Gunde Ninda Gudi Gantalu May 27th: బాలును నిందించిన ప్రభావతి.. నిజం తెలిసి తాటతీస్తున్న మీనా
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మే 26వ తేదీ 430వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మనోజ్ కు జాబ్ వచ్చిందని, కెనడాకు వెళ్లాలని ఇంట్లో వాళ్లకు చెబుతాడు. కానీ 14 లక్షలు కట్టాలని తెలియజేయడంతో అందరూ షాక్ అవుతారు. ఇక ప్రభావతి ఆ డబ్బులను ఏర్పాటు చేయమని కోడలు రోహిణిని అడుగుతుంది. దాంతో రోహిణి కంగారు పడుతుంది. మరోవైపు ఆ డబ్బులను ఎలా అరెంజ్ చేయాలని, ముందు ఆ సమస్య నుంచి వీలైనంత త్వరగా ఎలా తప్పించుకోవాలని ప్రయత్నిస్తుంది. అందుకు మళ్లీ కొత్త వ్యూహ్యాలు రచిస్తూ ఉంటుంది. ఈ క్రమంలో తన బ్యూటీ పార్లర్ లో పనిచేసే లేడీ ఎంప్లాయితో కలిసి రోడ్డుపై వెళ్తుంటే సడెన్ గా బాలును ఆటోలో చూస్తుంది. కారు నడుపుకోవాల్సిన బాలు ఆటో నడుపుతుండటంతో షాక్ అవుతుంది.
ఇదేంటీ ఆటో నడుపుతున్నావని ప్రశ్నిస్తుంది. దాంతో బాలు అడ్డదిడ్డమైన సమాధానాలు చెబుతూ అసలు విషయాన్ని దాచేస్తాడు. రోహిణి నుంచి తప్పించుకోవడానికి తన ఫ్రెండ్ రాజేశ్ కు ఫోన్ చేసి తన కారు రెంట్ కు వెళ్లినట్టుగా మాట్లాడుతూ కవర్ చేస్తాడు. ఇదిలా ఉంటే.. మరోవైపు ఆటో నడుపుతూనే తన భార్య మీనా కంట పడుతాడు బాలు. దీంతో మీనా కూడా షాక్ అవుతుంది. ఒక్కసారిగా బాలును ఆటో డ్రైవర్ గా చూసి ఆందోళన పడుతుంది. అసలు ఏం జరిగిందా అని ఆలోచిస్తూ ఉంటుంది. అయితే బాలు ఆటో తోలడంపై ఇంట్లో పెద్ద చర్చ జరుగుతుంది. ఎవరెవరు ఎలా స్పందించారు? కుటుంబ సభ్యుల ప్రశ్నలకు బాలు ఎలాంటి సమాధానాలు ఇచ్చారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికంగా మారింది. ఇక మే 27వ తేదీ 431 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే..?

బాలును ఆటో డ్రైవర్ గా చూసిన రోహిణి అనుమానం వ్యక్తం చేస్తుంది. తను కారు అమ్మేసిన విషయాన్ని ఇంట్లో వాళ్లకు రోహిణి చెబుతుందేమోనని భయపడి ఆటో గురించి మాట్లాడటం మానేస్తాడు. రోహిణి ఎన్ని సార్లు అడిగినా అసలు విషయం చెప్పబోడు. పైగా తన స్నేహితుడు రాజేష్ కు ఫోన్ చేసి కారు రెంట్ కు ఇచ్చానని వచ్చాక కారు కీస్ తీసుకోమని రాజేష్ కు చెబుతాడు. ఇక వెంటనే అర్థం చేసుకున్న రాజేశ్ ఆటోలో మనకు తెలిసిన వాళ్లు ఎవరో ఎక్కారా? అని అడుగుతాడు. అందుకు బాలు మీనాకు డౌట్ రాకుండా అవునని చెబుతాడు. వాళ్లతో జాగ్రత్తగా ఉండమని చెబుతాడు.
ఇక బాలు రోహిణిని, తన స్నేహితురాలును పార్లర్ దగ్గర దింపేస్తాడు. అయితే అక్కడే బాలుకు తెసిన ఒక వ్యక్తి వచ్చి బాలు ఎందుకు ఆటో నడుపుతున్నావ్.. కారు అమ్మేశావా? అని అడుగుతాడు. అందుకు బాలు అవునని బదులిస్తాడు. అయితే ఆ మాటలను రోహిణి చాటుగా వింటుంది. బాలు కారు అమ్మేశాడని కన్ఫమ్ చేసుకుంటుంది. వెంటనే ఈ విషయాన్ని ఇంట్లో వాళ్లందరికీ చెప్పాలని నిర్ణయించుకుంటుంది. అందుకు త్వరగానే పార్లర్ నుంచి ఇంటికి తిరిగి వెళ్తుంది. వెళ్లగానే మనోజ్ కు బాలు ఆటో డ్రైవర్ గా పని చేస్తున్న విషయాన్ని చెబుతుంది. కానీ మనోజ్ చాలా ఈజీగా తీసుకుంటాడు. అసలు బాలు కారు నడిపితే ఏంటీ? ఆటో నడిపితే ఏంటీ అని మనోజ్ అంటాడు. దాంతో రోహిణి మండిపడుతుంది.
