Gunde Ninda Gudi Gantalu May 9th: బాలు మీనా మధ్య గొడవలు.. ఇంట్లో నుంచి వెళ్లగొట్టేలా ప్రభావతి ప్లాన్

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మే 8వ తేదీ 418వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. తమ్ముడు శివకు చికిత్స జరుగుతుండటంతో మీనా ఆస్పత్రికి వెళ్తుంది. అసలు శివకు ఏమైందని డాక్టర్ ను అడిగి తెలుసుకుంది. చేయి విరిగిందని, ఆపరేషన్ చేయాలని చెబుతారు. అందుకు 30 వేలు ఖర్చు అవుతుందని వివరిస్తారు. ఆ డబ్బులను ఏర్పాటు చేసేందుకు మీనా ఎంతగానో శ్రమిస్తుంది. కానీ చివరకు ఆస్పత్రి వారు అడిగిన డబ్బులు అరెంజ్ కాకపోవడంతో వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లి రిక్వెస్ట్ చేస్తుంది. అందుకు డాక్టర్ బిట్ పేమెంట్ ఇన్ స్టాల్ మెంట్ చేసే సౌకర్యం ఉందని మీనాకు భరోసా వ్యక్తం చేస్తాడు. అదే విధంగా శివ గురించి మీనాకు డాక్టర్ ఓ షాకింగ్ విషయం చెబుతాడు.

శివకు బైక్ యాక్సిడెంట్ కాలేదని, ఆ గాయం చూస్తుంటే ఎవరో కావాలని గట్టిగా కొట్టి ఉంటాని చెబుతాడు. ఇదే విషయాన్ని మీనా శివను అడుగుతుంది. ఎవరు కొట్టారు చెప్పు అంటూ అడగడంతో వెంటనే బాలు బావ అని అబద్ధం చెబుతాడు. నేను గుణ దగ్గర ఫైన్సాన్స్ కంపెనీలో డేటా ఎంట్రీగా పనిచేస్తున్నానని చెబుతాడు. ఈ సందర్భంగా బాలు స్నేహితుడు రాజేశ్ డబ్బులు ఇవ్వాల్సి ఉండగా వెళ్లి అడిగాం. అందుకు రాజేశ్ తిరగబడ్డాడు. అలాగే బాలు కూడా మద్యం మత్తులో నన్ను కొట్టాడని శివ మీనాకు చెబుతాడు. మీనా వెంటనే వెళ్లి బాలును నిలదీస్తుంది. కానీ బాలు శివ చేసిన దొంగ పని చెప్పకుండా దాచేసి మీనాతో తిట్లు పడుతాడు. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోతారు. అక్కడ ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికంగా మారింది. ఇక మే 9వ తేదీ 419 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 419 May 9th

బాలు నిజం చెప్పకపోవడంతో అందరూ బాలునే తప్పుగా అర్థం చేసుకుంటారు. ఎవరు ఎన్ని మాట్లాడిన శివ చేసిన దొంగతనం గురించి ఎవరికీ చెప్పొద్దని అనుకుంటాడు. ఒకవేళ శివ దొంగతనం గురించి చెబితే ఎలాంటి గొడవలు మొదలు అవుతాయోనని భయపడుతాడు. అందుకోసమని ఎవ్వరికీ శివ గురించి నిజం చెప్పబోడు. మరీ ముఖ్యంగా మీనాకు కూడా చెప్పకుండా నిజాన్ని అలాగే దాచేస్తాడు. తన తమ్ముడిని కొట్టినందుకు మీనా బాలుపై నానా మాటలు అంటుంది. అపార్థం చేసుకుంటుంది. బాలుపై మండిపడుతుంది. తాము పేద వాళ్లం కాబట్టే ఇలాంటి మాటలు అంటున్నారంటూ మీనా బాలుతో అంటుంది. మమ్మల్ని ఏదన్నా, ఏమన్నా అడిగివారు లేరు కాబట్టి ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా అని అంటుంది మీనా. అయినప్పటికీ బాలు మీనాకు నిజం చెప్పడు.

