Gunde Ninda Gudi Gantalu May 26th: ఆటో డ్రైవర్ గా రోహిణికి దొరికిపోయిన బాలు.. మీనా కూడా చూడటంతో రచ్చ
Photo Courtesy: JioHotstar
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మే 23వ తేదీ 429వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. సత్యం ఇంట్లో ప్రస్తుతం మనోజ్ జాబ్ విషయమై రచ్చ సాగుతోంది. రోజురోజుకు మనోజ్ పైన ఒత్తిడి పెరుగుతూ ఉండటంతో ఎలాగైనా జాబ్ కొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ముందు చేసిన వెయిట్ ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండటంతో అందరూ ఏగతాళి చేస్తున్నారు.. కనీసం తల్లి ప్రభావతి కూడా మనోజ్ ను నమ్మబోదు. ఏమాత్రం డబ్బులు కూడా ఇవ్వడానికి ఇష్టపడదు.
కానీ మనోజ్ మాత్రం ఎలాగైనా జాబ్ కొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎవరూ డబ్బులు ఇవ్వకపోవడంతో తండ్రి సత్యం జేబులోంచి దొంగతనం చేసి మరీ జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్తాడు. ఓ కంపెనీలో ఉద్యోగం కోసమని మనోజ్ ఇంటర్వ్యూకు వెళ్తాడు. అయితే ఒక కన్సల్టెన్సీ ద్వారా విదేశాల్లో జాబ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ కన్సల్టెన్సీ వారు 14 లక్షలు ముందుగా కట్టాలని డిమాండ్ చేస్తారు. అలాగైతే కెనడాకు పంపిస్తామని లేదంటే ప్రాసెస్ చేయలేమని చెబుతాడు. ఇక అదే విషయాన్ని మనోజ్ ఇంట్లో వాళ్లకు చెబుతాడు. అందరూ ఒక్కసారి కళ్లు తేలేసి అలాగే షాక్ లో ఉండిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికంగా మారింది. ఇక మే 26వ తేదీ 430 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

Photo Courtesy: JioHotstar
గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మే 23వ తేదీ 429వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. సత్యం ఇంట్లో ప్రస్తుతం మనోజ్ జాబ్ విషయమై రచ్చ సాగుతోంది. రోజురోజుకు మనోజ్ పైన ఒత్తిడి పెరుగుతూ ఉండటంతో ఎలాగైనా జాబ్ కొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే ముందు చేసిన వెయిట్ ఉద్యోగం మానేసి ఇంట్లోనే ఉండటంతో అందరూ ఏగతాళి చేస్తున్నారు.. కనీసం తల్లి ప్రభావతి కూడా మనోజ్ ను నమ్మబోదు. ఏమాత్రం డబ్బులు కూడా ఇవ్వడానికి ఇష్టపడదు.
కానీ మనోజ్ మాత్రం ఎలాగైనా జాబ్ కొట్టాలని ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ ఎవరూ డబ్బులు ఇవ్వకపోవడంతో తండ్రి సత్యం జేబులోంచి దొంగతనం చేసి మరీ జాబ్ ఇంటర్వ్యూలకు వెళ్తాడు. ఓ కంపెనీలో ఉద్యోగం కోసమని మనోజ్ ఇంటర్వ్యూకు వెళ్తాడు. అయితే ఒక కన్సల్టెన్సీ ద్వారా విదేశాల్లో జాబ్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ కన్సల్టెన్సీ వారు 14 లక్షలు ముందుగా కట్టాలని డిమాండ్ చేస్తారు. అలాగైతే కెనడాకు పంపిస్తామని లేదంటే ప్రాసెస్ చేయలేమని చెబుతాడు. ఇక అదే విషయాన్ని మనోజ్ ఇంట్లో వాళ్లకు చెబుతాడు. అందరూ ఒక్కసారి కళ్లు తేలేసి అలాగే షాక్ లో ఉండిపోతారు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికంగా మారింది. ఇక మే 26వ తేదీ 430 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?
మనోజ్ కు జాబ్ వచ్చిందని, కెనడాలోని ఓ ఎంఎన్సీ కంపెనీలో జాబ్ ఆఫర్ వచ్చిందని ఇంట్లో వాళ్లందరికి చెబుతాడు. కానీ 14 లక్షలు కట్టాలని తెలియడంతో అందరూ షాక్ అవుతారు. కానీ బాలు, సత్యం మాత్రం ఇంక ఆ పని అయ్యినట్టే అని నవ్వుతారు. ఇప్పటికే పోగొట్టిన డబ్బులు చాలావా? అని ప్రశ్నిస్తారు. ఇక రోహిణి వచ్చి ఎందుకు మనోజ్ ను అంతలా అవమానిస్తున్నారని బాలును అడుగుతుంది. అందుకు బాలు స్పందిస్తూ అక్కడ 14 లక్షలు కావాలంట పార్లరమ్మ.. మళ్లీ మీ మలేషియా మామపై పడుతారేమో చూడమని అంటాడు. ఆ మాట అనడం వెంటనే రోహిణి మౌనంగా తన గదిలోకి వెళ్లిపోతుంది.
