Gunde Ninda Gudi Gantalu April 29th: బాలు మీనా రెండో పెళ్లిపై ప్రభావతి ఫైర్.. రోహిణికి అష్టకష్టాలు
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 28వ తేదీ 410వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు చేయించిన బంగారు పుస్తెలుతో పాటు బాలును వెంట తీసుకొని మీనా అమ్మవారి గుడికి వెళ్తుంది. అక్కడ మీనా తల్లి, చెల్లి, తమ్ముడు వారికోసం ఎదురుచూస్తుంటారు. బాలుకు కొత్త బట్టలు ఇచ్చి మార్చుకొని రమ్మని చెబుతారు. రాగానే మీనా అసలు విషయం చెబుతుంది. మనం మళ్లీ చేసుకోబోతున్నామని, మొదట జరిగింది బొమ్మలా పెళ్లి లాంటిదేనని చెబుతుంది. అప్పుడు మీకూ ఇష్టం లేదు. నాకు ఇష్టం లేదు. ఇప్పుడు మనస్ఫూర్తగా పెళ్లి చేసుకుందామని చెబుతుంది.
ఇక బాలు, మీనా గుడిలో పూజారితో పాటు పెద్దల సమక్షంలో మళ్లీ పెళ్లి చేసుకుంటారు. అగ్ని చుట్టూ ఏడడుగులు నడుస్తారు. పెళ్లి చేసుకున్న తర్వాత ఇద్దరూ తిరిగి ఇంటికి వెళ్తారు. అక్కడ మీనా బాలును చూసిన ప్రభావతి షాక్ అవుతుంది. ఏంటని ప్రశ్నిస్తుంది. ఇక బాలు స్పందిస్తూ ఇంట్లో వాళ్లందరికీ జరిగింది వివరిస్తారు. మీనా మాట్లాడుతూ అప్పుడు తాళి తీసేసాను కాబట్టి ఇప్పుడు మళ్లీ పెళ్లి చేసుకున్నామని మామ సత్యంకు బదులిస్తుంది. ఆ తర్వాత వారిద్దరికీ హారతిచ్చి ఇంట్లోకి ఆహ్వానిస్తారు. దాంతో మీనా బాలు దేవుడికి దండం పెట్టుకున్న తర్వాత తల్లి దండ్రులకు ఆశీర్వాదం తీసుకుంటారు. అంతకంటే ముందు రోహిణికి ప్రభావతి షాక్ ఇస్తుంది. తన తండ్రి తో చెప్పి ఒక కిలో బంగారం పంపించామని, లేదంటే మేమ మామతో చెప్పి 20 తులాల బంగారమైనా పంపించమని చెప్పు అంటుంది.

మీనా కంటే ఎక్కువ నగలతో నువ్వు మెరిసిపోవాలని, ఆ నగల్నీ తీసుకొని వేసుకో అని చెబుతుంది. దాంతో రోహిణి కంగారు పడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 29వ తేదీ 411 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?
బాలు మీనా మళ్లీ పెళ్లి చేసుకొని సత్యం ప్రభావతి ల ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ సందర్భంగా సత్యం బాలు మీనాను నిండుగా దీవిస్తాడు. కాని ప్రభావతి మాత్రం వాళ్ళిద్దరూ అంత సంతోషంగా ఉండడం చూసి ఏమాత్రం తట్టుకోలేకపోతోంది. మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఈరోజునే పెళ్ళి రోజుగా ఉంచుకోండి అని చెబుతుంది. మళ్లీ పెళ్లి చేసుకుంటూ పరువు తీయొద్దు అంటూ హేళన చేస్తుంది. నోటికొచ్చినంత మీనాపై మాట్లాడుతూ ఉంటుంది. మరోవైపు సత్యం ప్రభావతిని ఎప్పటికప్పుడు అడ్డుకుంటూ ఉంటాడు. బాలు మేన మనసు నొచ్చుకునేలా మాట్లాడుతుండడంతో ప్రభావతిపై సత్యం మండిపడతాడు.
మరోవైపు మీనా బాలు మళ్లీ పెళ్లి చేసుకున్న సంతోషంలో మునిగి తేలుతుంటారు. మొదట్లో వాళ్ల పెళ్లి సరిగా జరగలేదని చెబుతూ ఉంటారు. ఒకరిపై ఒకరికి ఇష్టం లేకుండేదని చెప్పుకొచ్చింది మీనా. అవును ఎలాగో నాలుగు రోజుల్లో నన్ను వదిలేసి వెళుతుంది అని అప్పుడు మీనా మొహం కూడా చూడకుండా తాళి కట్టేశానని బాలు చెబుతాడు. కానీ ఈరోజు మాత్రం మీనా కళ్ళల్లోకి చూస్తూ మరి తాళి కట్టాను. ఈ రోజే మాకు అసలు పెళ్లి జరిగిందని అనిపించింది. చాలా సంతోషంగా ఉంది అని బాలు చెబుతాడు. అంతేకాకుండా ప్రతి సంవత్సరం ఇదే రోజు తమ పెళ్ళి రోజు జరుపుకుంటామని బాలు చెబుతాడు.
