Gunde Ninda Gudi Gantalu May 12th: మీనాపై బాలు కోపం.. కొడుకూ కోడల్ని ఇంట్లో నుంచి వెళ్లగొట్టే పనిలో ప్రభావతి
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మే 9వ తేదీ 419వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. శివను కొట్టాడని మీనా ఇంట్లో వాళ్లందరికీ బాలుపై ఫిర్యాదు చేసింది. దీంతో బాలు బయటి నుంచి ఇంటికి తిరిగి వస్తాడు. అప్పటికే కోపంతో రగిలిపోతున్న సత్యం బాలుపై మండిపడుతాడు. అసలు శివను ఎందుకురా కొట్టావని, చేయి విరిచేసేంత పెద్ద తప్పు ఏం చేశాడని ప్రశ్నిస్తాడు. వాడు చెడు తిరుగుళ్లు తిరుగుతున్నాడని మందలించాను. కానీ చేయి విరుగుతుందని తెలియదు అని బదులిస్తాడు. ఏదేమైనా బాలు చేసింది తప్పు అని రవి, శృతి, సత్యం, మనోజ్ అంటారు. అయితే ఏ కారణం చేత బాలు ఇలా చేశాడో తెలుసుకోండి అంటూ ప్రభావతి పదే పదే అడుగుతూ ఉంటుంది. కానీ ఇంట్లో వాళ్ల అందరి ముందు శివ దొంగతనం చేశాడని చెబితే మీనాను ఇంట్లో నుంచి వెళ్లగొడుతారనే భయంతో ఆగిపోతాడు. ఎవ్వరూ ఎన్ని మాటలు అన్న పడుతూ మౌనంగా ఉంటాడు. చివరిగా శివ చేసిన తప్పు కారణంగానే కొట్టానని, అందులో నా తప్పేమీ లేదని బాలు చెప్పి తన గదిలోకి వెళ్లిపోతాడు.
మరోవైపు మీనా, బాలు మధ్య మళ్లీ గొడవలు మొదలు కావడంతో ప్రభావతి సంతోష పడుతుంది. ఈ కారణంతో ఎలాగైనా వీరిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టేందుకు ప్లాన్ చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇదే విషయాన్ని తన వదిన కామాక్షి ఫోన్ చేసి చెబుతుంటుంది. బాలు మీనా మధ్య గొడవలు జరుగుతుంటే నాకు సంతోషంగా ఉందని చెబుతూ ఉంటుంది. ఆ విషయాన్ని సత్యం వింటాడు. బాలు, మీనాను వెళ్లగొట్టాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నావంటూ మండిపడుతాడు. ఇంకోసారి ఇలాంటి ఆలోచనలు చేస్తే మాత్రం ఊరుకోనని భయం చెబుతాడు. ఇక మరోవైపు బాలు మీనాతో అసలు విషయం చెప్పాలని ప్రయత్నిస్తాడు. ఇంతకీ చెప్పాడా? లేదా? అన్నది తర్వాతి ఎపిసోడ్ కు వాయిదా పడింది. అక్కడ ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికంగా మారింది. ఇక మే 12వ తేదీ 420 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

అయితే ఈరోజు ఎపిసోడ్ లో బాలు వర్సెస్ ఫైన్షాయర్ గుణగా కథ నడించింది. బాలు స్నేహితుడు రాజేశ్ ను గుణ వడ్డీ డబ్బులు అడిగేందుకు వచ్చిన సమయంలో.. బాలు చితకబాదిన కోపంలో ఉంటాడు గుణ. అందుకు రివేంజ్ తీర్చుకోవడానికి వెంటనే ట్యాక్సీ డైవర్స్ అందరూ ఉండే చోటుకు వెళ్తాడు. అందరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటే.. వెంటనే వెళ్లి షాక్ ఇస్తాడు. కోపం వచ్చేలా ప్రవర్తిస్తాడు. దాంతో వారందరూ గుణపై ఫైర్ అవుతాడు. ఇక గుణ వాళ్లందరినీ తన డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తాడు. ఈనెల వడ్డీ ఇచ్చేశాము కదా అని అందరూ అంటారు. నా వడ్డీ కాదు... అసలు కూడా కావాలి అని అడుగుతాడు. వడ్డీ అడిగేందుకు వస్తే మనుషులను పెట్టి కొట్టిస్తున్నారు కదా అని ప్రశ్నిస్తాడు. ఇలాగైతే మీతో నేను వ్యాపారం చేయలేనని చెబుతాడు. అందుకని తన డబ్బును తనకు తిరిగి ఇచ్చేయాలని చెబుతాడు గుణ.
