Gunde Ninda Gudi Gantalu May 6th: శివ అంతుచూసిన బాలు.. తమ్ముడి వల్ల మీనాకు తలనొప్పి
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మే 5వ తేదీ 415వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. తమ రెండో పెళ్లి ఫొటోలు, ఫ్యామిలీ ఫొటోలను ఫ్రేమ్ కట్టించేందుకు వెళ్లిన బాలుకు షాకింగ్ విషయం తెలుస్తుంది. మీనా తమ్ముడు శివ తన తల్లి ప్రభావతి బ్యాగ్ ను దొంగలించిన వీడియోను చూస్తాడు. దాంతో వెంటనే బామ్మర్ది శివ కోసమని అత్తగారి ఇంటికి వెళ్తాడు. అక్కడ శివ ఉండడు. ఇక శివ దొంగతనం గురించి మీనా అమ్మకు చెప్పాలని అనుకుంటాడు. కానీ వారు అతని గురించి గొప్పగా చెప్పడంతో సైలెంట్ అవుతాడు. అక్కడి నుంచి తన కార్ స్టాండ్ కు వెళ్తాడు. అక్కడ బాలు స్నేహితుడు రాజేశ్ ను ఫైనాన్షియర్ గుణ వచ్చి వడ్డీ డబ్బులు ఇవ్వలేదని దాడి చేస్తాడు. అదే సమయంలో బాలు వెళ్లి అడ్డుకుంటాడు.
అయితే అక్కడికి గుణకు సపోర్ట్ గా బాలు బామర్ది శివ కూడా వస్తాడు. గుణను బాలు కొడుతూ ఉండగా శివ గుణకు సపోర్ట్ ఇస్తూ అతనిపై చేయి పడితే బావవని కూడా చూడను బాలు కాలర్ పట్టుకుంటాడు. చిర్రెత్తిపోయిన బాలు శివను పైకి లేపి నెలకు విసిరేస్తాడు. అతి చేయడంతో చేయి మెలిపెట్టి విరిచేయ బోతాడు. మీనా గుర్తుకు వచ్చి ఆగుతాడు. తర్వాత శివ ఇంటికి వెళ్తాడు. చేయి నొప్పి గురించి తెలుసుకొని ఆస్పత్రికి తీసుకెళ్తారు. ఈ విషయం మీనాకు కూడా తెలియడంతో వెంటనే బాలుకు ఫోన్ చేసి శివకు చెయి విరిగిందని, వెళ్లాలని రమ్మంటుంది. కానీ అప్పటికే మండిపోతున్న బాలు తనకు ట్రిప్స్ ఉన్నాయని చెప్పి ఇంట్లోనే ఉంటాడు. మీనా ఒక్కతే వెళ్లి తిరిగి వస్తుంది. వచ్చే సరికి బాలు ఇంట్లోనే కనిపిస్తాడు. దీంతో బాలు ఇదేంటనీ ప్రశ్నిస్తుంది. ఆ తర్వాత బాలు ఏమని బదులిచ్చాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మే 6వ తేదీ 416 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

మీనా తమ్ముడు శివను ఆస్పత్రికి తీసుకెళ్తారు. అక్కడ డాక్టర్ పరీక్షించి ఏమైందని అడుగుతాడు. శివ మాత్రం బైక్ మీద నుంచి కింద పడ్డానని చెబుతాడు. విపరీతంగా నొప్పి వస్తుందని అంటాడు. ఇక డాక్టర్ సరిగా ఏమైందో చెప్పమని, లేదంటే ట్రీట్ ెమెంట్ చేయడం కష్టమని అంటాడు. అప్పటికి కూడా శివ నిజం చెప్పడు. బైక్ మీద వెళ్లి కారు గుద్దుకున్నానని చెబుతాడు. డాక్టర్ ఇంకా గుచ్చి గుచ్చి అడుగుతుంటే నొప్పి నొప్పి అని అరుస్తాడు. ెక్కడ వాళ్ల అమ్మ, చెల్లి, అక్కా మీనాకు నిజం తెలిసి పోతుందోనని భయపడుతాడు. ఇక మీనా శివకు గాయమైందన్న విషయం తెలుసుకుని ఆస్పత్రికి వస్తుంది. ఏం జరిగిందని, ఎలా జరగిందని అడుగుతుంది. కంగారు పడుతూ శివతో మాట్లాడుతూ ఉంటుంది.
ఇప్పటి వరకు మన ఇంట్లో వారు ఎవరూ ఆస్పత్రికి రాకుండా అమ్మ మనల్ని జాగ్రత్తగా కాపాడుకుందని శివతో అంటుంది. అలాంటి ఇలా యాక్సిడెంట్ అయ్యి ఆస్పత్రి పాలవడం ఏమాత్రం బాగా లేదని చెబుతుంది. నేనేమీ కావాలని బైక్ మీద నుంచి పడలేదు కదా అని శివ బదులిస్తాడు. కానీ నిన్ను ఇలా చూసి అమ్మ, మేము తట్టుకోలేక పోతున్నాము అని మీనా బదులిస్తుంది. మన ఇంటికి ఉన్న ఒకే ఒక్క మొగ దిక్కువు నువ్వే కదా అని అర్థమయ్యేలా చెబుతుంది. ఆ వెంటనే బయటికి జ్యూస్ తీసుకొని రావడానికి వెళ్లుంది. అదే సమయంలో బాలుకు కూడా ఫోన్ చేసి శివ ఆస్పత్రిలో చేరిన విషయం చెబుతుంది. వెంటనే వాళ్ల అమ్మగారి ఇంటి పక్కన ఉన్న ఆస్పత్రికి రమ్మని అడుగుతుంది.