అందుకు సత్యం స్పందిస్తూ మీరు ఏ రోజు పెళ్లి రోజు చేసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మీరిద్దరూ ఇలా సంతోషంగా నవ్వుతూ కలిసి ఉంటే అంతే చాలు అని సత్యం తన మనసులోని మాటను చెబుతాడు. బాలు మీనా సంతోషంగా ఉండడం చూసి సత్యం కూడా ఎంతో ఆనందిస్తాడు. మరోవైపు తమ్ముడు రవి శృతి బాలు మీనాల పెళ్లి విషయంలో చాలా సంతోషం వ్యక్తం చేస్తారు. ఇక వెంటనే బాలు మాట్లాడుతూ ఈరోజు మా శోభనం ఏర్పాట్లకు సమయం వచ్చిందని అంటాడు. ఆ విషయం చెప్పబోతుంటే బాలును మీనా అడ్డుకుంటుంది. వెంటనే వాళ్ళ బెడ్ రూమ్ లోకి తీసుకెళ్తుంది. అందరి ముందు అలానే మాటలేంటని బాలుపై చిలిపి కోపం చేస్తుంది.
బయట మాత్రం ప్రభావతి వారిద్దరిని తిడుతూ ఉంటుంది. బాలు చేయించిన బంగారు పుస్తెలకే మీనా ఇంత ఓవరాక్షన్ చేస్తుందని ఆగ్రహించుకుంటుంది. ఇక వెంటనే రోహిణి తో మాట్లాడుతూ మీ నాన్నకి చెప్పి నంత బంగారాన్ని పంపించు అని చెప్పు అంటుంది. దాతలు కంగారు పడుతుంది. అన్ని వైపులా తిరిగి ఈమె నా వైపే వస్తున్నది అని, అన్ని విషయాలను మా నాన్నకి ముడిపెడుతూ ఉందని మనసులో అనుకుంటూ ఉంటుంది. ఈలోగా బాలు మళ్లీ కిందికి వస్తాడు. తన ఫోన్లో తీసుకున్న వారి పెళ్లి ఫోటోను తండ్రి సత్యముకు చూపిస్తూ ఆనందం వ్యక్తం చేస్తాడు. ఎలా ఉందని అడుగుతాడు. దాంతో సత్యం స్పందిస్తూ మీరిద్దరూ హీరో హీరోయిన్లుగా ఉన్నారని సత్యం పొగుడుతాడు.
తండ్రి అలా చెప్పడం వాళ్ళ ఎంతో సంతోషిస్తాడు. మీనా కూడా చాలా సంతోష పడుతుంది. ఇక వెంటనే ఆ ఫోటోను చూసేందుకు రవి శృతి రోహిణి ఆసక్తి చూపిస్తారు. ఒకరి తర్వాత మరొకరు బాలు మీనా కలిసి దిగిన వారి పెళ్లి ఫోటోలు చూస్తారు. చాలా బాగుందని వారు కూడా ప్రశంసలు అందిస్తారు. ఇక కోడలు శృతి బాలు మీనాల పెళ్లి ఫోటోలను చూస్తూ పొగుడుతూ ఉంటే ప్రభావతి తట్టుకోలేక పోతుంది. అంత బాగా ఉందా అని శృతితో ఎటకారంగా అంటుంది. నీకు అంతలా చూడాలనిపిస్తే వెళ్లి ఆ ఫోటో తీసుకొని చూడొచ్చు కదా అని ప్రభావతిని సత్యం అంటాడు. అందుకు ప్రభావతి అదేమైనా గొప్ప కార్యము చూసి తరించడానికి అని అంటుంది.
ఆ తర్వాత మీనా వంట గదిలోకి వెళ్లి రాత్రి అందరూ భోజనాలు చేయడం కోసం వంటలు వండుతుంది. అదే సమయంలో ప్రభావతి మీన దగ్గరికి వెళ్లి నాన్న మాటలు అంటుంది. ఇంకా ఎంతసేపు వంట చేస్తావ్ బయట అందరి కడుపు మాడిపోతుంది.. త్వరగా చేయొచ్చు కదా అని హెచ్చరిస్తుంది. దాంతో పైన చేస్తున్నాను అంటూ దీటుగా బదులుస్తుంది. మేము పెళ్లి చేసుకున్న రోజునైనా మంచిగా మాట్లాడొచ్చు కదా అత్తయ్య అని అంటుంది. ఆ చేసుకున్నారులే పెద్ద పెళ్లి అని ప్రభావతి మండిపడుతుంది. నా మీద పోటీ కోసమే ఇలా పెళ్లి చేసుకునే వచ్చావు అని ఫైర్ అవుతుంది.
బాలు గురించి నీకు సరిగా తెలియదని అంటుంది. ఏదో ఒక రోజు వాని నిజ స్వరూపం నీకే తెలుస్తుంది అని చెబుతుంది. ఈరోజు బంగారు పుస్తెలు చేయించినంత మాత్రాన సంతోష పడిపోకు అని అంటుంది. వాడు తెగిన గాలిపటం అని గుర్తు పెట్టుకో.. ఇప్పుడు ఎలా ఉంటాడో తెలియని పరిస్థితి అని అంటుంది. దాంతో మీనా తన భర్త బాలు ఎలా ఉన్నా సర్దుకుపోతానని బదిలిస్తుంది. ఇంకా మండిపోయిన ప్రభావతి త్వరగా వంట చేసుకుని తీసుకురా అని మీనాను ఆదేశించి వెళ్ళి పోతుంది. ఇదిలా ఉంటే బాలు మీనా మొదటి రోజు రాత్రి గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటారు. మనసులతో మాట్లాడుకుంటారు. ఇక మరోవైపు మనోజ్ నిద్రలోనే రెస్టారెంట్ లోని వంటకాలన్నీ పేర్లు చెబుతూ కలవరిస్తాడు. దాంతో రోహిణి మనోజ్ ను లేపి ఏం జరిగిందని? ఎందుకలా కలవరిస్తున్నావని అడుగుతుంది. రోహిణి ప్రశ్నలకు మనోజ్ ఎలా స్పందించాడనేది తర్వాత ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











