Gunde Ninda Gudi Gantalu May 21st: శివకి మీనా వార్నింగ్.. బాలూపై డబ్బులు విసిరేసిన శివ, చిక్కుల్లో రోహిణి
ఉదయాన్నే కాఫీ కోసం మీనాని పిలుస్తుంది ప్రభావతి. కోడలు ఇంట్లో లేదని బేరం వస్తే కొట్టుకు వెళ్లిందని సత్యం చెప్పడంతో మండిపడుతుంది. మనోజ్ మేడపై నుంచి చాప దిండుతో రావడంతో మళ్లీ కొడుకు కోడలు మధ్య ఏం జరిగిందోనని టెన్షన్ పడుతుంది. నీ కోసం నేను వెయిటర్ ఉద్యోగంలో చేరారని, కానీ వాళ్లు నన్ను అవమానించడంతో జాబ్ మానేశానని రోహిణితో మనోజ్ చెబుతాడు. బాలూ ఫోన్‌లో ఏదో ఉందని డౌట్ రావడంతో దానిని చెక్ చేస్తుంది మీనా. ఇంతలో బాలూ బాత్‌రూమ్ నుంచి వచ్చి ఫోన్ లాక్కోవడంతో మీనా కోపంగా వెళ్లిపోతుంది.
రవి కూడా మేడపై నుంచి రావడంతో షాకైన ప్రభావతి.. ఇంట్లో ఏదో జరుగుతోందని సత్యంతో అంటుంది. శృతిని పిలిచి ఏం జరిగిందని ప్రభావతి చెప్పగా ఆమె కోపంగా సెటైర్లు వేసి వెళ్లిపోతుంది. మీనా గురించి తప్పుగా మాట్లాడిన ప్రభావతి మీద రవి కోప్పడతాడు. శివ మళ్లీ గుణ దగ్గరికి పనిచేయడానికి వెళ్తున్నాడని మీనాకి తల్లి ఫోన్ చేసి చెప్పడంతో ఆమె టెన్షన్ పడుతుంది. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 21వ తేదీ ఎపిసోడ్ 427లో ఏం జరిగిందంటే?

రెడీ అవుతున్న శివ దగ్గరికి వచ్చిన పార్వతి ఎక్కడకి వెళ్తున్నావని అడుగుతుంది. బయటికి వెళ్తున్నప్పుడు ఎక్కడికి అని అడగకూడదని తల్లిపై కోప్పడతాడు శివ. అలా అడగకపోవడం వల్లే ఇలా చేయి విరగ్గొట్టుకుని వచ్చావని అంటుంది పార్వతి. నేను ఉద్యోగం చేయడానికి వెళ్తున్నానని శివ చెప్పడంతో నువ్వు చదువుకుంటే చాలని, ఉద్యోగం చేయాల్సిన పని లేదని చెబుతుంది పార్వతి. ఇంతలో మీనా అక్కడికొచ్చి తమ్ముడికి ఎలా ఉందని అడుగుతుంది. ఎక్కడికి వెళ్తున్నావని ప్రశ్నించడంతో ఉద్యోగం చేయడానికి వెళ్తున్నానని అంటాడు శివ. ఈ చేయి ఇలా పెట్టుకుని ఒక చేత్తో ఏం పని చేస్తావని ప్రశ్నిస్తుంది మీనా.
రెస్ట్ తీసుకోమని డాక్టర్ గారు చెప్పారు కదా? అని అంటుంది. పూల కొట్టు బాగానే నడుస్తుంది.. నువ్వు ఇప్పుడు కష్టపడాల్సిన అవసరం లేదని పార్వతి చెబుతుంది. మీ ఇద్దరూ కష్టపడుతుంటే నేను ఖాళీగా కూర్చోవాలా అని ప్రశ్నిస్తాడు శివ. ఖాళీగా కూర్చోవడం ఎందుకు నీకు కాలేజీ ఉంది కదా చదువుకోమని అంటుంది మీనా. ఆ గుణ దగ్గర పనిచేస్తానని అంటున్నావ్? వాడి వల్లే కదా రా మనకి ఇన్ని సమస్యలని మండిపడుతుంది పార్వతి. ఆ గుణ ఫైనాన్స్ బిజినెస్ చేస్తున్నాడని, బ్యాంక్ వాళ్లు వడ్డీ కట్టకపోతే కలెక్షన్ ఏజెంట్స్ వస్తారు కదా ఇది కూడా అలాంటిదేనని అంటాడు శివ.
నువ్వు వడ్డీ డబ్బులు వసూలు చేయడానికి అమ్మ నిన్ను కష్టపడి చదివించింది అని అడుగుతుంది మీనా. చివరికి నువ్వు రౌడీగా బతుకుదామని అనుకుంటున్నావా అని మండిపడుతుంది. నేను కాదు ఎవరి మీద పడితే వాళ్ల మీద చేయి చేసుకునే మీ ఆయన రౌడీ అని అంటాడు శివ. మా ఆయనని తక్కువ చేసి మాట్లాడితే పళ్లు రాల్తాయని వార్నింగ్ ఇస్తుంది మీనా. మీ ఆయన నా చేయి విరగ్గొట్టాడని అంటాడు. నువ్వు ఆ గుణతో చేరి చేరిపోతున్నావని మీ బావ నిన్ను కొడుతున్నాడని, ఆయన ఫ్రెండ్ రాజేష్ గుణ మీదకి రావడంతో అడ్డంగా వెళ్లానని దానికే నా చేయి విరగ్గొట్టాని చెబుతాడు శివ. నేను, మామయ్య గారు ఆయనని నిలదీశామని.. దాంతో ఆయన నాతో మాట్లాడటం లేదని మీనా చెప్పడంతో పార్వతి, శివలు షాక్ అవుతారు.
