Gunde Ninda Gudi Gantalu May 19th: బాలూకి సత్యం క్లాస్, మీనా పూలకొట్టుపై ప్రభావతి కన్ను..శృతిపై అలిగిన రవి

శివను బాలు ఎందుకు కొట్టాడో తెలియక మీనా వాళ్ల తల్లి కూడా అపార్ధం చేసుకుంటుంది. బాలు ప్రవర్తనపై ఆమె మండిపడుతుంది. మీనాతో పాటు ఆమె తల్లి కూడా తనను అవమానించడంతో బాలు తట్టుకోలేకపోతాడు. మీనా తండ్రి చనిపోవడంతో సంవత్సరికానికి ఏర్పాట్లు చేస్తారు. మీనా తల్లి, చెల్లి కలిసి మీనా అత్తారింటికి వెళ్లి కార్యక్రమానికి ఆహ్వానిస్తారు. కానీ సత్యం తనకు బదులు బాలును పంపిస్తాడు. అక్కడికి వెళ్లిన బాలుకు శివ చేతిలో అవమానం జరగడంతో అతను కోపంలో శివపై చేయి చేసుకుంటాడు.

మీనా వాళ్ల ఇంట్లో ఒక్క క్షణం కూడా ఉండకుండా వెంటనే ఇంటికి వచ్చేస్తాడు బాలు. శివ నిజ స్వరూపం చెప్పాలని, లేకపోతే మీనా కూడా తనను దూరం పెడుతుందని బాధపడతాడు బాలు. అటు మీనా వాళ్లింటికి వెళ్లొచ్చిన బాలు అక్కడ ఏం ఘనకార్యం చేశాడోనని సత్యం కంగారు పడుతుంటాడు. మీ కోడలు అక్కడే ఏం జరిగిందో చెప్పే ఉంటుంది కదా అని తన గదిలోకి వెళ్లిపోతాడు బాలు. శివ చేసిన దొంగతనం, గుణ వీడియోలను బాలు చూస్తుండగా మీనాకు డౌట్‌ వచ్చి నిలదీస్తుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 19వ తేదీ ఎపిసోడ్ 425లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 425 May 19th 2025 here is full story

అత్తగారింటికి వెళ్లావా అని బాలుని నిలదీస్తాడు సత్యం. మీ కోడలు చెప్పే ఉంటుంది కదా అని సూటిపోటీ మాటలు అంటాడు బాలు. అక్కడ గొడవ చేశావా? అని సత్యం అడగ్గా.. అది కూడా చెప్పే ఉంటుంది కదా అని అంటు బాలు . ఆ మాటలతో మీనా కంటతడి పెడుతుంది. నేను కారణం లేకుండా ఎవరితోనూ గొడవ పడనని నీకు తెలుసు కదా అని అంటాడు బాలు. అంత బలమైన కారణం ఏంటని అడుగుతుంది మేనత్త. అక్కడ జరుగుతున్న కార్యక్రమం ఏంటీ? నువ్వు చేసిన గొడవేంటీ? ఇంటి పెద్ద చనిపోతే ఆ బాధను దిగమింగుకుని వాళ్లు సంవత్సరికం చేసుకుంటుంటే నువ్వు అక్కడ నీ మొరటుతనం చూపించావని సత్యం మండిపడతాడు.

నేను అక్కడికి వెళ్లేసరికి ఈ ప్రభావతమ్మ లాంటి వారిని పొగేసి పెట్టారని, నన్ను తలా ఓ మాట అన్నారని నేను సైలెంట్‌గానే వెళ్లిపోయానని చెబుతాడు బాలు. కానీ ఇంటికి పిలిచి అవమానిస్తేప నేనెందుకు పడాలని ప్రశ్నిస్తాడు. తండ్రి పోయాడు, తల్లి కష్టపడుతోంది.. పిల్లల్ని పోషించుకుంటోంది, అలాంటి కుటుంబానికి నీ వల్ల నష్టం జరిగితే ఎందుకు ఊరుకుంటారని మండిపడతాడు సత్యం. అదేం అడవి కాదని, అక్కడా మనుషులుంటారని.. జంతువులా ప్రవర్తిస్తే, జంతువుని చూసినట్లే చూస్తారని అంటాడు.

మాకెవ్వరూ లేరని ఆ చుట్టుపక్కల ఉన్నవాళ్లే బంధువులు, ఆత్మీయులని శివకి చేయి బాలేక మా నాన్నకి దీపం కూడా పెట్టలేకపోయాడని మీనా చెబుతుంది. ఆ బాధలో ఏదో అన్నారని మొత్తం ఈయన పాడు చేశారని కంటతడి పెడుతుంది. మా నాన్న ఆత్మకు శాంతి కలగకుండా చేశారని, ఎవ్వరూ భోజనం చేయలేదని, ఎవ్వరికీ మనసు మనసులా లేదని మమ్మల్ని ఎంతకాలం వెంటాడుతారని మీనా బాధపడుతుంది. మేం ఏం అన్యాయం చేశాం, మా కుటుంబం మీద ఎందుకింత కక్ష చూపిస్తున్నారని ప్రశ్నిస్తుంది.

మీనాని ఓదార్చిన సత్యం.. నీకు ఇష్టం లేకపోతే చనిపోయిన వ్యక్తికి దండం పెట్టి, ఓ ముద్ద తినేసి వచ్చేయొచ్చు కదా అని బాలుతో అంటాడు. నీ ఇంటి కోడలిని కంటతడి పెట్టిస్తావా? మనిషివేనా? నువ్వు ఇదంతా ఎందుకు చేస్తున్నావో మాకేం అర్ధం కావడం లేదని కొడుకు మీద కోప్పడి వెళ్లిపోతాడు సత్యం. జరిగిన గొడవతో వంటగదిలోకి వెళ్లి బాధపడుతుంది మీనా. బాలుకి మీనా వాళ్ల పుట్టింటి మీద ఎందుకంత కోపం వచ్చిందని ప్రభావతిని అడుగుతుంది కోడలు. అదే అర్ధం కావడం లేదని, వాళ్ల మీద ఈగ వాలనిచ్చేవాడు కాదని.. ఏదో బలమైన కారణం ఉందని అంటుంది ప్రభావతి.

