Gunde Ninda Gudi Gantalu May 8th: బాలుకు కోపం తెప్పించిన మీనా.. శివ దొంగబుద్ధికి గుణపాఠం

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మే 7వ తేదీ 417వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మీనా తమ్ముడు శివకు ఆస్ప్రతిలో చికిత్స అందుతోంది. బాలు శివను కొట్టాడనే విషయాన్ని శివ అటు అక్క మీనాకు గానీ, తల్లి, చెల్లి సుమతికి గానీ చెప్పకుండా దాచేశాడు. మరోవైపు బాలు కూడా శివ దొంగతనం చేస్తేనే కొట్టానని, శివ తన కాలర్ పట్టుకున్నాడని కూడా ఎవ్వరికీ చెప్పలేదు. ఒక బాలు స్నేహితుడు రాజేశ్ కు మాత్రం విషయం తెలుసు. కానీ ఇంత వరకు ఎవ్వరికీ చెప్పలేదు. ఇక బాలు శివను మంచి మార్గంలో నడిపించాలని ఆస్పత్రికి వెళ్లి మరీ హెచ్చరిస్తాడు. శివ బాలుతో పొగరుగా మాట్లాడుతాడు. బాలును చూసి ఈసారి మళ్లీ ఏం విరగ్గొడుదామని వచ్చావంటూ ప్రశ్నిస్తాడు. అందుకు బాలు రేయ్ నువ్వు చేసిన పనికి ఏం విరగ్గొట్టినా పాపం లేదని అంటాడు. అసలు నేను నిన్ను కొట్టింది దొంగతనం చేసినందుకు అని చెప్పి, వీడియోను కూడా చూపిస్తాడు.

ఆ వీడియోలో బాలు తల్లి ప్రభావతి బ్యాగ్ ను శివ దొంగలించినట్టుగా ఉంటుంది. దాంతో శివ కంగారు పడుతాడు. కానీ మాటల విషయంలో శివ ఏమాత్రం తగ్గడు. నేను చేసిన దొంగతనానికి ఏమాత్రం సిగ్గు పడలేదు. ఒకసారి మీ ఇంటికి వస్తే మీ అమ్మ, అన్న నన్ను దొంగ అంటూ బ్యాగ్ మొత్తం సదిరి చూశారు. అప్పుడు నాకు ఎంతో అవమానంగా అనిపించింది. అందుకే మీ అమ్మ బ్యాగ్ దొంగలించానని చెబుతాడు శివ. దాంతో బాలు ఇంకా కోపం చేస్తాడు. ఆస్పత్రిలో ఏం చేయలేక వెళ్లిపోతాడు. మరోవైపు మీనా తిరిగి ఆస్పత్రికి వస్తుంది. డాక్టర్లు శివకు చేయి ఎముక విరిగిందని నిర్ధారిస్తారు. ఆ తర్వాత మీనా ఏం చేస్తుందనే ఇప్పుడు ఆసక్తికంగా మారింది. ఇక మే 8వ తేదీ 418 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 418 May 8th

మీనా ఆస్పత్రికి చేరుకుంటుంది. అసలు శివకు ఏమైందని డాక్టర్ ను అడుగుతుంది. దాంతో శివ చేయి విరిగిందని చెబుతారు. వెంటనే ఆపరేషన్ కూడా చేయాలని డాక్టర్లు మీనా, సుమతికు, తల్లికి చెబుతారు. అందుకు 30 వేలు ఖర్చు అవుతుంది. వెంటనే ఆ ఏర్పాట్లు చూసుకోండి అంటారు. దాంతో ఆపరేషన్ డబ్బుల కోసం అందరూ ప్రయత్నిస్తారు. అయితే వాళ్ల దగ్గర సరిపోయేంత డబ్బులు ఉండవు. ఎలాగైనా మొత్తం డబ్బులు అరెంజ్ చేయాలని భావిస్తారు. కానీ కుదరు. తమ దగ్గర ఉన్న మొత్తం డబ్బులను పోగేసినా కేవలం 18 వేలే అవుతుంది. ఇక మిగిలిన డబ్బుల కోసం బాలు కూడా ఫోన్ చేస్తుంది మీనా. కానీ బాలు ఫోన్ ఆన్సర్ చేయడు. మళ్లీ మా తమ్ముడిని చూసేందుకు రాలేదంటూ తిడుతుందని ఫోన్ లిఫ్ట్ చేయడం మానేసి, కారులోనే పడుకుంటాడు.

