Gunde Ninda Gudi Gantalu May 2nd: శృతికి రవి వార్నింగ్.. మీనా తమ్ముడిని చితకబాదిన బాలు

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మే 1వ తేదీ 413వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మనోజ్ రెస్టారెంట్ లో వెయిటర్ గా పనిచేస్తున్నాడన్న విషయం తెలియక తల్లి ప్రభావతి తన వదిన కామాక్షిని వెంట తీసుకొని అదే రెస్టారెంట్ కు వెళ్తుంది. వెళ్లి టిఫిన్ ఆర్డర్ చేస్తుంది. దోష, పూరీ ఆర్డర్ చేద్దామని అనుకుంటారు. వాళ్లను ముందుగానే చూసిన బాలు టక్కున దాక్కుంటాడు. వాళ్ల నుంచి తప్పించుకునేందుకు నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. తనకు బదులుగా వేరొక వెయిట్ ను పంపించి వాళ్ల దగ్గర ఆర్డర్ తీసుకోమని చెబుతాడు. కానీ అదే
సమయంలో మనోజ్ మనోజ్ అంటూ ఓనర్ గట్టిగా పిలుస్తూ ఉంటాడు.

నానా బూతులు తిడుతూ ఉంటాడు ఆ ఓనర్. దాంతో ప్రభావతికి మండిపోతుంది. కామాక్షి మాత్రం ఆ మనోజ్ మన మనోజేనేమోనని సందేహం కూడా వ్యక్తం చేస్తుంది. ప్రభావతి ఫోన్ చేయడంతో అక్కడే ఫోన్ కూడా రింగ్ అవుతుంది. వెళ్లి చూద్దామనుకునే లోపు మనోజ్ మరో వెయిటర్ ను పంపించి తన ఫోన్ ను తీసుకోమని చెబుతాడు. అలా తప్పించుకుంటాడు. ఇక ఇంటి దగ్గర శృతి దొమల స్ప్రే కొట్టడంతో సత్యంకు ఊపిరాడదు. దాంతో వెంటనే ఆస్పత్రికి తరలిస్తారు. అక్కడ విషయం తెలుసుకోకుండా మీనాపై ప్రభావతి మండి పడుతుంది. ఇదే సమయంలో శృతి వల్లనే ఇలా జరిగిందని తెలుసుకున్న బాలు రవిపై ఆగ్రహం వ్యక్తం చేస్తాడు. పెద్ద ఘర్షణ జరుగుతుంది.ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక మే 2వ తేదీ 414 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 414 May 2nd

బాలు మీనాలు సత్యంను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకొస్తారు. హాలులోని సోఫాలో కూర్చొబెడుతారు. వచ్చి రాగానే రోహిణి సత్యంను పలకరిస్తుంది. ఇప్పుడు ఎలా ఉంది మామయ్య నేనే ఆస్పత్రికి వద్దాం అనుకున్నా కానీ మీరే ఇంటికి వస్తున్నారని మనోజ్ చెప్పడంతో రాలేకపోయానని చెప్పుకొచ్చింది. దాంతో సత్యం ఇప్పుడు పర్లేదమన్నా అని బదులిస్తాడు. ఆ వెంటనే శృతి ఇంటికి తిరిగి వస్తుంది. రాగానే బాలుకు కోపం తెప్పించేలా మాట్లాడుతుంది. 'అప్పుడే ఇంటికి వచ్చారనే అంటే సమస్య చిన్నదేనా' అని అంటుంది. దాంతో బాలుకు మండిపోతుంది.

అంటే పెద్ద ఎత్తున ప్లాన్ చేశావా? మా నాన్న ఇంటికి తిరిగి రాకుండా పెద్ద ప్లాన్ చేశావా అని శృతిపై బాలు మండిపడుతాడు. అందుకు శృతి స్పందిస్తూ నేను అలా అనలేదు. సమస్య పెద్దదైతే ఆస్పత్రిలోనే వారం పాటు ఉంచుతారు కదా.. త్వరగా వచ్చారంటే ఏం సమస్య లేదు అంతా ఓకే కదా అని తన వెర్షన్ ను వివరిస్తూ ఉంటుంది. ఆ వెంటనే బాలు మాట్లాడుతూ నువ్వు చేసిన పనికి త్వరగానే తిరిగి వచ్చాం అంటూ గట్టిగా మాట్లాడుతాడు. శృతిపై బాలు కోపం చేస్తుంటే తమ్ముడు రవి అడ్డుకుంటాడు. అన్నయ్య నన్ను ఆస్పత్రిలో అడిగావు కదా.. మళ్లీ ఇప్పుడు శృతిని ఎందుకు అనడం అని బాలుతో అంటాడు.

