Gunde Ninda Gudi Gantalu May 23rd: మనోజ్‌కు బంపరాఫర్.. సత్యం కుటుంబానికి 14 లక్షల గండం, షాక్‌లో బాలూ

Photo Courtesy: JioHotstar

బాలు తీసుకొచ్చి సత్యంకు ఇచ్చిన డబ్బుపై ఇంట్లో వాళ్లకి డౌట్ వస్తుంది. పోలీసులు అంత తేలిగ్గా పట్టించుకోరని, ఒకవేళ పట్టించుకున్నా పూర్తి మొత్తం రిటర్న్ ఇవ్వరని అంటుంది రోహిణి. ఇదే విషయాన్ని ఆలోచిస్తుండగా మనోజ్ వచ్చి చీవాట్లు పెడతాడు. మీ ఇంటికి ఎందుకు వెళ్లావని మీనాని నిలదీస్తాడు బాలు. మా తమ్ముడు మా అమ్మ మాట వినిపించుకోకపోవడంతో నేను వెళ్లాల్సి వచ్చిందని చెబుతుంది. ఇంకెప్పుడూ వెళ్లొద్దని ఒకవేళ మీ అమ్మతో మాట్లాడాలని అనుకుంటే మనింటికి పిలవమని చెబుతాడు. మీ తమ్మడికి కనిపించొద్దు, వినిపించొద్దని మీనాకి వార్నింగ్ ఇస్తాడు బాలు.

దాంతో మీనా శివకి ఫోన్ చేసి మీ ఇద్దరి మధ్య అసలు ఏం జరిగింది? మీ బావ నీ మీద ఎందుకంత కోపం చూపిస్తున్నాడు? అని నిలదీస్తుంది. మీ ఆయన చెప్పినట్లు నువ్వు మా ఇంటికి రావొద్దని శివ చెప్పడంతో మీనా షాక్ అవుతుంది. తన పేరెంట్స్ ఇచ్చిన టికెట్స్‌తో వెకేషన్‌కు వెళ్దామని రవిని మరోసారి అడుగుతుంది శృతి. ఇంకెప్పుడూ ఈ టాపిక్ నా దగ్గర తీసుకురావొద్దని రవి మేడపైకి వెళ్తాడు. ఇదంతా గత ఎపిసోడ్‌లో హైలైట్‌గా నిలిచింది. ఇక మే 23వ తేదీ ఎపిసోడ్ 429లో ఏం జరిగిందంటే?

Gunde Ninda Gudi Gantalu serial episode 429 May 23rd 2025 here is full story

Photo Courtesy: JioHotstar

పాత జాబ్ వదిలేశానని కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళ్తున్నానని ప్రభావతితో చెబుతాడు మనోజ్. నీలాంటి వాడితో రోహిణి ఎలా కాపురం చేస్తుందిరా అంటూ కొడుకుపై మండిపడుతుంది ప్రభావతి. ముందు నిన్ను ఒక డాక్టర్‌కు చూపించాలని చెబుతుంది. ఉద్యోగాల కంటే నీ జీవితం ఇంటర్వ్యూలకి వెళ్లడంతోనే సరిపోతుందని మండిపడుతుంది. కొంచెం డబ్బులు ఇవ్వమని ప్రభావతిని అడగ్గా.. బాలూ గాడు ఇచ్చిన డబ్బుని మీ నాన్న దాచుకున్నాడని, నా దగ్గరేం లేవని చెబుతుంది ప్రభావతి. ఏనాడైనా పది రూపాయలు ఇచ్చి దాచుకోమన్నావా అంటూ మండిపడుతుంది. డబ్బులు ఎవరిస్తారో తెలియక ఇళ్లంతా వెతుకుతాడు మనోజ్. తండ్రి గదిలోకి వెళ్లి ఆయన షర్ట్‌లో నుంచి డబ్బులు కొట్టేస్తాడు. బాత్‌రూం నుంచి వచ్చిన సత్యానికి షర్ట్ కిందపడి ఉండటం, అందులో డబ్బులు లేకపోవడంతో అనుమానం వస్తుంది.

