Gunde Ninda Gudi Gantalu May 1st: సత్యానికి ప్రాణాపాయం.. రెస్టారెంట్ లో మనోజ్ బాగోతం..

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక ఏప్రిల్ 30వ తేదీ 412వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. రాత్రి అందరూ పడుకోకుండా ఎవరి గదిలో వారు గట్టిగా అరుస్తూ, నవ్వుతూ ముచ్చట్లు పెడుతూ ఉంటారు. దీంతో హాలులో పడుకున్న ప్రభావతి ఇబ్బంది ఫీల్ అవుతూ ఉంటుంది. నిద్రపోతున్న సత్యంను లేపి వీళ్లు ఇంతలా అల్లరి చేస్తున్నారు. మనకే గది లేకుండా పోయింది. ఇలా హాలులో పడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని గుణుగుతూ ఉంటుంది. వెంటనే ఆ బాలు, మీనాను ఇంట్లో నుంచి పంపించేద్దామని, ఆ గదిలో మనం ఎంచక్కా పడుకోవచ్చదని భర్త సత్యంతో అంటుంది. అందుకు సత్యం కోపం చేస్తాడు. ఏం మాట్లాడుతున్నావని మండిపడుతాడు. ఇంకోసారి అలా మాట్లాడితే అస్సలు ఊరుకోనని వార్నింగ్ ఇస్తాడు.

మరోవైపు రోహిణి మనోజ్ కోసం తీసుకొచ్చిన మసాలా దోశసను బాలు తినేస్తాడు. మీనా తనకోసం తీసుకొచ్చి హాల్ లోని టేబుల్ పై పెట్టిందని అనుకుంటాడు. అందుకే తీసుకొని దర్జాగా తింటూ ఉంటాడు. రోహిణి మనోజ్ ను గదిలోంచి తీసుకొచ్చే లోపు తింటూ కనిపిస్తాడు. దీంతో రోహిణి, మనోజ్, ప్రభావతి బాలుపై నానా మాటలు మాట్లాడుతారు. బాలు కూడా ధీటుగా బదులిస్తాడు. రోహిణి రెచ్చిపోవడంతో తన గురించి అసలు గుట్టు చెబుతానని తండ్రి సత్యంతో అంటాడు. సత్యం ఆపుతుండటంతో రోహిణి కూడా ముందే కనుగొని సైలెంట్ అవుతుంది. ఎక్కడా తన గుట్టు బయట పెడుతాడోనని భయంతో క్షమాపణలు కూడా చెబుతుంది. ఇక ప్రభావతి బాలు మీనాను ఇంట్లో నుంచి వెళ్ల గొట్టేందుకు ప్లాన్ వేస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తన వదిన కామాక్షిని సలహాలు అడుగుతుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న వారు మాట్లాడుకుంటూ మనోజ్ పనిచేస్తున్న రెస్టారెంట్ కు దోశ తినేందుకు వెళ్తాడు. మనోజ్ వారిని చూసి దాక్కుంటాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 413 May 1st

ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మే 1వ తేదీ 413 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

ప్రభావతి తన వదిన కామాక్షితో హోటల్లో టిఫిన్ చేసేందుకు వెళుతుంది. అయితే మీరు వెళ్లిన హోటల్లోనే మనోజ్ వెయిటర్ గా పనిచేస్తున్నారు. ఈ విషయం తెలియని ప్రభావతి కామాక్షి అదే హోటల్ కు వెళ్లి టిఫిన్ ఆర్డర్ చేస్తారు. మనోజ్ వాళ్ళని ముందుగానే చూసి వాళ్ళ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకోమని మరొక వెయిటర్ ని బతిలాడుతాడు. అతను సరే అని ఒప్పుకొని వెళ్లి ప్రభావతి కామాక్షి దగ్గర ఆర్డర్ తీసుకుంటాడు. ఈ క్రమంలో హోటల్ యజమాని మనోజ్ మనోజ్ అంటూ మాటిమాటికి అరుస్తూ ఉంటాడు. సరిగా పనిచేయడం లేదు అంటూ నానా మాటలు తిడతాడు. అలా తన కొడుకు మనోజ్ పేరుతో ఆ ఓనర్ తిడుతూ ఉంటే ప్రభావతి తట్టుకోలేక పోతుంది. కామాక్షి మాత్రం మనోజ్ ఇక్కడే పని చేస్తున్నాడేమో అని సందేహిస్తుంది. వీరి మాటలను ఓవైపు మనోజ్ చూస్తూనే ఉంటాడు.

