Gunde Ninda Gudi Gantalu May 22nd: బాలు డబ్బుపై రోహిణికి అనుమానం.. పుట్టింటితో మీనా బంధాన్ని తెంచిన బాలు
Photo Courtesy: JioHotstar
ఉదయాన్నే రెడీ అవుతున్న శివని ఎక్కడికి వెళ్తున్నావని అడుగుతారు పార్వతి, సుమతి. నువ్వు ఆ గుణ దగ్గర పనిచేయడం నాకు ఇష్టం లేదని పార్వతి చెబుతుండగా మీనా వచ్చి తమ్ముడిపై మండిపడుతుంది. నువ్వు ఆ గుణ దగ్గర పనిమానేసి బాగా చదువుకోమని హితవు పలుకుతుంది మీనా. సుమతి పెళ్లికి డబ్బులు కావాలని, మంచి ఇల్లు కట్టుకోవాలంటే నేను గుణ దగ్గర పనిచేయాల్సిందేనని చెబుతాడు శివ.
మనోజ్ తన వల్ల ఇబ్బందిపడుతున్నాడని, ఇకపై టార్చర్ చేయాలని రోహిణి అనుకుంటూ ఉండగా పార్లర్‌కు ఆమె మాజీ లవర్ వచ్చి 50 వేలు ఇవ్వాలని బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఫ్రెండ్స్‌తో మాట్లాడుతుండగా బాలూ దగ్గరికి శివ వచ్చి డబ్బు ముఖాన కొడతాడు. ఈ డబ్బు కోసమే నువ్వు నా చేయి విరక్కొట్టావని, ఇకపై నీకు నాకు సంబంధం లేదని తేల్చి చెబుతాడు. ఇంటికొచ్చి శివ ఇచ్చిన డబ్బును సత్యానికి ఇస్తాడు బాలు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 22వ తేదీ ఎపిసోడ్ 428లో ఏం జరిగిందంటే?

Photo Courtesy: JioHotstar
శివ ఇచ్చిన డబ్బును తెచ్చి ఇచ్చిన బాలుపై ఇంట్లో అందరికీ అనుమానం వస్తుంది. పోలీసులు ఇలా డబ్బులు దొరికితే తెచ్చి ఇవ్వరని? దొంగ ఎవరు? ఇలా రకరకాల ప్రశ్నలతో బాలూని ఉక్కిరిబిక్కిరి చేస్తారు. నువ్వు చెప్పేది ఏమాత్రం నమ్మశక్యంగా లేదని రోహిణి అనగా.. మీ మావయ్య మలేషియా నుంచి వచ్చాడని చెప్పావు, మేం నమ్మేం కదా ఇది కూడా అంతేనని అంటాడు బాలూ. మీరు అసలు పోలీస్ కంప్లయంట్ ఇచ్చారా? అని ప్రభావతిని శృతి అడగ్గా ఆమె లేదని చెబుతుంది. కంప్లయంట్ ఇస్తేనే పట్టించుకోని పోలీసులు, ఈ దొంగని ఎలా పట్టుకున్నారు? అని రోహిణి తిక్కతిక్క ప్రశ్నలు వేస్తుంటుంది.
అమ్మ కంప్లయంట్ ఇవ్వలేదు కానీ, నేను ఆ రోజే నాకు తెలిసిన పోలీసులకు చెప్పి పెట్టానని అంటాడు బాలు. దొంగని పట్టుకుంటే ముందే కోర్టులో సబ్మిట్ చేయాలి కదా నేరుగా డబ్బులు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తుంది రోహిణి. డిపార్ట్‌మెంట్ విషయాలు ఇంత డీప్‌గా ఎలా స్టడీ చేశావ్? నీకు ఎలా ఎలా తెలిశాయి? అని రివర్స్‌లో అడుగుతాడు బాలూ. ఆ దొంగ ఎక్కడున్నాడు? అని ప్రభావతి అడగ్గా ఆ రోజు వాడి గోర్లు నాకు గీసుకున్నాయి, కనిపిస్తే వాడికి నాలుగు తగిలిద్దామని చెబుతుంది ప్రభావతి. వాడిని జైలులో పెట్టాడని, నీకు అంతగా చూడాలనిపిస్తే జైలుకు వెళ్లమని అంటాడు బాలూ.
