Gunde Ninda Gudi Gantalu April 25th: సంజూ గూబ పగలగొట్టిన బాలు.. ప్రభావతి నోరు మూయించిన మీనా

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 24వ తేదీ 408వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు మీనా కోసం పుస్తెలు కొనేందుకు వెళ్తాడు. చిట్టి డబ్బులు అప్పుగా తీసుకొని వెళ్లి పుస్తెలు కొంటాడు. తిరిగి వస్తున్నక్రమంలో దారి మధ్యలో కారు చెడిపోయి సంజూ మీనా ఆగి ఉండటం గమనిస్తాడు. వెంటనే వారి దగ్గరికి వెళ్లి ఏమైందని అడుగుతాడు. కారు ఇంజిన్ ను పరిశీలించి ఇప్పట్లో స్టార్ట్ కాదని చెప్పి తన కారులోనే వాళ్ల ఇంటి దగ్గర దింపుతాడు. ఈ క్రమంలో సంజూ బాలు మొహంపై క్యాబ్ డబ్బులు తీసుకో అని విసిరేస్తాడు. బాలుకు మండిపోతుంది.

ఇక వెంటనే సంజూపై కోపం చేస్తాడు. డబ్బులు ఎక్కువగా ఉంటే దాచుకోవాలే కానీ ఇలా విసిరి పడేయ కూడదని సూచిస్తాడు. మర్యాద విసిరేసిన డబ్బులను నేల మీద నుంచి తీసి నాకు ఇస్తేనే ఊరుకుంటానని, లేదంటే మీ ఇంట్లో వాళ్లందరూ చూస్తుండగానే పోర్లించి పోర్లించి కొడుతానని హెచ్చరిస్తాడు. నా ముందు తల పొగరు చూపిస్తే నా చెల్లి మీనాకు భర్తవనే విషయాన్ని కూడా మర్చిపోయి చితక బాదుతానని మండి పడుతాడు. దీంతో చెల్లి మౌనికా కంగారు పడుతుంది. ఇక సంజూ బాలు మాట విని డబ్బులు నేల మీద నుంచి తీసి ఇచ్చాడా? లేదా? అన్నది ఈ ఎపిసోడ్ లో ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 25వ తేదీ 409 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 409 April 25th

బాలు మాటలకు సంజూ భయపడి పోతాడు. క్యాబ్ డబ్బులుగా ఇచ్చిన మనీని వెంటనే నేల మీద నుంచి తీసి కళ్లకు అద్దుకొని ఇవ్వమని చెప్పడంతో సంజూ కాసేపు ఆలోచిస్తాడు. కానీ ఇంట్లో వాళ్ల అందరి ముందే కొడతానని చెప్పడంతో వెళ్లి నేల మీద పడేసిన డబ్బులను పైకి తీస్తాడు. 200 రూపాయాల చార్జీకి ఇస్తాడు. నేను అడిగింది కేవలం 200 వందలే మిగిలినవి నువ్వే ఉంచుకో. డబ్బులు ఉన్నాయని లక్ష్మీ దేవీని విసిరి పడేయొద్దని సూచిస్తాడు. ఇక సంజూ ఇంట్లోకి వెళ్తుండటంతో చెల్లి మౌనికను బాలు ఏమైందని అడుగుతాడు. సంజూ వల్ల నీకు గాయం అయ్యితే మాత్రం వాడిని బూడిద చేస్తానని, నాకు చెప్పడానికి ఏమాత్రం సంకోచించకు అని అంటాడు.

కానీ, అలాంటిదేమీ లేదు అన్నయ్య అని బాలుకు సర్ది చెబుతుంది. ఇక సంజూ మళ్లీ వెనక్కి వచ్చి మౌనికను ఇంట్లోకి తీసుకెళ్తాడు. బాలుతో మాట్లాడుతుండగా.. ఈ క్యాబ్ డ్రైవర్ తో మాటలేంటీ అని తీసుకెళ్లి పోతాడు. ఇక మౌనికా ఏం చేయలేని పరిస్థితిలో మౌనంగా సంజూతో వెళ్లిపోతూ ఉంటుంది. ఇక బాలు కూడా సంజూ కోపం అంతా తనపైనే అని, మౌనికను మంచిగానే చూసుకుంటున్నాడని అనుకోని కారులో తిరిగి ఇంటికి వెళ్తాడు. ఇక మరోవైపు మనోజ్ కు రెస్టారెంట్ వద్ద అవమానం జరుగుతుంది.

