పరిచయం ఉంది. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఎందుకైనా మంచిది మనోజ్ జాబ్ చేసే కంపెనీకి ఒకసారి అందరం వెళ్లి చూసి వద్దాం. లేదంటే గతంలో లాగా మళ్లీ ఏదేైనా సమస్య వస్తుందేమోనని చెబుతాడు.
బాలు మాటలకు మనోజ్ ఆందోళన పడుతాడు. అసలు మనోజ్ చేసే రెస్టారెంట్ కు బాలు రెగ్యులర్ గా వెళ్తుంటానడంతో గుండె జారిపోతుంది. తనను రెస్టారెంట్ లో ఎప్పుడైనా చూసే అవకాశం ఉందని కంగారు పడుతాడు. తర్వాత బాలు ఇంట్లో నుంచి రైడ్స్ కోసం బయటికి వెళ్తాడు. ఇక మనోజ్ రోహిణి కూడా వాళ్ల రూమ్ లోకి వెళ్లి మాట్లాడుకుంటారు. రోహిణి కూడా నువ్వు ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నావని అడుగుతుంది. ఇప్పుడు ఆ జాబ్ చేయడం నాకు ఇష్టం లేదని, సమయం వచ్చినప్పుడు నేనే చెబుతానని అంటాడు మనోజ్. సరేలే ఏదేైమైనా నన్ను ఈ ఇంట్లో తలెత్తుకునేలా చేశావు. నాకు చాలా సంతోషంగా ఉందని చెబుతుంది. కానీ చేసే పని ఏంటో కూడా చెప్పమని అడుగుతుంది. అందుకు మనోజ్ ఇది చిన్న జాబే.. పెద్ద ఉద్యోగం వచ్చాక తప్పకుండా చెబుతానని అంటాడు.
ఇక మీనా ఇంటి ముందు పూలమ్ముతూ ఉంటే ప్రభావతి వచ్చి అరుస్తుంది. అదే సమయంలో మీనాకు తెలిసిన ఆమె పూలు తీసుకుంటుంది. ప్రభావతి ప్రవర్తన చూసి మండిపడుతుంది. మెడ పూస్తెల తాడు కూడా ఏదీ అని మీనాను అడుగుతుంది. దానికి మీనా అందరూ తనను బానే చూసుకుంటున్నారని, తాడు ఇంట్లోనే ఉందని సరిచెప్పుకొస్తుంది. ఇక మరోవైపు బాలు చెల్లెలు మౌనికను సంజూ చిత్ర హింసలు పెడుతూ ఉంటాడు. మౌనిక తాళి మార్చే ఫంక్షన్ కు వచ్చిన సమయంలో బాలు చేతిలో అవమానపడటాన్ని ఇంకా జీర్ణించుకోలేకపోతాడు. ఆరోజు తన అత్త చంద్రకాంతం తనకు వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడిందో తెలుసుకుంటాడు. ఇక మళ్లీ ఎలాగైనా మౌనికను ఇబ్బంది పెట్టాలని అనుకుంటాడు. దాంతో మౌనికా కాఫీ తీసుకొని రాగా.. తీసుకొని నానా మాటలు అంటాడు. అంతే కాకుండా కోపంలో మెడ పట్టి నెట్టేస్తాడు. దీంతో మౌనిక తలకు గాయం అవుతుంది. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. దారి మధ్యలో కారు ఆగిపోతోంది. బాలు వారిని చూసి ఆగుతాడు. మౌనిక తలకు గాయం చూసి ఏమైందని అడుగుతాడు. సంజూనే ఇదంతా చేశాడా? అని అడుగుతాడు. అందుకు మౌనికా ఎలా స్పందించిందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications










