Gunde Ninda Gudi Gantalu April 26th: పెళ్లి పేరుతో ట్విస్ట్ ఇచ్చిన మీనా.. రోహిణికి మైండ్ బ్లాక్
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 26వ తేదీ 409వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు మీనా కోసం బంగారు పుస్తెలు తీసుకొని వస్తాడు. అదే సమయానికి రెస్టారెంట్ నుంచి మనోజ్ కూడా తిరిగి వస్తాడు. దీంతో బాలు ఇంట్లో వాళ్ల అందరినీ కూడా బయటికి రావాలని పిలుస్తాడు. అందరూ ఏమైందని హడావుడిగా బయటికి వస్తారు. అందరూ రాగానే తన భార్య కోసం బంగారం కొన్నానని తీసి చూపిస్తాడు. దాంతో వారందూ సంతోషిస్తారు. కానీ ప్రభావతి మాత్రం అదో రకంగా చూస్తుంది. ఏదో పది తులాల బంగారం కొనిచ్చినట్టు గొప్పలు చెబుతాన్నావంటూ తక్కువ చేసి మాట్లాడుతుంది.
అయితే, మీనా మాత్రం ఎంతదైనా తన భర్త చెప్పిన వెంటనే తనకు బంగారు పుస్తెలు తీసుకొచ్చి ఇచ్చాడని గర్వంగా చెబుతుంది. అయితే ఆ పుస్తెలును మాత్రం వెంటనే వేసుకోమని అందరూ చెబుతారు. కానీ మీనా అందుకు మరో సమయం ఉందని చెప్పి ఆ బంగారు పుస్తెలును దేవుడి దగ్గర పెడుతుంది. ఆ తర్వాత రోహిణికి వర్దన్ నుంచి వాయిస్ మెసేజ్ వస్తుంది. తనకు డబ్బులు ఇంకా పంపించలేదని, త్వరగా పంపించకపోతే ఈసారి వాయిస్ మెసేజ్ మీ అత్తకు పంపిస్తానని హెచ్చరిస్తాడు. ఇక ప్రభావతి వచ్చి ఆ చివరి మాటలు వింటుంది. రోహిణి వేరే విషయం చెప్పి డైవర్ట్ చేస్తుంది. మరోవైపు మీనా లాగే నువ్వు కూడా నీ నగలన్నీ తీసి వేసుకో అని చెబుతుంది. నగలు ఉండగా ఎందుకని పసుపు తాడు కట్టుకున్నావని ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 28వ తేదీ 410 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

బాలు మీనాకోసం చేయించుకొని వచ్చిన బంగారు పుస్తెలను మీనా ఇంట్లోని దేవుడి దగ్గర పెట్టిన సంగతి తెలిసిందే. ఇక ఆ పస్తెలును తీసుకొని భర్తకు చెప్పకుండా అమ్మవారి గుడి దగ్గరకు తీసుకెళ్తుంది. కారు వెళ్తున్న సమయంలో బాలు ఎక్కడికి ఎక్కడికి అని ఎన్ని సార్లు అడిగినా అస్సలు చెప్పదు. తీరా అమ్మవారి గుడికి తెలుసుకుంది. అక్కడికి వెళ్లగానే బాలును తన బావమర్ది, మరదలు, అత్తమ్మ అందరూ ఆహ్వానిస్తారు. అర్థం కానీ బాలు ఎందుకు ఇంతలా మర్యాద ఇస్తున్నారని అడుగుతాడు. దానికి మీనా కొత్త బట్టలు ఇచ్చి ప్రస్తుతం ఇవ్వి మార్చుకొని రండి అని చెబుతుంది.
మీనా ఏమాత్రం చెప్పకపోవడంతో బాలు సైలెంట్ గా వెళ్లి పట్టు వస్త్రాలు ధరించుకొని వస్తాడు. ఇక వెంటనే మీనా బాలును ఆలయంలోకి తీసుకెళ్లి పెళ్లి ఏర్పాట్లు చేసిన దగ్గర ఆపుతుంది. ఈ పెళ్లి ఏర్పాట్లు అన్నీ మన కోసమేనని చెబుతుంది. ఎందుకని మీనాను అడగగా.. మనం మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నామని అంటుంది. తమ పెళ్లి సమయంలో బాలుకు మీనా, మీనాకు బాలు అంటే ఏమాత్రం ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకుంటారు. అదే విషయాన్ని మీనా బాలుతో చెబుతుంది. మనకు పెళ్లి జరిగినప్పుడు నేనంటే మీకు, మీరంటే నాకు ఏమాత్రం ఇష్టం లేదని చెబుతుంది మీనా. కానీ ఇప్పుడు ఇద్దరం ఒకటిగా బతుకుతున్నాం గునుక ఇప్పుడు నీతో మనస్పూర్తిగా తల వంచుకొని తాళి కట్టించుకుంటానని చెబుతుంది.
దాంతో బాలు ఎంతో ఎమోషనల్ అవుతారు. అవును అస్సలు మనకు ఏమాత్రం ఇష్టం లేని పెళ్లిని చేశారు. అది కేవలం బొమ్మల పెళ్లి అయ్యింది. నువ్వు నా తలపై జీలకర్ర బెల్లం పెట్టినప్పుడే నీకు నాతో పెళ్లి ఇష్టం లేదని నాకు అర్థమైంది. కానీ ఇప్పుడు ఒకరికోసం బతుకుతున్నాం అని బాలు కూడా అంటాడు. ఇక మీనా చెప్పిన దాని ప్రకారం.. పూజారి వారిద్దరికీ మళ్లీ పెళ్లి జరిపిస్తాడు. నుదిట బాషింగం, బుగ్గన చుక్క, పెళ్లి తండలు, జీలకర్ణ బెల్లం పెట్టించి మత్రోచ్చరణల మధ్య బాలు దీపాకు మళ్లీ చేయిస్తారు. బాలు తో మీనా సంతోషంగా తాళి కట్టించుకుంటుంది. తన కూతురు పెళ్లి జరుగుతుంటే మీనా తల్లి చూసి ఎంతో సంతోషిస్తుంది. అక్కడున్న వాళ్లు మీనా బాలును ఆశీర్వదిస్తారు. నిండు నూరేళ్లు హాయిగా బతకాలని దీవిస్తారు.
ఇక బాలు మీనా మళ్లీ పెళ్లి తర్వాత తిరిగి ఇంటికి వెళ్తారు. అక్కడ వీరిద్దరిని పూల దండల్లో చూసిన ప్రభావతి ఎంతో షాక్ అవుతుంది. సత్యం ను పిలిచి అటు చూడండి వీళ్లేదో చేసుకొచ్చారంటూ ఆగమాగం చేస్తుంది. దాంతో బాలు స్పందిస్తూ నా భార్యతో రెండో పెళ్లి చేసుకున్నాను నాన్న అని బదులిస్తాడు. ఇప్పుడు రెండో పెళ్లి ఏంట్రా అని ప్రభావతి అడుగుతుంది. దాంతో బాలు ఏం జరిగిందో పూర్తిగా వివరిస్తాడు. మీనాకు కొనిచ్చిన బంగారు పుస్తెలును నిన్న వేసుకోకుండా ఇవ్వాళ గుడిలో మార్చుకుంది. అదే సమయంలో మీనా వాళ్ల అమ్మ, కూతురు, కొడుకు, అయ్యగారు కూడా ఉండి మళ్లీ పెళ్లి జరిపించారు. చేసుకున్నామని బదులిస్తాడు.
మరీ మమల్ని కూడా పిలవొచ్చు కదా అని సత్యం అంటాడు. అంత సమయం లేదని చెబుతాడు బాలు. నువ్వేనా చెప్పాలి కదా మీనా అనడంతో... పెళ్లైన కొత్తలో తాళి తీసేశాను, దాని వల్ల బాలుకు ఏమౌతుందోనని ఇలా మళ్లీ పెళ్లి చేసుకున్నామని మీనా వివరిస్తుంది. ఏదేమైనా సంతోషమని సత్యం అంటాడు. ఇక వెంటనే వారికి హారతి ఇచ్చి, ఒకరి పేర్లు మరొకరితో చెప్పించి ఇంట్లోకి ఆహ్వానిస్తారు. ఈ నూతన దంపతులు దేవుడికి దండం పెట్టుకొని వెళ్లి సత్యం, ప్రభావతి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకుంటారు.
ఇక మరోవైపు ప్రభావతి రోహిణికి ఊహించని షాక్ ఇస్తుంది. మీనా గురించి మాట్లాడుతూ బాలు తెచ్చిన మూడు గ్రాముల బంగారానికే మీనా ఎంతగానో మురిసిపోతోంది. నువ్వు కూడా బంగారు నగలన్నీ వేసుకో అని రోహిణికి సూచిస్తుంది. నీ నగల్నీ ఎక్కడ ఉన్నాయని ప్రశ్నిస్తుంది. అన్ని నగలు ఉన్నా ఎందుకు పసుపు తాడే వేసకుంటున్నావని అడుగుతుంది. దాంతో రోహిణి గుండె గుబేలు అంటుంది. లాకర్ లో పెట్టావా? అని ప్రభావతి అనడంతో అవునని సమాధానం చెప్పి తప్పించుకుంటుంది. మీనా నాన్నతో చెప్పి కిలో బంగారం పంపించమని ప్రభావతి అంటుంది. కనీసం మీ మామయ్యతోనైనా చెప్పి 20 తులాల బంగారం వెంటనే పంపించమని అడుగు అని అంటుంది. లేదంటే నేనే అడుగుతానని అంటుంది. దాంతో రోహిణి నేను అడిగి పంపించమాంటను అత్తయ్య అని బదులిస్తుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











