Gunde Ninda Gudi Gantalu May 15th: మీనాను కంటతడి పెట్టిస్తున్న బాలు.. సత్యం వార్నింగ్

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మే 14వ తేదీ 422వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మీనా వాళ్ళ ఇంటికి సత్యం వెళ్లి వస్తాడు. అక్కడ శివాను పరామర్శించి, వైద్యం కోసం కొన్ని డబ్బులు ఇవ్వాలని ప్రయత్నిస్తాడు. కానీ మీనా వాళ్ళ అమ్మ డబ్బులను తీసుకోదు. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత బాలుపై సత్యం ఫైర్ అవుతాడు. అంత చిన్న పిల్లాడు శివ ను ఎందుకు కొట్టావు రా అని ప్రశ్నిస్తాడు. త్వరలో శివకు ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఇలాంటి సందర్భంలో నువ్వు చేయి విరగ కొట్టడం వల్ల అతని భవిష్యత్తు కు సమస్య అవుతుందని ఆలోచించలేదా అని అంటాడు. అసలు వాళ్ళు నిన్ను ఎందుకు అంటున్నారని అడుగుతాడు. అసలు శివ వాడు చేసిన పనికి వాడిని కొట్టడం కాదు.. అని రగిలిపోతాడు. శివ ఏం చేశారో తెలుసా నాన్న అని అసలు విషయం చెప్పబోతాడు.

కానీ మీనాను చూసి ఆ నిజం చెప్పకుండా దాచేస్తాడు. వెంటనే మాట మార్చేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఇక సత్యం మీనా మధ్య సంభాషణ జరుగుతుంది. బాలు ఏదో విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నాడని అంటాడు సత్యం. కానీ బయటికి చెప్పడానికి ఎందుకో సందేహిస్తున్నాడని, ఆ విషయాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉందని సత్యం మీనా తో అంటాడు. ఇక మీనా కూడా స్పందిస్తూ శివను బాలు కావాలని ఉద్దేశపూర్వకంగా కొట్టలేదని నేను కూడా నమ్ముతున్నాను అని అంటుంది. కానీ ఎందుకు చేయి చేసుకున్నాడనే విషయాన్ని మాత్రం చెప్పకుండా దాచేస్తున్నాడని ఇద్దరు సందేహిస్తారు. ఇంకాస్త సమయం ఇచ్చి చూద్దామని అంటారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మే 15వ తేదీ 423 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 423 May 15th

సత్యం ఇంటికి మీనా అమ్మ, చెల్లి వస్తారు. ఇంటి గుమ్మం దగ్గర నిల్చొని మీనా అని పిలుస్తారు. ఆ పిలుపు విని మీనా అత్త ప్రభావతి మండిపడుతుంది. మీనా ఇల్లు కాదిది.. సత్యం ఇల్లులు అని, ఎప్పుడూ పడితే అప్పుడు ఊడిపడటానికి, దర్జాగా రావడానికి అవమానంగా లేదా అని ప్రభావతి మీనా తల్లిని అంటుంది. దీంతో మీనా మండిపోతుంది. అత్తపై చూపించలేని కోపాన్ని తన తల్లిపై చూపిస్తుంది. పిలవని పేరంటానికి ఎందుకు వచ్చారంటూ గట్టిగా మందలిస్తుంది. ఇంకోసారి ఈ ఇంటివైపు రావొద్దని ఏదైనా ఉంటే ఫోన్ లోనే చెబితే సరిపోతుందని మీనా తిడుతుంది. మీకు ఇక్కడ అవమానం జరిగితే అది చూసి నేను తట్టుకోలేనని అంటుంది. ఇక ఇదే సమయంలో సత్యం జోక్యం చేసుకుంటాడు.

ప్రభావతిని నోరు మూసుకోమని, లేదంటే తన ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరిస్తాడు. మీనాతో మాట్లాడుతూ మీనా అమ్మగారిని గుమ్మం బయటి నుంచి ఇంట్లోకి తీసుకొని రమ్మని చెబుతాడు. దీంతో మీనా అమ్మ, చెల్లి ఇంటిలోపలికి వస్తారు. వారిని కూర్చొమని చెబుతాడు. కానీ వారు కూర్చొరు. వారికి కుంకుమ పెట్టి లోపలికి పిలవాల్సింది కదా అని సత్యం ప్రభావతిపై మండిపడుతాడు. దానికి ప్రభావతి నేను పిలుద్దామనే అనుకుంటున్నాను. కానీ ఆమెకు ఆ యోగం లేదు.. నుదిటిపై ఆ రాత ఉండాలి కదా అని ఎంతో నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తుంది. దాంతో మీనా తల్లిగారు కన్నీళ్లు పెట్టుకుంటారు. ఎంతో భావోద్వేగానికి గురవుతారు. ఏడుస్తూ ఉంటారు. ఇక దానికి కూడా ప్రభావతి మండిపడుతుంది. నా ఇంట్లో ఏడ్వటం ఆపండి అని అంటుంది.

