Gunde Ninda Gudi Gantalu May 14th: బాలును వాయించేసిన మీనా.. ఇద్దరి మధ్య మరో చిచ్చు

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మే 13వ తేదీ 421వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఈ ఎపిసోడ్ లో మీనా కుటుంబానికి మామ సత్యం వెళ్లి క్షమాపణలు చెబుతాడు. తన కొడుకు బాలు విచక్షణ రహితంగా ప్రవర్తించడాన్ని జీర్ణించుకోలేక పోతాడు. అందుకు బాలు తరుపుణ మీనా వల్ల తల్లిగారి కుటుంబానికి క్షమాపణలు చెబుతాడు. కొంత డబ్బు కూడా ఇచ్చి శివకు మెరుగైన వైద్యం, బలమైన ఆహారం అందించండి అని చెబుతాడు. కానీ సత్యం ఇచ్చే డబ్బులను మీనా వల్ల తల్లి తీసుకోవడానికి నిరాకరిస్తుంది. తన కూతురు మీనాను చక్కగా చూసుకుంటే సరిపోతుందని కోరుతుంది.

మరోవైపు ఫైనాన్షియర్ గుణ బాలుకు వార్నింగ్ ఇస్తాడు. తన కాళ్లు పట్టుకొని క్షమాపణలు కోరకపోతే తన స్నేహితులందరి కార్లు తీసుకొని వెళ్తానని హెచ్చరిస్తాడు. అంతకు ముందే తన దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులన్నింటిని మొత్తం తిరిగి ఇవ్వకపోతే కార్లు తీసుకొని వెళ్తానని హెచ్చరిస్తాడు. అనుకున్నట్టుగానే అలాగే కార్లను తీసుకొని వెళ్లేందుకు తన అనుచరులను తీసుకొని క్యాబ్ లు ఉండే చోటుకు వస్తాడు. అక్కడ క్యాబ్ డ్రైవర్లను బయటపెట్టి కార్లు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు. ఈలోగా బాలు వచ్చి గుణను అడ్డు కుంటాడు. అతనికి అప్పుగా తీసుకున్న అందరి డబ్బులను కారు అమ్మి మరీ తిరిగి ఇచ్చేస్తాడు.. ఉట్టి చేతులతో ఇంటికి తిరిగి వెళ్తాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మే 14వ తేదీ 422 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 422 May 14th

మీనా వాళ్ళ ఇంటికి సత్యం వెళ్లి వస్తాడు. అక్కడ శివాను పరామర్శించి, వైద్యం కోసం కొన్ని డబ్బులు ఇవ్వాలని ప్రయత్నిస్తాడు. కానీ మీనా వాళ్ళ అమ్మ డబ్బులను తీసుకోదు. ఇక సత్యం కూడా వాళ్లని పదే పదే అడుగకుండా తెలుసుకుని తిరిగి ఇంటికి వస్తాడు. అక్కడ మీనా వాళ్ల తల్లి శివ కోసం ఎంతలా బాధపడుతుందో ఆలోచిస్తూ ఉంటాడు. బాలు శివను కొట్టడానికి అసలు కారణం ఏంటని ఆలోచిస్తూ ఉంటాడు. ఎలాగైనా బాలు శివని ఎందుకు కొట్టాడో తెలుసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈలోగా ప్రభావతి సత్యం దగ్గరికి వచ్చి ఆ ఇంటికి వెళ్లారు కదా ఏం జరిగిందని అడుగుతుంది. డబ్బులు ఇస్తానని వెళ్లారు కదా ఇచ్చారా? ఇంకా కావాలని అడిగారా వాళ్లు అని ఎటకారంగా మాట్లాడుతుంది. అందుకు సత్యం మండిపోతాడు.

మా ఇంటికి వెళ్లొద్దు అన్న కూడా మీరు ఎందుకు వెళ్తున్నారని సత్యమును ప్రభావతి అడుగుతుంది. ఇంత జరిగాక కూడా ఆ ఇంటికి వెళ్లి పరామర్శించకపోతే ఏం బాగుంటుందని అంటాడు. నేను డబ్బులు ఇవ్వడానికి ప్రయత్నించిన కూడా.. మీనా వాళ్ళ అమ్మగారు వద్దంటే వద్దన్నారు. డబ్బులు తీసుకోలేదు అని సత్యం ప్రభావానికి సమాధానం ఇస్తాడు. అప్పటికే మీనా కూడా వీళ్ళ సంభాషణ మొత్తం పక్కనే ఉండి వింటుంది. మా ఇంట్లో వాళ్లకి డబ్బులు ఇవ్వాల్సిన పని ఏమీ లేదని అంటుంది. ఈలోగా బాలు ఇంటికి తిరిగి వస్తాడు. రాగానే బాలును సత్యం పక్కకి తీసుకెళ్లి మాట్లాడతాడు.