ఇక డబ్బులు పోగు కాకపోవడంతో వెంటనే మీనా డాక్టర్ దగ్గరకు వెళ్లి సమస్యను వివరిస్తుంది. అందుకు డాక్టర్ బిల్లింగ్ ఇన్ స్టాల్ మెంట్ లో కట్టుకునే సౌకర్యం ఉందని, దానికి మీరేమీ టెన్షన్ పడాల్సిన పనిలేదని చెబుతాడు డాక్టర్. అలాగే శివకు ఏమైందో మీకు తెలుసా? అని మీనాను డాక్టర్ అడుగుతాడు. దానికి బైక్ యాక్సిడెంట్ అని చెప్పాడంటూ వివరిస్తుంది. అది విన్న డాక్టర్.. శివకు యాక్సిడెంట్ కాలేదని, ఎవరో కావాలని చేయి విరకొట్టారని, ఆ గాయాలు చూడటానికి అలానే ఉన్నాయని డాక్టర్ వివరిస్తాడు. దాంతో మీనా నేరుగా తమ్ముడు శివ దగ్గరకు వెళ్లి ఏం జరిగిందని అడుగుతుంది. నీకు చేయి ఎలా విరిగిందని ప్రశ్నిస్తుంది. అందుకు శివ తన స్నేహితుడి బైక్ మీద నుంచే కింద పడిపోయానని చెబుతాడు. కానీ మీనా గట్టిగా అడుగుతుంది. నాకు డాక్టర్ అంతా చెప్పాడని, నీ చేయి ఎవరో విరగ్గొట్టారని డాక్టర్ చెబుతున్నారని అంటుంది.

కానీ శివ లేదూ నా ఫ్రెండ్ బైక్ నుంచి కింద పడే చేయి విరగొట్టుకున్నానని మళ్లీ బదులిస్తాడు. మీనా వెంటనే నీ ఫ్రెండ్ ను వెంటనే ఇక్కడి రమ్మని అడుగుతుంది. అసలు నీ ఫ్రెండ్ ఎవరు? అని ప్రశ్నించగా.. చేసేదేమీ లేక శివ బాలుపై పచ్చి అబద్ధం చెబుతాడు. తన స్నేహితుడు ఎవరో కాదని, పైనాన్షియర్ గుణనే అంటాడు. దాంతో తల్లి, మీనా, చెల్లి అందరూ శివను తిడుతారు. గుణతో కలిసి తిరగొద్దని ఎన్ని సార్లు చెప్పినా వినిపించుకోవా? అని తిడుతాడు. అందుకు శివ స్పందిస్తూ గుణ మంచిగా మారాడాని, ఫైనాన్స్ కంపెనీ పెట్టుకొని రన్ చేస్తున్నాడని చెబుతాడు. అందులోనే డేటా ఎంట్రీగా పార్ట్ టైమ్ జాబ్ చేస్తున్నానని, అందరి దగ్గరి నుంచి నెలనెలా వడ్డీ వసూల్ చేయాల్సి ఉంటుందని చెబుతాడు.

అలాగే బాలు బావ ఫ్రెండ్ రాజేష్ కూడా వడ్డీ డబ్బులు ఇవ్వాలని, వెళ్లి అడిగితే మా ఇద్దరిని కొట్టారని చెబుతాడు. బావ తాగొచ్చి మరీ తన చేయి విరగొట్టారని, ఎంత బతిమిలాడినా వదలకుండా చితకొట్టాడని అబద్ధం చెబుతాడు. దాంతో మీనాకు భర్త బాలుపై కోపం పోరిగిపోతుంది. తన కొడుకును ఇంతలా కొట్టింది బాలు కాబట్టి ఏం చేయలేకపోతున్నానని, వేరే వాళ్లతై కాలర్ పట్టుకొని అడిగేదాన్ని అని తల్లి మీనాను అంటుంది. ఇక మీనా వెంటనే వెళ్లి బాలును నిలదీస్తుంది. ఎందుకు నా తమ్ముడిని కొట్టావని ప్రశ్నిస్తుంది. అందుకు బాలు ఎందుకు కొట్టానో వాడు చెప్పలేదా? అంటాడు. చెప్పాడు వాడు బతిమిలాడినా నువ్వు వదలలేదని, మమల్ని కొట్టినా, తిట్టినా అడిగే వారు లేరనే కదా అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు.

మా నాన్న చనిపోయినప్పుడే మా ధైర్యం చచ్చిపోయిందని మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇంతలో రాజేశ్ అసలు విషయం చెప్పేయ్ రా అని బాలుతో అంటాడు. మరోవైపు తను కూడా మీనాకు చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ బాలు వద్దని అడ్డుకుంటాడు. మీనా చెప్పండి అని ఎంతలా అడిగినా చెప్పబోరు. మళ్లీ శివ జీవితం ఏమైపోతుందోనని దొంగతనం నిజాన్ని దాచేస్తాడు. దాంతో మీనా బాలును నానా మాటలు అంటుంది. మొదటిసారిగా చిరాకు పడుతుంది. మరోవైపు బాలు మళ్లీ తాగినందుకు కూడా ఛీ కొట్టి వెళ్లిపోతుంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Take a Poll

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X