Gunde Ninda Gudi Gantalu May 24th: ఆటోడ్రైవర్‌గా బాలు.. మీనా కంటతడి, బాలూని బోనులోకి లాగిన ప్రభావతి
Photo Courtesy: JioHotstar
గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మే 23వ తేదీ 429వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. పాత ఉద్యోగం వదిలేసి కొత్త ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్తున్నానని ప్రభావతితో చెబుతాడు మనోజ్. ఇంటర్వ్యూకి వెళ్లడానికి డబ్బులు కావాలని అడుగుతాడు. నువ్వు ఏ రోజైనా నాకు 10 రూపాయలు ఇచ్చావా? అని కొడుకుని నిలదీస్తుంది ప్రభావతి. నా దగ్గర డబ్బులు లేవని చెప్పడంతో బాలూ డబ్బులు ఇచ్చాడు కదా అని అంటాడు మనోజ్.
అవి మీ నాన్న డబ్బులు, ఆయనే జాగ్రత్తగా దాచుకున్నాడని చెబుతుంది ప్రభావతి. దీంతో చేసేదేం లేక తండ్రి గదిలోకి దొంగ చాటుగా వెళ్తాడు మనోజ్. సత్యం బాత్‌రూమ్‌లో ఉండటంతో హ్యాంగర్‌కు తగిలించి ఉన్న సత్యం షర్ట్ జేబులోంచి డబ్బులు కొట్టేసి సైలెంట్‌గా వెళ్లిపోతాడు. బాత్ రూమ్‌లో నుంచి వచ్చి చూసేసరికి షర్ట్ కింద పడి ఉండటంతో సత్యంకు అనుమానం వచ్చి చూడగా డబ్బులు కనిపించవు. దీంతో ప్రభావతి దగ్గరికి వెళ్లి నా డబ్బులు ఎవరో కొట్టేశారని చెబుతాడు. ఇంతలో మనోజ్ సైలెంట్‌గా ఆ వైపు రావడంతో సత్యంకు డౌట్ వచ్చి 500 రూపాయలకు చిల్లర ఉందా అని అడగుతాడు. నా దగ్గర క్యాష్ లేదని ఫోన్‌లో ఉన్నాయని చెప్పి తప్పించుకుంటాడు మనోజ్.

Photo Courtesy: JioHotstar
బాలూ రావడంతో కొడుకుని 300 అడుగుతాడు సత్యం. నా దగ్గర ఉన్నాయి కానీ డీజిల్ కొట్టించాలని చెబుతాడు. ఇంతలో మీనా వచ్చి 300 రూపాయలు బాలూకి ఇచ్చి మామగారికి ఇప్పిస్తుంది. మీనా నీకు ఇష్టమైన పూరీలు చేసిందని సత్యం చెప్పడంతో బాలూ ఫటా ఫటా లాగించేస్తాడు. అది చూసి మీనా కూడా సంతోషిస్తుంది. చివరికి రెండు పూరీలు మాత్రమే ఉండటంతో మీనా భోజనం చేసిందో లేదో తెలియక ఆమె కోసం ఉంచేసి వెళ్లిపోతాడు. బాలూ హడావుడిగా వెళ్లిపోవడంతో డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్లి చూడగా అక్కడ కేవలం రెండు పూరీలు మాత్రమే ఉంటాయి. నా కోసం ఆయన వీటిని వదిలి వెళ్లాడని మీనా సంబరపడిపోతుంది.
ఇంటర్వ్యూ కోసం వెళ్లిన మనోజ్ ఈ ఉద్యోగం తనకు వస్తుందో రాదోనన్న భయంతో ఓ ప్లాన్ వేస్తాడు. ఇంటర్వ్యూ కోసం వచ్చిన అందరి రెజ్యూమ్స్, వాళ్ల క్వాలిఫికేషన్స్ చూసి మీరంతా వెళ్లిపోవచ్చని అంటాడు. నేను మీకన్నా ఎక్కువ చదువుకున్నా.. ఎక్కువ క్వాలిఫికేషన్స్ ఉన్నాయని తన బయోడేటా చూపిస్తాడు. అది చేసిన మిగిలిన వాళ్లు ఈ ఉద్యోగం తమకు దక్కదని వెళ్లిపోతారు. తన ప్లాన్ విజయవంతంగా పూర్తి కావడంతో మనోజ్ సంబరపడిపోతుంటాడు.
సీఈవో లోపలికి పిలిచి ఇంటర్వ్యూ చేస్తూ మనోజ్ బయోడేటా చూసి సంతోషిస్తాడు. మీరు చాలా టాలెంటెడ్ అని చెప్పగా.. అవును సార్.. నేను మీ పొజిషన్‌లో ఉండాలని చెప్పగా ఆ సీఈవో మండిపడతాడు. మీరు ఈ జాబ్‌కి సెలెక్ట్ అయ్యారని, కెనడాలో ఉద్యోగం అని చెప్పడంతో మనోజ్ చాలా సంతోషిస్తాడు. నెలకు లక్షల్లో జీతం అని చెప్పేసరికి మనోజ్ ఆనందానికి అవధులు ఉండవు. అయితే కెనడా వెళ్లడానికి కంపెనీకి కొంత డబ్బులు కట్టాలని సీఈవో చెప్పడంతో ఎంత కట్టాలని అడుగుతాడు మనోజ్. 14 లక్షలు అని చెప్పడంతో షాక్ అయి బిక్కమొహం పెడతాడు.
మనోజ్ బయటికి వెళ్లాడని వాడు వచ్చేసరికి వంట చేయమని మీనాకి ఆర్డర్స్ వేస్తుంది ప్రభావతి. ఇంతలో బాలూ వచ్చి మనోజ్ ఎక్కడికి వెళ్లాడని అడగటంతో ఇంటర్వ్యూకి వెళ్లాడని చెబుతుంది ప్రభావతి. అంటే ఆ ఉద్యోగం కూడా గోవిందానా? అని మండిపడతాడు బాలూ. ఇప్పుడు చేసే దానికంటే మంచి ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్లాడని కవర్ చేస్తుంది ప్రభావతి. ఇంతలో మనోజ్ వచ్చి ఇంటర్వ్యూలో ఏం జరిగిందో తల్లికి చెవిలో చెబుతాడు. ఆ మాటలకు ప్రభావతి పొంగిపోయి ఎగిరి గంతేస్తుంది. మళ్లీ మనోజ్ చెవిలో ఏదో చెప్పడంతో ఏడుస్తుంది.

