Gunde Ninda Gudi Gantalu May 13th: బాలును నిలదీసిన సత్యం.. మీనా మనస్సుకు గాయం

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మే 12వ తేదీ 420వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఈ ఎపిసోడ్ లో బాలు వర్సెస్ ఫైన్షాయర్ గుణగా కథ నడించింది. బాలు స్నేహితుడు రాజేశ్ ను గుణ వడ్డీ డబ్బులు అడిగేందుకు వచ్చిన సమయంలో.. బాలు చితకబాదిన కోపంలో ఉంటాడు గుణ. అందుకు రివేంజ్ తీర్చుకోవడానికి వెంటనే ట్యాక్సీ డైవర్స్ అందరూ ఉండే చోటుకు వెళ్తాడు. అందరూ సరదాగా నవ్వుకుంటూ ఉంటే.. వెంటనే వెళ్లి షాక్ ఇస్తాడు. కోపం వచ్చేలా ప్రవర్తిస్తాడు. దాంతో వారందరూ గుణపై ఫైర్ అవుతాడు. ఇక గుణ వాళ్లందరినీ తన డబ్బులు మొత్తం తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేస్తాడు. ఇక ఈ విషయం బాలుకు తెలుస్తుంది.

వెంటనే బాలు గుణ ఫైనాన్స్ ఆఫీస్ కు వెళ్తాడు. బాలును చూసిన గుణ షాక్ అవుతాడు. ఎందుకు మా వాళ్లను డబ్బులు ఇవ్వమని ఇబ్బంది పెడుతున్నావని గుణను బాలు అడుగుతాడు. నేను ఇచ్చిన డబ్బులు తిరిగి ఇవ్వమని అడగడటం కాదు కదా? అని తిరిగి ప్రశ్నిస్తాడు. నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో నాకు తెలుసని అంటాడు. నీకు ఇప్పుడు ఏం కావాలని బాలు గుణను అడుగుతాడు.. అందుకు గుణ మాట్లాడుతూ ఇప్పుడు నువ్వు నా దారిలోకి వచ్చావు... నువ్వు అందరి ముందు నన్ను కొట్టావు కాబట్టి వారందరి ముందు నాతో పాటు శివ కాళ్లు పట్టుకొని క్షమాపణలు అడుతావా? అని డిమాండ్ చేస్తాడు. దాంతో బాలుకు కోపం వచ్చి, సైలెంట్ గా వెళ్లిపోయేందుకు ప్రయత్నిస్తాడు.

Gunde Ninda Gudi Gantalu serial episode 421 May 13th

వెంటనే గుణ సమాధానం చెప్పకపోతే.. రేపు కార్లలన్నీ తీసుకొని వెళ్లిపోతానని అంటాడు. ఎలా తీసుకెళ్తావో నేనూ చూస్తానని బాలు కూడా అంటాడు. ఇక మే 13వ తేదీ 421 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

ఫైనాన్షియర్ గుణ క్యాబ్ డ్రైవర్ల అందరి దగ్గర కేవలం వడ్డీనే కాకుండా అసలు మొత్తం చేయాలని డిమాండ్ చేస్తాడు. ఆ విషయం తెలిసి బాలు గుణ ఆఫీసుకు వెళ్లి వార్నింగ్ ఇస్తాడు. ఇప్పటికిప్పుడు డబ్బు మొత్తం ఇవ్వాలంటే ఎలా కుదురుతుంది అని ప్రశ్నిస్తాడు. డబ్బులు ఇవ్వలేకపోతే నన్ను నువ్వు అందరి ముందు కొట్టావు కాబట్టి వాళ్లందరి ముందే నా కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరితే వదిలేస్తానని గుణ బాలుతో అంటాడు. అందుకు బాలు ఇంకా కోపం తో రగిలిపోతాడు. డబ్బులు ఇవ్వకపోతే కార్లు తీసుకెళ్తానని గుణ హెచ్చరించడంతో ఇంకా మండిపడతాడు. కార్లు ఎలా తీసుకెళ్తావో నేను చూస్తానని బాలు సవాల్ చేసి మరి వెళ్తాడు.

ఇక మరుసటి రోజు గుణ హెచ్చరించినట్టుగానే క్యాబ్ డ్రైవర్ల అందరి దగ్గరికి వెళ్లి తన అప్పుగా ఇచ్చిన డబ్బులు మొత్తం తిరిగి వాళ్ళని అడుగుతాడు. రాజేష్ తో పాటు మిగిలిన వాళ్ళందరి దగ్గర కూడా గుణం దగ్గర తీసుకున్న అప్పు తీర్చేందుకు సరిపడా అమౌంట్ జమ కాదు. దీంతో కంగారు పడతారు. ఇక గుణ తన అనుచరులను తీసుకొని వచ్చి కార్లను తీసుకుని వెళ్లేందుకు ప్రయత్నిస్తాడు. ఇక అదే సమయంలో బాలు అక్కడికి వచ్చి గుణ అనుచరులను కార్లపై చేయి పడకుండా చూసుకుంటాడు. కార్లు తీసుకెళ్లాలని ప్రయత్నిస్తే అందరి బొక్కలు చేస్తానని హెచ్చరిస్తాడు.

