Gunde Ninda Gudi Gantalu June 5th : మీనాపై ప్రభావతి అక్కసు.. ఆడేసుకుంటున్న బాలు

Gunde Ninda Gudi Gantalu : గుండె నిండా గుడి గంటలు సీరియల్ రోజురోజుకు కొత్త ట్విస్ట్ లతో ఆకట్టుకుంటోంది. ఇక జూన్ 4వ తేదీ 437వ ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. పెద్ద ఆర్డర్ రావడంతో మీనా పూల దండలు కట్టడానికి బస్తీలో ఉండే కొందరు ఆడవాళ్లను పిలుస్తుంది. వాళ్లు సాయంత్రం ఇంటికి వస్తారు. మీనా మీనా అని పిలుస్తారు. ఇంట్లో నుంచి ప్రభావతి బయటికి వచ్చి ఎవరు మీరంతా అని ప్రశ్నిస్తుంది. అందులో ఒక మహిళా స్పందిస్తూ మేమంతా మీనా బస్తీవాళ్లం. ఇవ్వాళ్ల పెద్ద పూల దండల ఆర్డర్ వచ్చిందంటే పనికోసం వచ్చామని చెబుతుంది. దాంతో ప్రభావతి మండిపోతుంది. అదే ఒక పని మనిషి, దానికింద మీరు పని చేయడానికి వచ్చారా? అని అంటుంది. దీంతో వాళ్లందరూ ప్రభావతిపై మండిపడుతారు. మీనా గురించి ఇంకొక్క మాట తప్పుగా మాట్లాడితే అస్సలు ఊరుకోమని హెచ్చరిస్తారు.

మీ ఇంట్లో వాళ్లందరికీ ఎన్నో సేవలు చేస్తున్న మీనాను, పైగా నీ సొంత కోడలు అని కూడా చూడకుండా అంతేసి మాటలు అంటవా? సీరియస్ అవుతారు. ఇంకోసారి మీనాను ఏమైనా అన్నావంటే ఉతికారేస్తామని హెచ్చరిస్తారు. ఇక బాలు మీనా తిరిగి ఇంటికి వస్తారు. ఇంట్లోని హాలులోనే పూలను నేలపై పోసి దండలు అళ్లడం ప్రారంభిస్తారు. ఈ సమయంలో ప్రభావతి, మనోజ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉంటారు. కానీ సత్యం మాత్రం వారిని అడ్డుకుంటాడు. మీనాకు ఫుల్ సోపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇక పూల దండల ఆర్డర్ సవ్యంగా జరిగిపోవాలని బాలు, మీనా చూస్తుంటారు. ఇక తర్వాత ఏం జరిగిందనేది ఆసక్తికరంగా మారింది. ఇక జూన్ 5వ తేదీ 438 ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే.?

Gunde Ninda Gudi Gantalu serial episode 438 June 5th

మీనాకు పెద్ద ఆర్డర్ ను బాలు ఇప్పించడంతో మీనా ఆ పనిలో నిమగ్నమై పోతోంది. తమ బస్తీవాళ్లను పలిచి 500 పూల దండలను ఒక్క రోజులో కట్టించే పనిలో బిజీగా ఉంటుంది. అయితే ఇంటిలోపల పూల దండలను అళ్లడానికి సత్యం అనుమతి ఇస్తాడు. కానీ ప్రభావతి, మనోజ్, రోహిణి మాత్రం అభ్యంతరం వ్యక్తం చేస్తారు. సత్యం దగ్గరుండి మీనా పనులకు సహరిస్తుండటంతో ఇంకేమీ చేయలేకపోతారు. మరోవైపు తమకు పెద్ద ఆర్డర్ వచ్చిందనే విషయాన్ని సోషల్ మీడియాలో పెడుదామని మీనా వాళ్ల చెల్లి సుమతి అంటుంది. దాంతో ఒక ఫొటో తీయమని మామ సత్యంను అడుగుతుంది. ఇక మనోజ్ ను ఆ ఫొటో తీయమని సత్యం అంటాడు. మనోజ్ తనకు ఇష్టం లేకపోయినా తీస్తాడు.

ఇక మరోవైపు అందరూ స్పీడ్ గా పూల మాలలు కడుతూ ఉంటే సత్యం అందరినీ అభినందిస్తాడు. ఎవరెన్ని పూలమాలలు కడుతున్నారనేది లెక్కలు వేస్తూ ఉంటాడు. దాంతో ప్రభావతి మాత్రం అదేం గొప్పా, పూల దండలు కట్టడానికి డిగ్రీలు చేయాలా? అని ఎటకారంగా అంటుంది. దాంతో సత్యం ప్రభావతిపై ఫైర్ అవుతాడు. పూల మాలలు కట్టడం కూడా ఒక కళనే అని చెబుతాడు. ఒక్క రోజులో ఇన్ని వందల పూల దండలు అల్లడం అంటే రికార్డులాంటిదేనని అంటాడు. కానీ ప్రభావతి మాత్రం సత్యం మాటలను చెవికి ఎక్కిందు. తన ఇంటిని మొత్తం పూల మార్కెట్ ను చేశారని మండిపడుతూ ఉంటుంది. ఇలాగే వదిలేస్తే ఇళ్లంతా పూలతోటగా మార్చేస్తారా? అని అంటుంది. ఇక ఇదే సమయంలో ప్రభావతి వాళ్ల వదిన కామక్షి కూడా ఇంటికి వస్తుంది. ఇంటి నిండా ఉన్న పూలను చూసి షాక్ అవుతుంది. పూల వాసన బాగవస్తుందని, ఇంతకీ ప్రభావతి ఇలా పూలను ఇంట్లోనే అల్లడానికి ఒప్పుకుందా? అని అడుగుతుంది.