మేమంతా సంతోషంగా ఉండటం మీకు ఇష్టం లేదా అని అడుగుతుంది. అందుకే ఇలా వచ్చి ఏడుస్తున్నారా? అంటూ విసుక్కుంటుంది. దానికి మీనా స్పందిస్తూ చనిపోయింది మా అమ్మ భర్త, నాకు తండ్రి ఆయన లేరనే విషయం గుర్తుకొచ్చి ఏడ్వకుండా ఉంటారా? అని అంటుంది. మా బాధ మీకు నసలాగా మారిందా? అని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీనా మాటలతో సత్యం స్పందిస్తూ ప్రభావతి నోరు మూయిస్తాడు. ఇంకొక్క మాట మాట్లాడితే వెంటనే నీ పరువు పోయేలా చేస్తానని అంటాడు. మౌనం ఉన్న కొద్ది రెచ్చిపోతున్నావంటూ మండిపడుతాడు. నువ్వు లోపలికి వెళ్లమని అంటాడు. ఇక మీనా తన తల్లితో నువ్వు వచ్చిన విషయం ఏంటో చెప్పి వెళ్లు అని అంటుంది.

దాంతో మీనా తల్లి తన భర్త చనిపోయి ఏడాది అవుతోందని, ఇందాక వదిన ప్రభావతి అన్నట్టు నాకు కుంకుమ పెట్టుకునే రాత చెదిరిపోయి సంవత్సరం పూర్తైందని, సంవత్సరికం చేయాలి కాబట్టి ఇంటికి వచ్చి పిలుస్తున్నామని చెబుతుంది. దాంతో సత్యం భావోద్వేగానికి గురవుతాడు. తన వల్లే మీనా తండ్రి చనిపోయాడని గుర్తు చేసుకొని బాధపడుతాడు. అసలు విషయం చెప్పిన తర్వాత మీనా తన తల్లి, చెల్లిని సాగనంపేందుకు వారితో కలిసి గేట్ వరకు వెళ్తుంది. అసలు ఇంటికి వచ్చి ఎందుకు అవమానం పాలవుతున్నారని మీనా తన తల్లిని అడుగుతుంది. సంవత్సరికానికి ఇంటికి వచ్చి పిలకవపోతే బాలు రాడని, అందుకే వచ్చి పిలిచామని అంటుంది.

ఇక అదే సమయానికి బాలు ఇంటికి తిరిగి వస్తాడు. గేట్ దగ్గర మీనా తల్లి పలకరించినా తిరిగి మాట్లాడకుండా వెళ్లిపోతాడు. ఇక ఇంట్లోకి తిరిగి వచ్చిన మీనా బాలుతో గొడవ పడుతుంది. తన తల్లి పిలిచినా ఎందుకు మాట్లాడలేదని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు సత్యం మీనా వాళ్ల నాన్న సంవత్సరికం కార్యక్రమానికి వెళ్లాలని ఆదేశిస్తాడు. తన ఇష్టం లేదని బాలు చెబుతాడు. కానీ వెళ్లాల్సిందేనని సత్యం చెబుతాడు. దాంతో సరేనని అంటాడు. మరోవైపు శృతికి వాళ్ల అమ్మ కలిసి సైకిల్ మీద ఎందుకు తిరుగుతున్నారని అడుగుతుంది.

ఏదైనా డబ్బు సమస్య ఉన్నా, మీ అత్తగారింట్లో ఇబ్బంది ఉన్నా వెంటనే అల్లుడు రవిని తీసుకొని వచ్చేయ్ అని చెబుతుంది. ఇక హనీమూన్ కోసమని టికెట్స్ కూడా ఇస్తుంది. మరోవైపు మనోజ్ కు జాబ్ పోయిందన్న సంగతిని రోహిణికి చెబుతాడు. దాంతో రోహిణి మనోజ్ పై మండిపడుతుంది. రెండు వారాలంటే ఎక్కడా ఎందుకు జాబ్ చేయలేకపోతున్నావని ప్రశ్నిస్తుంది. అసలు నీకు ఉద్యోగం చేసే ఆలోచన ఉందా? అని అడుగుతంది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X