నేను షర్ట్‌లో పెట్టుకున్న 300 రూపాయలు కనిపించడం లేదని ప్రభావతిని అడుగుతాడు సత్యం. మీరే ఎక్కడో పెట్టి మరిచిపోయి ఉంటారని ప్రభావతి చెబుతుండగా మనోజ్ కంగారు పడుతూ వస్తాడు. దాంతో ప్రభావతికి, సత్యానికి కొడుకుపై డౌట్ వస్తుంది. మనోజ్‌ను పిలిచి 500కు చిల్లర ఉందా అని అడుగుతాడు సత్యం. క్యాష్ లేదని ఆన్‌లైన్‌లో ఉందని మనోజ్ చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోతాడు. ఇంతలో బాలూ రావడంతో నేను దాచుకున్న డబ్బులు పోయాయని నాకో 300 కావాలని అడుగుతాడు సత్యం. మనోజ్ ఇంట్లోనే ఉన్నాడా అని బాలూ అడగటంతో ప్రభావతి కోప్పడుతుంది. నేను ఇస్తానులే అని బాలూ డబ్బులు తీస్తుండగా ఆటోకి డీజిల్ కొట్టించాలని అనుకుంటాడు. ఇంతలో మీనా వచ్చి మామగారికి డబ్బులు ఇప్పిస్తుంది. ఈరోజు నీ ఫేవరెంట్ టిఫిన్ అని తినేసి వెళ్లమని బాలూతో చెబుతాడు సత్యం.

ఎలాగైనా ఉద్యోగం సంపాదించాలనే లక్ష్యంతో ఉన్న మనోజ్ ఇంటర్వ్యూకి వచ్చిన వాళ్లకి బ్రెయిన్ వాష్ చేసి తనకు చాలా డిగ్రీలు ఉన్నాయని చెప్పి వాళ్లని భయపెట్టి పంపేస్తాడు. మీనా తనకు ఇష్టమైన పూరీలు చేయడంతో తినాలా? వద్దా? అని ఆలోచిస్తూ మీనా వంక చూస్తుంటాడు బాలూ. ఏదైతే అదే అయ్యిందని మీనా చేసిన పూరీలు తినాలని ఫిక్స్ అవుతాడు బాలూ. పూరీల టేస్ట్ బాగుండటంతో మీనాని మనసులోనే మెచ్చుకుంటాడు. మీరు తినకుండా ఎక్కడ ఖాళీ కడుపుతో వెళ్లిపోతారోనని కంగారుపడ్డానని, మీరు కడుపునిండా తింటే చాలని మీనా మనసులో అనుకుంటుంది. పూరీలు రెండే ఉండటంతో ఇవి కూడా నేనే తింటే మీనా ఏం తింటుందని ఆలోచించి వాటిని అక్కడే పెట్టేసి వెళ్లిపోతాడు బాలూ. అది చూసిన మీనా.. బాలూ వెళ్లగానే బాక్స్ చేయగా నా కోసమే వదిలి వెళ్లాడని మురిసిపోతుంది.

మనోజ్ క్వాలిఫికేషన్స్‌కి వెంటనే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతాడు. మీకు కెనడాలో ఉద్యోగం వచ్చిందని, కానీ మీరు అక్కడికి వెళ్లాలంటే కొంత అమౌంట్ పే చేయాలని చెబుతాడు కంపెనీ సీఈవో. దాంతో పర్స్‌లో నుంచి 300 తీసి చేతిలో పెడతాడు. మీరు మా కంపెనీలో పనిచేయాలంటే 14 లక్షల రూపాయలు కట్టాలని సీఈవో చెప్పడంతో మనోజ్ షాక్ అవుతాడు. దానిని మీరు కేవలం 4 నెలల్లోనే సంపాదిస్తారని, భయపడొద్దని నచ్చచెబుతాడు సీఈవో. సింగిల్ సిట్టింగ్‌లో పే చేయాలా? లేక ఈఎంఐ ఆప్షన్ ఉందా? అని మనోజ్ అడగటంతో సీఈవో మండిపడతాడు. సింగిల్ సిట్టింగ్‌లో అయిపోవాలని, ఆ తర్వాతే ప్రాసెస్ మొదలుపెడతామని సీఈవో చెబుతాడు.

