Gunde Ninda Gudi Gantalu May 29th : సంజూ మెడపై కత్తి పెట్టిన బాలు.. మౌనిక కోసం తీవ్ర గొడవ

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మే 27వ తేదీ 432వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు కార్ అమ్మేసిన సంగతి తెలిసిన రోహిణి ఇంట్లో వాళ్లందరితో చెబుతుంది. దాంతో కుటుంబ సభ్యులందరూ బాలును నిలదీస్తారు. ఎందుకు కారు అమ్మేయాల్సి వచ్చిందని ప్రశ్నిస్తారు. ఇంటి కాగితాలను తాకట్టు పెట్టి కారు కొనిస్తే నువ్వేలా నీ ఇష్టానికి అమ్మేస్తావని తల్లి ప్రభావతి అంటుంది. ఆ డబ్బులను వెంటనే తిరిగి ఇవ్వాలని అంటుంది. మరోవైపు మనోజ్ కూడా తమ్ముడు బాలును నిలదీస్తూ ఉంటాడు. ఆ డబ్బులను ఏం చేశావని అడుతూ ఉంటాడు. ఇక రోహిణి కూడా బాలును ప్రశ్నిస్తూ ఉంటుంది.

దాంతో బాలు స్పందిస్తూ తనకు ఒక సమస్య ఎదురవ్వడం వల్ల సాల్వ్ చేసుకునేందుకు కారును అమ్మేశానని చెబుతాడు. త్వరలోనే ఆ డబ్బులను తిరిగి ఇస్తానని అంటాడు. కానీ ఇంట్లో వాళ్లూ కారు అమ్మితే అమ్మేశావు కదా.. కనీసం ఎందుకు అమ్మాల్సి వచ్చిందో అసలు కారణమైన చెప్పు అని అంటారు. దానికి కూడా బాలు సమాధానం ఇవ్వబోడు. సమయం వచ్చినప్పుడు అందరికీ బదులిస్తాడనని చెబుతాడు. మరోవైపు మనోజ్ కు అప్పు ఇచ్చిన అతను ఇంటికి వచ్చి డబ్బులు తిరిగి ఇవ్వమని గొడవ చేస్తూ ఉంటాడు. ఇంకోవైపు మౌనికాకు విడాకులు ఇచ్చేందుకు భర్త సంజూ వ్యూహాలు రచిస్తాడు. ఈ క్రమంలో జరిగిన ఘటనతో మౌనికా ఇంట్లో నుంచి వెళ్లిపోతోంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మే 28వ తేదీ 433 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

Gunde Ninda Gudi Gantalu serial episode 433 May 29th 2025 here is full story

బాలుతో గుణ గొడవ పడడం వల్లనే బాలు కారు అమ్మేసి మరి ఆటో నడుపుకునే పరిస్థితి ఏర్పడిందని మీనా తెలుసుకుంటుంది. క్యాబ్ డ్రైవర్ల అప్పులను చెల్లించకపోతే బాలును తన కాళ్లు పట్టుకొని గుణ కండిషన్ పెట్టడంతో బాలుకు గుణకు మధ్య గొడవ జరిగింది. ఆ గొడవలో శివ ఉండడం వల్లనే బాలు కోపంతో అటు గుణాను ఇటు శివ ను కొట్టినట్టుగా మీనా నిజం తెలుసుకుంటుంది. ఈ క్రమంలోనే తన కారు అమ్మేసి మరి తోటి క్యాబ్ డ్రైవర్ల అప్పులు తీర్చి వారికి జీవనాధారం పోకుండా చేశాడని మీనా భర్త బాలు స్నేహితుడు రాజేష్ ద్వారా తెలుసుకుంటుంది. ఇక గుణ బాలును కాళ్లు మొక్కాలని కండిషన్ పెట్టిన విషయం తెలుసుకోవడంతో మండిపోతుంది. వెంటనే కార్ షెడ్ నుంచి నేరుగా గుణ ఫైనాన్స్ ఆఫీస్ కు వెళ్తుంది. అక్కడే ఉన్న గుణకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది.

తన భర్త జోలికి వస్తే ఇంకోసారి అస్సలు ఊరోకోబోనని అంటుంది. తన తమ్ముడు శివను చెడగొట్టడమే కాకుండా ఇలా బాలుపైనా కూడా చేయి చేసుకునే ప్రయత్నం చేస్తావా? పైగా నా భర్త బాలును నీ కాళ్లు పట్టుకోమని ఎలా అడుగుతావని అంటుంది. ఇంకోసారి ఇలాంటి పనులు చేస్తే మాత్రం పళ్లు రాల గొడుతానని వార్నింగ్ ఇస్తుంది. నా భర్త ముందు నీ కుప్పిగంతులు సాగవని హెచ్చరిస్తుంది. ఆయన గతంలో ఒక ఫైనాన్సర్ ను కొడితే ఇప్పటికీ పత్తా జాడా లేకుండా పోయాడని అంటుంది. బాలు ముందే నువ్వు ఓ బచ్చాగాడివని, ఇంకోసారి ఆయన జోలికి వెళ్లే సాహసం చేయకని హెచ్చరిస్తుంది. అలాగే శివను తనతో తిప్పుకోవద్దని, ఇంకోసారి శివ నీ దగ్గరికి వస్తే నేను అస్సలు ఊరుకోనని వార్నింగ్ ఇస్తుంది. నీ వాళ్ల నా భర్త కారు అమ్ముకొని ఆటో డ్రైవర్ గా మారాల్సి వచ్చిందని బాధపడుతుంది. ఒక గుణ రోహిణి ముందు కపట ప్రేమను కురిపిస్తాడు. మీనా అక్క నా తప్పేమీ లేదని బదులిస్తూ ఉంటాడు.