నీ వల్ల అక్క కాపురంలో కూడా గొడవలు మొదలయ్యాయని శివపై మండిపడుతుంది పార్వతి. అయితే అక్కని కూడా ఇక్కడికి రమ్మను, అలాంటి వాడితో కాపురం చేయడం అనవసరమని శివ అనడంతో మీనా కోప్పడుతుంది. నా కాపురం సంగతి నేను చూసుకుంటాను, నువ్వు ముందు చదువుకోమని వార్నింగ్ ఇస్తుంది. నీవల్ల రేపు సుమతికి పెళ్లి సంబంధాలు రావని పార్వతి బాధపడుతుంది. సుమతికి పెళ్లి కావాలంటే డబ్బులు కావాలి.. ఆ డబ్బులు లేవనే కదా వాళ్లు అక్కని వాళ్లు అవమానిస్తున్నారని అంటాడు శివ. ఆ మాటలతో అంతా షాక్ అవుతారు. అక్క లాగా సుమతి కూడా అవమానాలు పడకూడదంటే డబ్బులు సంపాదించాలని చెబుతాడు శివ. మన దగ్గర డబ్బు లేదని నన్ను దొంగ అన్నారని, అందుకే కష్టపడి డబ్బులు సంపాదిస్తున్నానని అంటాడు శివ. నేను గుణ దగ్గర పనిచేయాల్సిందే, ఎవరేం చెప్పినా విననని వెళ్లిపోతాడు శివ.
తన వల్ల మనోజ్ ఇబ్బంది పడుతున్నాడని బాధపడుతుంది రోహిణి. ఇంతలో ఓ అతను వచ్చి రోహిణిని డబ్బులు బ్లాక్ మెయిల్ చేస్తాడు. నా దగ్గర డబ్బులు లేవని నువ్వేం చేస్తావో నాకు తెలియదు నాకు డబ్బులు ఇవ్వాలి అని అంటాడు. ఇంతలో వాళ్ల మేడం వచ్చి రోహిణికి వార్నింగ్ ఇస్తుంది. నాకు ఓ ఆటో కావాలని రాజేష్‌ను అడుగుతాడు బాలూ. కారు అలవాటయ్యాక ఆటో అంటే బాగోదని రాజేష్ అంటాడు. కారు లేదని ఇంట్లో తెలిస్తే బాగోదని శివ చెబుతుండగా ఇంతలో శివ, గుణలు అక్కడికొస్తారు. శివ నీతో ఏదో మాట్లాడాలని వచ్చాడని గుణ అంటాడు. నేను డబ్బులు కొట్టేశానని నువ్వు నా చేయి విరగ్గొట్టావ్ అని డబ్బులు విసిరేస్తాడు శివ. నువ్వు నా చేయి తిరిగి ఇవ్వగలవా అని బాలూని ప్రశ్నిస్తాడు. ఇది మా నాన్న కష్టపడి సంపాదించిన డబ్బని ఆయనకే చేరాలని అంటాడు బాలూ.
నీకు, నాకూ ఏ సంబంధం లేదని శివ తేల్చి చెబుతాడు. నేను గుణ దగ్గర పని చేస్తున్నట్లు మా అక్కకి చెప్పావ్ అని శివ చెప్పడంతో గుణ మండిపడతాడు. ఇద్దరూ కొట్టుకోబోతుండగా ఫ్రెండ్స్ ఆపుతారు. ఇంకెప్పుడూ మా అక్కని నా దగ్గరికి పంపొద్దని వార్నింగ్ ఇస్తాడు శివ. వాడికి బావ అన్న భయం లేదని నీతో ఇలా మాట్లాడుతున్నాడేంటీ అని రాజేష్ అడుగుతాడు. మీనా వంట పూర్తి చేయకపోవడంతో ఆమెపై ప్రభావతి కోప్పడుతుంది. నువ్వు పూలకొట్టు పెట్టి నన్ను పట్టించుకోవడం లేదని మండిపడుతుంది. పూలు ఆర్డర్ ఇచ్చిన ఓ అమ్మాయి నేరుగా ఇంటికొచ్చి మీనాకి డబ్బులు ఇస్తుంది. పూలు ఫ్రీజ్‌లో పెట్టొద్దని మీనాకి వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి. నా ఇంటి ముందు పూలకొట్టు పెట్టుకున్నందుకు నాకు రెంట్ కట్టాలని ప్రభావతి అనడంతో బాలూ వచ్చి మండిపడతాడు. సత్యం చేతులో డబ్బులు పెట్టి నీ డబ్బు అని చెబుతాడు బాలూ. ప్రభావతి దగ్గర డబ్బులు కొట్టేసిన దొంగని పోలీసులు పట్టుకున్నారని ఆ డబ్బే ఇదేనని అంటాడు . ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











