Gunde Ninda Gudi Gantalu May 7th: బాలును నిలదీసిన మీనా.. శివ అబద్ధంతో వాదిద్దరి మధ్య గొడవలు

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మే 5వ తేదీ 416వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మీనా తమ్ముడు శివను ఆస్పత్రికి చేర్పిస్తారు. అక్కడ అతని ట్రీట్ మెంట్ జరుగుతుంది. అదే విషయాన్ని మీనా బాలుకు చెబుతుంది. శివకు గాయమైందని ఆస్పత్రికి రమ్మని అడుగుతుంది. కానీ బాలు తనకు అర్జంట్ రైడ్ పడింది. రాలేనని బదులిస్తాడు. అయ్యాక రమ్మని మీనా అడిగితే.. లాంగ్ రైడ్ పడిందని, వచ్చే సరికి రాత్రి అవుతందని చెప్పి తప్పించుకుంటాడు. శివ చేసిన పనికి రగిలిపోతూ మీనాపై అరుస్తాడు. ఇక ఆస్పత్రి నుంచి తిరిగి ఇంటి వస్తుంది. అయితే మీనా ఇంటికి వచ్చే సరికి బాలు ఇంట్లోనే కనిపిస్తాడు. అదేంటీ రైడ్ కు వెళ్తున్నానని చెప్పారు. ఆస్పత్రికి రావొచ్చు కదా అని ప్రశ్నిస్తుంది. దాంతో బాలు నేను ఎందుకు రావాలి? నేను రాకపోతే వాడికి చికిత్స జరగదా? నేను అడిగితే త్వరగా కోలుకుంటాడా? అని బాలు మీనాపై మండిపడుతాడు. దాంతో మీనాతో పాటు ఇంట్లో వాళ్లందరూ షాక్ అవుతారు.

ఎవ్వరికీ ఆపద వచ్చినా వెంటనే వెళ్లే బాలు, తన భార్య మీనా తమ్ముడు శివకు గాయమై ఆస్పత్రిలో ఉన్నా ఎందుకు వెళ్లలేదని సందేహిస్తారు. అసలు ఏం జరిగిందని అందరూ బాలును అడుగుతారు. దాంతో బాలు ఇంకా కోపంతో రగిలిపోతాడు. అసలు వాడు చేసిన పనికి చేయి విరగడం కాదు అంటూ.. రగిలిపోతాడు. దీంతో ప్రభావతి వాడు ఏం చేశాడో చెప్పు అని అడుగుతుంది. మరోవైపు ఆస్పత్రిలో డాక్టర్ శివకు యాక్సిడెంట్ కాలేదని, ఎవరో శివను కావాలని కొట్టిన దెబ్బలవి అని చెబుతాడు. దీంతో మీనా వెళ్లి బాలును నిలదీస్తుంది... ఇక ఆ తర్వాత బాలు ఎలా బదులిచ్చాడనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. శివ దొంగతనం చేశాడని, తన కాలర్ పట్టుకున్నాడని మీనాకు చెబుతాడా? లేదా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మే 7వ తేదీ 417 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 417 May 7th

శివకు యాక్సిడెంట్ అవ్వడంతో ఆస్ప్రతిలో చికిత్స పొందుతూ ఉంటాడు. ఓ వైపు మీనా మరోవైపు తల్లి, చెల్లి ఎంతగానో బాధ పడుతూ ఉంటారు. శివకు ఇలా అయ్యిందేంటనీ ఏడుస్తూ కూర్చుంటారు. డాక్టర్లు ఇచ్చే రిపోర్ట్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ముఖ్యంగా శివకు చేయి బాగా నొప్పిగా ఉండటంతో అసలు ఏం జరిగందని అందరూ సందేహంలో ఉన్నారు. అయితే శివ మాత్రం ఫైనాన్షియర్ గుణకు మద్దతుగా వెళ్లినందుకు బాలుతో గొడవ జరిగిందని, బాలు కాలర్ పట్టుకున్న విషయాన్ని ఎవ్వరికీ చెప్పలేదు. ముఖ్యంగా బాలు కూడా ఇంకా శివ చేసిన దొంగతనం గురించి ఇంట్లో మీనాకు, అత్తగారి అస్సలు చెప్పలేదు. ఆ విషయం తెలిస్తే ఎక్కడ ఎలాంటి సమస్య వస్తుందోనని భయంతో ఆగిపోయాడు.