దాంతో శృతి ఏమైంది? అస్సలు మిమ్మల్ని ఆస్పత్రిలో బాలు ఏమన్నాడు. నన్ను ఇప్పుడు ఎందుకు అంటాడు? అని శృతి రవితో అంటుంది. ఏ తప్పు చేయనందుకు నన్ను ఎలా అంటారని శృతి కూడా ఫైర్ అవుతుంది. దాంతో మీనా కలుగజేసుకొని మీరిద్దరూ లోపలికి వెళ్లండి అని రవి, శృతిలకు చెబుతుంది. కానీ శృతి మాత్రం నాకు నేను చేసిన ఆ తప్పేంటో తెలియాలని అంటుంది. ఇక మీనా చెబుతుంది. నువ్వు హాల్ లో దోమల మందు స్ప్రే చేయడం వల్ల మామయ్యకు ఊపిరి అందలేదు. అప్పటికే హార్ట్ ఆపరేషన్ జరగడం వల్ల మామయ్యకు ఇలాంటి వన్నీ పెద్దగా పడవు అని మీనా చెబుతుంది. దాంతో శృతి అందులో నా తప్పేం ఉంది మీనా.. మామయ్యకు ఆ వాసన పడదనే విషయం నాకు తెలియదు కదా అని బదులిస్తుంది.

కనీసం నేను చెప్పినప్పుడైనా నువ్వు విన్నావా? అని మీనా తిరిగి ప్రశ్నిస్తుంది. ఇవన్నీ ఆలోచించే నేను స్ప్రే చేయొద్దని చెప్పాను. ఆ వాసన నాకే పడలేదు. అప్పుడు ఆగి ఉంటే ఇప్పుడు ఇలా జరిగేది కాదని మీనా అంటుంది. ఇక ప్రభావతి తనకు తెలియదని చెబుతుంది కదా అని అంటుంది. దాంతో బాలు స్పందిస్తూ అదే పని మీనా చేస్తే ఊరుకుంటావా? అని తల్లి ప్రభావతిని అడుగుతాడు. అయినా నాన్నకు ఏమైందే టెన్షన్ ఎవ్వరికీ లేదు. ఆస్పత్రిలో అప్పు చేసి మరీ బిల్లు కట్టాను. మిగిలిన ఇద్దరు కొడుకులు ఒక్క రూపాయి తీసిన పాపానా పోలేదు.. అని బాలు అంటాడు. ఇక శృతి వెంటే ఆ డబ్బులు నేను ఇస్తాను. నువ్వే అన్నీ చక్కబెడుతున్నట్టుగా మాట్లాడకు అని సీరియస్ అవుతుంది.

ఇక సత్యం జోక్యం చేసుకొని అందరూ ఎవరి ఇంట్లోకి వారిని వెళ్లమని చెబుతాడు. ఇక బాలు తన రూమ్ ను తల్లి, తండ్రి సత్యం, ప్రభావతికి ఇస్తాడు. మరోవైపు శృతి రవి మధ్య ఘర్షణ జరుగుతుంది. నవ్వు చదువుకొని కూడా ఇలా చేశావేంటని రవి శృతిపై మండిపడుతుంది. మీ నాన్న హెల్త్ హిస్టరీ నాకు తెలియదు కదా.. అప్పుడు స్ప్రే చేస్తే తప్పేం ఉందని అనుకున్నాను. నాకు తెలిసి చేయలేదు. అప్పు నా తప్పేం లేదని శృతి అంటుంది. దాంతో రవి ఎవ్వరూ ఏమైపోయినా పర్లేదు నువ్వు మాత్రం ఎవ్వరి ఎమోషన్స్ పట్టించుకోవు అని అంటాడు. ఇక వెంటనే శృతి మామ సత్యం దగ్గరకు వెళ్లి క్షమాపణలు కోరుతుంది. అంతటి సమస్య సద్దుమణుగుతుంది.

ఆ తర్వాత సుశీలమ్మ ఫోన్ చేసి అందరి యోగా క్షేమాలు అడుగుతుంది. ఈ క్రమంలో బాలు, మీనాల మళ్లి పెళ్లి ఫొటోలను చూసి బాగుందని చెబుతుంది. అలాగే ఉగాదికి వెళ్లిన ఫొటోలను పంపించురా అని బాలును ఫోన్ లో అడుగుతుంది. అందుకు బాలు సరేనని అంటాడు. అదే సమయంలో మన ఇంట్లో కూడా పెట్టుకోవడానికి కుటుంబ సభ్యులందరూ ఉన్న ఒక ఫొటోను ప్రేమ్ కట్టించుకోని తీసుకురా బాలు అని సత్యం చెబుతాడు. దాంతో బాలు ఫొటో ఫ్రేమ్ కట్టించేందుకు షాప్ కు వెళ్తాడు. అక్కడ విస్తుపోయే నిజాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత మీనా తమ్ముడుని చితకబాదుతాడు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందనేది ఇప్పుడు నెక్ట్స్ ఎపిసోడ్ లో ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X