Gunde Ninda Gudi Gantalu April 24th: మౌనికా తలకు గాయం.. సంజూపై బాలు ఉగ్రరూపం
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 23వ తేదీ 407వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మనోజ్ కు జాబ్ వచ్చిందని తెలియడంతో రోహిణి చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. అలాగే ప్రభావతి, సత్యం కూడా ఆనందిస్తారు. కానీ మనోజ్ తన చదువు తగిన ఉద్యోగం సంపాదించుకున్నానని చెప్పినా.. అతను చేస్తున్నది రెస్టారెంట్ లో అనే నిజాన్ని నిర్భయంగా చెప్పుకోలేకపోతాడు. కనీసం రోహిణికి కూడా ఆ తను చేసే జాబ్ గురించి చెప్పలేక పోతాడు. రోహిణి కూడా అడిగి ఇబ్బంది పెట్టడం ఎందుకని మానుకుంటుంది.
ఇక మనోజ్ జాబ్ వచ్చిందని చెప్పినప్పటి నుంచి ప్రభావతి మరింతగా రెచ్చిపోతుంది. బాలును ఇష్టమొచ్చినట్టు మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. అలాగే మీనాను అయితే ఆ ఇంటికి బానిసలా చూస్తుంది. ఇంటి పనులన్నీ చేయాలని పని భారం వేస్తుంది. కనీసం పూల కొట్టు దగ్గరకు కూడా వెళ్లకుండా పనులు చెబుతూనే ఉంటుంది. మధ్యలో ఇంటికి వచ్చి పూలు అడిగిన వారి ముందే మీనాను నానా మాటలు అంటుంది. ఆ మాటలు విన్నా సత్యం ప్రభావతిపై మండిపడుతాడు. మీనాను అర్థం చేసుకోలేవా అని తిడుతాడు. మరోవైపు బాలు చెల్లెలు మౌనికాను సంజూ టార్చర్ పెడుతుంటాడు. బాలుపై పగ సాధించలేక మౌనికపై చేయి చేసుకుంటాడు. దాంతో ఆమె తలకు గాయం అవుతుంది. ఆస్పత్రికి తీసుకెళ్లే క్రమంలో బాలు కలుస్తాడు. తలకు గాయాన్ని చూసి ఏమైందని అడుగుతాడు. సంజూనే కదా అని సందేహం వ్యక్తం చేస్తాడు. ఇక అన్న ప్రశ్నలకు మౌనికా ఎలా బదులిచ్చిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 24వ తేదీ 408 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

మీనాను ప్రతిసారి కావాలనే ప్రభావతి సూటిపోటి మాటలు అంటుంది. దాంతో సత్యం ఇంట్లోకి వచ్చి భార్య ప్రభావతిపై మండిపడుతాడు. కోడలు మీనాను ఎందుకు అలా అందరి ముందు అవమానిస్తున్నావు అని ప్రశ్నిస్తాడు. ఓవైపు నువ్వు మీనాను ఎన్ని చిత్ర హింసలు పెడుతున్నా మీనా మాత్రం నీ గురించి గొప్పలు చెబుతోంది. మా అత్తా మమా నన్ను బాగా చూసుకుంటున్నారని అందరికి చెప్పుకొస్తోంది. అలాంటి మంచి మనసున్న మీనాను నువ్వు ఇంకెప్పుడు అర్థం చేసుకుంటావో తెలియడం లేదు. పైగా వచ్చిపోయే వాళ్లు మీనా మెడలో తాళి లేదని అడుగుతున్నారు. వెంటనే మీనా బంగారం మీనాకు ఇచ్చేయ్ అని ప్రభావతిపై సత్యం మండిపడుతాడు.
ఇక వెంటనే ప్రభావతి స్పందిస్తూ నేనేమో మీనాను కష్టపెడుతున్నట్టు నా మీద పడుతున్నారు. నేనా మీనా ఒంటిపై బంగారం తీసి ఇవ్వమనింది. మీనానే కదా పొగరుగా బంగారం వలిచి ఇచ్చేసింది. నేను ఆరోజు ఏదో క్యాజువల్ గా అన్నందుకు బంగారం అలా తీసి ఇచ్చేయాలా? రోహిణి చూడు పార్లర్ నడుపుతూ ఎంత చక్కగా ఉంటుందో.. శృతి కూడా సినిమాలకు డబ్బింగ్ చెబుతూ చక్కటి జీవితం కొనసాగిస్తోంది. ఏ రోజైనా పొగరుగా మాట్లాడారా? కానీ మీనాకు వారిలో నడుచుకోదు. అయినా ఒంటి మీద బంగారం తీసి ఇవ్వమని నేను అనలేదు కదా. తినడానికి తిండి లేని వాళ్లు కూడా పౌరుషాలకు పోతుంటారు. ఆ బంగారం ఇంట్లోని అల్మారాలోనే ఉంది. వెళ్లి తీసుకొమని చెప్పండి.. అంటూ భర్త సత్యంతో చెబుతుంది. అప్పటికే మీనా వచ్చి అత్త ప్రభావతి మాటలను పూర్తిగా వింటుంది. దాంతో చాలా బాధపడుతుంది.
