Gunde Ninda Gudi Gantalu April 30th: బాలు మీనా కొత్త జీవితం.. మనోజ్ కు రోహిణి వార్నింగ్
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 29వ తేదీ 411వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు మీనా మళ్లీ పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటారు. కానీ ఆ విషయం ప్రభావతికి అస్సలు నచ్చదు. మళ్లీ మళ్లీ పెళ్లి చేసుకోకుండా ఈరోజునే పెళ్ళి రోజుగా ఉంచుకోండి అని చెబుతుంది. మళ్లీ పెళ్లి చేసుకుంటూ పరువు తీయొద్దు అంటూ హేళన చేస్తుంది. నోటికొచ్చినంత మీనాపై మాట్లాడుతూ ఉంటుంది. మీరిద్దరూ ఇలా సంతోషంగా నవ్వుతూ కలిసి ఉంటే అంతే చాలు అని సత్యం తన మనసులోని మాటను చెబుతాడు. బాలు మీనా సంతోషంగా ఉండడం చూసి సత్యం కూడా ఎంతో ఆనందిస్తాడు. మరోవైపు తమ్ముడు రవి శృతి బాలు మీనాల పెళ్లి విషయంలో చాలా సంతోషం వ్యక్తం చేస్తారు.
ఆ తర్వాత బాలు మీనా శోభనం ఏర్పాట్లు జరుగుతాయి. ఒకరితో ఒకరు ఏకాంతంగా గడుపుతారు. తమ మనస్సుల్లోని మాటలను చెప్పుకుంటూ సంతోషంగా ఉంటారు. కొత్త జీవితంలో మరింత సంతోషంగా ఉండాలని అనుకుంటారు. ఇంకో వైపు ప్రభావతి రోహిణిపై ఒత్తిడి పెంచుతుంది. తన పుట్టింటి నుంచి 20 తులాల బంగారం తీసుకొని రమ్మని చెప్పి సూచిస్తుంది. దాంతో రోహిణి చాలా భయపడుతుంది. ఎలా ఆ సమస్య నుంచి బయట పడాలని ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు మనోజ్ నిద్రలోనే రెస్టారెంట్ లోని వంటకాలన్నీ పేర్లు చెబుతూ కలవరిస్తాడు. హోటల్ లో టిఫిన్స్ కు సంబంధించిన మెనునూ కలవరిస్తూ ఉంటాడు. దాంతో రోహిణి మనోజ్ ను లేపి ఏం జరిగిందని? ఎందుకలా కలవరిస్తున్నావని అడుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక ఏప్రిల్ 30వ తేదీ 412 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

బాలు మీనా ఇద్దరికీ శోభన ఏర్పాట్ల తర్వాత ఇంట్లో మరో సమస్య మొదలవుతుంది. మనోజ్ నిద్రపోతూ కలవరిస్తాడు. అది కూడా తన రెస్టారెంట్ లోని ఫుడ్ ఐటెమ్స్ అన్నీ చెబుతూ ఉంటాడు. పదే పదే అన్నీ టిఫిన్స్ గురించి కలవరిస్తూ ఉంటాడు. దీంతో రోహిణి వెంటనే మనోజ్ ను లేపుతుంది. అసలు ఎందుకలా కలవరిస్తున్నావంటూ లేపి ప్రశ్నిస్తుంది. దాంతో మనోజ్ లేస్తూనే ఆ సార్.. అనుకుంటూ లేస్తాడు. రోహిణి ఏమైందని మనోజ్ ను అడుగుతుంది. ఆ విషయం నువ్వే చెప్పాలని రోహిణి మనోజ్ ను ప్రశ్నిస్తుంది.దాంతో మనోజ్ అలాంటిది ఏమీ లేదని బదులిస్తాడు. తను ఒక హోటల్లో మసాలా దోశ ఆర్డర్ చేసుకొని తినేశానని, ఆ టేస్ట్ గుర్తుకొచ్చి మళ్ళీ అలా కలవరిస్తున్నా నేమోనని అంటాడు. ఆయన రోహిణి సందేహిస్తుంది. హోటల్లో వెయిటర్ లాగా కలవరిస్తున్న ఎందుకు అని అనడంతో మనోజ్ కంగారు పడతాడు. వెయిటర్ లా కలవరించాల్సిన పని నాకేం ఉందని మనోజ్ అంటాడు. ఇక తర్వాత వారిద్దరు సరదాగా మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు రవి శృతి కూడా తమ గదిలో ఆటలాడుతూ ఉంటారు. ఇక బాలు మీనా తమ గదిలో నిద్రిస్తూ ఉంటారు.
అయితే, అందరి గదిలో నుంచి పెద్దపెద్దగా శబ్దాలు రావడంతో హాల్లో పడుకున్న ప్రభావతి ఒకసారిగా నిద్రలో నుంచి లేస్తుంది. ఇంట్లో అందరి అరుపులు చూసి నాకు నిద్ర పట్టడం లేదని సత్యంతో గొడవ పడుతుంది. పిల్లలు అలాగే అల్లరి చేస్తారు నువ్వు సైలెంట్ గా పడుకో అని సత్యం ప్రభావతితో అంటాడు. కానీ ప్రభావతి మాత్రం మనకు ప్రైవేట్ గా రూమ్ లేకపోవడం వల్లనే ఇలా నిద్రలేక ఇబ్బంది పడుతున్నామని సత్యంతో అంటుంది. ఇప్పుడు హాయిగానే పడుకున్నాం కదా ఇంకా గోల ఏంటి అని ప్రశ్నిస్తాడు సత్యం. కానీ ప్రభావతి మాత్రం చాలా ఇబ్బందిగా ఉంటుందని పదేపదే చెబుతూ ఉంటుంది.
