Gunde Ninda Gudi Gantalu May 17th : నిజం తెలుసుకున్న మీనా.. భర్త బాలుకు క్షమాపణలు

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మే 16వ తేదీ 424వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మీనా తమ్ముడు శివ చేయి విరిగిపోవడంతో అందరూ బాలును నిందిస్తూ ఉంటారు. బాలునే అకారణంగా శివను కొట్టాడని అందరూ అపార్థం చేసుకుంటూ ఉంటారు. ఎవరూ ఎంత అవమానించినా.. ఎన్ని నిందలు వేసినా.. శివ చేసిన తప్పు గురించి అస్సలు చెప్పబోడు. ముఖ్యంగా మీనాకు కూడా తన తమ్ముడు చేసిన దొంగతనం వీడియోను చూపించడానికి సాహసం చేయబోడు. తెలిస్తే ఎక్కడ గొడవలు అవుతాయోనని భయపడుతాడు. నిజం తన మనస్సులోనే దాచుకుంటూ అందరితో మాటలు పడుతూ ఉంటాడు.

ఇక బాలు శివను ఎందుకు కొట్టాడో అసలు విషయం తెలియని మీనా వాళ్ల తల్లి కూడా చాలా అపార్థం చేసుకుంటుంది. తమ కుటుంబానికి పెద్ద కొడుకుగా అండగా ఉండాల్సిన బాలునే ఇలా శివపై దాడి చేయడం, చేయి కూడా విరగ్గొట్టడం ఏమాత్రం బాలేదని మండిపడుతుంది. కాస్తా బాలు ప్రవర్తనపైనా కూడా కోపం చేస్తుంది. ఇక బాలు మీనాతో పాటు మీనా తల్లి కూడా అవమానించడం ప్రారంభించడంతో తట్టుకోలేకపోతాడు. బాలుకు కోపం కట్టలు తెంచుకుంటూ ఉంటుంది. ఒక్కసారి మీనా వాళ్ల తల్లిపైనా మండి పడుతాడు. ఇలాంటి పరిస్థితుల్లో బాలు శివ గురించి అసలు విషయం తెలియజేస్తాడా? లేదా? ఇక మీనా అయినా బాలు ఏ విషయంలో శివను కొట్టాడనే సంగతి తెలుసుకుంటుందా? అనేది తరువాతి ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచింది. ఇక మే 17వ తేదీ 425 ఎపిసోడ్ లో ఏం జరిగి ఉంటుందంటే..?

Gunde Ninda Gudi Gantalu serial episode 425 May 17th Expected

మీనా తండ్రి చనిపోయి ఏడాది కావడంతో ఇంట్లో వాళ్లందరూ సంవత్సరికం చేయడానికి ఏర్పాట్లు చేస్తారు. ఈ సందర్భంగా ఆయన ఫొటోకు పూలమాల వేసి, ఆయన ఆత్మకు శాంతి చేకూరేలా నలుగురిని పిలిచి భోజనం పెట్టడానికి అన్ని ఏర్పాట్లు చేస్తారు. అయితే ఆ కార్యక్రమానికి మీనా తల్లి, చెల్లి స్వయంగా మీనా మామ వారి ఇంటికి వెళ్లి పిలిచి వస్తారు. కానీ సత్యంకు బదులుగా బాలును పంపిస్తాడు. బాలుకు ఇష్టం లేకున్నా కూడా అక్కడి వెళ్లేందుకు సిద్ధ పడుతాడు. ఇక తీరా అక్కడికి వెళ్లిన సమయంలో పెద్ద గొడవ జరుగుతుంది. బాలుకు శివ వల్ల అవమానం జరుగుతుంది. మళ్లీ కోపంలో చేయి చేసుకుంటాడు.

అయితే అక్కడి నుంచి బాలు వెంటనే తిరిగి ఇంటికి వస్తాడు. తనను ఇంటికి పిలిచి మరీ అవమానిస్తున్నారని బాలు మండిపడుతాడు. శివ చేసిన తప్పును చెప్పలేక పోవడమే తన తప్పుగా అవుతుందని, దాంతో మీనాతో కూడా దూరం పెరుగుతూ వస్తోందని, రోజురోజుకు మీనా తనను నిందితుడిలాగా చూస్తోందని బాధపడుతూ ఉంటాడు. ఇక బాలు మీనాను పుట్టింటిలోనే వదిలేసి తిరిగి ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చే సరికి సత్యం కంగారు పడుతూ ఉంటాడు. అసలే అందరిపై ఈ మధ్య చిర్రు బుర్రులాడుతున్న బాలు అక్కడికి వెళ్లి ఎలాంటి గొడవ చేశాడోనని కంగారులో ఉంటాడు. అదే సమయంలో బాలు ఇంటికి తిరిగి వస్తాడు. అంతకంటే ముందే మీనా ఇంటికి వచ్చి ఉంటుంది.

