Gunde Ninda Gudi Gantalu May 5th: మీనాపై బాలు కోపం.. కోడలుపై రెచ్చిపోయిన ప్రభావతి
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మే 2వ తేదీ 414వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇంటికి తిరిగి వచ్చిన సత్యంకు బాలు తన రూమ్ ను ఇస్తాడు. ఆ తర్వాత శృతి రవి మధ్య ఘర్షణ జరుగుతుంది. నవ్వు చదువుకొని కూడా ఇలా చేశావేంటని రవి శృతిపై మండిపడుతుంది. మీ నాన్న హెల్త్ హిస్టరీ నాకు తెలియదు కదా.. అప్పుడు స్ప్రే చేస్తే తప్పేం ఉందని అనుకున్నాను. నాకు తెలిసి చేయలేదు. అప్పు నా తప్పేం లేదని శృతి అంటుంది. దాంతో రవి ఎవ్వరూ ఏమైపోయినా పర్లేదు నువ్వు మాత్రం ఎవ్వరి ఎమోషన్స్ పట్టించుకోవు అని అంటాడు. ఇక వెంటనే శృతి మామ సత్యం దగ్గరకు వెళ్లి క్షమాపణలు కోరుతుంది. అంతటి సమస్య సద్దుమణుగుతుంది.
ఆ తర్వాత సుశీలమ్మ ఫోన్ చేసి అందరి యోగా క్షేమాలు అడుగుతుంది. ఈ క్రమంలో బాలు, మీనాల మళ్లి పెళ్లి ఫొటోలను చూసి బాగుందని చెబుతుంది. అలాగే ఉగాదికి వెళ్లిన ఫొటోలను పంపించురా అని బాలును ఫోన్ లో అడుగుతుంది. అందుకు బాలు సరేనని అంటాడు. అదే సమయంలో మన ఇంట్లో కూడా పెట్టుకోవడానికి కుటుంబ సభ్యులందరూ ఉన్న ఒక ఫొటోను ప్రేమ్ కట్టించుకోని తీసుకురా బాలు అని సత్యం చెబుతాడు. దాంతో బాలు ఫొటో ఫ్రేమ్ కట్టించేందుకు షాప్ కు వెళ్తాడు. అక్కడ విస్తుపోయే నిజాలు తెలుసుకుంటాడు. ఆ తర్వాత మీనా తమ్ముడుని చితకబాదుతాడు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందనేది ఇప్పుడు నెక్ట్స్ ఎపిసోడ్ లో ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక మే 5వ తేదీ 415 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

తన పెళ్లి ఫొటోతో పాటు ఉగాదికి సుశీలమ్మ గ్రామానికి వెళ్లిన సమయంలో తీసుకున్న ఫొటోలను ఫ్రేమ్ కట్టించేందుకు బాలు బయటికి వెళ్తాడు. తన తనకు తెలిసిన ఫొటో స్టూడియోలో ఆ ఫొటో ఫ్రేమ్ ను కట్టించేందుకు ప్రయత్నిస్తాడు. స్టూడియోకు వెళ్తాడు. అక్కడ బాలుకు తెలిసిన వ్యక్తికి ఆ రెండు ఫొటోలు చూపించి పెద్ద సైజ్ లో ఫ్రేమ్ లు కట్టించి ఇవ్వు అని బాలు చెబుతాడు. అందుకు ఆ అబ్బాయి సరే అన్న అని బాలు చూపించిన ఫొటోలను క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. అయితే బాలు, మీనా ఉన్న ఫొటో కాకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి ఉన్న ఫొటోను చూసి ఆ స్టూడియో అతను షాక్ అవుతాడు. వెంటనే ప్రభావతిని చూపిస్తూ ఈవిడ మీ అమ్మనేనా అన్న అని బాలును అడుగుతాడు. అందుకు బాలు అవునని అంటాడు.
దాంతో వెంటనే అతను ఒక వీడియోను చూపిస్తాడు. అందులో ప్రభావతి చేతిలో బ్యాగ్ పట్టుకొని ఆ స్టూడియో ముందు నుంచి వెళ్తూ ఉంటుంది. అదే సమయంలో ఇద్దరు యువకులు బైక్ మీద వచ్చి ప్రభావతి బ్యాగ్ కొట్టేసి అందులోని డబ్బులను లాక్కెళ్లిపోతారు. అది చూసిన బాలు షాక్ అవుతాడు. వాళ్లు ఎవరిని ఈ వీడియో ఎక్కడిదని బాలు ప్రశ్నిస్తాడు. దాంతో ఆ షాప్ అతను స్పందిస్తూ తన స్టూడియో ముందు ఉన్న సీసీ టీవీ కెమెరాలో రికార్డు అయ్యిందని, మరో వీడియో బిల్డింగ్ వెకకాల కూడా ఉందని చెబుతాడు. ఆ వీడియోను ఓపెన్ చేసి చూపించడంతో బాలు ఆశ్చర్యపోతాడు. ఆ వీడియోలో బైక్ మీద కొట్టేసిన డబ్బులతో మీనా తమ్ముడు శివ కనిపిస్తాడు. దీంతో వెంటనే ఆ వీడియోను తన ఫోన్ లోకి పంపించమని చెబుతాడు.
