Gunde Ninda Gudi Gantalu June 3rd : బాలు కోసం మీనా తాపత్రయం.. బాంబు పేల్చిన ప్రభావతి
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 2వ తేదీ 435వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. తన చెల్లిని ఏం చేశావని బాలు కోపంతో ఊగిపోతాడు. సంజూ సమాధానం చెప్పకపోవడంతో పండ్లు కోసే కత్తితో సంజూ మెడపై దాడికి యత్నిస్తాడు. అసలు తన చెల్లి ఎక్కడికి వెళ్లింది? వీడు మౌనికా ఫొటోను చూపిస్తూ ఎందుకు బయట వెతుకుతున్నాడని అడుగుతాడు. చెప్పకపోతే గొంతు కోసి చంపేస్తానని బెదిరిస్తాడు. ఇదే సమయంలో మౌనికా తిరిగి ఇంటికి వస్తుంది. కోపంతో రగిలిపోతున్న అన్న బాలును అడ్డుకుంటుంది. ఎక్కడికి వెళ్లావురా అని అడుగుతాడు. అందుకు మౌనికా ఎక్కడికి లేదు అన్నయ్య గుడికి వెళ్లి వస్తున్నానని అంటుంది. లేదు ఏదో జరిగింది.. వీళ్లు నిన్ను ఎందుకు వెతుకుతున్నారు? అసలు ఏం జరిగిందో చెప్పమని బాలు మౌనికాను అడుగుతాడు. కానీ మౌనికా నిజాన్ని దాచేస్తుంది.
బాలును ఇంటికి బయటికి తీసుకెళ్లి పోతాడు. నిజాన్ని దాచేసినందుకు క్షమించు అన్నయ్య అంటూ మౌనికా మనస్సులో అనుకుంటూ ఉంటుంది. మరోవైపు రోహిణి, మనోజ్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటే... గుణ దగ్గర అప్పుగా తీసుకున్న డబ్బులు, వడ్డీ తిరిగి ఇవ్వమని అతని అనుచరులు అడుగుతారు. దీంతో మనోజ్ షాక్ అవుతాడు. రోహిణి తనకోసం డబ్బులు తీసుకోలేదని , తన ఫ్రెండ్ విద్య కోసం తీసుకున్నానని చెబుతుంది. ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవ అవుతుంది. ఇంకో బాలు మీనా మధ్య మళ్లీ మాటలు కలిసే సిచ్యూయేషన్ ఏర్పడటం ఆసక్తికరంగా మారింది. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్ట్స్ ఎపిసోడ్ కు వాయిదా పడింది. ఇక జూన్ 3వ తేదీ 436 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

ప్రభావతికి రోహిణి ఫేస్ ప్యాక్ వేస్తుంది. రాత్రి అంతా అలానే ఉంచుకొంటే తెల్లవారి మంచి గ్లో వస్తుందని చెబుతుంది. దాంతో ప్రభావతి ఫేస్ ప్యాక్ తోనే రాత్రి పడుకుంటుంది. అయితే రవి శృతి వాళ్లు రాత్రి పడుకొంటారు. శృతి ఏసీ ఫుల్ పెట్టి పడుకుంటుంది. రవి ఏసీనీ ఆఫ్ చేసి పడుకోవాలని అనుకుంటాడు. ఏసీ వల్ల తనకు నిద్ర రావడం లేదని శృతిని లేపి మరీ ఏసీని ఆఫ్ చేస్తాడు. కానీ శృతి తనకు చాలా ఉక్కపోస్తోందని, ఏసీ ఆఫ్ చేయొద్దని చెప్పి రవితో గొడవ పడుతుంది. అలా వాళ్లిద్దరూ ఏసీని ఆఫ్ చేస్తూ.. ఆన్ చేస్తూ ఉంటారు. పదే పదే అలా చేయడంతో ఇంట్లో కరెంట్ పోతోంది. ఫ్యూజ్ పోవడం వల్ల కరెంట్ పోతుంది. ఇక కరెంట్ పోవడంతో అందరూ తమ గదుల్లోంచి హాలు లోకి వస్తారు. అయితే అప్పటికే ప్రభావతి తన ఫేస్ ప్యాక్ తోనే కిందికి వస్తుంది.
