Gunde Ninda Gudi Gantalu April 26th: రోహిణికి షాక్ ఇచ్చిన ప్రభావతి.. బాలు మీనాకు మళ్లీ పెళ్లి

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 25వ తేదీ 409వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు మీనాకు బంగారం కొనుక్కొని వచ్చి ఇస్తాడు. పుస్తెల తాడు కొనివ్వలేవ్వలేకపోయినా తన ఆర్థిక స్థోమత, మీనాను ఇంట్లో తలెత్తుకునేలా చేసుకునేందుకు బంగారు పుస్తెలు చేయించుకొని వస్తాడు. ఇంటికి వచ్చి అందరినీ పిలిచి ఆ బంగారు పుస్తెలను చూపిస్తాడు బాలు. దాంతో తండ్రి సత్యం, రవి, శృతి అందరూ సంతోషిస్తారు. మంచి పనిచేశావంటూ వారు ప్రశంసిస్తారు. కానీ ప్రభావతి మాత్రం ఒళ్లు కాల్చుకుంటుంది. గోరంత చేసి కొండంత గొప్పలు చెబుతున్నావంటూ బాలుపై విరుచుకు పడుతుంది. నువ్వేమైనా లక్షల బంగారం కొన్నావా? కొనింది మూడు గ్రాముల బంగారమే కదా అని ప్రభావతి హేళలన చేస్తుంది.

మరోవైపు రోహిణి తన రూమ్ లో రెడీ అవుతూ ఉంటుంది. ఈలోగా తనకు వాయిస్ మెసేజ్ వస్తుంది. 'ఏంటీ కళ్యాణి నన్ను మర్చిపోయావా? ఈనెల నాకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలేదు. నా ఉద్యోగం పోగొట్టి, నువ్వు మాత్రం హాయిగా సంతోషంగా ఉంటున్నావా? త్వరగా డబ్బులు ఇవ్వకపోతే ఈసారివాయిస్ మెసేజ్ నీకు కాదు మీ అత్తయ్యకు వెళ్లుంది. మీ అత్త గురించి నీకు తెలిసిందే కదా' అని అంటాడు. ఆ విషయాన్ని ప్రభావతి వింటుంది. ఎవరతను అని అడుగుతుంది. మలేషియా మేనమామ వాళ్ల భార్య నాకు అత్తయ్య కదా ఆమె గురించే నాకు మెసేజ్ వచ్చిందని చెప్పి కవర్ చేస్తుంది. ఇక మీనాకు బాలు బంగారం కొనివ్వడంతో ప్రభావతి రోహిణిని కూడా తన బంగారం తీసి వేసుకో అని చెబుతుంది. దాంతో రోహిణి కంగారు పడుతుంది. మరోవైపు కొత్త పుస్తెలు కొనివ్వడంతో బాలుతో మీనా మళ్లీ పెళ్లి చేసుకుంటుంది. ఈ సందర్భంగా ఏమైందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 26వ తేదీ 410 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 410 April 26th

మీనాను మాటిమాటికి ప్రభావతి నానా మాటలు అంటూ ఉంటోంది. ఎప్పుడైతే మనోజ్ కు జాబ్ వచ్చిందని తెలిసిందో అప్పటి నుంచి మీనాపై అత్త ప్రభావతి విరుచుకు పడుతుంది. ఇంట్లో అన్ని పనులు మీనాకే చెబుతుంది. పని భారం పెంచుతుంది. కనీసం మనిషిలా కూడా చూడకుండా మాట్లాడుతుంది. మీనాను అనడమే కాకుండా ఆమె అమ్మాగారిని కూడా నానా మాటలు అంటుంది. కనీసం తిండికి గతి లేని వాళ్లు, ఇంకా బంగారు గోలుసు చూసిన మొహమేనా అని అవమానిస్తుంది. దాంతో మీనా గుండె బరువెక్కి పోతుంది. అత్త ప్రభావతి మాటలకు మొహం చిన్న చేసుకుంటుంది. మీనా బాధపడటం చూసి బాలు కూడా బాధపడుతాడు. అందుకోసమే బంగారు పుస్తెలు చేయించుకొని తీసుకొచ్చి ఇస్తాడు.

