Gunde Ninda Gudi Gantalu May 30th : సంజూను ఆటాడుకున్న మౌనికా.. బాలుకు విపరీతమైన టెన్షన్

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మే 28వ తేదీ 433వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. బాలు కారు అమ్మడానికి కారణం గుణ అని మీనాకు తెలుస్తుంది. అందుకే గుణకు వార్నింగ్ ఇస్తుంది. ఆ విషయాన్ని మీనా బాలుతోనూ చెబుతంది. వాడు నిన్ను కాళ్లు మొక్కాలనడంతోనే మీరు కారు అమ్మిన విషయం నాకు తెలిసిపోయిందని మీనా చెబుతుంది. అంతే కాదు గుణ ఆఫీస్ కు వెళ్లి వార్నింగ్ కూడా ఇచ్చేశానని అంటుంది. ఒక్క దానివే వాడి ఆఫీస్ కు ఎందుకు వెళ్లావని, వాడసలే రౌడీ అనే విషయం నీకు తెలుసు కదా అని అంటాడు. వాడికి బాలుకు మధ్య ఉన్న గొడవలో మీనాను దూరొద్దని సూచిస్తాడు బాలు. ఇదిలా ఉంటే.. బాలు చెల్లె మౌనికాను సంజూ నానా తిప్పలు పెడుతూ ఉంటాడు. కావాలని టార్చర్ పెట్టాలని ప్రయత్నిస్తాడు. ఇప్పటికే ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని ప్రయత్నాలు చేస్తున్న సంజూ ఇంట్లో ఎవ్వరూ లేని సమయంలో మౌనికాపై నిందలు వేసే ప్రయత్నం చేస్తాడు. తన స్నేహితులను పిలిచి ఇంట్లోనే మందు తాగుతాడు. మౌనికాతో అన్ని రకాల మాంసం వంటకాలు వండమని చెబుతాడు. అలాగే మౌనికాతోనే తన స్నేహితులకు మందు కూడా పోయిస్తాడు. మందు అయ్యిపోగానే కింద కార్లో ఇంకో బాటిల్ ఉందని తీసుకు రాపో అని తన మనస్సును ముక్కులు చేస్తాడు. కింద డ్రైవర్ ను పిలిచి మౌనికా బాటిల్ తీసుకుంటుంది.

అదే సమయంలో సంజూ కిందికి దిగి కావాలనే మౌనికా నింద వేస్తాడు. డ్రైవర్ తో బిజీ అయ్యావా అని లేనిపోని మాటలు మాట్లాడుతాడు. మధ్యలో తల్లివచ్చి అడ్డుకుంటుంది. దాంతో మౌనికా బయటికి వెళ్తుంది. అయితే బాలు మద్యం మత్తులో వెళ్లి పడుకుంటాడు. లేచే సరికి మౌనికా కనిపించదు. దీంతో తన టార్చర్ తట్టుకోలేకనే ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని అనుకుంటాడు. సంతోష పడుతాడు. వెంటనే వెళ్లి తండ్రికి ఈ విషయాన్ని చెబుతాడు. మౌనికా ఇంట్లో నుంచి వెళ్లిపోయిందని తెలుసుకున్న సంజూ తండ్రి కూడా సంతోషిస్తాడు. గొప్పింటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేస్తానని కొడుకు సంజూతో అంటాడు. మరీ మౌనికా ఎక్కడికి వెళ్లి ఉంటుందని ఆలోచించగా పుట్టింటికే వెళ్లి ఉంటుందని అనుకుంటారు. కానీ పుట్టింటి నుంచి ప్రభావతి ఫోన్ చేసి మౌనికాతో మాట్లాడాలని ఉందని అంటుంది. దీంతో మౌనికా అక్కడికి రాలేదని తెలుసుకుంటారు. మరి ఎక్కడికి వెళ్లిపోయి ఉంటుందని కంగారు పడుతారు. లెటర్ రాసి చనిపోతే తమపైకే వస్తుందని టెన్షన్ పడుతారు. ఆ వెంటనే ఆచూకీ కోసం వెతకడం ప్రారంభిస్తారు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక మే 30వ తేదీ 434 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

Gunde Ninda Gudi Gantalu serial episode 434 May 30th

మౌనికా ఇంట్లో నుంచి వెళ్లిపోవడంతో సంజూ, వాళ్ల నాన్న ఎంతగానో భయపడుతారు. ఒకవేళ మౌనికా వాళ్ల పేర్లు రాసి ఏదైనా అఘాయిత్యం చేసుకుంటే తమపైనే కేసులు నమోదు అవుతాయని అంటాడు. దాంతో వెంటనే మౌనికా ఎక్కడ ఉందో వెతకాలని సంజూ తండ్రి అంటాడు. ఇక వెంటనే సంజూ ఆచూకీ వెతకడంలో నిమగ్నమైపోతారు. ఇదిలా ఉంటే బాలు ఆటో నడుపుతూ తన స్నేహితుడిని కలుస్తాడు. అతను పొలిటికల్ పార్టీలో కార్యకర్తగా పని చేస్తాడు. అయితే బాలు ఆటో నడుపుతూ తన స్నేహితుడిని కలుస్తాడు. కాసేపు మాట్లాడిన తర్వాత బాలును పార్టీ ఆఫీస్ లోని వారి నేత దగ్గరకు తీసుకెళ్తాడు. వీళ్లు అక్కడికి వెళ్లే సరికి పెద్ద గొడవ జరుగుతుంది.