ఇంకెవ్వరికీ ఈ విషయం చెప్పకూ అని అక్కడి నుంచి నేరుగా శివ కాలేజీకి వెళ్తాడు. తన తల్లి గతంలో వడ్డీ డబ్బులను ఎవరో కొట్టేశారని చెబితే నమ్మలేదని, కానీ అది నిజమేనని అర్థం చేసుకుంటాడు. ఈ శివ ఇంకా మారకుండా ఇలానే తిరుగుతున్నాడా? అని అనుకుంటూ ఉంటాడు. ఇక శివను కలిసి మాట్లాడుతుదాం అని కాలేజీకి వెళ్లితే అక్కడ ఉండడు. మూడు నెలలుగా కాలేజీకి సరిగా రావడం లేదని అతని స్నేహితులు చెబుతారు. దాంతో నేరుగా మీనా వాళ్ల ఇంటికి వెళ్తాడు. అక్కడ అత్త, మరదలు ఉంటారు. శివ ఇంట్లో ఉండడు. ఇంట్లో వారి యోగా క్షేమాలు అడిగి శివ లేడా? అని బాలు ప్రశ్నిస్తాడు. కాలేజీకి వెళ్లాడని, అలాగే పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తూ బుద్దిగా ఉంటున్నాడని శివ తల్లి చెబుతుంది. చెడు తిరుగుళ్లు తిరగడం లేదని ఇంటి బాధ్యతలను తెలుసుకొని ప్రవర్తిస్తున్నాడని బాలుకు చెబుతుంది మీనా తల్లి.
ఇక శివపైన అన్ని ఆశలు పెట్టుకున్న వారికి శివ దొంగతనం చేసిన విషయాన్ని చెప్పలేకపోతాడు. అక్కడి నుంచి తన కార్ స్టాండ్ కు వెళ్తాడు. బాలు వెళ్లే సరికే అక్కడ తన స్నేహితుడు రాజేశ్ ను ఫైనాన్షియర్ గుణ వచ్చి కొడుతూ ఉంటాడు. వడ్డీ డబ్బులు ఇవ్వలేదని, సమయం కట్టాలని తెలియదా అని నానా మాటలు మాట్లాడుతాడు. ఈ క్రమంలో రాజేశ్ గుణపై చేయి చేసుకుంటాడు. ఆ వెంటనే గుణకు సపోర్ట్ గా శివ వస్తాడు. ఇద్దరు కలిసి రాజేశ్ ను కొట్టబోతుంటే.. బాలు వచ్చి అడ్డుకుంటాడు. గుణను కొడుతూ ఉంటాడు. ఇక శివ గుణకు సపోర్ట్ ఇస్తూ అతనిపై చేయి పడితే బావవి అని కూడా చూడను అని బాలు గల్లా పట్టుకుంటాడు. చిర్రెత్తిపోయిన బాలు శివను పైకి లేపి నెలకు విసిరేస్తాడు. అతి చేయడంతో చేయి మెలిపెట్టి విరిచేయ బోతాడు. అదే సమయంలో మీనా గుర్తుకు వచ్చి వదిలేస్తాడు.
ఇక శివ ఇంటికి వెళ్తాడు. బయటికి వెళ్లి ఒక పనిచేసుకొని రమ్మని తన చెల్లి వచ్చి చేయిని లాగుతుంది. దాంతో శివ కేకలు వేస్తాడు. నొప్పి నొప్పి అంటూ ఏడుస్తాడు. వెంటనే అతన్ని ఆస్పత్రికి తీసుకెళ్తూ ఉంటారు. ఇక ఈ విషయం మీనాకు తెలుస్తుంది. ఆస్పత్రికి వెళ్తుంది. మరోవైపు బాలుకు కూడా చెప్పి రమ్మని అంటుంది. కానీ బాలు నాకు పని ఉందని చెప్పి ఇంట్లోనే ఉంటాడు. తిరిగి వచ్చిన మీనా బాలును ఇంట్లోనే చూసి ఏమైందని అడుతుంది. వాడికి దెబ్బలు తగలలేదు. వాడు చేస్తున్న పనికి ఇలానే అవుతుందని అంటాడు. కోపంతో రగిలిపోతాడు. శివ ఏం చేశాడని ప్రభావతి గుచ్చిగుచ్చి అడుగుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