వెంటనే సత్యం స్పందిస్తూ అమ్మ మీనా నీ ఒంటి మీద బంగారం వేసుకో.. పూలకొట్టు దగ్గరకు వచ్చి పోయే వాళ్లూ అని బోసి మెడతో, పసుపు కుంకుమతో చూస్తే ఏ మాత్రం బాగుండదు. అని కోడలు మీనాతో అంటాడు. అందుకు మీనా స్పందిస్తూ తన భర్త కొని ఇచ్చే వరకు నేను బంగారం వేసుకోను. ముఖ్యంగా మీరు పెట్టిన బంగారం అస్సలు వేసుకోను. మేం బంగారం కొనలేని స్థితిలో ఉన్న వారిమే. అత్త ప్రభావతి మాటల్లో చెప్పాలంటే తిండికి గతి లేని వాళ్లమే. ఆ మాటకొస్తే మేం ఎప్పుడూ మిమ్మల్ని పెళ్లి చేసుకో అని అడగలేదు. మీరే గొప్ప మనస్సు చేసుకొని నన్ను ఈ ఇంటి కోడలిగా చేసుకున్నారు. ఇక పంతానికి పోతే నా భర్త బాలు ఇవ్వాళే పుస్తెలు తాడు తెస్తాడు. కనీసం బంగారు పుస్తెలైనా తీసుకొస్తాడు. మీ మాట కాదంటున్నందుకు క్షమించండి. అని చెబుతాడు.
ఇక మీనా నిర్ణయం చెప్పాక సత్యం బాలుతో మాట్లాడుతాడు. నీ భార్య మణులు, మాణిక్యాలు అడగటం లేదు. కనీసం పుస్తెలు తాడైనా కొని ఇవ్వమని అంటోంది. త్వరగా కొని ఆ గౌరవం కాపాడుకో అని బాలుకు సూచిస్తాడు. దాంతో బాలు వెంటనే ఇంటి నుంచి బయటికి వెళ్లి.. చిట్టి పాట దగ్గరకు వెళ్తాడు. తన దగ్గర డబ్బులు లేకపోవడంతో చిట్టి ఎత్తాలని అనుకుంటాడు. దాంతో చిట్టి పాడుతుండగా వెళ్లి రాజేష్ తో మాట్లాడుతాడు. బాలు మాటల తీరుకు డబ్బు అత్యవసరమని తన స్నేహితుడు రాజేశ్ కు తెలుస్తుంది. దీంతో ఈసారి చిట్టి డబ్బులను బాలుకే ఇప్పిస్తాడు. ఇక ఆ డబ్బులను తీసుకొని వెంటనే మీనాకు పుస్తెలు చేయిస్తాడు. తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో బాలుకు దారి మధ్యలో మౌనికా - సంజూ కనిపిస్తారు. వారి కారు చెడిపోవడంతో అక్కడే ఆగిపోతారు. అది చూసిన బాలు వెంటనే కారు ఆపి వారి దగ్గరికి వెళ్తాడు.
మౌనికా తలకు గాయం చూసిన బాలు కంగారు పడుతాడు. సంజూ నీపై చేసుకున్నాడా? అని అడుగుతాడు. దానికి అదేం లేదు అన్నయ్య అని మౌనికా బదులిస్తుంది. సంజూ నీపై చేయి చేసుకుంటే మాత్రం వాడిని ఇక్కడే బూడిద చేస్తాను తల్లి అని మౌనికాతో అంటాడు. అలా వాగ్వాదం జరుగుతుంది. మీనా జోక్యంతో బాలు శాంతిస్తాడు. వారి ఇద్దరినీ ఒక డ్రైవర్ లా తీసుకెళ్లి వారి ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాడు. ఇక దారి మధ్యలో మీనాకు పుస్తెలు కొన్నానని బాలు మౌనికాకు చెబుతాడు. మౌనికా సంతోషిస్తుంది. ఇక ఇంటి దగ్గరకు చేరుకున్నాక క్యాబ్ చార్జీలు తీసుకో అంటూ బాలు మొహంపై సంజూ డబ్బులు విసిరేస్తాడు. చిర్నేత్తిపోయిన బాలు డబ్బు పొగరు నెత్తికి ఎక్కించుకోకు మర్యాదగా ఆ డబ్బులు తీసి కళ్లకు అద్దుకొని నాకు ఇస్తే సరే.. లేదంటే నిన్ను నీ ఇంటి ముందే పొర్లించి పొర్లించి కొడుతాను. అని హెచ్చరిస్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది రేపటి ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