కానీ అందుకు బాలు రాలేనని చెబుతాడు. ఒక లాంగ్ ట్రిప్ పడిందని, తను తిరిగి వచ్చే వరకు రాత్రి అవుతుందని మీనాతో అంటాడు. దాంతో మీనా షాక్ అవుతుంది. ఇదేంటి ఇలా మాట్లాడుతున్నారని బాలుతో అంటుంది. ఇంకెలా మాట్లాడాలి. వాడు అస్సలు ఎక్కడ తిరుగుతున్నాడు? ఏం చేస్తున్నాడనే విషయాలను పట్టించుకోవడమే మానేశారు. అందుకే వాడికి ఇలా జరిగిందని అంటాడు. వాడికి యాక్సిడెంట్ అయితే నేను వచ్చి ఏం చేయాలని అంటాడు. దాంతో మీనా బాధ పడుతుంది. సొంత తమ్ముడు ఆస్పత్రిలో ఉన్నాడంటే ఇలా మాట్లాడుతున్నారంటూ కోపం తెచ్చుకుంటుంది. ఇక తిరిగి ఆస్పత్రికి వెళ్తుంది. ఆస్పత్రిలో ఇంకా రిపోర్ట్ రావడానికి ఆలస్యం కావడంతో మీనా రాత్రి వరకు అక్కడే ఉంటానని చెబుతుంది.
అయితే, బాలుకు అక్క మీనా ఫోన్ చేసిన సంగతి తెలుసుకున్న శివ కంగారు పడుతాడు. బాలు బావ ఏమైనా చెప్పాడా? అని అక్కను అడుగుతాడు. దేని గురించిరా అని మీనా అడుగుతుంది. ఇలా ఆస్పత్రికి వచ్చాము కదా.. దీని గురించి అని అంటాడు. ఏమీ లేదు. ఆయన రాలేనని చెప్పాడు. ఇలా జరిగినందుకు ఫీల్ అవుతున్నాడని చెబుతుంది. ఇక అంతకు ముందు బాలు తన దగ్గరున్న శివ దొంగతనం వీడియోను డిలీట్ చేయాలని అనుకుంటాడు. ఆ వీడియో చూస్తే అమ్మ ప్రభావతి మీనాను ఇంట్లో ఉండనివ్వదనే ఆలోచనతో డిలీట్ చేద్దామని తన స్నేహితుడు రాజేశ్ తో అంటాడు. అయితే రాజేశ్ మాత్రం ఆ వీడియో ఉండాలని, దాన్ని చూపించి శివను దారిలో పెట్టే అవకాశం ఉందని చెబుతాడు. ఎప్పుడైనా సాక్ష్యం కావాలంటే ఇది చూపించొచ్చు అని సలహానిస్తాడు. దాంతో బాలు కూడా ఆ వీడియోను తన ఫోన్ లోనే ఉంచుతాడు.
ఇక మీనా ఇంటికి తిరిగి వెళ్తుంది. వెళ్లగానే సత్యం ఏమైందని, శివకు ఎలా ఉందని అడుగుతాడు. దాంతో మీనా ఇంకా ఆస్పత్రిలోనే ఉన్నాడని చెబుతుంది. ఆస్పత్రి ఖర్చులకు ఏమైనా డబ్బులు కావాలంటే అడుగు అంటాడు సత్యం. దానికి ప్రభావతి ఆ మొత్తం ఊడ్చి ఇవ్వండని తన బుద్ధిచూపిస్తుంది. అందుకు మీనా నేను నా మొగుడిని అడగలేదు. ఇంకా మిమ్మల్ని ఎందుకు అడుగుతానని బదులిస్తాడు. అలోపే బాలు కిందికి దిగి వస్తాడు. మీనా బాలును చూసి మీరు ఇంట్లోనే ఉన్నారా? ఆస్పత్రికి ఎందుకు రాలేదు, ఒక్కరోజు ట్రిప్ కు వెళ్లకపోతే ఏం జరుగుతుందని అంటుంది. దాంతో బాలు నేను ఆస్పత్రికి వచ్చి అడిగితేనే వాడికి తగ్గుతుందా? వాడు ఎవరితో పనిచేస్తున్నాడో, ఎక్కడ పనిచేస్తున్నాడో చూస్తున్నారా? అని మీనాను ప్రశ్నిస్తాడు. అసలు శివగాడు చేసిన పనికి... అంటూ పిడికిలి బిగిస్తాడు. దీంతో ఏం జరిగిందని మీనా బాలును అడుగుతుంది... ఇక బాలు నిజం చెప్పాడా లేదా అన్నది తరువాత ఎపిసోడ్ కు వాయిదా పడింది. మరోవైపు ప్రోమోలో బాలును మీనా అపర్థం చేసుకుంటుంది. దీంతో వీరిద్దరి మధ్య మనస్ఫార్థాలు ఏర్పడుతాయని చూపించడం నెక్ట్స్ ఎపిసోడ్ పై మరింత ఆసక్తిని పెంచుతోంది.


Click it and Unblock the Notifications