కానీ రోహిణికి మాత్రం బాలూ మాటలపై డౌట్ వస్తుంది. దీని గురించి ఆలోచిస్తుండగా మనోజ్ వచ్చి ఏం జరిగిందని అడుగుతాడు. ఎప్పుడో మిస్ అయిన డబ్బు పూర్తి మొత్తంగా మళ్లీ వెనక్కి తిరిగి రావడం వెనుక ఏదో కొడుతోందని చెబుతుంది రోహిణి. ఆ దొంగకి బాలుకీ ఏదో లింక్ ఉందని, లేదంటే బాలూనే మనిషిని పెట్టి ఆ పని చేయించొచ్చని అంటుంది రోహిణి. ఆ మాటలను విన్న మనోజ్ భార్యపై మండిపడతాడు. బాలూకి కోపం ఎక్కువని, కానీ డబ్బు కోసం గడ్డి తినే రకం కాదని చెబుతాడు. నిజాయితీ విషయంలో వాడిని వేలేత్తి చూపించొద్దని అంటాడు.
నువ్వు ఏం చెప్పినా సరే ఖచ్చితంగా ఆ బాలూకి, దొంగకీ సంబంధం ఉందని అంటుంది రోహిణి. దొంగతనం జరిగిన డబ్బుని ఎప్పుడూ పోలీసులు పూర్తి మొత్తం తిరిగి ఇవ్వరని చెబుతుంది. ఆ మధ్యలోనే కొందరు తినేస్తారని.. కానీ బాలు మాత్రం మొత్తం తిరిగి తెచ్చాడని అంటుంది రోహిణి. దొంగ ఎవరో? దొంగతనం చేయించింది? ఎవరో తెలుసుకుని తీరతానని చెబుతుంది. ఈ మాటలన్నీ మీనా విని బాధపడుతుంది. తనతో శివ అన్న మాటలు గుర్తొచ్చి బాలు రగిలిపోతాడు. ఇంతలో మీనా రావడంతో ఎక్కడికి వెళ్లావని ప్రశ్నిస్తాడు. మా అమ్మ ఫోన్ చేసి రమ్మంటే మా పుట్టింటికి వెళ్లానని, శివ మాట వినడం లేదని చెబుతుంది మీనా. మళ్లీ ఆ గుణ దగ్గరికే ఉద్యోగం చేయడానికి వెళ్తున్నాడని అంటుంది.
నేనేమీ నిన్ను మీ పుట్టింటికి పంపించలేదు కదా? అని బాలూ అడగ్గా అవునని సమాధానమిస్తుంది మీనా. మరీ నిన్ను నేను పుట్టింటికి పంపించానని మీ తమ్ముడు అంటున్నాడని మండిపడతాడు బాలూ. మీ తమ్మడు ట్యాక్సీ స్టాండ్ దగ్గరికి వచ్చాడని, మళ్లీ నా జోలికి వస్తే మాత్రం రెండో చేతికి నేను గ్యారంటీ ఇవ్వలేనని అంటాడు. నిన్ను పంపించి వాడిని దారిలో పెట్టాలని చూస్తున్నానని మీ తమ్ముడు అనుకుంటున్నాడని బాలూ మండిపడతాడు. నువ్వు చేసే పనుల వల్ల మీ బావ కోపంగా ఉన్నారని మాత్రమే నేను చెప్పానని అంటుంది మీనా. మీరు నా దగ్గర ఏదో దాస్తున్నారు? అంత గొడవ జరిగిన తర్వాత వాడు మీ దగ్గరికి రాకూడదని అంటుంది. వాడు ఎందుకొచ్చాడో మీరైనా చెప్పొచ్చు కదా అని చెబుతుంది.