ఆ తర్వాత సత్యం, బాలు మనోజ్ పై, తల్లి ప్రభావతిపై జోకులు వేస్తూ నవ్వుకుంటారు. అందుకు మనోజ్, ప్రభావతి మండిపడిపోతారు. ఇదిలా ఉంటే.. మరోవైపు శృతి, రవిల మధ్య జరిగిన గొడవ తల్లిదండ్రుల వరకు వెళ్తుంది. శృతి వాళ్ల తల్లి హనీమూన్ కోసమని రెండు టికెట్స్ పంపిస్తే రవి మాత్రం రిజెక్ట్ చేస్తాడు. తన స్వయం శక్తితోనే అలాంటి ట్రిప్స్ కు వెళ్దామని, మీ పేరేంట్స్ ఇచ్చే ఆఫర్స్ తో వెళ్లాల్సిన పనిలేదని శృతితో అంటాడు. అయితే ఈ విషయం శృతి వాళ్ల అమ్మకు తెలుస్తుంది. ఇక వెంటనే ఆమె రవి పనిచేస్తున్న రెస్టారెంట్ కు వెళ్తుంది. అక్కడ రవిని నిలదీస్తుంది. శృతితో నువ్వు మాట్లాడిన మాటలు ఏ మాత్రం బాలేదని అడుగుతుంది.
నిన్ను సొంత కొడుకులా చూస్తున్నామని, అందుకే శృతిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నా కూడా సహించామని రవితో అంటుంది. మేం మీకోసం ఖర్చు పెట్టడం తప్పుగా ఎందుకు భావిస్తున్నావు. మేం మీకు ఏమీ కాబోమా? శృతి నిన్ను ఇష్టపడింది కదా అని పెళ్లి చేసుకున్నా ఏమనలేదు.. పైగా నీ కోసం పది మెట్లు దిగి వచ్చి మాట్లాడుతుంటే లక్ష్య పెట్టడం లేదని ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపిస్తుంది. ఇక రవి స్పందిస్తూ ఇప్పుడు తను రెస్టారెంట్ లో వర్కింగ్ హావర్స్ లో ఉన్నానని, ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం ఆంటీ అని అంటాడు. కానీ శృతి వాళ్ల అమ్మ అస్సలు వినిపించుకోదు. గట్టిగా మాట్లాడుతూనే ఉంటుంది. దాంతో రవి మీరు ఇలా అరిస్తే జాబ్ కు ప్రాబ్లం అవుతుందని అంటాడు.
ఇలాంటి రెస్టారెంట్ ను నీకోసం కట్టిస్తామని, ఆ స్థాయిలో ఉండి కూడా నువ్వు ఇలా ప్రవర్తించడం సరికాదని, శృతి హానీమూన్ కు వెళ్దామంటే ఎలా వద్దంటావని ప్రశ్నిస్తుంది. అంతా ఉంటే శృతిని వెళ్లమని చెప్పి రవి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇక ఇంటికి తిరిగి వెళ్లిన తర్వాత శృతిని ప్రశ్నిస్తాడు. ఎందుకు మీ అమ్మకు ఇక్కడ జరిగే అన్ని విషయాలను చెబుతున్నావని, నన్ను అవమానిస్తున్నావని అడుగుతాడు. దాంతో శృతి స్పందిస్తూ నేను మా అమ్మకు ఏం చెప్పలేదు, చెప్పాల్సిన పనిలేదు అని శృతి రవికి బదులిస్తుంది. కానీ రవి మాత్రం ఈరోజు మా అమ్మ చేసిన పనికి నా ఉద్యోగం పోయినంత పనైందని మండిపడుతాడు.
మనం హానీమూన్ కు వెళ్లలేదనే విషయాన్ని మీ అమ్మకు ఎవ్వరు చెప్పారని ప్రశ్నిస్తాడు. నేను చెప్పలేదని శృతి అంటుంది. అయినా మా అమ్మ అడగటంలో తప్పేముందని అంటుంది. తప్పు ఉందని కాదు.. మనం ఏదీ సాధించినా మన స్వయం అయ్యి ఉండాలని రవి బదులిస్తాడు. దాన్నే సెల్ఫ్ రెస్పెక్ట్ అని అంటారని చెబుతాడు. మన జీవితంలోకి వాళ్లని ఎంటర్ కావొద్దని అంటాడు. దాంతో శృతి కాస్తా బాధపడుతుంది. ఇక మరోవైపు బాలు చెల్లెలు మౌనికాను సంజూ హింస పెడుతూ ఉంటాడు. తనకు బయటికి పార్టీ కోసం వెళ్తాడు. మద్యం మత్తులో తిరిగి ఇంటికి వస్తాడు. వచ్చే సరికి మౌనికా భోజనం చేస్తూ ఉంటుంది. భర్త లేకుండానే భార్య తినడం ఎలాంటి పద్ధతి అని సంజూ ప్రశ్నిస్తాడు. అన్నం పెడుతూ ఉంటే కూడా నాకెమొద్దని ప్లేట్ నెట్టేస్తాడు. మౌనికను నానా మాటలు అని ఏడిపిస్తాడు.
మరోవైపు రోహిణిని అత్త ప్రభావతి పిలుస్తుంది. మనోజ్ కు 14 లక్షలు ఇప్పిస్తే జాబ్ వస్తుందని, వెంటనే మలేషియాలో ఉన్న తన తండ్రికి ఫోన్ చేసి అడుగమని రోహిణిని ప్రభావతి అడుగుతుంది. దాంతో రోహిణి కంగారు పడుతుంది. 14 లక్షలు ఎక్కడి నుంచి తీసుకొని రావాలని మనసులో అనుకుంటుంది. అయినా ఇండియాలోనే జాబ్ చేసుకుంటే సరిపోతుంది కదా అని ప్రభావతితో అంటుంది. ఆ తర్వాత బయటికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా.. ఆటోలో ఎక్కువుతుంది. ఆ ఆటో బాలుది కావడంతో రోహిణి షాక్ అవుతుంది. ఆటో డ్రైవర్ గా కనిపించడంతో బాలు కూడా భయపడుతాడు. కానీ తన కారు వేరే వాళ్లు తీసుకెళ్లారని, ఆ ఆటో తనది కాదని చెప్పి నమ్మించే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