ఇక మీనా ఇంటికి తిరిగి వెళ్తుంది. జరిగిన విషయం ఇంట్లో వాళ్లందరికీ చెబుతుంది. బాలు తన తమ్ముడు శివను దారుణంగా కొట్టాడని, సొంత బామ్మర్ది అని కూడా చూడకుండా చేయి విరగొట్టాడని మామ సత్యంకు చెబుతుంది. తన తమ్ముడు శివ చదువుకునే వయస్సులో ఉన్నాడని, చిన్న పిల్లవాడని, కొద్దిరోజుల్లో పరీక్షలు కూడా ఉన్నాయని చెబుతుంది. ఇప్పుడు వాడి జీవితం నాశనం అయిపోతుందని బాధపడుతూ ఉంటుంది. ముఖ్యంగా బాలు చేయి విరగొట్టడం పట్ల ఎంతో కుమిలి పోతుంది. అసలు బాలుకు అలాంటి పనిచేయాలని ఎలా ఆలోచన వచ్చిందో తెలియడం లేదంటూ తన మామ సత్యంతో అంటుంది. ఇక మీనా ఏడుస్తూ ఉంటే.. రోహిణి, శృతి, రవి ఓదార్చుతారు. త్వరలోనే మీ తమ్ముడు శివ కోలుకుంటాడని ధైర్యం చెబుతారు. యువకుడే కాబట్టి ఎములకు త్వరగానే అతుకుంటాయని మనోధైర్యం ఇస్తారు.

కాగా, అసలు బాలు శివను ఎందుకు కొట్టాడనేది ఎవ్వరికీ తెలియకపోవడంతో సందేహంలో ఉండిపోతారు. బాలు, శివ మధ్య ఏం జరిగిందని అంతా ఆలోచిస్తూ ఉంటారు. ఇదే సమయంలో మీనా మరో విషయం చెబుతుంది. నా తమ్ముడు శివ ఫైన్సాన్షియర్ గుణ దగ్గర పని చేస్తున్నాడని, బాలు స్నేహితుడు రాజేశ్ దగ్గర వడ్డీ డబ్బులు అడిగేందుకు వెళ్లడంతో అక్కడ చూసిన బాలు శివ చేయి విరగొట్టాడని తనకు తెలిసిన విషయాన్ని వివరిస్తుంది. అంత మాత్రానికే చేయి విరగొట్టాల్సిన పని ఏముందని అందరూ సందేహం వ్యక్తం చేస్తారు. మీనా మాటలు విన్న ప్రభావతి ఇలా మాట్లాడుతుంది. అసలు ఎలాంటి కారణం లేకుండా బాలు ఎవరి జోలికి వెళ్లడు కదా.. మరీ శివ చేయి విరగొట్టాడంటే కారణం పెద్దదే అయ్యి ఉంటుందని సందేహం చెబుతుంది. అసలు ఆ విషయం కనుక్కోవాలని అంటుంది.

ఇదే సమయంలో బాలు బయటి నుంచి ఇంటికి తిరిగి వస్తాడు. అప్పటికే కోపంతో రగిలిపోతున్న సత్యం బాలుపై మండిపడుతాడు. అసలు శివను ఎందుకురా కొట్టావని, చేయి విరిచేసేంత పెద్ద తప్పు ఏం చేశాడని ప్రశ్నిస్తాడు. వాడు చెడు తిరుగుళ్లు తిరుగుతున్నాడని మందలించాను. కానీ చేయి విరుగుతుందని తెలియదు అని బదులిస్తాడు. ఏదేమైనా బాలు చేసింది తప్పు అని రవి, శృతి, సత్యం, మనోజ్ అంటారు. అయితే ఏ కారణం చేత బాలు ఇలా చేశాడో తెలుసుకోండి అంటూ ప్రభావతి పదే పదే అడుగుతూ ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ల అందరి ముందు శివ దొంగతనం చేశాడని చెబితే మీనాను ఇంట్లో నుంచి వెళ్లగొడుతారనే భయంతో ఆగిపోతాడు. ఎవ్వరూ ఎన్ని మాటలు అన్న పడుతూ మౌనంగా ఉంటాడు. చివరిగా శివ చేసిన తప్పు కారణంగానే కొట్టానని, అందులో నా తప్పేమీ లేదని బాలు చెప్పి తన గదిలోకి వెళ్లిపోతాడు.

మరోవైపు మీనా, బాలు మధ్య మళ్లీ గొడవలు మొదలు కావడంతో ప్రభావతి సంతోష పడుతుంది. ఈ కారణంతో ఎలాగైనా వీరిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టేందుకు ప్లాన్ చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని తన వదిన కామాక్షి ఫోన్ చేసి చెబుతుంటుంది. బాలు మీనా మధ్య గొడవలు జరుగుతుంటే నాకు సంతోషంగా ఉందని చెబుతూ ఉంటుంది. ఆ విషయాన్ని సత్యం వింటాడు. బాలు, మీనాను వెళ్లగొట్టాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నావంటూ మండిపడుతాడు. ఇంకోసారి ఇలాంటి ఆలోచనలు చేస్తే మాత్రం ఊరుకోనని భయం చెబుతాడు. ఇక మరోవైపు బాలు మీనాతో అసలు విషయం చెప్పాలని ప్రయత్నిస్తాడు. ఇంతకీ చెప్పాడా? లేదా? అన్నది తర్వాతి ఎపిసోడ్ కు వాయిదా పడింది.

Take a Poll

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X