అసలు నువ్వు ఆ ఇంటికి వెళ్లడం వల్లే కదా ఇవన్నీ వస్తున్నాయి.. ఇక నుంచి నువ్వు మీ పుట్టింటికి వెళ్లడానికి వీళ్లేదని, నీ తమ్ముడున్న ఏ చోటికి నువ్వు వెళ్లడానికి వీల్లేదని మీనాపై ఆంక్షలు పెడతాడు బాలు. మధ్యలో నేనేం చేశాను, మా అమ్మ చెల్లెలితో మాట్లాడకుండా ఎలా? అని మీనా అడుగుతుంది. మాట్లాడొద్దని నేను చెప్పడం లేదు.. కావాలంటే వాళ్లనే ఇక్కడికి రమ్మను, లేదంటే గుడికి వెళ్లి కలువు అని చెబుతాడు బాలు. ఏదో బలమైన కారణం లేనిదే మీరు ఇంత పెద్ద నిర్ణయం తీసుకోరని, అసలు ఏం జరిగిందని అడుగుతుంది మీనా. అన్ని టైం వచ్చినప్పుడు నేనే చెబుతానని వెళ్లిపోతాడు బాలూ.
శివకి ఫోన్ చేసి మీ బావని ఎందుకు కలిశావని మండిపడుతుంది. నువ్వు మళ్లీ గుణని కలిస్తే మాత్రం జీవితాంతం మంచం మీదే ఉండాల్సి వస్తుందని మీనా వార్నింగ్ ఇస్తుంది. నేను పనిచేస్తేనే డబ్బులొస్తాయ్, గుణ దగ్గరే పనిచేస్తానని తేల్చిచెబుతాడు శివ. నీ వల్లే నన్ను మనింటికి వెళ్లొద్దని మా ఆయన చెప్పాడని మీనా చెప్పగానే ఐదే రావొద్దని శివ అంటాడు. ఆ మాటలతో మీనా షాక్ అవుతుంది. మా సంగతి ఎవ్వరూ పట్టించుకోవద్దు, ఎవ్వరికీ ఏ సమస్య రాదని చెబుతాడు శివ.
టూర్‌కి వెళ్లడానికి వస్తావా? రావా? అని రవిని అడుగుతుంది శృతి. నేను సంపాదించి ఎప్పటికైనా హనీమూన్‌కి తీసుకెళ్తానని అనుకుంటే వెయిట్ చేయ్, లేదంటే నీ ఇష్టమని తేల్చిచెబుతాడు రవి. ఇంతలో శృతికి వాళ్ల అమ్మ ఫోన్ చేయడంతో మేం వెళ్లడం లేదని, ఆ పాస్‌లతో నువ్వు, డాడీ వెళ్లమని చెబుతుంది శృతి. వాళ్లకి అల్లుడి మీద రెస్పెక్ట్ లేదని, నీకు అంతకంటే లేదని మేడపై పడుకోవడానికి వెళ్లిపోతాడు రవి. ఉదయాన్నే టిఫిన్ చేస్తూ పూరీలను చూసిన సత్యం.. బాలు కోసం చేశావా? అని మీనాని ఆటపట్టిస్తాడు. బాలు ఎప్పుడొస్తాడా అని మీనా ఎదురుచూస్తుంటుంది. మరోవైపు.. ప్రభావతిని డబ్బు కోసం కాకపడుతుంటాడు మనోజ్. నేను జాబ్ వదిలేశానని కొత్త ఇంటర్వ్యూ కోసం వెళ్తున్నానని చెప్పడంతో మనోజ్‌పై మండిపడుతుంది ప్రభావతి. రోహిణికి నేను ఉద్యోగం చేయడం లేదని తెలుసని అంటాడు మనోజ్. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.


Click it and Unblock the Notifications