ఇక మీనా గుణ ఆఫీస్ నుంచి వెళ్లిపోయిన తర్వాత మీనాపై కుట్ర పూరితంగా ఆలోచిస్తాడు. శివను వాడుకొని మీనాను తన భర్త నుంచి దూరం చేయాలని ప్లాన్ చేస్తాడు. ఇక మీనా గుణ నుంచి తిరిగి వస్తుండగా దారి మధ్యలో చెల్లి సుమతి కనిపిస్తుంది. జరిగిన విషయాన్ని వివరిస్తుంది. సుమతి కూడా బాలును అపార్థం చేసుకోవడం మానేస్తుంది. ఇక శివను గుణ దగ్గరకు వెళ్లకుండా చూసుకోవాలని ఇద్దరూ అనుకుంటారు. శివ వినే పరిస్థితి లేదని కంగారు పడుతారు. ఇక మీనా తిరిగి ఇంటికి వెళ్తుంది. ఇంట్లోనే ఉన్న మామ సత్యంకు జరిగిన విషయాన్ని పూర్తిగా వివరిస్తుంది. బాలు కారు అమ్మేయడానికి కారణం గుణ అని, క్యాబ్ డ్రైవర్లను అప్పులు తీర్చమని ఒత్తిడి చేయడం వల్లనే అని తెలుపుతుంది. క్యాబ్ డ్రైవర్ల జీవనాధారం కోసం తను ఆటో డ్రైవర్ గా మారాడని చెబుతుంది. దాంతో సత్యం కూడా తన కొడుకు దయ గుణం కలిగిన వ్యక్తి అని సంతోషిస్తాడు. మాటాల్లోనే బాలు ఇంటికి రావడంతో మెచ్చుకుంటాడు. అది అర్థం కానీ బాలు ఏమైందోనని ఆలోచిస్తూ తన గదిలోకి వెళ్తాడు. బాలు వెనకాలనే మీనా వెళ్లి అన్ని విషయాలు తనకు తెలిసి పోయాయని చెబుతుంది.

కారు అమ్మేయడానికి కారణం గుణ అని, వాడు నిన్ను కాళ్లు మొక్కాలనడంతోనే మీరు కారు అమ్మిన విషయం నాకు తెలిసిపోయిందని మీనా చెబుతుంది. అంతే కాదు గుణ ఆఫీస్ కు వెళ్లి వార్నింగ్ కూడా ఇచ్చేశానని అంటుంది. ఒక్క దానివే వాడి ఆఫీస్ కు ఎందుకు వెళ్లావని, వాడసలే రౌడీ అనే విషయం నీకు తెలుసు కదా అని అంటాడు. వాడికి బాలుకు మధ్య ఉన్న గొడవలో మీనాను దూరొద్దని సూచిస్తాడు బాలు. ఇదిలా ఉంటే.. బాలు చెల్లె మౌనికాను సంజూ నానా తిప్పలు పెడుతూ ఉంటాడు. కావాలని టార్చర్ పెట్టాలని ప్రయత్నిస్తాడు. ఇప్పటికే ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్న సంజూ ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో మౌనికాపై నిందలు వేసే ప్రయత్నం చేస్తాడు. తన స్నేహితులను పిలిచి ఇంట్లోనే మందు తాగుతాడు. మౌనికాతో అన్ని రకాల మాంసం వంటకాలు వండమని చెబుతాడు. అలాగే మౌనికాతోనే తన స్నేహితులకు మందు కూడా పోయిస్తాడు. మందు అయ్యిపోగానే కింద కార్లో ఇంకో బాటిల్ ఉందని తీసుకు రాపో అని తన మనస్సును ముక్కులు చేస్తాడు. కింద డ్రైవర్ ను పిలిచి మౌనికా బాటిల్ తీసుకుంటుంది.

అదే సమయంలో సంజూ కిందికి దిగి కావాలనే మౌనికా నింద వేస్తాడు. డ్రైవర్ తో బిజీ అయ్యావా అని లేనిపోని మాటలు మాట్లాడుతాడు. మధ్యలో తల్లివచ్చి అడ్డుకుంటుంది. దాంతో మౌనికా బయటికి వెళ్తుంది. అయితే బాలు మద్యం మత్తులో వెళ్లి పడుకుంటాడు. లేచే సరికి మౌనికా కనిపించదు. దీంతో తన టార్చర్ తట్టుకోలేకనే ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని అనుకుంటాడు. సంతోష పడుతాడు. వెంటనే వెళ్లి తండ్రికి ఈ విషయాన్ని చెబుతాడు. మౌనికా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తెలుసుకున్న సంజూ తండ్రి కూడా సంతోషిస్తాడు. గొప్పింటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తానని కొడుకు సంజూతో అంటాడు. మరీ మౌనికా ఎక్కడికి వెళ్లి ఉంటుందని ఆలోచించగా పుట్టింటికే వెళ్లి ఉంటుందని అనుకుంటారు. కానీ పుట్టింటి నుంచి ప్రభావతి ఫోన్ చేసి మౌనికాతో మాట్లాడాలని ఉందని అంటుంది. దీంతో మౌనికా అక్కడికి రాలేదని తెలుసుకుంటారు. మరి ఎక్కడికి వెళ్లిపోయి ఉంటుందని కంగారు పడుతారు. లెటర్ రాసి చనిపోతే తమపైకే వస్తుందని టెన్షన్ పడుతారు. ఆ వెంటనే ఆచూకీ కోసం వెతకడం ప్రారంభిస్తారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X