కార్లు తీసుకెళ్లకూడదు అంటే నేను అప్పుగా ఇచ్చిన డబ్బులు మొత్తం తిరిగి ఇవ్వు అని గుణ బాలును డిమాండ్ చేస్తాడు. లేదంటే వచ్చి నా కాళ్ళ మీద పడి క్షమాపణలు కోరు అని అంటాడు. కానీ అందుకు బాలు ఒప్పుకోడు. గుణ ఛాతి పైకి తన కాలు లేపి తన్నపోతాడు. కానీ రాజేష్, క్యాబ్ డ్రైవర్ లందరూ బాలును అడ్డుకుంటారు. ఇక బాలు శాంతించి గుణపై కోపం తగ్గించుకుంటాడు. నీకు ఇవ్వాల్సిందే డబ్బులే కదా.. ఇప్పుడే ఇచ్చేస్తామని చెప్పి అందరిని పక్కకి తీసుకెళ్తాడు. ఒక్కొక్కరూ గుణకు ఎంతెంత డబ్బులు ఇవ్వాలని అడుగుతాడు. అందరూ తమ తీసుకున్న డబ్బులు ఎంత అమౌంట్ ఉందనే వివరాలను బాలుకు చెబుతారు.

ఇక వెంటనే బాలు ఒక్కొక్కరికి గుణాకు ఇవ్వాల్సిన డబ్బులను ఇస్తాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ఇక మొత్తానికి ఆ డబ్బును తీసుకెళ్లి నువ్వు గుణకు ఇచ్చే ప్రయత్నం చేస్తారు. కానీ బాలు ఆ డబ్బులను ఇచ్చే ముందు వీడియో తీసుకొని ఇవ్వాలని అంటాడు. అందరూ డబ్బులు ఇచ్చే దృశ్యాన్ని ఫోన్లో వీడియో తీస్తాడు. భవిష్యత్తులో ఏదైనా తేడా చేస్తే గుణను అడ్డుకోవడానికి ఈ వీడియో పనిచేస్తుందని అంటాడు. ఇంకా డబ్బులు తీసుకుని గుణ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. మరి బాలు అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకొచ్చాడు అని తన స్నేహితుడు రాజేష్ సందేహిస్తాడు. వెంటనే వెళ్లి అడుగుతాడు. ఇంత డబ్బు ఎక్కడిది రా అని బాలును ప్రశ్నిస్తాడు.

అందుకు బాలు స్పందిస్తూ.. తన కారు అమ్మేసి తీసుకొచ్చానని చెబుతాడు. నావల్ల మీరందరూ ఇబ్బంది పడడం నాకు ఇష్టం లేదని చెబుతాడు. నేను డబ్బులు తీసుకురా లేకపోతే ఆ గుణ గాడి కాళ్ళ మీద పడాల్సి వచ్చేదని.. అది నాకు ఏమాత్రం ఇష్టం లేదని రాజేష్ తో అంటాడు. ఇక కారు మళ్ళీ ఎలాగైనా కొనుక్కోవచ్చని, కారు లేకపోయినా నేను ఏదైనా చేయగలనని బాలు ధైర్యాన్ని వ్యక్తం చేస్తాడు. ఇదిలా ఉంటే మరోవైపు మీనా బాలు మధ్య రోజురోజుకు దూరం పెరుగుతూ ఉంటుంది. ఇక బాలు రాత్రి పడుకోగానే మీనా ఇంట్లో నుంచి వెళ్లిపోయినట్టుగా కళ వస్తుంది. దాంతో భయపడతాడు.

మీ నాకు మంచి జరగాలని శివ చేసిన దొంగతనం విషయాన్ని బయట పెట్టకపోవడం వల్ల ఇంకా సమస్యలు వస్తున్నాయని అనుకుంటాడు. ఆ మంచి జరగడం ఏమో గాని మీ నాతో తనకు దూరం పెరుగుతుందని భయంతో వెంటనే వెళ్లి నిజం చెప్పాలనుకుంటాడు. పడుకున్న మీనా ను లేపి నిజం చెప్పే ధైర్యం చేస్తాడు. కానీ నిజం తెలిస్తే మీన బాధపడుతుందని చెప్పడం మానేస్తాడు. ఇదిలా ఉంటే సత్యం మీనా అమ్మ గారి ఇంటికి వెళ్లి శివాను పరామర్శిస్తాడు. తన కొడుకు బాలు ఇలా చేయడం తనకు కూడా బాధగానే ఉందని చెబుతాడు. కానీ బాలు కారణాలు లేకుండా ఏం చేయడానికి సాహసం చేయడని అంటాడు. ఇక ఆస్పత్రి ఖర్చులకోసం అని కొంత డబ్బును ఇచ్చే ప్రయత్నం చేస్తాడు. కానీ వాళ్లు తీసుకోరు. మీనా వాళ్ళ తల్లి సత్యమును ఒకటే కోరుతుంది. తన కూతురు ఆ ఇంట్లో క్షేమంగా ఉండాలని కోరుతుంది. ఆ విషయంలో బాధ్యత మొత్తం నాదేనని సత్యం మాట ఇస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X