అందుకు రాజేశ్ స్పందిస్తూ ఇదేంటీ గుణ ఇప్పటికిప్పుడు అసలు, వడ్డీ మొత్తం ఇవ్వమంటే ఎలా తిరిగి ఇచ్చేది అని అంటాడు. అందుకు గుణ స్పందిస్తూ ఇప్పుడే ఇవ్వమని అడగటం లేదులే. మీ అందరికీ ఒక్కరోజు సమయం మాత్రమే ఇస్తున్నానని చెబుతాడు. 24 గంటల్లో నాకివ్వాల్సిన డబ్బులు మొత్తం తిరిగి ఇవ్వాలని హెచ్చరిస్తాడు. లేదంటే మీ కార్లన్నీ తీసుకొని వెళ్తానని భయపెడుతాడు. దాంతో అందరూ గుణ మాటలకు కంగారు పడుతారు. మనకు జీవానాధారమైన ఈ కార్లను తీసుకెళ్లిపోతే ఇక మనం బతికేది ఎలా అని మాట్లాడుకుంటూ ఉంటారు. అసలు దీనంతటికి కారణం ఆ బాలు ఆవేశమే అని అంటారు. వెంటనే రాజేశ్ స్పందిస్తూ మనకు ఎప్పుడూ ఏ ఆపద వచ్చినా బాలునే అదుకుంటున్నాడు కదా అని చెబుతాడు.
ఇప్పుడేదో సమస్య వచ్చింది అని బాలును నిందించడం ఏమాత్రం సరి కాదని రాజేశ్ చెప్పుకుంటూ వస్తాడు. అదీ నిజమేనని అంటారందరూ. కానీ ఈరోజు వాడి ఆవేశం వల్లనే మనం సమస్యలో ఇరుక్కోవాల్సి వచ్చిందని అంటారు. బాలు గుణను కొట్టడం వల్లనే వాడు ఇప్పుడు మనల్ని వచ్చి కావాలని వడ్డీనే కాకుండా అసలు మొత్తం కూడా ఇవ్వమని బెదిరిస్తున్నాడని అంటారు. ఇక అదే సమయానికి బాలు కూడా క్యాబ్స్ స్టాండ్ దగ్గరకు వస్తాడు. రాగానే బాలుకు జరిగిందంతా చెబుతారు. నీ ఆవేశం వల్లే ఇప్పుడిలా జరిగిందని అంటారు. దానికి బాలు మీరేం కంగారు పడకండి నేను మళ్లీ వస్తానని చెప్పి నేరుగా గుణ ఫైనాన్స్ ఆఫీస్ దగ్గరకు వెళ్తాడు.
బాలును చూసిన గుణ షాక్ అవుతాడు. ఎందుకు మా వాళ్లను డబ్బులు ఇవ్వమని ఇబ్బంది పెడుతున్నావని గుణను బాలు అడుగుతాడు. నేను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడటం కాదు కదా? అని తిరిగి ప్రశ్నిస్తాడు. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసని అంటాడు. నీకు ఇప్పుడు ఏం కావాలని బాలు గుణను అడుగుతాడు.. అందుకు గుణ మాట్లాడుతూ ఇప్పుడు నువ్వు నా దారిలోకి వచ్చావు... నువ్వు అందరి ముందు నన్ను కొట్టావు కాబట్టి వారందరి ముందు నాతో పాటు శివ కాళ్లు పట్టుకొని క్షమాపణలు అడుతావా? అని డిమాండ్ చేస్తాడు. దాంతో బాలుకు కోపం వచ్చి, సైలెంట్ గా వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తాడు. వెంటనే గుణ సమాధానం చెప్పకపోతే.. రేపు కార్లలన్నీ తీసుకొని వెళ్లిపోతానని అంటాడు. ఎలా తీసుకెళ్తావో నేనూ చూస్తానని బాలు కూడా అంటాడు.
దాంతో గుణ భయపడి పోతాడు. అసలు బాలు ఏదో ప్లాన్ తో ఉన్నాడని, అందుకే అంత ధీటుగా బదులిచ్చి పోతున్నాడని గుణ సందేహిస్తాడు. ఇక మరోవైపు రవి, శృతిలు ఇద్దరూ తమ ఫస్ట్ యానివర్సీ సందర్భంగా ప్రేమగా, సరదగా సమయం గడుపుతారు. రవికి ఫస్ట్ యానివర్సీ గుర్తుకు లేనందుకు శృతి మండిపడుతుంది. అందుకు శిక్షగా తనను బై సైకిల్ మీద స్టూడియో వరకు తీసుకెళ్లి దగబెట్టాలని అంటుంది. అందుకు శివ కూడా సరేనని తీసుకెళ్తూ ఉంటాడు. అయితే రోడ్డుపై వారిద్దరూ బైసైకిల్ పై వెళ్తుండగా శృతి వాళ్ల అమ్మనాన్న చూసి మండిపడుతాడు. ఉన్న బైక్ కూడా అమ్మేసి ఉంటాడని రవిని అపార్థం చేసుకుంటారు. మున్ముందు వీరి బతుకు ప్లాట్ ఫాం మీదకు వస్తుందని రగిలిపోతారు. ఇక ప్రోమోలో బాలుపై సత్యం ఫైర్ అవుతాడు. మీనా సర్దిచెబుతుంది. అసలు శివను ఎందుకు కొట్టాడనే విషయం తెలుసుకోవాలని అనుకుంటుంది.


Click it and Unblock the Notifications










