Gunde Ninda Gudi Gantalu June 2nd : బాలు ఉగ్రరూపం.. మౌనికా మనసు మార్చిన మీనా

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక మే 30వ తేదీ 434వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. ఇంట్లో నుంచి వెళ్లిపోయిన మౌనికా గుడిలో మీనాకు కనిపిస్తుంది. అప్పటికే అత్తగారింట్లో ఎవ్వరికీ చెప్పకుండా వచ్చిన మౌనికా గుడిలో కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. భరించలేని నిందలు వేస్తున్న భర్తతో ఎలా కాపారం చేసేదని తనలో తానే కుమిలిపోతుంది. ఇక మీనా కలవడంతో బోరున ఏడుస్తుంది. ఏమైందని మీనా మౌనికాను అడిగితే ఏం లేదని, ఊరికే గుడికి వచ్చానని, పుట్టింటికి వెళ్లడానికి వీలు లేకపోవడంతో ఇక్కడ కూర్చున్నానని చెబుతుంది. ఇక మీనా కూడా పెద్దగా ప్రశ్నలు వేయదు.

మరోవైపు మౌనికా కోసం సంజూ వెతుకుతూ బాలు కంట పడుతాడు. చెల్లి మౌనికా ఇంట్లో లేదనే విషయాన్ని బాలు తెలుసుకుంటాడు. వెంటనే ఇంటికి వెళ్లి సంజూను, అత్త, మామను గట్టిగా అడుగుతాడు. ఎవ్వరూ నోరు మెదపకపోవంతో సంజూ గొంతుపై కత్తి పెట్టి బెదిరిస్తాడు. అదే సమయంలో మౌనికా తిరిగి ఇంటికి వస్తుంది. దాంతో బాలు ఏమైందని, ఎక్కడికి వెళ్లావని ప్రశ్నిస్తాడు. అందుకు మౌనికా ఏమని బదులిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక జూన్ 2వ తేదీ 435 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

Gunde Ninda Gudi Gantalu serial episode 435 June 2nd

మౌనికా గుడిలో ఉన్న సమయంలో మీనా చూసి మాట్లాడుతుంది. అప్పటికే మౌనికా తన భర్త సంజూ టార్చర్ పెడుతున్నాడని బాధపడుతూ ఉంటుంది. నిందలు వేస్తున్న వ్యక్తితో ఎలా కాపురం చేస్తానని అనుకుంటుంది. అయితే మీనా కలిసిన తర్వాత మౌనికాతో చాలా సమయం మాట్లాడుతుంది. అలాగే బాలు, మీనా మధ్య ఉన్న గొడవల గురించి కూడా చెబుతుంది. తన తమ్ముడు శివ కొట్టినందుకు తప్ప నాకింకేం కోపం లేదని మౌనికాతో మీనా చెబుతుంది. అలాగని బాలు ప్రేమకు దూరంగా ఉండలేనని అంటుంది. ఒకప్పుడు తనకు ఇష్టంలేని పెళ్లిని చేశారని, కానీ ఇప్పుడు తన మెడలోని పసుపుతాడు పవిత్రంగా మారిందని చెబుతుంది. బాలు చిన్నప్పటి నుంచి పెరిగిన పరిస్థితుల కారణంగా అలా మారాడని అనుకుంటున్నానని, అందుకే శివను ఎందుకు కొట్టాడో కూడా చెప్పకుండా దాస్తున్నాడని అంటుంది. ఇక మీనా మాటలు విన్నాకా తన భర్త సంజూ కూడా చిన్నప్పుడు ఏదో పరిస్థితుల ద్వారా ఇలా మారి ఉంటాడని భావిస్తుంది.

ఇక మీనాకు పెద్ద ఆర్డర్ వచ్చిందని, వెంటనే వెళ్లి ఆ పనులు చూడాలని అని చెప్పి వెళ్లి పోతుంది. మౌనికా కూడా గుడి నుంచి తిరిగి ఇంటికి బయల్దేరుతుంది. అదే సమయంలో సంజూ మౌనికా కోసం వెతికి వెతికి తిరిగి ఇంటికి వస్తాడు. తన తండ్రి ఏమైందని అడుగుతాడు. మౌనికా దొరకలేదని, అది బతికి ఉంటే తిరిగి ఇంటికి వస్తుందిలే అని నిర్లక్ష్యంగా సమాధానం ఇస్తాడు. కానీ సంజూ తండ్రి మాత్రం మౌనికాను ఎలాగైనా కనిపెట్టాలని లేదంటే వాళ్ల బాలుకు విషయం తెలిస్తే పరిస్థితి మరోలా ఉంటుందని అంటాడు. అప్పటికే బాలు తనను రోడ్డుపై చూశాడని సంజూ తన తండ్రికి చెబుతాడు. అదే సమయంలో బాలు తన చెల్లి కోసం ఇంటికి వస్తాడు. హాల్ లోనే ఉన్న సంజూ కాలర్ పట్టుకొని నా చెల్లి ఎక్కడ ఉందని ప్రశ్నిస్తాడు. మౌనికా మౌనికా అంటూ ఇల్లు మొత్తం కంపించేలా అరుస్తాడు. కానీ మౌనికా కనిపించకపోవడంతో కోపంతో రగిలిపోతాడు.

