Gunde Ninda Gudi Gantalu June 4th : బాలు, మీనాలకు ప్రమాదం.. గుండాలతో దాడికి యత్నం
Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 3వ తేదీ 436వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. మీనా బాలు పూల మార్కెట్ కు వెళ్తారు. వెళ్లే దారిలో వారిద్దరి మధ్య కూడా మాటలు కలుస్తాయి. మీనా బాలుతో సరదాగా ఓ ఆటాడుకుంటుంది. పూల మూటలు మోయించడం, బాలుతో బతిమిలాడించుకోవడం, ట్రాఫిక్ పోలీసుతో బయపెట్టించడం వంటి ఫన్నీ పనులన్నీ చేస్తుంది. అలా మొత్తానికి వారిద్దరి మధ్య ఇప్పుడిప్పుడే మళ్లీ మాటలు మొదలయ్యాయి. మీనా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నా.. బాలు మాత్రం ఇంకా కోపంతోనే రగిలిపోతాడు. మరోవైపు బాలు చెల్లెలు మౌనికాకు మరో ప్రమాదం వస్తుంది. మౌనికా భర్త సంజూ, మామ ఇద్దరూ ఆమెపై కుట్రకు పూనుకుంటారు.
బాలుపై పగసాధించాలని ప్రయత్నించిన ప్రతిసారి ఓడిపోతున్నామని తండ్రీకొడుకులు అనుకుంటారు.ఇప్పుడైతే ఏకంగా ఇంటికే వచ్చి బెదిరించాడని, ఆ బాలుని ఏదోకటి చేయాలని అనుకుంటారు. ఇక తను ఢిల్లీ వెళ్తున్నానని వచ్చేలోపే మౌనికాను ఇంట్లో నుంచి వెళ్లగొట్టాలని, రాగానే మినిస్టర్ కూతురితో పెళ్లి జరిపిస్తానని సంజూకు తన తండ్రి చెబుతాడు. సంజూ కూడా అలాగే చేస్తాను అని చెబుతాడు. ఇక బాలు, మీనా తమకు వచ్చిన పెద్ద ఆర్డర్ ను పూర్తి చేసేందుకు పూల దండలను అల్లే పనిలో నిమగ్నమైపోతారు. ఈ విషయాన్ని ఫైనాన్షియర్ గుణ తెలుసుకొని ఆ పూల దండలు మధ్యలోనే కనిపించకుండా చేయాలని కుట్ర పన్నుతాడు. ఈ క్రమంలో తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 4వ తేదీ 437 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

బాలు, మీనా మంచిగా కలిసిపోయే సిచ్యూయేషన్ వచ్చింది. బాలు వాళ్ల స్నేహితుడు అశోక్ ద్వారా వచ్చిన పెద్ద పూల దండల ఆర్డర్ పనుల్లో నిమిగ్నమైపోతారు. బాలు మీనాను తీసుకొని పూల మార్కెట్ కు వెళ్తాడు. అక్కడ పూల దండలను తీసుకొని తిరిగి ఇంటికి వస్తుంటారు. దారి మధ్యలో మీనా వాళ్ల ఇంటి దగ్గర ఆటోను ఆపమని అడుగుతుంది. అన్ని పూల దండలను అళ్లాలంటే చాలా మంది కావాల్సి ఉంటుందని, అప్పటికే కొందరు బస్తీ వాళ్లను పిలిచినట్టుగా మీనా చెబుతుంది. ఇక తన చెల్లి సుమతిని కూడా రమ్మని చెబుతుంది. అందుకోసం సుమతిని తమ ఆటోలోనే తీసుకెళ్లేందుకు అక్కడికి వెళ్తారు. అక్కడ సుమతి వెయిట్ చేస్తూ ఉంటుంది. బాలు, మీనా ఆటోలో రాగానే ఇవ్వాళ్ల వాళ్లిద్దరి మధ్య ఉన్న దూరాన్ని పూర్తిగా తగ్గించాలని అనుకుంటుంది.
ఇక మీనా ఆటోలో వెనక సీట్ లో కూర్చుకుంటుంది. సుమతిని తన కాళ్లపై కూర్చుందువు రమ్మని అంటుంది. కానీ సుమతి అందుకు ఒప్పుకోదు. మీనానే ఆటో దిగమని అంటుంది. వెళ్లి ముందు మీ ఆయన పక్కన కూర్చొమని సుమతి చెబుతుంది. దాంతో బాలు, మీనా షాక్ అవుతారు. పూల మార్కెట్ కు వెళ్లే క్రమంలోనే చాలా తిట్టుకున్న వీరు.. ఇక పక్క పక్కన కూర్చోవడానికి సందేహిస్తారు. కానీ సుమతి బలవంతంగా ఇద్దరినీ ముందు కూర్చోబెడుతుంది. ఇక బాలు, మీనా అలా జంటగా కూర్చోవడం చూసి సుమతి సంతోషం వ్యక్తం చేస్తుంది. వాళ్లు ఎప్పుడూ అలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది. ఇక బాలు మీనా పక్కనే కూర్చోవడంతో కాస్తా చిర్రుబుర్రులాడుతాడు. కానీ మీనా కూడా బాలు మాటలకు ధీటుగానే సమాధానం ఇస్తాడు. ఒకరికొరు కాస్తా దగ్గరై పోతారు. తమ మాటల్లో కాస్తా కోపం తగ్గిపోతుంది.