రెస్టారెంట్ లో బేరర్ గా పనిచేస్తూనే మరోవైపు పలు కంపెనీలకు ఇంటర్వ్యూలకు వెళ్లేందుకు అప్లై చేస్తూ ఉంటాడు. మరోవైపు ఆ రెస్టారెంట్ కు చెత్త ఏరుకునే వాడు వస్తాడు. వాడి దగ్గర మనోజ్ ఆర్డర్ తీసుకునే క్రమంలో అవమానం జరుగుతుంది. ఆ చెత్త ఏరుకునే వాడు మనోజ్ ను చూసి నువ్వు పార్క్ లో తిని పడుకుంటావు కదా అని అంటాడు. అసలు వీడిని ఎలా ఉద్యోగంలో పెట్టుకున్నారు అంటూ ఆ రెస్టారెంట్ ఓనర్ తో అంటాడు. దాంతో మనోజ్ చిర్రెత్తి పోతాడు. తన మాటలతో రెచ్చిపోతాడు. కానీ రెస్టారెంట్ ఓనర్ వచ్చి మనోజ్ పై మండిపడుతాడు. కస్టమర్లే మనకు దేవుళ్లు అని చెబుతాడు. కాస్తా అణిగి మణిగి ఉండాలని సూచిస్తాడు. అలాగైతే రెస్టారెంట్ వృద్ధిలోకి వస్తుందని చెబుతాడు. వెంటనే అతను అడిగింది చేయించి ఇవ్వమని ఆదేశిస్తాడు.

ఇక రెస్టారెంట్ లో జరిగిన అవమానంతో పనిచేసే మూడ్ పోయిందని ఇంటికి తిరిగి వెళ్తాడు. ఇక బాలు ఇంటికి తిరిగి వస్తాడు. హాలులో కూర్చున్న తండ్రి సత్యంతో అందరినీ పిలవండి నాన్న అని అరుస్తాడు. ప్రభావతి, శృతి, రోహిణి, రవి అందరినీ బయటకి రండి అని పిలుస్తాడు. అందరూ రాగానే తన భార్య కోసం బంగారం కొన్నానని తీసి చూపిస్తాడు. మా అమ్మా ప్రభావతి మీనాను కనీసం బంగారం కూడా కొనుక్కోలేనిదని అవమానించింది కదా.. అందుకే ఈరోజు పుస్తెలు తీసుకొచ్చానని అంటాడు. దాంతో మీనా, సత్యం, రవి, శృతి అందరూ సంతోషం వ్యక్తం చేస్తారు. ఇక మీనా భర్త బాలు కొనిచ్చిన పుస్తెలును దేవుడి దగ్గర పెట్టి మొక్కుతుంది. బంగారు పుస్తెలు చేయించి తన పరువు కాపాడాడని, తల ఎత్తుకునేలా చేశాడని మీనా సంతోషం వ్యక్తం చేస్తుంది. అయితే అప్పుడే మెడలో వేసుకోమని అంటే మీనా ఎప్పుడు పడితే అప్పుడు పుస్తెలు తీయకూడదు, అలాగే వేసుకోకూడదని బదులిస్తుంది. మరోవైపు తన భర్త బాలుతో ఎమోషనల్ అవుతుంది. ఇక బాలు ఈ పుస్తెలే కాకుండా ఇంకా విష్ లిస్ట్ లో ఉన్నవన్నీ కొనిస్తానని చెబుతాడు.

మరోవైపు ప్రభావతి మాత్రం నువ్వేమైనా లక్షల బంగారం కొన్నావా? కొనింది మూడు గ్రాముల బంగారమే కదా అని హేళలన చేస్తుంది. దాంతో మీనా ఎంత బంగారం అనేది ముఖ్యంగా కాదు నా భర్త కష్టంతో అడిగిన వెంటనే కొనిచ్చాడు కదా, అది సరిపోతుంది నాకు అంటూ అత్త ప్రభావతి నోరు మూయిస్తుంది. ఇక రోహిణి తన రూమ్ లో రెడీ అవుతూ ఉంటుంది. ఈలోగా తనకు వాయిస్ మెసేజ్ వస్తుంది. 'ఏంటీ కళ్యాణి నన్ను మర్చిపోయావా? ఈనెల నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. నా ఉద్యోగం పోగొట్టి, నువ్వు మాత్రం హాయిగా సంతోషంగా ఉంటున్నావా? త్వరగా డబ్బులు ఇవ్వకపోతే ఈసారివాయిస్ మెసేజ్ నీకు కాదు మీ అత్తయ్యకు వెళ్లుంది. మీ అత్త గురించి నీకు తెలిసిందే కదా' అని అంటాడు. ఆ విషయాన్ని ప్రభావతి వింటుంది. ఎవరతను అని అడుగుతుంది. మలేషియా మేనమామ వాళ్ల భార్య నాకు అత్తయ్య కదా ఆమె గురించే నాకు మెసేజ్ వచ్చిందని చెప్పి కవర్ చేస్తుంది. ఇక మీనాకు బాలు బంగారం కొనివ్వడంతో ప్రభావతి రోహిణిని కూడా తన బంగారం తీసి వేసుకో అని చెబుతుంది. దాంతో రోహిణి కంగారు పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది తరువాత ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X