మీనాని త్వరగా వంట చేయమని రోహిణితో చెబుతుంది ప్రభావతి. మనోజ్ ఈరోజు భోజనానికి ఇంటికే వస్తాడని ప్రభావతి చెప్పడంతో వాడు ఎక్కడికి వెళ్లాడని బాలూ అడుగుతాడు. వాడు ఇంటర్వ్యూకి వెళ్లాడని ప్రభావతి అనడంతో బాలూ షాక్ అవుతాడు. ఇప్పటి వరకు చేసిన ఉద్యోగాన్ని వాడే వదిలేశాడా? లేక వాడి బిల్డప్‌లు భరించలేక గెంటేశారా? అని బాలూ అడుగుతాడు. ఆ మాటలతో రోహిణి మండిపడుతుంది. పెద్ద కంపెనీలో ఆఫర్ వస్తే వెళ్లాడని చెబుతుంది. ఇంతలో మనోజ్ ఇంటికి వస్తాడు. ఇంటర్వ్యూలో ఏం జరిగిందో తల్లికి చెవిలో చెప్పగా ప్రభావతి ఎగిరి గంతేస్తుంది. మరి సంతోషించకుండా ఎందుకు ఏడుపు ముఖం పెట్టావ్ అని ప్రభావతి అడుగుతుంది. దాంతో మళ్లీ తల్లికి చెవిలో చెప్పడంతో ప్రభావతి గుండెలు బాదుకుంటుంది.

ఇంతకీ ఇంటర్వ్యూ ఏమైందని రోహిణి అడగ్గా.. ఉద్యోగం వచ్చింది, నెలకు లక్షల్లో జీతమమని చెబుతాడు మనోజ్. వీడు మళ్లీ ఏదో పెద్ద కుట్ర పన్నుతున్నాడని సత్యంతో అంటాడు బాలూ. ఇంత పెద్ద ఉద్యోగం వచ్చినా? నా కొడుకు నాతో ఉండకుండా వదిలేసి వెళ్లిపోతున్నాడని బాధపడుతుంది ప్రభావతి. జాబ్ ఇండియాలో కాకుండా కెనడాలో వచ్చిందని మనోజ్ చెబుతాడు. భాష తెలియని దేశంలో కష్టపడాలా? అక్కడ చలి ఎక్కువగా ఉంటుందట, నా కొడుకు ఎలా తట్టుకుంటాడోనని ప్రభావతి బాధపడుతుంది.

ఈ అమ్మని వదిలి నువ్వు ఉండగలవా? అని ప్రభావతి అడుగుతుంది. తప్పదమ్మా? సంపాదించాలంటే వెళ్లాలి కదా అని అంటాడు మనోజ్. నువ్వు బాగా సంపాదించి వీడి ముఖం మీద కొట్టమని అంటుంది ప్రభావతి. వీసా రెడీ చేసుకున్నావా? అని మనోజ్‌ను రోహిణి అడుగుతుంది.. ఉద్యోగం రాగానే అన్ని అవే వస్తాయని అంటాడు మనోజ్. ఉద్యోగం రాలేదా? వచ్చిందని చెబుతున్నారు కదా అని మీనా అంటుంది. 14 లక్షలు కడితేనే కానీ ఉద్యోగం ఇవ్వరని మనోజ్ చెప్పడంతో అంతా షాక్ అవుతారు. ఇంతటితో ఎపిసోడ్ ముగుస్తుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X