ఇక వెంటనే ప్రభావతి తన కొడుకు మనోజ్ కు ఫోన్ చేస్తుంది. ఆ ఫోన్ కూడా అక్కడే రింగ్ అవుతుంది. ఇక కామాక్షి అనుమానంతో ఆ ఫోన్ లిఫ్ట్ చేసేందుకు వెళుతుంది. వీరి వెనకాల ఉన్న మనోజ్ కౌంటర్ దగ్గర చార్జింగ్ పెట్టిన ఆ ఫోన్ దగ్గరికి వెళ్లలేక పోతాడు. కామాక్షి లేచి ఆ ఫోన్ దగ్గరికి వెళ్లి తీసుకునే లోపు.. మనోజ్ ఇంకో వెయిటర్ ని పంపించి ఫోన్ లిఫ్ట్ చేయమని చెప్తాడు. ఇక అతను ఆ ఫోన్ తీసుకోవడంతో కామాక్షి కూడా మనోజ్ ఫోన్ కాదని వెనక్కి తిరిగి వస్తుంది. ఇక ఫోన్ తీసుకొని వెళ్ళిన మనోజ్ మళ్ళీ తిరిగి ప్రభావతికి ఫోన్ చేస్తాడు. ప్రభావతి మాట్లాడుతూ సాఫ్ట్వేర్ కంపెనీలో బిజీగా పని చేసుకుంటున్నావా మనోజ్ అని అడుగుతుంది. అవునని మనోజ్ చెప్తాడు. తల్లి అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం చెప్పి సమస్య నుంచి ఎక్కుతాడు.

ఇక మరోవైపు శృతి డబ్బింగ్ చెప్పి ఇంటికి తిరిగి వస్తుంది. ఇంట్లోకి తిరిగి రాగానే దోమలు ఉండడంతో మస్కిటో స్ప్రే కొడుతుంది. మోతాదుకు మించి ఎక్కువగా స్ప్రే చేస్తుంది. కిచెన్ నుంచి బయటికి వచ్చిన మీనా స్ప్రే చాలా ఎక్కువ అయిపోయింది. ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉందని చెబుతున్నా కూడా శృతి స్ప్రే కొడుతూనే ఉంటుంది. బాగా స్ప్రే చేస్తూనే ఉంటుంది. అదే సమయంలో శృతికి డబ్బింగ్ చెప్పాలని ఫోన్ వస్తుంది. దాంతో అర్జెంట్ గా బయటికి వెళ్లిపోతుంది. ఇక సత్యం ఇంట్లోకి వచ్చి కూర్చుంటాడు. దోమల స్ప్రే ఎక్కువ కొట్టడంతో ఇంట్లో పూర్తిగా వ్యాపిస్తుంది. దాంతో సత్యానికి ఊపిరి తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. వెంటనే చాతిలో నొప్పి వచ్చి పడిపోతాడు. మీనా నువ్వు పిలుస్తూ శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉందని తెలియజేస్తాడు.

కంగారుపడుతూ మేడం వెంటనే అందరికీ ఫోన్ చేస్తుంది. కానీ ఎవరూ లిఫ్ట్ చేయకపోవడంతో తానే ఆటోలో సత్యంను ఆసుపత్రికి తీసుకువెళ్తోంది. దారి మధ్యలో బాలు తిరిగి ఫోన్ చేస్తాడు. విషయం తెలుసుకునే ఆసుపత్రికి వెళ్తారు. పరీక్షించిన వైద్యుడు మస్కిటో స్ప్రే ఎక్కువ అవ్వడం వలన ఊపిరి తీసుకోవడం కష్టంగా మారిందని, సమయానికి ఆసుపత్రికి తీసుకురావడం వల్ల ఎలాంటి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారని చెబుతారు. ఇక వెంటనే ప్రభావతి వచ్చి కంగారు పడుతుంది. విషయం తెలుసుకోకుండానే మీనా ను నానా మాటలు అంటుంది. మీ వీధిలో అన్ని దోమలు ఉంటాయి కదా అందులోనే పుట్టి పెరిగావు కదా స్ప్రే లేకపోతే ఉండలేవు అని మీనా అనే స్ప్రే చేసిందని తెట్ల పురాణం మొదలుపెడుతుంది. దీంతో మేలుకున్న సత్యం ప్రభావతిని అడ్డుకుంటాడు. బాలు కూడా అడ్డుకునే ప్రయత్నం చేస్తాడు.

ఇక మీనా స్పందిస్తూ ఆ స్ప్రే నేను కొట్టలేదని చెబుతుంది. నువ్వు కాకుండా మరి ఎవరు కొట్టారని ప్రభావతి పదేపదే అడుగుతూ ఉంటుంది. ఇదే సమయంలో మనోజ్ రవి కూడా ఆసుపత్రికి చేరుకుంటారు. నాన్నకు ఎలా ఉందని అడుగుతుంటారు. దీంతో బాలు రవి పై మండిపడతాడు. ఎలా ఉందో నీ పెళ్ళాన్ని అడిగి తెలుసుకో తిడతాడు. రెండుసార్లు నీవల్ల నాన్న ఆసుపత్రి పాలయ్యారని బాలు ఆవేదన వ్యక్తం చేస్తాడు. ఆయన కోలుకొని తిరిగి ఇంటికి వచ్చాక అందరు లెక్కలు తీరుస్తానని, ఇంట్లో నుంచి వెళ్లగొడతానని అంటాడు. ముందు సత్యం ట్రీట్మెంట్ కావాల్సిన మందులు తీసుకొని రావడానికి బాలు బయటికి వెళ్తారు. ఇక తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X