Gunde Ninda Gudi Gantalu May 16th: మీనా ప్రేమను కోల్పోయిన బాలు.. మళ్లీ చిచ్చు పెట్టిన శివ
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మే 15వ తేదీ 423వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. సత్యం ఇంటికి మీనా అమ్మ, చెల్లి వస్తారు. మీనా తల్లి తన భర్త చనిపోయి ఏడాది అవుతోందని, ఇందాక వదిన ప్రభావతి అన్నట్టు నాకు కుంకుమ పెట్టుకునే రాత చెదిరిపోయి సంవత్సరం పూర్తైందని, సంవత్సరికం చేయాలి కాబట్టి ఇంటికి వచ్చి పిలుస్తున్నామని చెబుతుంది. దాంతో సత్యం భావోద్వేగానికి గురవుతాడు. తన వల్లే మీనా తండ్రి చనిపోయాడని గుర్తు చేసుకొని బాధపడుతాడు. అసలు విషయం చెప్పిన తర్వాత మీనా తన తల్లి, చెల్లిని సాగనంపేందుకు వారితో కలిసి గేట్ వరకు వెళ్తుంది. అసలు ఇంటికి వచ్చి ఎందుకు అవమానం పాలవుతున్నారని మీనా తన తల్లిని అడుగుతుంది. సంవత్సరికానికి ఇంటికి వచ్చి పిలకవపోతే బాలు రాడని, అందుకే వచ్చి పిలిచామని అంటుంది.
ఇక అదే సమయానికి బాలు ఇంటికి తిరిగి వస్తాడు. గేట్ దగ్గర మీనా తల్లి పలకరించినా తిరిగి మాట్లాడకుండా వెళ్లిపోతాడు. ఇక ఇంట్లోకి తిరిగి వచ్చిన మీనా బాలుతో గొడవ పడుతుంది. తన తల్లి పిలిచినా ఎందుకు మాట్లాడలేదని కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరోవైపు సత్యం మీనా వాళ్ల నాన్న సంవత్సరికం కార్యక్రమానికి వెళ్లాలని ఆదేశిస్తాడు. తన ఇష్టం లేదని బాలు చెబుతాడు. కానీ వెళ్లాల్సిందేనని సత్యం చెబుతాడు. దాంతో సరేనని అంటాడు. అక్కడ ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మే 16వ తేదీ 424 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

మీనా తండ్రి ఏడాది కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. ఈ సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాల వేసి, ఆయన ఆత్మకు శాంతి చేకూరేలా నలుగురిని పిలిచి భోజనానికి అన్ని రెడీ చేస్తారు. ఇక ఈ సమయంలో శివ చేతికి కట్టుతో కనిపించడంతో ఇంటికి వచ్చిన వాళ్లందరూ ఏమైందని అడుగుతూ ఉంటారు. ఇంటికి వచ్చిన వాళ్లలోనే మరోకరు వాళ్ల అల్లుడు బాలునే శివను కొట్టాడని చెబుతారు. సొంత అల్లుడే బామ్మర్దిపై చేయి చేసుకోవడం ఏంటని అంత నివ్వెరపోతారు. తన కూతురు మీనాను ఎంతో బాగా చూసుకుంటాడని ఎప్పుడూ చెబుతుంటావు కదా బాలు గురించి, మరీ ఇలా చేశాడేంటనీ మీనా తల్లిని అందరూ ప్రశ్నిస్తూ ఉంటారు. అందుకు ఆమె ఏం బదులివ్వకుండా ఉండిపోతుంది.
సొంత అల్లుడే ఇలా చేస్తాడనుకోలేదు. చదువుకునే పిల్లాడి చేయి విరిచేయడం సరికాదని అందరూ అభిప్రాయపడుతుంటారు. ఏదేమైనా అల్లుడు బాలు సంవత్సరికారినికైనా వస్తాడా? రాడా అని మీనాను తల్లి అడుగుతుంది. అందుకు తప్పకుండా వస్తాడని మీనా బదులిస్తుంది. తన తండ్రి సత్యం చెప్పాడు కాబట్టి ఎలాగైనా వస్తాడని మీనా అంటుంది. ఇక ఆయన వచ్చే వరకు మనం ఎందుకు కార్యక్రమం చేయకుండా ఆగాలని శివ దురుసుగా మాట్లాడుతాడు. రానివాడి కోసం ఎందుకు ఎదురుచూడాలని అంటాడు. దాంతో సరేనని మొదటి హారతి ఇచ్చేందుకు ప్రయత్నిస్తారు. ఇక హారతీ పళ్లెం నాకివ్వు అక్క అని మీనాను శివ అడుగుతాడు. తండ్రికి నేనే హారతీ ఇస్తానని అంటాడు.