ఇక బంగారు పుస్తెలు ఇవ్వడంతో మీనా, ఇంట్లో వాళ్లు అందరూ సంతోషిస్తారు. ప్రభావతి మాత్రం గునుగుతూ ఉంటుంది. ఇక మీనాను ఆ పుస్తెలను వెంటనే మెడలో వేసుకొని శృతి, రవి, బాలు సూచిస్తారు. కానీ మీనా మాత్రం ఇప్పుడు కాదని చెబుతుంది. వెంటనే ఇంట్లోని దేవడి ప్రతిమల వద్ద ఆ బంగారు పుస్తెలను పెడుతుంది. వెంటనే భర్తతో తన సంతోషాన్ని చెప్పుకుంటూ ఎమోషనల్ అవుతుంది. అయితే ఆ పుస్తెలును వెంటనే వేసుకోక పోవడానికి ఒక కారణం ఉందని చెప్పుకొస్తుంది. తమ పెళ్లి సమయంలో బాలుకు మీనా, మీనాకు బాలు అంటే ఏమాత్రం ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంటారు. అదే విషయాన్ని మీనా బాలుతో చెబుతుంది. ఇక రేపు ఉదయం నిన్ను ఒక చోటు తీసుకెళ్తాను. ఎక్కడి అని అడగకుండా నాతో పాటు రా అని చెబుతుంది.

అందుకు బాలు కూడా సరే అని అంటారు. బాలుతో పాటు మీనా నూతన వస్త్రాలను తీసుకొని దగ్గర్లోని గుడి వెళ్తుంది. అక్కడికి వెళ్లగానే నూతన వస్త్రాల్లో దేవుడికి దర్శనం చేసుకుంటారు. ఈ సందర్బంగా మీనా మాట్లాడుతూ మనకు పెళ్లి జరిగినప్పుడు నేనంటే మీకు, మీరంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదని చెబుతుంది మీనా. కానీ ఇప్పుడు ఇద్దరం ఒకటిగా బతుకుతున్నాం గునుక ఇప్పుడు నీతో మనస్పూర్తిగా తల వంచుకొని తాళి కట్టుకుంటానని చెబుతుంది మీనా. దాంతో బాలు ఎంతో ఎమోషనల్ అవుతారు. దీంతో మళ్లీ ఇద్దరికి పెళ్లి కళ వస్తుంది. పట్టు వస్త్రాల్లో బాలు మీనా గుడిలో మళ్లీ మూడుముళ్ల బంధంలోకి అడుగుపెడతారు.

బాలుతో మీనా పసుపు తాడు తీయించి అదే తాడుకు ఉన్న పసుపు కుంకుమ తీయించి బంగారు పుస్తెలు వేయిస్తుంది. ఆ తర్వాత మూడు ముళ్లు వేస్తాడు బాలు. అలాగే అగ్ని చుట్టూ ఏడడుగులు వేస్తారు. ఒకటి చేయి మరొకరు పట్టుకొని నడుస్తారు. జీవితాంతం ఇలాగే ఉండాలని, ఉంటామని ఒకరికొరు వాగ్దానం చేసుకుంటారు. ఇక మరోవైపు రోహిణి తన మాజీ భర్త వర్దన్ నుంచి వాయిస్ మెసేజ్ వస్తుంది. అతను రోహిణి అసలు పేరుతో కళ్యాణి అని పిలుస్తాడు. అంతే కాకుండా తనకు నెల నెలా ఇవ్వాల్సిన డబ్బులు ఇంకా పంపలేదని అడుగుతాడు. నన్ను ఉద్యోగం వదిలేసేలా చేసి నువ్వు మాత్రం ఏంచక్కా హ్యాపీగా ఉంటున్నావా? అని ప్రశ్నిస్తాడు. నాకు మాత్రం డబ్లులు రాకపోతే ఈసారి వాయిస్ మెసేజ్ మీ అత్త గారికి వెళ్తుంది. ఆమె ఎలాంటిదో నీకు తెలిసిందే కదా అని అంటాడు.

మరోవైపు ఆ చివరి మాటలను ప్రభావతి వింటుంది. ఏవరమ్మా మీ అత్త అని మాట్లాడుతున్నారు అని రోహిణిని అడుగుతుంది. తన మలేషియా అత్తయ్య అని, మందులు వేసుకోమంటే బద్దకిస్తోందని బదులిస్తుంది. దాంతో ప్రభావతి సరేనని, ఆ వెంటనే మీనా గురించి మాట్లాడుతుంది. బాలు తెచ్చిన మూడు గ్రాముల బంగారానికే మీనా ఎంతగానో మురిసిపోతోంది. నువ్వు కూడా బంగారు నగలన్నీ వేసుకో అని రోహిణికి సూచిస్తుంది. అన్ని నగలు ఉన్నా ఎందుకు పసుపు తాడే వేసకుంటున్నావని ప్రశ్నించడంతో రోహిణి గుండె గుబేలు అంటుంది. ఏదో సమాధానం చెప్పి పంపిస్తుంది. ఆ తర్వాత వర్దన్ కు డబ్బులు ఇవ్వడం కోసం మళ్లీ అప్పు చేస్తుంది. అలాగే బంగారం విషయం లోకూ విడిపించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఈ సమస్యల నుంచి ఎలా బయట పడుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X