బాలు, మనోజ్, రవి, శృతి చీకట్లో ప్రభావతిని ఫేస్ ప్యాక్ లో చూసి జడుసుకుంటారు. దయ్యంలా ఉన్నావంటూ అందరూ అవమానిస్తారు. ఈ వయస్సుల్లో ఇలాంటి పనులేంటని అందరూ అడుగుతారు. కాసేపు ప్రభావతిని ఏడిపిస్తారు. ప్రభావతి అందరూ నోరు మూయించే పని చేస్తుంది. ఆ తర్వాత వెళ్లి కరెంట్ ఎందుకు పోయిందని చూస్తారు. ఫ్యూజ్ పోవడంతోనే కరెంట్ పోయిందని, సెట్ చేశామని బాలు, రవి చెబుతారు. అసలు అలా ఎందుకు ఫ్యూజ్ పోయిందిరా అని సత్యం బాలును అడుగుతాడు. ఎవరైనా స్విచ్ లు ఆన్, ఆఫ్ చేస్తూ ఉంటే ఇలా జరుగుతుందని అంటాడు బాలు. అలా ఎవ్వరం చేయలేదని అంటారు. ఇక అందరూ వెళ్లి పడుకుంటారు. పడుకునే ముందు కూడా రవి, శృతి తమ గదిలో గొడవ పడుతారు. నువ్వు ఏసీ ఆన్ ఆఫ్ చేయడం వల్లనే కరెంట్ పోయిందని శృతి, రవి కొట్లాడుతారు. ఈ విషయం ప్రభావతి చూస్తుంది. రవి, శృతి గొడవ పడటం వల్ల భయపడుతుంది.
ఇక తెల్లవారి ఆఫీస్ లకు వెళ్లేప్పుడు కూడా శృతి, రవిలు గొడవ పడుతారు. ఆ దృశ్యాన్ని కూడా ప్రభావతి చూస్తుంది. పదే పదే శృతి, రవి ఇలానే గొడవ పడుతున్నారేమోనని, ఇలాగైతే వాళ్లు విడిపోతారేమోనని భయపడుతుంది. దాంతో వాళ్లు ఆఫీస్ కు వెళ్లే ముందు వాళ్ల సమస్య ఏంటో అడిగి తెలుసుకోవాలని అనుకుంటుంది. శృతి ఆఫీస్ కు బయల్దేరగానే ఏమైంది శృతి.. రవికి నీకు ఏదైనా గొడవ ఉందా? అని అడుగుతుంది. ఏం లేదని శృతి చెబుతుంది. ఏదైనా ఉంటే చెప్పమని, తను పరిష్కరిస్తానని ప్రభావతి అంటుంది. అదే సమయంలో రవి కూడా రావడంతో మీ ఇద్దరి మధ్య ఏదైనా గొడవ ఉందా అని అడుగుతుంది. కానీ వారిద్దరూ ఏ గొడవ లేదని అప్పుడప్పుడు సరదాగా గొడవ పడుతామని చెబుతారు. ఇక ఒకరికొరు ప్రేమగా మాట్లాడుకుంటూ తమ పనులకు వెళ్లిపోతారు. ఇక ప్రభావతి అనవసరంగా టెన్షన్ పడ్డానని అనుకుంటుంది.
మరోవైపు మీనా బాలు పూల మార్కెట్ కు వెళ్తారు. వెళ్లే దారిలో వారిద్దరి మధ్య కూడా మాటలు కలుస్తాయి. మీనా బాలుతో సరదాగా ఓ ఆటాడుకుంటుంది. పూల మూటలు మోయించడం, బాలుతో బతిమిలాడించుకోవడం, ట్రాఫిక్ పోలీసుతో బయపెట్టించడం వంటి ఫన్నీ పనులన్నీ చేస్తుంది. అలా మొత్తానికి వారిద్దరి మధ్య ఇప్పుడిప్పుడే మళ్లీ మాటలు మొదలయ్యాయి. మీనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా.. బాలు మాత్రం ఇంకా కోపంతోనే రగిలిపోతాడు. మరోవైపు బాలు చెల్లెలు మౌనికాకు మరో ప్రమాదం వస్తుంది. మౌనికా భర్త సంజూ, మామ ఇద్దరూ ఆమెపై కుట్రకు పూనుకుంటారు.
బాలుపై పగసాధించాలని ప్రయత్నించిన ప్రతిసారి ఓడిపోతున్నామని తండ్రికొడుకులు అనుకుంటారు.ఇప్పుడైతే ఏకంగా ఇంటికే వచ్చి బెదిరించాడని, ఆ బాలుని ఏదోకటి చేయాలని అనుకుంటారు. ఇక తను ఢిల్లీ వెళ్తున్నానని వచ్చేలోపే మౌనికాను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని, రాగానే మినిస్టర్ కూతురితో పెళ్లి జరిపిస్తానని సంజూకు తన తండ్రి చెబుతాడు. సంజూ కూడా అలాగే చేస్తాను అని చెబుతాడు. ఇక బాలు, మీనా తమకు వచ్చిన పెద్ద ఆర్డర్ ను పూర్తి చేసేందుకు పూల దండలను అల్లే పనిలో నిమగ్నమైపోతారు. ఈ విషయాన్ని ఫైనాన్షియర్ గుణ తెలుసుకొని ఆ పూల దండలు మధ్యలోనే కనిపించకుండా చేయాలని కుట్ర పన్నుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది.


Click it and Unblock the Notifications