అందుకు మీనా కూడా ఏం మాట్లాడకుండా శివకు హారతీ పళ్లెం ఇస్తుంది. శివ హరతీ పళ్లాన్ని తండ్రి ఫొటో ముందు తిప్పుతూ ఉంటాడు. చేయి ఎముక ఇరగడంతో ఆ హారతీ పళ్లెం కూడా పట్టుకోలేని స్థితిలో కింద పడేస్తాడు. దీంతో అందరూ షాక్ అవుతారు. ఇక మీనా తల్లి బోరున ఏడుస్తుంది. తన కొడుకు హారతీ కూడా ఇవ్వలేకపోతున్నాడే అని బాధపడుతుంది. అంతలా చేయి విరగొట్టాలా అని బాలుపై మండిపడుతుంది. ఆయనకు ఏం అన్యాయం చేశామని అంటుంది. ఈ సమయంలోనే బాలు ఇంట్లోకి వస్తాడు. మీనా తల్లి అన్న మాటలన్నింటిని వింటాడు. అయితే బాలు ఇంట్లోకి రావడానికి ముందే వీధిలో పూలు అమ్ముకునే వారిద్దరూ అవమానిస్తారు.
మీ సొంత బావమర్ది చేయినే నువ్వు విరిచేసావంట బాలు అని ప్రశ్నిస్తాడు. దీంతో బాలు షాక్ అవుతాడు. అసలు ఆ విషయం వీళ్లందరికీ ఎలా తెలిసిందని సందేహిస్తాడు. ఇక ఆ పూలు అమ్ముకునే వారు బాలుకు మంచి మాటలు చెప్పాలని చూస్తారు. కానీ బాలు ఎందుకు కొట్టాడనే సంగతి తెలుసుకోకుండా ఉచిత సలహాలు ఇస్తారు. ఆ ఇంటికి పెద్ద కొడుకుగా ఉండాల్సిన నువ్వే అలా ప్రవర్తించడం సరిలేదని అంటారు. ఇక అక్కడ బాలు ఏం అనకుండా నేరుగా ఇంటికి వస్తాడు. వచ్చే సరికి మీనా తల్లి కూడా బాలునే నిందిస్తూ ఉంటడంతో కోపం కట్టలు తెంచుకుంటుంది. ఇంటి పిలిచి మరీ అవమానించాలని ఫిక్స్ అయ్యారా? వీధిలోకి రాగానే ఇద్దరు మనుషులను పెట్టి అవమానించారు కదా? అని బాలు తన కోపాన్ని వ్యక్తం చేస్తాడు. ఇంత మంది నేనేదో తప్పు చేశానని మాట్లాడుతున్నారు కానీ.. అసలు వాడు చేసిన తప్పేంటీ అని ఏ ఒక్కరైనా ప్రశ్నించారా? అని అడుగుతాడు. చిన్న పిల్లాడు, చిన్న పిల్లాడిలా ఉండాలని, పెద్ద పెద్ద తప్పులు చేస్తుంటే తప్పు అని చెప్పినందుకు ఇంతలా నిలదీస్తున్నారని మండిపడుతాడు.
అయినా మర్యాద లేని ఇంటికి వస్తే ఇలానే ఉంటుందిలే అని మండిపడుతాడు. ఇలాంటి ఇంటికి వచ్చినందుకు నాకు ఇలా కావాల్సిందే అని రగిలిపోతాడు. ఇదే సమయంలో శివ.. చేసింది చాలక సిగ్గులేకుండా తినడానికి వచ్చావా అని అంటాడు. దాంతో బాలు మళ్లీ శివపై చేయి చేసుకుంటాడు. దీంతో మీనా బాలును అడ్డుకుంటుంది. ఇంతకోపం ఎందుకు తెచ్చుకుంటున్నారని, మా ఇంటి వాళ్లంటే మీకెందుకు చిన్న చూపైపోతోందని ప్రశ్నిస్తుంది. ఇక బాలు ఇంటికి పిలిచి అవమానించారని రగిలిపోతూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. కార్యక్రమం ముగిసిన తర్వాత మీనా ఇంటికి తిరిగి వస్తుంది. వచ్చి రాగానే సత్యం బాలు సరిగానే ఉన్నాడా? అని ప్రశ్నిస్తాడు. అందుకు మీనా కన్నీళ్లు పెట్టుకుంటూ ఎందుకు వచ్చాడా? అనే చేశాడని చెబుతుంది. ఆ సమయంలోనే బాలు కూడా ఇంటికి తిరిగి వస్తాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.


Click it and Unblock the Notifications