తన చెల్లిని ఏం చేశావని బాలు కోపంతో ఊగిపోతాడు. సంజూ సమాధానం చెప్పకపోవడంతో పండ్లు కోసే కత్తితో సంజూ మెడపై దాడికి యత్రిస్తాడు. అప్పటికే సంజూ వాళ్ల తల్లిదండ్రులు ఎంత చెప్పినా బాలు వినిపించుకోడు. అసలు తన చెల్లి ఎక్కడికి వెళ్లింది? వీడు మౌనికా ఫొటోను చూపిస్తూ ఎందుకు బయట వెతుకుతున్నాడని అడుగుతాడు. చెప్పకపోతే గొంతు కోసి చంపేస్తానని బెదిరిస్తాడు. ఇదే సమయంలో మౌనికా తిరిగి ఇంటికి వస్తుంది. కోపంతో రగిలిపోతున్న అన్న బాలును అడ్డుకుంటుంది. ఇక చెల్లిన చూసిన వెంటనే బాలు కూడా తన కోపాన్ని పక్కన పెట్టి వెళ్లి ఎక్కడికి వెళ్లావురా అని అడుగుతాడు. అందుకు మౌనికా ఎక్కడికి లేదు అన్నయ్య గుడికి వెళ్లి వస్తున్నానని అంటుంది. లేదు ఏదో జరిగింది.. వీళ్లు నిన్ను ఎందుకు వెతుకుతున్నారు? అసలు ఏం జరిగిందో చెప్పమని బాలు మౌనికాను అడుగుతాడు. కానీ మౌనికా నిజాన్ని దాచేస్తుంది.

బాలును ఇంటికి బయటికి తీసుకెళ్లి, ఆ ఇంటిలో తను ఎంతో సంతోషంగా ఉందని చెబుతుంది. నువ్వు కంగారు పడాల్సిన పనేం లేదని, ఏదైనా సమస్య ఉంటే ఆ దేవుడి కంటే ముందే నీకే చెప్పుకుంటానని అంటాడు. నిజంగా నేను గుడికే వెళ్లానని అక్కడ మీనా వదిన కనిపించిందని, పెద్ద ఆర్డర్ ఏదో వచ్చిందని కూడా చెప్పిందని చెప్పడంతో బాలు కూడా నిజమేనని నమ్ముతాడు. ఇక తిరిగి వెళ్లిపోతాడు. బాలు వెళ్లిపోతూ ఉంటే.. తను పడుతున్న కష్టాలను చెప్పనందుకు క్షమించు అన్నయ్య అంటూ మౌనికా మనస్సులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు రోహిణి, మనోజ్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటే... గుణ దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు, వడ్డీ తిరిగి ఇవ్వమని అతని అనుచరులు అడుగుతారు. దీంతో మనోజ్ షాక్ అవుతాడు.

రోహిణి కంగారు పడుతూ వాళ్ల దగ్గర ఏకంగా 2 లక్షలు అప్పు తీసుకున్నానని, వడ్డీతో 4 లక్షలు అయ్యిందని చెబుతుంది. అది తన కోసం కాదని తన ఫ్రెండ్ విద్య కోసం తీసుకున్నానని చెబుతుంది. మొన్నటి వరకు బాగానే ఈఎంఐ కట్టిందని, ఈ మధ్య సరిగా కట్టకపోవడంతో తనను అడుగుతున్నారని చెబుతుంది. కానీ ఈ విషయాన్ని నాకు నువ్వు ఎప్పుడో చెప్పాల్సింది కదా అని మనోజ్ అంటాడు. మన మధ్య ఎలాంటి దాపరికాలు ఉండొద్దని అనుకున్నాం కదా అని అంటాడు. ఇలా రోడ్డుపై వాళ్లు డబ్బులు అడుగుతుంటే ఎంతో కష్టంగా ఉందని, అవమానంగా ఉందని రోహిణితో అంటాడు. కోపం వచ్చిన రోహిణి వెంటనే నువ్వు పోగొట్టుకున్న 40 లక్షల ముందుకు ఇదేం పెద్ద విషయం కాదని అవమానిస్తుంది. దాంతో మనోజ్ చాలా బాధపడుతాడు. బాలు తర్వాత నువ్వే నన్ను ఇలా అనడం ఏం బాలేదని అంటాడు. ఇలా వారిద్దరి మధ్య మనస్ఫార్థాలు వస్తాయి. ఆ తర్వాత ఏం జరిగిందనేది వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X