పక్కనే ఉన్న ప్రభావతి దగ్గరికి వెళ్లి నువ్వెనా ఒప్పుకున్నదని అని అడుతుంది. ఏదేమైనా మంచి పని చేశావని అంటుంది. ఇన్ని పూలను చూస్తుంటే తనకు మళ్లీ పెళ్లి చేసుకోవాలని అనిపిస్తోందని అంటుంది. దాంతో అందరూ షాక్ అవుతారు. అయితే మామను వదిలేస్తావా? అత్త అని బాలు కౌంటర్ వేస్తాడు. సత్యం జోక్యం చేసుకుని మీనా, నువ్వు ఇద్దరూ కలిసి రెండో పెళ్లి చేసుకున్నారు కదా అలా అన్నమాట అని సర్దిచెప్పుకొస్తాడు. ఇక ఈలోపు ఆఫీస్ పని ముగించుకొని రవి, శృతి తిరిగి ఇంటికి వస్తారు. ఇంటి నిండా ఉన్న పూలను చూసి శృతి సంతోషం వ్యక్తం చేస్తుంది. పెద్ద ఆర్డర్ వచ్చినందుకు రవి కూడా సంతోషిస్తాడు. ఇక వారిద్దరూ కూడా ఫ్రెష్ అయ్యి వచ్చి పూలదండలు కట్టడంలో సాయం చేస్తారు. శృతికి దండలు కట్టడం రాకపోయినా మీనా దగ్గర నేర్చుకొని మరీ కట్టేందుకు ప్రయత్నిస్తుంది.

శృతి పూల దండలు కట్టే ప్రయత్నంలో పక్కనే ఉన్న కామక్షి మొహానికి అనుకోకుండా చేతిని గట్టిగా తగిలిస్తుంది. ఆమె లబోదిబోమని అరుస్తుంది. దీంతో అందరూ నవ్వుకుంటారు. చిన్నదెబ్బకే ఇంతలా అరుస్తుందని చూస్తారు. ఇక సత్యం ప్రతి ఒక్కరూ స్పీడ్ గా దండలు కట్టడం చూసి అందరినీ అభినందిస్తాడు. ఒక్కొక్కరి వివరాలను అడిగి తెలుసుకుంటాడు. అదే సమయంలో ప్రభావతి భర్త సత్యం మాటలను దెప్పి పొడుస్తూ ఉంటుంది. దాంతో సత్యం మండిపడుతాడు. ఇక బాలు ప్రభావతిని అందరికీ టీలు పెట్టి ఇవ్వమని అంటాడు. నేను టీ పెట్టి ఇవ్వాలా? నేనేమైనా పని మనిషిని అనుకుంటున్నావారా అని అంటుంది. దీంతో సత్యం కలుగజేసుకొని ఇప్పుడు ఇక్కడ ఖాళీగా ఉన్నది నువ్వే కాబట్టి నువ్వే అందరికీ టీలు పెట్టి ఇవ్వమని అంటాడు. దాంతో ప్రభావతి సరేనని తనకు ఇష్టం లేకపోయినా అందరికీ టీ పెట్టి ఇస్తుంది.

ఇక మరోవైపు రాత్రి 10 అవ్వడంతో అందరికీ భోజనాలకు ఏర్పాట్లు చేయడానికి ప్రయత్నిస్తారు. ఇంట్లో వండటం వీలవ్వదని బయటి నుంచి తెప్పిద్దామని మీనా అంటుంది. కానీ అక్కడే ఉన్న రవి మాత్రం అందరికీ నేను వంట చేస్తానని చెబుతాడు. కానీ ఇంతమందికి అంటే ఇంట్లో సరుకులు లేవని ప్రభావతి చెబుతుంది. ఇక మనోజ్ ను బయటికి పంపించి వంటకు కావాల్సిన సరుకులన్నీ తీసుకురా అని బాలు చెబుతాడు. అప్పుడు ప్రభావతి ఫైర్ అవుతుంది. నా కొడుకు ఎలా కనిపిస్తున్నాడు? ఇందాక నన్ను టీ ఇవ్వమన్నారు.. ఇప్పుడు వాడిని పూలు తీసుకురమ్మంటున్నారని అంటుంది. అయినా మనోజ్ వెళ్లి సరుకులు తీసుకు వస్తాడు. రవి అందరికీ కిచిడి చేస్తానని చెప్పడంతో రోహిణి, మనోజ్ సెపరేట్ గా ఆర్డర్ చేసుకుంటారు... ఇక తర్వాత ఏం జరిగిందనేది వేచి చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X