Gunde Ninda Gudi Gantalu May 3rd : మీనా తమ్ముడి దొంగతనం.. బాలు చేతికి చిక్కిన బావమర్ది
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మే 2వ తేదీ 414వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. సత్యంను ఆస్పత్రి నుంచి తిరిగి తీసుకొచ్చిన తర్వాత ఇంట్లో పెద్ద గొడవ అవుతుంది. శృతి తనకు తెలిసో తెలియక చేసిన పనికి తన తండ్రి సత్యం ప్రాణాలకే ముప్పు వచ్చిందని బాలు సీరియస్ అవుతాడు. తమ గదిలో మాత్రమే దొమల స్ప్రే కొడితే సరిపోయేదని అనవసరంగా హాలు లో కూడా స్ప్రే కొట్టావని మీనా శృతి చేసిన తప్పును గుర్తు చేస్తుంది.
నాకు తెలియక చేశానని శృతి చెబుతుంది. అసలు మామ సత్యం హెల్త్ హిస్టరీ తనకు తెలియకపోవడం వల్లే ఇలా స్ప్రే కొట్టానని, తెలిసి చేయలేదు కదా అని తన వెర్షన్ చెప్పే ప్రయత్నం చేస్తుంది. కానీ రవి మాత్రం తన ఏదేమైనా నువ్వు చేసిందీ తప్పేనని అంటాడు. చదువుకున్న దానివేగా ఈ మాత్రం బేసిక్ సెన్స్ లేకపోతే ఎలా అని అంటాడు. దాంతో శృతికి ఇంకా కోపం వస్తుంది.. తనకు చేసింది ఏమాత్రం తప్పుకాదని, తెలియక చేశాను కాబట్టి అది పొరపాటే అవుతుందని చెబుతుంది. ఇక ఆ వెంటనే వెళ్లి మామ సత్యానికి క్షమాపణలు చెబుతుంది అంతటితో సమస్య సర్దుమణుగుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మే 3వ తేదీ 415 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

సత్యం ఆస్పత్రి నుంచి తిరిగి ఇంటి క్షేమంగా వస్తాడు. డాక్టర్లు ఆయనకు దోమల స్ప్రేలు, దట్టమైన పొగ పడదని, శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారి అతని ప్రాణాలకే ప్రమాదం ఉంటుందని చెబుతారు. ఇంకోసారి ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని చెప్పి హెచ్చరిస్తారు. దాంతో బాలు తన తండ్రిని హాలులో కాకుండా తన గదిలో పడుకోమని చెబుతాడు. ఇక మీనా కూడా ఆ గదిని శుభ్రం చేసి మామ సత్యం పడుకునేందుకు ఏర్పాట్లు చేస్తుంది. ప్రభావతి కూడా అదే గదిలో ఉంటుంది. దీంతో బాలు మీనా హాలులోనే పడుకుంటారు. అయితే దీనికంటే ముందు బాలుకు ఓ నిజం తెలుస్తుంది.
పసర్లపూడి గ్రామంలో ఉంటున్న తన నాయనమ్మ సుశీలమ్మకు బాలు, మీనా మళ్లీ పెళ్లి చేసుకున్న ఫొటోలను పంపిస్తారు. అవి చూసిన సుశీలమ్మ తిరిగి ఫోన్ చేసి చాలా చక్కగా ఉందని, చూడ ముచ్చటగా ఉన్నారని చెబుతుంది. మీరు ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలని దీవిస్తుంది. ఆ వెంటనే ఊర్లో కుటుంబ మొత్తం కలిసి దిగిన ఒక ఫొటోను పంపించమని అడుతుంది. దాంతో బాలు సరేనని పంపిస్తాడు. ఇక ఆ మాటలు విన్న సత్యం.. మనకు కూడా ఒక ఫ్రేమ్ కట్టించుకు రారా అని బాలుకు చెబుతాడు. దాంతో బాలు సరే అని చెప్పి తమ ఫ్యామిలీ ఫొటో ఫ్రేమ్ కట్టించేందుకు ఫొటో షాపునకు వెళ్తాడు.
అక్కడ తమ ఫ్యామిలీ ఫొటోను చూపించి ఒక ఫ్రేమ్ కట్టమని ఆర్డర్ ఇస్తాడు. అయితే అక్కడ బాలుకు ఒక నిజం తెలుస్తుంది. వారి ఫ్యామిలీ ఫొటోను చూసిన డిజైనర్ ఈ కుటుంబ సభ్యులంతా మీ వాళ్లేనా అని అడుగుతాడు. అందుకు బాలు అవునని సమాధానం ఇస్తాడు. ఈ అమ్మ ఎవరని అడగ్గా మా అమ్మ ప్రభావతి అని బదులిస్తాడు. దాంతో బాలుకు తమ షాప్ సీసీ టీవీ ఫుటేజీలో రికార్డు అయిన ఒక వీడియోను చూపిస్తాడు.. అందులో ప్రభావతి వీధిలో నడుచుకుంటూ వస్తుంటే ఇద్దరు బైక్ పై నుంచి వచ్చి ప్రభావతి బ్యాగ్ ను కొట్టేస్తారు. ఆ ఇద్దరిలో మీనా తమ్ముడు కూడా ఉంటాడు. అది చూసిన బాలు ఒక్కసారిగా షాక్ అవుతాడు.
