Gunde Ninda Gudi Gantalu May 20th: కోడళ్లపై ప్రభావతిలో అనుమానం.. బాలూ ఫోన్ చెక్ చేసిన మీనా, జస్ట్ మిస్
మీనా తండ్రి సంవత్సరికం చెడగొట్టి, నానా గొడవ చేయడంపై బాలూకి క్లాస్ పీకుతాడు సత్యం. దీంతో కిచెన్‌లోకి వెళ్లి బాధపడుతుంది మీనా. అక్కడ జరిగినదంతా ఇక్కడ చెప్పడం అవసరమా? అని మీనాపై మండిపడతాడు బాలూ. తనకు ఎవరూ లేరని ఉన్నది మామగారేనని మీనా చెబుతుంది. మీనా - బాలూ మధ్య గొడవ చూసి సంబరపడిపోతుంది ప్రభావతి.
రవి దగ్గరికి శృతి వచ్చి మా అమ్మ స్టూడియోకి వచ్చి నన్ను పలకరించిందని చెబుతుంది. ఇద్దరం హ్యాపీగా ఉండటానికి కొన్నిరోజులు ట్రిప్‌కి వెళ్లిరమ్మని టికెట్స్ ఇచ్చిందని చెప్పడంతో రవి రగిలిపోతాడు. నాకు హోటల్‌లో పని ఉందని నేను ఎక్కడికి రానని చెబుతాడు రవి. భార్యలతో గొడవపడ్డ మనోజ్, రవి, బాలూలు మేడపై కబుర్లు చెప్పుకుంటూ అల్లరి చేస్తారు. కింద రోహిణి, మీనా, శృతిలు కూడా హాయిగా మాట్లాడుకుంటారు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 20వ తేదీ ఎపిసోడ్ 426లో ఏం జరిగిందంటే?

అన్నదమ్ముల అనుబంధం చూసిన అక్కాచెల్లెళ్లు రగిలిపోతారు. రేపు నేనంటే ఏంటో చూపిస్తా.. ఈ నవ్వులన్నీ మాయం చేస్తానని శృతి అంటుంది. మీరు కూడా వదలొద్దు ఒక ఆట ఆడుకోండని చెబుతుంది. ఉదయాన్నే సత్యం కాఫీ తాగుతూ ఉండగా ప్రభావతి వచ్చి మీనాని కాఫీ అడుగుతుంది. మీనా ఇప్పుడు కాఫీ ఇవ్వదు, కస్టమర్లు వచ్చారని కొట్టు దగ్గరికి వెళ్లిందని నువ్వే వెళ్లి కాఫీ తెచ్చుకోమని సత్యం చెబుతాడు. అసలు ఆ పూలకొట్టు పెట్టినప్పటి నుంచి 24 గంటలు అక్కడే ఉంటుందని, మనకి చాకిరీ చేయడానికి ఆమె ఏమైనా పనిమనిషా? ఈ ఇంటి కోడలని చెబుతాడు సత్యం. వ్యాపారం, కాపురం రెండూ చూసుకోవాలి కదా.. ఇంకా ఇద్దరు కోడళ్లు ఉన్నారు కదా వాళ్లకి చెప్పి కాఫీ తెప్పించుకో అని అంటాడు.
వాళ్ల డ్యూటీకి వాళ్లు వెళ్లాలి కదా అని ప్రభావతి అనడంతో .. అయితే నువ్వే తెచ్చుకో అని తేల్చిచెబుతాడు సత్యం. నువ్వేమైనా కలెక్టర్ జాబ్ చేస్తున్నావా? వెళ్లి తెచ్చుకో అని చెబుతాడు. ఉదయాన్నే మనోజ్ చాప, దిండుతో కిందకి రావడం చూసిన ప్రభావతి షాక్ అవుతుంది. ఏం జరిగిందో తెలుసుకోవాలని రోహిణిని అడుగుతుంది రుద్రాణి. నేను, మీనా, రోహిణి మాట్లాడుకుంటూ కూర్చోవడంతో లేట్‌గా నిద్రలేచామని అంటుంది రోహిణి. మనకి తెలియకుండా ఇంట్లో ఏదో జరుగుతోందని సత్యంతో చెబుతుంది ప్రభావతి.
రోహిణి లెక్కలు చూస్తుండగా మనోజ్ తప్పు చేశానని బాధపడుతుంటాడు. నాకు సూట్ అవ్వని జాబ్ చేయకూడదని అనుకున్నానని కానీ నీ వల్లే ఆ జాబ్ చూసుకోవాల్సి వచ్చిందని అంటాడు. ఆ మాటలతో రోహిణి మండిపడుతుంది. నీకు జాబ్ చేయడం ఇష్టం లేదు, నీ బద్ధకానికి నేనెందుకు కారణమవుతానని అంటుంది. నీ కోసం నా డిగ్రీలు, డిగ్నిటీ పక్కనపెట్టి ఓ హోటల్‌లో వెయిటర్‌గా జాయిన్ అయ్యానని చెబుతాడు మనోజ్. ఆ మాటలతో రోహిణి షాక్ అవుతుంది. అసలు ఆ జాబ్‌కి ఎందుకు వెళ్లావని అడగ్గా.. నీకోసమేనని చెబుతాడు మనోజ్. అక్కడ నన్ను ఎంతో అవమానించినా నీకోసం భరించానని చెబుతాడు .
ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదని రోహిణి అడగ్గా.. నువ్వు బాధపడటం ఇష్టం లేక చెప్పలేదని అంటాడు. వాళ్లు నన్ను అవమానిస్తున్నా తట్టుకున్నానని కానీ నా వల్ల కాలేదని చెబుతాడు. నా అర్హతకు తగ్గ ఉద్యోగం దొరికే వరకు నన్ను ఇబ్బంది పెట్టొద్దని రోహిణిని అడుగుతాడు మనోజ్. భర్త తక్కువ స్థాయి ఉద్యోగం చేయాలని ఏ భార్యా కోరుకోదని, అలా అని ఇంట్లో ఖాళీగా ఉంటే తట్టుకోలేదని చెబుతుంది రోహిణి. ఏదో ఒక జాబ్ అంటే ఇలా హోటల్‌లో వెయిటర్ జాబ్ కాదని, మినిమం నీ డిగ్రీకి సరిపోయే జాబ్ చూసుకోమని అంటుంది రోహిణి.
మనోజ్ ఎందుకు పైన పడుకున్నాడని సత్యంను అడుగుతుంది ప్రభావతి. భార్యాభర్తల మధ్య కీచులాటలు సహజమని మూడో మనిషి జోక్యం చేసుకుంటే వాదనలు పెరిగి ఇంకా పెద్దదవుతుందని చెబుతాడు. ఇంతలో బాలూ కనపించగా మన కారు ఏమైందని సత్యం అడుగుతాడు. కారు టాక్సీ స్టాండ్‌లో ఉందని బాలూ చెప్పడంతో దానిని ఏమైనా రిపేర్ చేయించాలా అని సత్యం అడుగుతాడు. రాజేష్ కారు రిపేర్‌కి ఇచ్చాడని, కొన్నిసార్లు వాడు ట్రిప్‌కి వెళ్తున్నాడని చెబుతాడు బాలూ. కొడుకులిద్దరూ ఏదో దాస్తున్నారని సత్యంతో అంటుంది ప్రభావతి.
ఫోన్‌లో వీడియోలు కనిపించకుండా ఎన్నాళ్లు దాచాలో అర్ధం కాక ఫోన్ వంక చూస్తున్న బాలూని మీనా గమనిస్తుంది. ఆమె రాగానే ఫోన్ పక్కన పడేసి వెళ్లిపోతాడు బాలూ. దాంతో ఆ ఫోన్‌లో ఏదో ఉందని మీనాకి డౌట్ వచ్చి చూస్తుంది. ఇంతలో బాత్‌రూమ్ నుంచి వచ్చిన బాలూ ఫోన్ లాక్కుని, నన్ను నువ్వు అనుమానిస్తున్నావని మండిపడతాడు. ఇంకెప్పుడు నా ఫోన్ చూడొద్దని మీనాకి వార్నింగ్ ఇస్తాడు. ఆ మాటలతో మీనా బాధపడుతూ కిందకి వచ్చేస్తుంది. వారి అరుపులు విన్న ప్రభావతి.. ఈ ఇంట్లో అందరికీ గొడవలు జరుగుతున్నాయ్ ఏమైందని ఆలోచిస్తుండగా రవి కూడా చాప దిండుతో కనిపిస్తాడు.
శృతి గదిలో నుంచి బయటికి వచ్చిందా అని మీనాని రవి అడగ్గా.. నేను ఇక్కడే ఉండగా మీ వదినను అడుగుతావేంటీ అని ప్రభావతి మండిపడుతుంది. రవి లోపలికి వెళ్లేసరికి శృతి డ్యాన్స్ చేస్తుంది. మన పెళ్లయ్యాక ఎప్పుడైనా ఇలా విడివిడిగా పడుకున్నామా? దీనికి నీ ఇగోనే కారణమని మండిపడతాడు రవి. ఇంట్లో ఏం జరుగుతుందో మీరు పట్టించుకోవడం లేదని సత్యంతో గొడవ పడుతుంది ప్రభావతి. ఇంతలో రవికి కాఫీ తీసుకుని వస్తుంది మీనా. ఆ పూలకొట్టు దాంతో నీకెంట్రా పని అని ప్రభావతి అడగ్గా.. వదిన గురించి తప్పుగా మాట్లాడొద్దని మండిపడతాడు రవి. ఇంతలో శృతి కిందకి రావడంతో రవి మేడపై ఎందుకు పడుకున్నాడో తెలుసుకోవాలని అనుకుంటుంది ప్రభావతి.
బాలూతో కలిసి రవి, మనోజ్‌లు ఎందుకు పడుకుంటున్నారని సత్యంను అడుగుతుంది ప్రభావతి. అతిగా వాళ్ల మధ్యలో జోక్యం చేసుకుంటే చివరికి అవమానాలు తప్పవని హెచ్చరిస్తాడు సత్యం. ఇలా వీళ్లు అరుచుకుంటుంటే ఇంట్లో పిల్లల అరుపులు ఎప్పుడు వినిపిస్తాయని అడుగుతుంది ప్రభావతి. శివ ఉద్యోగానికి వెళ్తానని అంటున్నాడని మీనాకి ఫోన్ చేస్తుంది తల్లి. ఉద్యోగం చేస్తే మంచిదే కదా అని మీనా చెప్పగా.. వాడు ఆ గుణ దగ్గర పనిచేయడానికే వెళ్తానని అంటున్నాడని అంటుంది. నేను చెబితే వినడం లేదని నువ్వొచ్చి మాట్లాడతావా అని తల్లి అడిగేసరికి వస్తానని చెబుతుంది మీనా. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