కిచెన్‌లోకి వచ్చి ఏడుస్తున్న మీనాపై మండిపడతాడు బాలూ. అక్కడ జరిగినదంతా మా నాన్నకి చెప్పాలా? అని నిలదీస్తాడు. మా కోసం ఎంతో చేసిన మా నాన్న ఆత్మకు శాంతి లేదు, మాకు తృప్తి లేదు, ఇరుగు పొరుగు వాళ్ల ముందు పరువు లేదు మరి మా బాధ మావయ్యగారికే చెప్పుకోగలమని అంటుంది మీనా. మా నాన్న ముందు నన్ను చెడు చేస్తున్నావని మండిపతాడు బాలు. ఇప్పుడు నా చేయి కూడా విరగ్గొడతారా? మీరు ఎవ్వరినీ వదల్లేదు కదా? మీకు ఆవేశం వస్తే అవతల ఎవరున్నది చూసుకోరని ఫైర్ అవుతుంది మీనా. ఈ ప్రపంచంలో మీరొక్కరే నిజాయితీపరులు అయినట్లు, మిగతా వాళ్లు మనుషులు కానట్లుగా ప్రవర్తిస్తున్నారని మండిపడుతుంది మీనా.

కష్టాలు నీకు, నీ కుటుంబానికేనా? నాకు ఉన్నాయి.. నేనెవరికి చెప్పుకోవాలని ప్రశ్నిస్తాడు బాలు. మీకేం కష్టాలున్నాయి, మా నాన్న సంవత్సరికం కూడా ప్రశాంతంగా చేసుకోనివ్వలేదు.. మీరు కష్టాల గురించి మాట్లాడొద్దని అంటుంది మీనా. ఇప్పుడు మీరంతా గొప్పొళ్లు.. నేను మాత్రం చెడ్డొడినా అని అడుగుతాడు బాలు. దాంతో కోప్పడిన మీనా ఇంట్లో సామానులు విసిరికొడుతుంది. వారిద్దరి గొడవ చూసిన ప్రభావతి.. ఇక మీనా వాళ్ల పుట్టింటికి పోవడం గ్యారెంటీ అనుకుని సంబరపడిపోతుంది. దాని కంటే ముందే పూల కొట్టు తీయించేయాలని ప్లాన్ చేస్తుంది.

రవి దగ్గరికి వచ్చిన శృతి.. నిన్న మా మమ్మీ స్టూడియోకి వచ్చిందని చెప్పడంతో అతను షాక్ అవుతాడు. మనిద్దరం సైకిల్‌పై వెళ్లడం చూసి ప్రాబ్లమ్‌లో ఉన్నావేమోనని కనుక్కుందామని వచ్చిందని చెబుతుంది. నా కూతురిని అల్లుడు చాలా కష్టపెడుతున్నాడు, కారు కొనిద్దామని వచ్చారా? అని సెటైర్లు వేస్తాడు రవి. హాలీడే ట్రిప్‌కి టిక్కెట్స్ ఇచ్చారని వెళ్దామని అడుగుతుంది శృతి. నాకు కుదరదని నన్ను నమ్మి రెస్టారెంట్ ఇప్పుడిప్పుడే డెవలప్ అవుతోందని చెబుతాడు రవి. నువ్వు ఓనర్ కాదని, ఓవరాక్షన్ చేయొద్దని అంటుంది శృతి. మనం పెళ్లాయ్యాక ఎక్కడికి వెళ్లలేదు కదా? నాలుగు రోజులే కదా? వెద్దామని మారాం చేస్తుంది. నేను మాత్రం రానని, కావాలనుకుంటే నువ్వొక్కదానివే వెళ్లమని రవి తేల్చి చెబుతాడు.

బాలు మేడపై నిద్రపోతుండగా మనోజ్ వస్తాడు, ఆ కాసేపటికీ రవి కూడా చాప దిండు తీసుకుని పైకి రావడదంతో వాళ్లిద్దరూ షాక్ అవుతారు. పెళ్లయితే మగాళ్ల పరిస్ధితి ఇలాగే ఉంటుందా అని రవి అడగ్గా.. నీకు బాగా అయిందిరా, లేచిపోయినప్పుడు ఇవేవీ ఆలోచించరా అని అంటాడు బాలు. మీనా వదిన చాలా మంచిదని, తప్పు నీదే అయి ఉంటుందని అంటాడు రవి. అయినా మన చిన్నప్పటి రోజులే బాగుండేవని ముగ్గురు అన్నదమ్ములు నవ్వుకుంటూ ఉంటారు. కిచెన్‌లో ఉన్న మీనా దగ్గరికి శృతి వచ్చి నిద్ర రావడం లేదా అని అడుగుతుంది. ఆ వెంటనే రోహిణి కూడా రావడంతో వాళ్లిద్దరూ షాక్ అవుతారు. ముగ్గురు టీ తాగుతూ కబుర్లు చెప్పుకుని నవ్వుకుంటారు. అలాగే ముగ్గురు భర్తల గురించి చెప్పుకుంటూ ఉంటారు. ఇంతలో పై నుంచి అన్నదమ్ముల నవ్వులు వినిపించడంతో కోడళ్లు ముగ్గురు షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X