ఇక షాపు నుంచి తిరిగి తన కార్ షెల్టర్ దగ్గరకు వెళ్తుంది. అక్కడికి బాలు ఫ్రెండ్ రాజేష్ కు కారు ఫైనాన్స్ ఇచ్చిన గుణ వస్తాడు. గుణతో పాటు మీనా వాళ్ల తమ్ముడు కూడా వస్తాడు. ఇక నెలనెల వడ్డీ కట్టలేదని గుణ రాజేష్ ను ఇబ్బంది పెడుతాడు. సరిగా డబ్బులు కట్టతెలియడం లేదా అని కోపగించుకుంటాడు. అంతటితో ఆగకుండా రాజేష్ కార్ తాళంచెవి లాక్కునేందుకు ప్రయత్నిస్తాడు. రాజేష్ సర్ది చెప్పే ప్రయత్నం చేస్తుంటే గుణ ఆవేశంలో రాజేష్ పై చేయి చేసుకుంటాడు. అది చూసిన బాలు వచ్చి రాజేష్ ను కొడుతున్న గుణను అడ్డుకుంటాడు. తిరిగి దాడి చేస్తాడు. దీంతో గుణపై చేయి వేస్తే బాగుండదని మీనా తమ్ముడు బాలుపై తిరగబడతాడు.
బామ్మర్ది అయ్యి ఉండి కూడా గుణ గాడి కోసం తనకు ఎదురుతిరగడంతో మీనా తమ్ముడిపై బాలుకు ఇంకా కోపం వస్తుంది. నాకే ఎదురు తిరుగుతావా? అని బాలు మీనా తమ్ముడిని చితక బాదుతాడు. ఒక్కసారిగా పైకి లేపి కారుపైకి ఎత్తేత్తాడు. గుణ కూడా బాలును కొట్టే ప్రయత్నం చేస్తాడు. కానీ అక్కడి కారు డ్రైవర్లు అందరూ వచ్చి అడ్డుకుంటారు. అంతే కాకుండా బాలు ఫోటో స్టూడియోలో వారి దొంగతనం వీడియోను చూసిన విషయాన్ని చెబుతాడు. దాంతో గుణ, మీనా తమ్ముడు బెదిరిపోతారు. మరోవైపు డ్రైవర్లు కూడా అడ్డుకోవడం ఇరువైపులా ఆగుతారు.
రాజేశ్ కూడా ఒకటి రెండ్రోజుల్లో డబ్బులు తిరిగి చెల్లిస్తానని చెబుతాడు. ఇక అంతటి ఆ ఘర్షణ ఆగుతుంది. ఇక రాజేష్ దగ్గర డబ్బులు తీసుకున్నందుకునే ఇప్పుడిలా జరిగిందని బాలు కాస్తా బాధపడుతాడు. రాజేష్ అలా ఏం కాదులేరా అని బదులిస్తాడు. ఇక ఇంటికి వెళ్లిన తర్వాత బాలు మీనాకు జరిగిన విషయం చెబుతాడా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మరోవైపు బాలు గదిని ఇప్పుడు తల్లిదండ్రులు సత్యం, ప్రభావతికి ఇవ్వడంతో బాలు, మీనా ఎక్కడ పడుకుంటారు? అనేది కూడా ఇంట్రెస్ట్ ను క్రియేట్ చేస్తోంది. అప్పటికే బాలు మీనాను ఇంట్లో నుంచి వెళ్ల గొట్టాలని చూస్తున్న ప్రభావతికి ఇది అవకాశం అయ్యిందా? లేక మీనా, బాలు అడ్జస్ట్ అయ్యి హాలులోనే ఉండేందుకు ఒప్పుకుంటారా? అన్నది కూడా వేచి చూడాలి. మరోవైపు మీనా తమ్ముడి దొంగతనం, పైగా రాజేష్ పై దాడి, గుణతో గొడవ వంటి ఘటనల నేపథ్యంలో బాలు మీనాల మధ్య ఎలాంటి సమస్యలు వస్తాయోననేది ఉత్కంఠగా మారింది.


Click it and Unblock the Notifications