Photo Courtesy: JioHotstar
సత్యం, బాలూ, మీనా, రోహిణిలకు ఏం జరిగిందో అర్ధం కాక దిక్కులు చూస్తుంటారు. నాకు కెనడాలో ఉద్యోగం వచ్చిందని, నెలకు లక్షల్లో జీతమని చెప్పడంతో మరి అంత మంచి మాటని అలా డల్‌గా చెబుతావేంటీ అని ఫైర్ అవుతాడు బాలూ. నేను కెనడా వెళ్లాలంటే 14 లక్షలు కట్టాలని మనోజ్ చెప్పడంతో అంతా ఉలిక్కిపడతారు. మరి మనోజ్‌ను కెనడా పంపడానికి 14 లక్షలు కట్టడానికి సత్యం కుటుంబం ఓకే చెబుతుందా? అన్న కోసం ఆ డబ్బును బాలూ తీసుకొస్తాడా? అసలు మనోజ్ భవిష్యత్ ఏంటీ? అనేది తరువాతి ఎపిసోడ్ పై ఆసక్తిని పెంచింది. ఇక మే 24వ తేదీ 430వ ఎపిసోడ్ లో ఏం జరిగి ఉంటుందంటే..?
మీనా మార్కెట్‌లో పూలు అమ్ముతూ బేరం చూసుకుంటూ ఉండగా.. అదే మార్కెట్‌కు ఓ ఆటో వచ్చి ఆగుతుంది. అందులో నుంచి బాలు ఖాకీ బట్టల్లో ఆటోలో నుంచి దిగి ప్యాసింజర్ సామాన్లు కిందపెడతాడు. ఆటోడ్రైవర్ అచ్చం బాలులాగా ఉండటంతో మీనాకు అనుమానం వస్తుంది. ఆయన కార్ ఏమైంది? ఆటో నడుపుతున్నాడేంటీ అని? మీనా ఆలోచిస్తుంది. మీనాని గమనించని బాలూ ఆటోలో మరో ప్యాసింజర్‌ను ఎక్కించుకుని వెళ్తాడు.
మరోవైపు.. ప్రభావతి, సత్యం కుటుంబ సభ్యులు అందరూ కలిసి బాలూని కోర్టు బోనులో నిలబెట్టినట్లు ఎంక్వైరీ చేస్తారు. బాలూ ఎవరికీ తెలియకుండా కారు అమ్మేశాడు. వచ్చిన డబ్బుని గుట్టు చప్పుడు కాకుండా దాచేశాడని ప్రభావతి ఆరోపించినా బాలూ సైలెంట్‌గా చేతులు కట్టుకుని నిలబడతాడు. కొడుకు ఏం మాట్లాడకపోవడంతో సత్యం షాక్ అవుతాడు. ఆ వెంటనే రోహిణి కూడా ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి కారు కొనిస్తే ఎలా అమ్మేస్తాడని మండిపడుతుంది. నిజం చెప్పు బాలు నువ్వు నిజంగానే కారు అమ్మేశావా? అని సత్యం అడగ్గా .. తప్పలేదు నాన్నా అని బాలు ఆన్సర్ ఇస్తాడు. కారు ఎందుకు అమ్మేశావ్ రా కారణం చెప్పమని ప్రభావతి గట్టిగా బాలుని నిలదీస్తుంది. సత్యం, మీనాలు మాత్రం బాలు వైపు నిలబడి చూస్తూ ఉండిపోతారు. మరి బాలు నిజం చెప్పేశాడా? శివ దొంగతనం గురించి బయటపెట్టేశాడా? అనేది నెక్ట్స్ ఎపిసోడ్‌లో చూడాల్సిందే.


Click it and Unblock the Notifications