ఇక సత్యం బాలు వచ్చే సరికి అక్కడ ఏం చేశావని ప్రశ్నిస్తాడు. అందుకు బాలు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏముంది మీ కోడలు మీనా చెప్పే ఉంటుంది కదా అని అంటాడు. ఇలా తిక్క తిక్కగా సమాధానం ఇస్తూన్నావేంటని సత్యం కొడుకు బాలుపై మండి పడుతాడు. ఇక బాలు ఎక్కువగా మాట్లాడటం ఇష్టం లేక తన గదిలోకి వెళ్లిపోతాడు. బాలు ఏదో కారణం లేకుండా అస్సలు కొట్టడని, ఏదో పెద్ద కారణం ఉన్నందుకే బాలు నీ కుటుంబం మొత్తంపై మండి పడుతున్నాడని ప్రభావతి కూడా మీనాపై కస్సుబుస్సులాడుతుంది. దాంతో సత్యం ప్రభావతిని నోరుమూసుకోమని, సంధు దొరికితే దూరిపోతావని మండిపడుతాడు. ఇక మీనా కూడా ధీటుగానే బదులిస్తుంది. అంత పెద్ద తప్పు ఏమీ చేయలేదని, ఊరికే మా ఇంటి వాళ్లపై ఆడిపోసుకోవడం మానేయండి అంటూ మీనా గట్టిగా సమాధానం చెబుతుంది.

ఇదిలా ఉంటే.. బాలు తన కారును అమ్మేసిన విషయం ఇంకా ఇంట్లో ఎవ్వరికీ చెప్పలేదు. రెండు మూడు రోజులుగా కారు ఇంటికి రాకపోవడంతో సత్యంకు అనుమానం వస్తుంది. దాంతో బాలును మళ్లీ పిలిచి నీ కారు ఏమైందిరా బాలు అని అడుగుతాడు. దానికి బాలు స్పందిస్తూ తన కారును రాజేష్ వాడుకుంటున్నాడని చెబుతాడు. రాజేష్ కారు సర్వీసింగ్ కు ఉందని, నేను ఖాళీగా ఉన్న సమయంలో వాడు వాడుకుంటున్నాడని, ఖాళీ టైమ్ లో రాజేష్ రైడ్స్ కు వెళ్తున్నాడని అబద్ధం చెబుతాడు. బాలుపై ఉన్న నమ్మకంతో సత్యం నమ్ముతాడు. ఇక మళ్లీ తిరిగి తన గదిలోకి వెళ్తాడు.

ఇక బాలు స్నానం చేసేందుకని బాత్ రూమ్ కు వెళ్తాడు. వెళ్లే ముందు తన ఫోన్ లోని శివ దొంగతనం వీడియోను, గుణ వీడియోలను చూస్తూ ఉంటాడు. ఫోన్ ను బాగా పరీశీలనగా చూస్తూ ఉండటంతో మీనా గమనిస్తుంది. అసలు అందులో ఏముందనే విషయాన్ని మీనా తెలుసుకోవాలని అనుకుంటుంది. బాలు బాత్ రూమ్ కు వెళ్లగానే వెంటనే వెళ్లి ఫోన్ ఓపెన్ చేసి చూస్తుంది. ఇక మీనా ఆ వీడియోలను చూసే లోపే బాలు బయటికి వచ్చి మీనా దగ్గర ఉన్న తన ఫోన్ ను లాక్కుంటాడు. దాంతో మీనా కోపంగా చూస్తుంది. ఎందుకలా ఫోన్ లాగేసుకున్నావని బాలుపై మండి పడుతుంది. ఏం లేదని చెప్పి బాలు వెళ్లిపోతాడు.

ఇక ఆ ఫోన్ లోనే ఏదో ఉందని మీనా సందేహం వ్యక్తం చేస్తుంది. శివను కొట్టడానికి సంబంధించిన వీడియోలు లేదా ఫొటోలు ఏదో ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తోంది. ఇక ఎలాగైనా ఆ సంగతి తెలుసుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో బాలు మీనాకు నిజం చెప్పే ప్రయత్నం చేస్తాడు. కానీ వీడియోను చూపిస్తాడా? లేదా? అన్నది, శివ దొంగతం చేశాడన్న విషయాన్ని మీనాకు చెబుతాడా? లేదా అనేది తరువాతి ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X