అంత చిన్న పిల్లాడు శివ ను ఎందుకు కొట్టావు రా అని ప్రశ్నిస్తాడు. త్వరలో శివకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఇలాంటి సందర్భంలో నువ్వు చేయి విరగ కొట్టడం వల్ల అతని భవిష్యత్తు కు సమస్య అవుతుందని ఆలోచించలేదా అని అంటాడు. నువ్వు చేసిన పనికి నన్ను ఆ ఇంట్లో వాళ్ళు ఎన్ని మాటలు అంటున్నారు నీకు తెలుసా? వాళ్ల ప్రశ్నలకు నేను సమాధానం ఇవ్వలేకపోయాను అని ఆవేదన వ్యక్తం చేస్తాడు. దాంతో బాలు కోపోద్రికుడై అసలు వాళ్ళు నిన్ను ఎందుకు అంటున్నా రని అడుగుతాడు. అసలు శివ వాడు చేసిన పనికి వాడిని కొట్టడం కాదు.. అని రగిలిపోతాడు. శివ ఏం చేశారో తెలుసా నాన్న అని అసలు విషయం చెప్పబోతాడు.

కానీ అప్పటికే మీనా దగ్గరికి రావడంతో ఆ నిజం చెప్పకుండా దాచేస్తాడు. వెంటనే మాట మార్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక సత్యం మీనా మధ్య సంభాషణ జరుగుతుంది. బాలు ఏదో విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నాడని అంటాడు సత్యం. కానీ బయటికి చెప్పడానికి ఎందుకో సందేహిస్తున్నాడని, ఆ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సత్యం మీనా తో అంటాడు. ఇక మీనా కూడా స్పందిస్తూ శివను బాలు కావాలని ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని నేను కూడా నమ్ముతున్నాను అని అంటుంది. కానీ ఎందుకు చేయి చేసుకున్నాడనే విషయాన్ని మాత్రం చెప్పకుండా దాచేస్తున్నాడని ఇద్దరు సందేహిస్తారు. ఇంకాస్త సమయం ఇచ్చి చూద్దామని అంటారు.

ఇక మరోవైపు బాలు తన క్యాబ్ అమ్మేసి ఆటోను కొనుక్కుంటాడు. కారు అమ్మిన విషయాన్ని ఇంట్లో ఎవ్వరికీ చెప్పడు. ముఖ్యంగా మీనాకు తెల్వకుండా చూసుకోవాలని బాలు అనుకుంటాడు. ఇక బాలు తన కారు అమ్మేసి ఎలాంటి తిప్పలు పడుతున్నాడోనని అతని స్నేహితుడు రాజేష్, క్యాబ్ డ్రైవర్లు బాగా బాధపడుతూ ఉంటారు. ఈలోగా క్యాబ్ లు పార్క్ చేసే ప్లేస్ కు బాలు తన కొత్త ఆటోతో వెళ్తాడు. దాంతో బాలును అలా ఆటోతో చూసి ఫ్రెండ్ రాజేష్ ఎంతగానో బాధపడుతాడు. మా అందరి కోసం నీ కారు అమ్మేసి మా అప్పులు తీర్చేశావు కదా అని అంటారు. దాంతో బాలు అదేం లేదు మీరేం నాకోసం ఇబ్బంది పడాల్సిన పని లేదని చెబుతాడు. ముఖ్యంగా ఇప్పుడు క్యాబ్ లకు ఎంతలా రైడ్స్ ఉంటున్నాయో ఆటోలాకు కూడా అంతే డిమాండ్ ఉందని చెబుతాడు.

ఇదిలా ఉంటే.. ఇక మీనాపై అత్త ప్రభావతి నిప్పులు చెరిగేస్తుంది. సూటిపోటీ మాటలతో మనసుకు గాయం చేస్తుంది. తన మీద ఉన్న కోపాన్ని మొత్తం మాటల తూటాలతో బయటపెడుతుంది. ఇక మీనా కూడా ధీటుగానే బదులిస్తుంది. ఈలోగా ఇంటికి మీనా వాళ్ల తల్లి, చెల్లి వస్తారు. గుమ్మంలో నిల్చొని మీనా అని పిలుస్తారు. దాంతో ప్రభావతి ఇది మీనా ఇల్లు కాదు.. సత్యం ఇల్లు. అయితేగియితే ప్రభావతి ఇల్లు అని అంటుంది. దాంతో సత్యం ప్రభావతి ఫైర్ అవుతాడు. నువ్వు మనిషివేనా అని తిడుతాడు. మరోవైపు మీనా తన తల్లిని అసలు ఈ ఇంటికి ఎందుకు వచ్చావంటూ తిడుతుంది. వెంటనే వెళ్లిపో నేనే ఫోన్ చేస్తానని చెబుతుంది. దాంతో ప్రభావతి మరింత మొండిగా మాట్లాడుతుంది. ఆపై మీనా ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X