Gunde Ninda Gudi Gantalu May 28 th : నిజం తెలుసుకున్న మీనా.. భర్త బాలుకు క్షమాపణలు

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మే 27వ తేదీ 431వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు ఆటో నడుపుతున్న విషయాన్ని రోహిణి అత్త ప్రభావతి దగ్గరకు వెళ్లి చెప్పే ప్రయత్నం చేస్తుంది. మన ఇంట్లో ఎవరెవరు ఏం చేస్తున్నారో మీకు పూర్తిగా తెలుసా అని ప్రశ్నిస్తుంది. దాంతో ప్రభావతి నాకెందుకు తెలియదు అని బదులిస్తుంది. నువ్వు పార్లర్ నడుపుతున్నావ్, మనోజ్ కెనాడకు వెళ్తున్నాడు, శృతి డబ్బింగ్ చెబుతుంది, రవి రెస్టారెంట్ లో చెఫ్ గా పనిచేస్తున్నాడు. ఇక ఆ మీనాకు పూలకొట్టు ఉంది. బాలు కారు డ్రైవ్ చేస్తున్నాడు కదా అని అంటుంది. దాంతో రోహిణి స్పందిస్తూ వెంటనే బాలు ఇప్పుడు కారు డ్రైవ్ చేయడం లేదు అత్తయ్య, ఆటో నడుపుతున్నాడని నిజం చెబుతుంది. దాంతో ప్రభావతి షాక్ అవుతుంది. ఇంటి పత్రాలు తాకట్టు పెట్టి కొన్న కారును అమ్మేసి, ఆ డబ్బులను ఏం చేశాడో తెలియడం లేదని రోహిణి ప్రభావతిని ఉసిగొలుపుతుంది.

ప్రభావతి వెంటనే ఇంట్లో వాళ్లందరినీ పోగేసి బాలు బంఢారం బయట పడిందని అంటుంది. అంతలోనే మీనా రావడంతో బాలు ఆటో నడుపుతున్నాడా? అని అడుగుతుంది. దాంతో అవునని, ఇందాకనే పూల కొట్టు దగ్గర చూశానని చెబుతుంది. తనకు ఆ విషయం కొద్ది సేపటి కిందనే తెలిసిందని అంటుంది. మరీ కారు అమ్మేసిన డబ్బులు ఏం చేశారని, మీరిద్దరు కలిసి ఆ డబ్బును ఏ ఇంటికి పంపించారని మీనాను దెప్పి పొడుతుంది. దాంతో మీనా ఆ విషయం నాకు తెలియదని, ఆయన వచ్చాక అడగండి అని అంటుంది. అదే సమయంలో బాలు తిరిగి ఇంటికి వస్తాడు. వచ్చి రాగానే బాలును ప్రభావతి హాలులోనే నిలదీస్తుంది. నీ కారు ఏమైపోయిందని, ఆటో ఎందుకు నడుపుతున్నావని ప్రశ్నల మీద ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. అందుకు బాలు తనకు వేరే సమస్యలు ఉండటంతో అమ్మేశానని అంటాడు. మరీ ఆ డబ్బులు ఏం చేశావని అడిగే సరికి బాలు మైనంగా ఉంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికంగా మారింది. ఇక మే 28వ తేదీ 432 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

Gunde Ninda Gudi Gantalu serial episode 432 May 28th

బాలును కారు అమ్మేసినందుకు రోహిణి, ప్రభావతి, మనోజ్, శృతి నిందిస్తారు. ఎవ్వరికీ చెప్పకుండా కారును ఎలా అమ్మేశావని ప్రశ్నిస్తూ ఉంటారు. ఎలాంటి పరిస్థితిలో కారు అమ్మావని, ఆ డబ్బును ఏం చేశావని అడుగుతారు. ఇక తండ్రి సత్యం కూడా బాలును ప్రశ్నించడంతో బాలు కోపంతో ఊగిపోతాడు. ఆ కారును అమ్మేయడానికి ఓ కారణం ఉందని చెబుతాడు. తనకు ఓ ఆపద వచ్చిందని అందుకోసమే కారును అమ్మేశానని బాలు కుటుంబ సభ్యులతో చెబుతాడు. కానీ ఊరికే అలా చెప్పడంతో తల్లి ప్రభావతి ఊరుకోదు. అసలు కారణం ఏంటో అందరి ముందు చెప్పమని ఒత్తిడి పెంచుతుంది. కానీ ఇప్పుడు చెప్పలేనని, సమయం వచ్చినప్పుడు చెబుతానని అంటాడు.

కానీ మనోజ్ మాత్రం తమ్ముడు బాలుపై నోరు జారుతాడు. ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి కొన్న కారును ఎలా అమ్మేశావని, అలా అమ్మితే నీకు మూడు, నాలుగు లక్షలు వస్తాయి కదా? ఆ డబ్బులు ఇప్పుడే తిరిగివ్వాలని అంటాడు. రోహిణి కూడా ఆ డబ్బులు తిరిగి ఇవ్వాల్సిందేనని మండిపడుతుంది. దాంతో చిర్రెత్తిపోయినా బాలు సమయం వచ్చినప్పుడు చెబుతానని చెప్పినా వినడం లేదు కదా మీరూ.. ఇప్పుడే డబ్బులు కావాలంటే మొదట ఇంటి పత్రాలను తాకట్టు పెట్టి 40 లక్షలు ఇవ్వమని మనోజ్ ను ప్రశ్నిస్తాడు. ఆ వెంటనే తను తీసుకున్న డబ్బులను కూడా తిరిగి ఇస్తానని అంటాడు.