మరోవైపు పెద్ద ఆర్డర్ రావడంతో మీనా పూల దండలు కట్టడానికి బస్తీలో ఉండే కొందరు ఆడవాళ్లను పిలుస్తుంది. వాళ్లు సాయంత్రం ఇంటికి వస్తారు. మీనా మీనా అని పిలుస్తారు. మీనా, బాలు పూల దండలు తీసుకొని దారిలో వస్తుండగా... ఇంట్లోనే ఉన్న ప్రభావతి ఇంటి ముందుకు వచ్చిన ఆ ఆడవాళ్లను చూసి ఎవరా? అని సందేహిస్తుంది. ఎవరు మీరంతా అని అడుగుతుంది కూడానూ. అందులో ఒక మహిళా స్పందిస్తూ మేమంతా మీనా బస్తీవాళ్లం. ఇవ్వాళ్ల పెద్ద పూల దండల ఆర్డర్ వచ్చిందంటే పనికోసం వచ్చామని చెబుతుంది. దాంతో ప్రభావతి మండిపోతుంది. అదే ఒక పని మనిషి, దానికింద మీరు పని చేయడానికి వచ్చారా? అని అంటుంది. దీంతో వాళ్లందరూ ప్రభావతిపై మండిపడుతారు. మీనా గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకోమని హెచ్చరిస్తారు.
మీ ఇంట్లో వాళ్లందరికీ ఎన్నో సేవలు చేస్తున్న మీనాను, పైగా నీ సొంత కోడలు అని కూడా చూడకుండా అంతేసి మాటలు అంటవా? సీరియస్ అవుతారు. ఇంకోసారి మీనాను ఏమైనా అన్నావంటే ఉతికారేస్తామని అంటారు. మేం మా బస్తీలో మీనాను మా ఇంటి పాపలా చూసుకుంటాం. అలాంటి మీనాను నువ్వు ఇలా చూస్తున్నవని మాకు తెలియదు. నోరు అదుపులో ఉంచుకో లేదంటే నాలుక లాగి పూలదండలా కుట్టేస్తామని భయపెడుతారు. ఇక ఇదే సమయంలో బాలు మీనా తిరిగి ఇంటికి వస్తారు. పూల సంచులను గుమ్మంలోనే దించుతారు. ఆ సంచులను చూసి మళ్లీ ప్రభావతి చిర్రుబుర్రులాడుతుంది. ఇలా గుమ్మం ముందు పూల మార్కెట్ చేశారేంటని గాబర చేస్తుంది.
ఇక సత్యం ఉండి.. ఇంటి ముందు ఎందుకు వచ్చి పోయే వాళ్లకి ఇబ్బంది అవుతుంది. ఇంట్లోని హాలులోనే పని చేసుకోండి అని చెబుతాడు. దీంతో ప్రభావతి మళ్లీ షాక్ అవుతుంది. ఇక అందరూ ఇంట్లోకి వెళ్లి పూలను నేలపై పోసి దండలు అళ్లడం ప్రారంభించారు. అది చూసి సత్యం ఎంతో సంతోషిస్తాడు. ఓవైపు మనోజ్ వచ్చి ఇదేంటని అడగటంతో సత్యం కనిపించడం లేదా అని బదులిస్తాడు. ఇది చాలా పెద్ద ఆర్డర్ అని చెబుతాడు. ఇవ్వాళ ఒక్క రోజే బాలు, మీనా రెండున్నర లక్షలు సంపాదించబోతున్నారని చెబుతాడు. దాంతో అందరూ షాక్ అవుతారు. ప్రభావతి నోరెళ్లబెడుతుంది. ఇలా మీనా సంతోషంగా ఉండటం చూసి ఓర్వ లేకపోతుంది. వెంటనే తన వదిన కామాక్షిని పిలిచి ఇక్కడ జరిగేదంతా చూస్తువు రా అని అంటుంది. ఇక కామాక్షి కూడా వచ్చి సంతోషిస్తుంది. మరోవైపు మనోజ్ కు రోహిణి సర్ ప్రైజ్ ఇస్తుంది. మనోజ్ కు తెలియకుండా తనకున్న పార్క్ ఫ్రెండ్ అప్పును తీర్చేస్తుంది. ఇది తెలుసుకున్న మనోజ్ రోహిణికి థ్యాంక్స్ చెబుతాడు. తనకు కూడా కష్టపడి బాగా చూసుకుంటానని చెబుతాడు.


Click it and Unblock the Notifications