అసలు బాలు ఆ కారును ఎలా కొన్నాడు? ఇంటి పత్రాలను తాకట్టు పెట్టే కదా కొన్నది? అలాంటప్పుడు ఎవ్వరికీ తెలియకుండా ఆ కారును ఎలా అమ్మేస్తాడు అని రోహిణి ప్రశ్నిస్తుంది. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టిన కొన్న కారు కాబట్టి దాని గురించి అందరికీ అడిగే హక్కు ఉంటుంది కదా అని మనోజ్ తో రోహిణి అంటుంది. మనల్ని ఇంటి పత్రాలు తాకట్టు పెట్టిన సమయంలో బాలు ఎంతలా ఇబ్బంది పెట్టాడో తెలుసు కదా అని, ఇప్పుడు కారు ఎందుకు అమ్మేశాడో అడగమని మనోజ్ ను రెచ్చ గొడుతుంది. కానీ మనోజ్ మనకెందుకులే రోహిణి, పోయి పోయి బాలుగాడినే అడగాలా, అడిగినా వాడు తిన్నగా సమాధానం ఇవ్వడు కదా అని అంటాడు. ఇక రోహిణి చిర్రెత్తిపోతుంది. నీతో కాదు ఎవ్వరికీ చెప్పాలో వారికే చెప్పి బాలు అంతు తేల్చుతానని అనుకుంటూ హాలు లోకి వెళ్తుంది.
అప్పుడే దేవుడికి దీపం ముట్టిస్తున్న అత్త ప్రభావతి దగ్గరకు రోహిణి వెళ్లి సంతోషంగా కనిపిస్తుంది. దీంతో ఏంటీ రోహిణి ఎందుకు అంత సంతోషంగా ఉన్నావంటూ అడుగుతుంది. దానికి రోహిణి నాకు ఒక నిజం తెలిసింది అత్తయ్య అని బదులిస్తుంది. ఇంతకీ మీకు మన ఇంట్లో ఎవరెవరు ఏం చేస్తున్నారో మీకు పూర్తిగా తెలుసా అని ప్రశ్నిస్తుంది. దాంతో ప్రభావతి నాకెందుకు తెలియదు అని బదులిస్తుంది. నువ్వు పార్లర్ నడుపుతున్నావ్, మనోజ్ కెనాడకు వెళ్తున్నాడు, శృతి డబ్బింగ్ చెబుతుంది, రవి రెస్టారెంట్ లో చెఫ్ గా పనిచేస్తున్నాడు. ఇక ఆ మీనాకు పూలకొట్టు ఉంది. బాలు కారు డ్రైవ్ చేస్తున్నాడు కదా అని అంటుంది. దాంతో రోహిణి స్పందిస్తూ వెంటనే బాలు ఇప్పుడు కారు డ్రైవ్ చేయడం లేదు అత్తయ్య, ఆటో నడుపుతున్నాడని నిజం చెబుతుంది. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి కొన్న కారును అమ్మేసి, ఆ డబ్బులను ఏం చేశాడో తెలియడం లేదని రోహిణి ప్రభావతిని ఉసిగొలుపుతుంది.
ప్రభావతి వెంటనే ఇంట్లో వాళ్లందరినీ పోగేసి బాలు బంఢారం బయట పడిందని అంటుంది. అంతలోనే మీనా రావడంతో బాలు ఆటో నడుపుతున్నాడా? అని అడుగుతుంది. దాంతో అవునని, ఇందాకనే పూల కొట్టు దగ్గర చూశానని చెబుతుంది. తనకు ఆ విషయం కొద్ది సేపటి కిందనే తెలిసిందని అంటుంది. మరీ కారు అమ్మేసిన డబ్బులు ఏం చేశారని, మీరిద్దరు కలిసి ఆ డబ్బును ఏ ఇంటికి పంపించారని మీనాను దెప్పి పొడుతుంది. దాంతో మీనా ఆ విషయం నాకు తెలియదని, ఆయన వచ్చాక అడగండి అని అంటుంది. అదే సమయంలో బాలు తిరిగి ఇంటికి వస్తాడు. వచ్చి రాగానే బాలును ప్రభావతి హాలులోనే నిలదీస్తుంది. నీ కారు ఏమైపోయిందని, ఆటో ఎందుకు నడుపుతున్నావని ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అందుకు బాలు తనకు వేరే సమస్యలు ఉండటంతో అమ్మేశానని అంటాడు. మరీ ఆ డబ్బులు ఏం చేశావని అడిగే సరికి బాలు మైనంగా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