బాలు మీ నాన్న ఇంట్లో నుంచి పంపించేద్దామని సత్యంతో ప్రభావతి అంటుంది. దాంతో సత్యం ఒక్కసారిగా ప్రభావతిపై మండిపడతాడు. తిక్క తిక్కగా ఉందా బాలు మీనాను ఇంట్లో నుంచి పంపించడం ఏంటని గట్టిగా మందలిస్తాడు. ఇక భర్త సత్యం సీరియస్ కావడంతో ప్రభావతి సైలెంట్ గా పడుకుంటుంది. ఇక తెల్లారాక మీనా అందరికోసం టిఫిన్ రెడీ చేసి పెడుతుంది. కానీ రోహిణి మాత్రం మనోజ్ కోసం అని హోటల్ నుంచి రెండు మసాలా దోశలు ఆర్డర్ చేసి తీసుకొస్తుంది. ఆ విషయం మీ నాకు చెప్పి తమకు టిఫిన్ వద్దని, మా వరకు దోసెలు తెచ్చుకున్నామని చెబుతుంది. దానితో మీనా షాక్ అవుతుంది. పోనీలే అని సైలెంట్ గా ఉంటుంది.
అయితే రోహిణి తెచ్చుకున్న టిఫిన్ను హాల్లోని టేబుల్ పై పెడుతుంది. వెళ్లి మనోజ్ ని తీసుకొద్దామని గదిలోకి వెళుతుంది. ఇక వాళ్ళు వచ్చేలోపు బయట పెట్టి ఉన్న టిఫిన్ బాలు తినేస్తాడు. ఆ టిఫిన్ మీనా తనకోసం తెచ్చింది అనుకొని బాలు తింటూ ఉంటాడు. ఇక దీంతో రచ్చ మొదలవుతుంది. ఒకరి కోసం తెచ్చిన టిఫిన్ను మరొకరు తినడం సభ్యత కాదని మనోజ్, ప్రభావతి, రోహిణి బాలుపై మళ్ళి పడతారు. నానా మాటలు అంటారు. ఇక దీంతో బాలు సభ్యత గురించి నాతోనే మాట్లాడుతున్నావా అంటూ రోహిణి పై మండిపడతాడు. అసలు విషయం బయట పెట్టేస్తానని తన నాన్నతో చెబుతుంటాడు. దీంతో సత్యం బాలును ఆపే ప్రయత్నం చేస్తూ ఉంటాడు.
బాలు పదే పదే రోహిణి గుట్టు బయట పెడతానని అనడంతో రోహిణి సైలెంట్ అయిపోతుంది. ఎక్కడ బాలు నిజం చెప్పేస్తాడోనని భయపడుతుంది. ఇక వెంటనే బాలుకు క్షమాపణలు చెబుతుంది. కానీ ప్రభావతి మాత్రం వీడేంటి త్రాచుపాముల బుసలు కొడుతున్నాడు. ఏదో చెప్తున్నాను అన్నాడు కదా చెప్పమనండి అంటూ ప్రభావతి, మనోజ్ అంటాడు. ఇక బాలు చెప్పబోతుంటే సత్యం అడ్డుకుంటాడు. సత్యం మాట్లాడుతూ టిఫిన్ ఇలా ఒక్కరి కోసమే కాకుండా అందరి కోసం తీసుకురావాలి కదా అమ్మా అని రోహిణి మందలిస్తాడు. ఆ తర్వాత వీరి గోల ఆగేలా లేదని శృతి అందరికీ టిఫిన్ ఆర్డర్ చేస్తుంది. అంతటితో సమస్య ముగుస్తుంది.
ఇక ప్రభావతి తన వదిన కామాక్షిని తీసుకొని బయటికి వెళుతుంది. వెళ్తూ వెళ్తూ ఇంట్లో జరిగిన విషయాలన్నీ ఆమెకు చెబుతుంది. ఎలాగైనా బాలు మీనా ను ఇంట్లో నుంచి పంపించాలని తను నిర్ణయించుకున్నట్టు కామాక్షికి చెబుతుంది. అందుకు కామాక్షి షాక్ అవుతుంది. అలా ఆలోచిస్తావ్ ఏంటని ప్రశ్నిస్తుంది. ప్రస్తుతం ఆ బాగా ఆకలి వేస్తుందని పక్కనే హోటల్ ఉంది వెళ్దాం అని చెబుతుంది. అయితే వీరిద్దరూ మనోజ్ పనిచేసే రెస్టారెంట్ కి తినడానికి వెళ్తారు. అక్కడ మనోజ్ వీళ్లను చూసి లోపలికి వెళ్లి దాక్కున్నాడు. అయితే అక్కడ ఉన్న ఓనర్ మనోజ్ ను బండ బూతులు తిడుతూ బయటికి రమ్మంటాడు. మనోజ్ బయటకు రాకుండా మరొక వెయిటర్ తో ఆర్డర్ తీసుకోమని చెబుతాడు. మనోజ్ పేరు పెట్టి మాట్లాడడంతో కామాక్షి మన మనోజ్ అయ్యుంటాడని సందేహిస్తుంది. అయితే ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