ఇక బాలు ఎలాగైనా శివను మంచి మార్గంలో నడిపించాలని భావిస్తాడు. ఆస్పత్రిలో చేర్పించిన రోజు మీనా పిలిచినా కూడా వెళ్లకపోవడంతో మరోసుటి రోజు వెళ్తాడు. అది కూడా శివను చూసేందుకు కాకుండా తను చేస్తున్న పనులన్నీ మంచివి కాదని, ఆ గుణ గాడితో తిరిగితే జీవితం నాశనం అవుతుందని హెచ్చరించడానికి వెళ్తాడు. ఆస్పత్రికి వెళ్లి శివను కలుస్తాడు. వెంటనే శివ బాలును చూసి కంగారు పడుతాడు. మరోవైపు పొగరు కూడా చూపిస్తాడు. బాలును చూసి ఈసారి మళ్లీ ఏం విరగ్గొడుదామని వచ్చావంటూ ప్రశ్నిస్తాడు. అందుకు బాలు రేయ్ నువ్వు చేసిన పనికి ఏం విరగ్గొట్టినా పాపం లేదని అంటాడు. నువ్వు చేసే పనులు ఏమాత్రం బాగా లేవని హెచ్చరిస్తాడు. అందుకు శివ బాలుకు ఇంకా వ్యతిరేకంగా మాట్లాడుతాడు.

నేను చేసే పనులు ఏం బాగాలేవు చెప్పు అని అడుగుతాడు. నువ్వు నీ స్నేహితుడు రాజేష్ కు మద్దుతు నిచ్చినట్టుగానే నేను నా ఫ్రెండ్ గుణకు సపోర్ట్ చేశాను. నువ్వు నా ఫ్రెండ్ ను కొట్టినప్పుడు లేని తప్పు నీ నిన్ను అడ్డుకుంటే ఎలా వచ్చిందని తిరిగి ప్రశ్నిస్తాడు. అందుకు బాలు ఇంకా చిర్రెత్తిపోతాడు. అసలు నేను నిన్ను కొట్టింది గుణగాడికి సపోర్ట్ చేసినందుకు కాదురా.. నువ్వు చేసిన ఇంకో పనికి గాను నీకోసం వెతుకుతూనే ఉన్నాను. అదే సమయంలో నువ్వే నాకు ఎదురు పడ్డావు. అసలు నీ వయస్సెంత నువ్వుంతరా... పెద్దలకు ఎదురించి మాట్లాడుతున్నావ్ పిల్ల బచ్చా అంటూ కోపం చేస్తాడు. శివ కూడా అంతటితో ఆగకుండా రెచ్చిపోయి మాట్లాడుతాడు. నా తప్పేం ఉందని, నాకోసం వెతకాల్సిన పని ఏముందని ప్రశ్నిస్తాడు.

దాంతో బాలు రెచ్చిపోయి బామ్మర్ది శివ చేసిన తప్పును చెప్పేస్తాడు. బాలుకు దొరికిన శివ దొంగతనం వీడియోను చూపిస్తాడు. ఆ వీడియోలో బాలు తల్లి ప్రభావతి బ్యాగ్ ను శివ దొంగలించినట్టుగా రుజువు కావడంతో శివ కంగారు పడుతాడు. ఈ విషయం మీ అక్క మీనాకు, మీ అమ్మ, చెల్లికి తెలిస్తే ఏం జరుగుతుందో తెలుసా.. నిన్ను మనిషిలాగా కూడా చూడరు అంటూ మందలిస్తాడు. అయినా శివ ఏమాత్రం తగ్గడు. నేను చేసిన దొంగతనానికి ఏమాత్రం సిగ్గు పడలేదు. అది అసలు నా దృష్టిలో తప్పే కాదు. ఒకసారి మీ ఇంటికి వస్తే మీ అమ్మ, అన్న నన్ను దొంగ అంటూ బ్యాగ్ మొత్తం సదిరి చూశారు. అప్పుడు నాకు ఎంతో అవమానంగా అనిపించింది. అందుకే మీ అమ్మ బ్యాగ్ దొంగలించానని చెబుతాడు శివ.

మీ అమ్మ, అన్న నన్ను అవమానించినందుకు నేనే బ్యాగ్ దొంగలించాను. ఇక నేను చేసిన దొంగతనం వీడియో చూసి నువ్వు నా చెయ్యి విరగొట్టావు. చెల్లుకు చెల్లు అయ్యింది. ఇక వెళ్లు అని చాలా నిర్లక్ష్యంగా మాట్లాడుతాడు. దాంతో బాలు గట్టిగా అరుస్తాడు. కొట్టడానికి వెళ్తాడు. కానీ ఆస్పత్రిలో అందరూ చూస్తుండటంతో ఆగిపోతాడు. ఇక ఆస్పత్రిలో జరిగిన విషయం మొత్తం శివ తన ఫ్రెండ్, రౌడీ, ఫైనాన్షియర్ గుణకు చెబుతాడు. గుణ మీ బావ సంగతి చూసుకుంటానని చెబుతాడు. మరోవైపు బాలు ఆస్పత్రిలో శివ ప్రవర్తనను తన స్నేహితుడు రాజేశ్ కు చెబుతాడు. ఆవేశంలో మందు కూడా తాగుతాడు. ఇక మీనా ఆస్పత్రికి చేరుకుంటుంది. అలోపే డాక్టర్లు శివ చేయి విరిగిందని తేల్చుతారు. అందరూ కంగారు పడుతారు. మీనా శివతో మాట్లాడటానికి వెళ్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X