పార్టీ నేత భారీ సామూహిక వివాహాలను చేయాలని పూనుకుంటాడు. అందుకు లక్షలు ఖర్చు చేస్తూ ఉంటాడు. ఎన్నికలు దగ్గరికి వస్తున్నాయని అన్ని పనులు సవ్యంగా చేయాలని కార్యకర్తలకు సూచిస్తూ ఉంటాడు. అదే సమయంలో ఒకతను పార్టీ నేతకు కోపం తెప్పిస్తాడు. 250 మందికి సామూహిక వివాహాలు చేయాలని ఏర్పాట్లు చేయగా.. అంత మందిని సర్దలేకపోతాడు. దాంతో అతనిపై ఫైర్ అవుతాడు పార్టీ నేత. ఇక బాలు స్నేహితుడు అశోక్ జ్యోక్యం చేసుకొని మిగితా జంటలను తను ఏర్పాటు చేస్తానని అంటాడు. అన్ని పనులను సక్రమంగా అయ్యేలా చూస్తానని చెబుతాడు. అదే సమయంలో అశోక్ నుంచి మరో సమస్య వస్తుంది. తను ఆర్డర్ ఇచ్చిన పెళ్లి దండాలు అరెంజ్ చేయలేమని ఫోన్ కాల్ వస్తుంది. దాంతో పార్టీ నేత కోపం బాలు స్నేహితుడు అశోక్ వైపు మళ్లుతుంది.

దాంతో బాలు భార్య మీనాకు పూల కొట్టు ఉందని, దండల ఆర్డర్ వీళ్లకు ఇచ్చేద్దామని అంటాడు. దాంతో పార్టీ నేత సరేనని చెప్పి 20,,000 రూపాయాల అడ్వాన్స్ ఇస్తాడు. సమయానికి పెళ్లి దండాలు అందాలని, లేదంటే ఇద్దరూ ప్రాణాలతో ఉండరని హెచ్చరిస్తాడు. దాంతో బాలు, అశోక్ భయపడుతూనే సరేనని చెబుతారు. ఇక బాలు ఇంటికి వెళ్లి ఈ భారీ ఆర్డర్ గురించి మీనాకు చెప్పాలని ప్రయత్నిస్తాడు. కానీ బాలు, మీనాకు మాటలు లేకపోవడంతో తన తండ్రి సత్యంను పిలిచి మీనాను పిలవమని అంటాడు. పక్కనే ఉన్న మీనా వచ్చి ఏంటో చెప్పమనండి మామయ్య అని అంటుంది. ఇక బాలు 500 పెళ్లి దండాలకు ఆర్డర్ వచ్చిందని చెబుతాడు. దాంతో మీనా షాక్ అవుతుంది. ఇక రెండు రోజుల్లో ఇవ్వాలనడంతో అందుకు కూడా సరేనని చెబుతుంది. ఇక వెంటనే పని ప్రారంభం చేస్తుంది.

ఇక మీనా ముందుగా గుడికి వెళ్లి అక్కడి నుంచి పూల దండాలు అల్లడం కోసం పనివాళ్లను పిలిచి వస్తానని చెప్పి వెళ్తుంది. ముందుగా గుడికి వెళ్తుంది. అక్కడ దేవుడిని దర్శించుకుంటుంది. అదే సమయంలో మౌనికా గుడిలో కనిపిస్తుంది. అయితే అప్పటికే అత్తగారింట్లో ఎవ్వరికీ చెప్పకుండా వచ్చిన మౌనికా గుడిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. భరించలేని నిందలు వేస్తున్న భర్తతో ఎలా కాపారం చేసేదని తనలో తానే కుమిలిపోతుంది. ఇక మీనా కలవడంతో బోరున ఏడుస్తుంది. ఏమైందని మీనా మౌనికాను అడిగితే ఏం లేదని, ఊరికే గుడికి వచ్చానని, పుట్టింటికి వెళ్లడానికి వీలు లేకపోవడంతో ఇక్కడ కూర్చున్నానని చెబుతుంది. ఇక మీనా కూడా పెద్దగా ప్రశ్నలు వేయదు. మరోవైపు మౌనికా కోసం సంజూ వెతుకుతూ బాలు కంట పడుతాడు. చెల్లి మౌనికా ఇంట్లో లేదనే విషయాన్ని బాలు తెలుసుకుంటాడు. వెంటనే ఇంటికి వెళ్లి సంజూను, అత్త, మామను గట్టిగా అడుగుతాడు. ఎవ్వరూ నోరు మెదపకపోవంతో సంజూ గొంతుపై కత్తి పెట్టి బెదిరిస్తాడు. అదే సమయంలో మౌనికా తిరిగి ఇంటికి వస్తుంది. దాంతో బాలు ఏమైందని, ఎక్కడికి వెళ్లావని ప్రశ్నిస్తాడు. అందుకు మౌనికా ఏమని బదులిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X