దాంతో మనోజ్ వెంటనే నోరు కంట్రోల్ చేస్తాడు. నువ్వు చేసిన అప్పు గురించి మాట్లాడుతుంటే నన్ను డబ్బులు తిరిగి ఇవ్వమని ఎందుకు అడుగుతున్నావని, అయినా నీతో మాట్లాడటం నాదే తప్పులే అని బాలుపై మనోజ్ చిరాకు పడి తన గదిలోకి వెళ్లిపోతాడు. ఇక ఆ వెంటనే బాలు వదిన రోహిణిపై పడుతాడు. నన్ను కారు డబ్బులు ఏం చేశావని నిలదీస్తున్నావ్ కదా.. నేను నీ గుట్టును రట్టు చేయాలా? నువ్వు ఇప్పటి వరకు ఏ తప్పు కూడా చేయలేదా? ఎప్పుడూ ఇంట్లో వాళ్లకి అబద్ధాలు చెప్పలేదా? అని ప్రశ్నిస్తాడు. ఇక రోహిణి పార్లర్ గురించి మాట్లాడబోతుంటాడు. దాంతో రోహిణి జల్లు మంటుంది. వెంటనే బాలును తండ్రి సత్యం కంట్రోల్ చేయడంతో రోహిణి గుట్టు చెప్పకుండా సైలెంట్ అవుతాడు.

ఆ తర్వాత రవి వైఫ్ శృతి కూడా బాలును ప్రశ్నించడం ప్రారంభించడంతో శృతిపైనా మండిపడుతాడు. మీరు లేచిపోయి పెళ్లి చేసుకోవడం వల్ల మా నాన్న ఆరోగ్యం చెడిపోయిందని ముందు దాని సంగతి తేలుద్దామా?అని ప్రశ్నిస్తాడు. దాంతో శృతి కూడా సైలెంట్ అయిపోతుంది. మరోవైపు కారు అమ్మిన డబ్బులు ఎక్కడ పోలేదని, తనకో సమస్య వచ్చి వాడుకున్నానని, త్వరలోనే అమ్మకు సంబంధించిన ఆ కారు డబ్బులు తిరిగి ఇస్తానని చెబుతాడు. ఇదిలా ఉంటే అందరిలో అసలు బాలుకు కారు అమ్మే పరిస్థితి ఎందుకు వచ్చిందా? అని ఆలోచిస్తూ ఉంటారు. ఎంత అడిగినా నిజం చెప్పకపోవడం మళ్లీ మళ్లీ ప్రశ్నిస్తూనే ఉంటారు.

ఇక చివరిగా సత్యం, రవి కలుగ జేసుకొని బాలుకు ఏదో పెద్ద సమస్యనే వచ్చిందని, ఆ సమస్య గురించి చెప్పమని బాలును అడుగుతారు. ఆ ఆపద ఏంటో కనీసం చెప్పాలని ఒత్తిడి పెంచుతారు. దీంతో బాలు ఎవ్వరికీ సమాధానం చెప్పకుండా ఇంట్లోకి వెళ్లిపోతాడు. మరోవైపు మీనా కూడా బాలుపై ప్రశ్నల వర్షం కురిపించే ప్రయత్నం చేస్తుంది. బాలు మీనా నోరు కూడా మూయిస్తాడు. ఇప్పుడు నన్ను ఏం అడగొద్దని సమయం వచ్చినప్పుడు తానే చెబుతానని చెప్పి వెళ్లిపోతాడు. దీంతో మీనా అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలని అనుకుంటుంది. వెంటనే బాలు స్నేహితుడు రాజేశ్ దగ్గరకు వెళ్తుంది.

అసలు బాలు కారు ఎందుకు అమ్మేశాడని అడుగుతుంది. అందుకు రాజేశ్ అసలు జరిగిన విషయం మొత్తం చెబుతాడు. గుణకు క్యాబ్ డ్రైవర్లు డబ్బులు ఇవ్వాలని, వాడితో పాటు శివ వచ్చి డబ్బులు అడగటంతో గొడవ అయ్యిందని, అందుకే బాలు కారు అమ్మేసి మరి డబ్బులు కట్టాడని మీనాకు చెబుతాడు. దాంతో మీనా నేరుగా గుణ దగ్గరకు వెళ్లి వార్నింగ్ ఇస్తుంది. తన భర్త తలుకుంటే నీకు బతుకు ఉండదని హెచ్చిరిస్తుంది. ఇంకోసారి తన తమ్ముడిని వెంట పెట్టుకొని తిరగొద్దని వార్నింగ్ ఇస్తుంది. ఇక మనోజ్ కు అప్పు ఇచ్చిన పార్క్ ఫ్రెండ్ ఇంటికి వచ్చి డబ్బులు అడుగుతాడు. ఇంట్లోనే కూర్చొని వెళ్లనని మనోజ్ ను టెన్షన్ పెడుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X